దోచుకో.. పెట్టుబడిగా మార్చుకో!


Sat,October 6, 2012 03:55 PM

ఈదేశ సంపద విదేశీ బ్యాంకుల్లోకి ఎలా తరలిపోతున్నది? తరలిపోతున్న ఆ అక్రమ సంపద తిరిగి ఈ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో ఎలా రాగలుగుతున్నది? దేశం నుంచి విదేశీ బ్యాంకుల్లోకి తరలిపోతున్న నల్లధనం గురించి బాధలేదు. కానీ తరలిపోయిన నల్లధనంపై పన్నులు ఎలా వసూలు చేయాలనేది మాత్రమే మన ప్రభుత్వాల ఆలోచన. లేదా తరలిపోయిన నల్లధనం తెల్లధనంగా మారి విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి దేశంలోకి ఎలా రాబట్టాలనేది మాత్రమే మరొక ఆలోచన.అంటే అవినీతి పెరిగినా ఫరవాలేదు. దేశంలో మెగా స్కాంలు ఎంత ఎక్కువ జరిగితే, దేశంలోకి విదేశీ పెట్టుబడులు అంత ఎక్కువ వస్తాయన్నట్టు!

జర్మనీ లీచ్టెన్‌స్టీన్ బ్యాంకులోభారీ మొత్తంలో నల్ల డబ్బు దాచుకున్న 26 మంది భారతీయుల జాబితా మన ప్రభుత్వానికి కొంత కాలం కిందటే అందింది. కనీసం వారి పేర్లు కూడా బయట పెట్టడానికి మన పాలకులు సిద్దంగా లేరు. ఈవిషయంలో సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ జాబితా ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆ జాబితాను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పగించింది. కానీ జర్మనీతో ఉన్న ఒప్పందం ప్రకారం, ఆ జాబితాను బయటపెట్టకూడ దని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరడం విశేషం. జాతి సంపదను బహిరంగంగా లూటీ చేయడానికి మించిన నేరం ఇంకేముంటుంది? ఇలాంటి విషయంలోనూ ఒప్పందాల గురించి మొహమాటపడాల్సిన సందర్భం కాదిది-అని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించడం గమనార్హం!

పార్లమెంటులో గత మే నెలలో ప్రభుత్వం నల్లధనంపై శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది.అందులో ప్రభుత్వం వెల్లడించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనిద్దాం.-‘పన్నుల నుంచి తప్పించుకునేందుకు, లేక నిజమైన పెట్టుబడిదారులు భారతీయులేనని గుర్తించకుండా వుండేందుకు మారిషస్ , సింగపూర్, మలేషియా, దుబాయిల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ( ఎఫ్‌డిఐ) రూపంలో దేశంలోకి తరలిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2000-2011 వరకు దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులలో మారిషస్ నుంచి 41.80 శాతం, సింగపూర్ నుంచి 9.17 శాతం వచ్చాయి. ఆర్థికంగా కూడా చిన్న దేశాలైన మారిషస్, సింగపూర్‌ల నుంచి మన దేశంలోకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావడానికి అవకాశాలు లేవు.భారతీయులే తమ నల్లధనాన్ని మారిషస్, సింగపూర్‌ల నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో తెల్లధనంగా మార్చుకొని దేశంలోని తమ కంపెనీలలోకి తరలిస్తున్నారు’- నల్లధనంపై ప్రవేశ పెట్టిన శ్వేత పత్రంలో స్వయాన ప్రభుత్వమే చెప్పిన విషయమిది. విషయమంతా తెలిసి కూడా పటిష్ట చర్యలు తీసుకోలేని పాలకులు, శ్వేత పత్రంలో మొసలి కన్నీళ్లు కారిస్తే ఈ దేశానికి ఒరిగేదేమిటి?

దేశం నుంచి తరలిపోతున్న నల్లధనం తిరిగి విదేశీ పెట్టుబడుల రూపంలో తెల్లధనంగా మారి దేశంలోకి ఎలా రాగలుగుతున్నది? ఇదే అత్యంత కీలకమైన ప్రశ్న. 1983లో భారత్-మారిషస్‌ల మధ్య ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ద్వంద్వ పన్నుల నుంచి మినహాయింపు ( తప్పించుకునే) ఒప్పందం జరిగింది. అప్పట్లో మనది మిశ్రమ ఆర్థికవిధానం. ఇరు దేశాలు పెట్టుబడుల కోసం కుదుర్చుకున్న ఒప్పందం అది. మరి ఇప్పుడు? మిశ్రమఆర్థిక విధానం పోయి, సరళీకృత ఆర్థిక విధానం వచ్చి రెండు దశాబ్దాలు గడిచిపోతున్నాయి. కానీ మారిషస్ తోపాటు, మరే ఇతర చిన్నపాటి దేశాలతో మన దేశానికి ఉన్న అలాంటి ఒప్పందాలలో మార్పులు మాత్రం జరగలేదు.సరళీకృత విధానాలతో స్వేచ్ఛా మార్కెట్లు వచ్చాయి.దేశ ఆర్థిక స్వరూపం మారింది. 70 కోట్ల జనాభాకు ఉపాధి కల్పించిన వ్యవసాయానికి ‘స్లోపాయిజన్’ ఇచ్చారు. సేవల రంగాన్ని విస్తరించారు. ప్రభుత్వాలు ఏకంగా దేశ వనరుల అమ్మకానికి ఎగబడ్డాయి. దేశ వనరుల అమ్మకాలలో చేతికి మరకలంటని( ఫలానికి ప్రతిఫలం)నయా దోపిడీ విధానం పాలకులకు వరంగా మారింది. ప్రతిఫలాలను( నల్లధనాన్ని) విదేశాలకు తరలించి, విదేశీ పెట్టుబడుల రూపంలో తెల్ల ధనంగా మార్చుకొని దేశంలోని తమ సొంత కంపెనీలలోకి తరలించేందుకు మారిషస్ తో మనకున్న ఒప్పందం అమోఘంగా ఉపయోగపడుతున్నది.

రెండు దశాబ్డాల కాలం నుంచి పాలకులే పెట్టుబడిదారులుగా, కార్పొరేట్లుగా మారిపోతున్నారు. పాలకుడికి, పెట్టుబడిదారుడికి తేడా లేని ఒక నయా ఉదారవాద దగాకోరు నీతి ఇవాళ దేశాన్నేలుతున్నది. అలాంటి వేలాది ఇంటిదొంగలను నిందితులుగా నిలబెడితే పెట్టుబడులు ఆగిపోతాయనేది పాలకుల మనోగతం!
మారిషస్‌తో ఒప్పందాన్ని సమీక్షించుకోవచ్చు కదా అని గత రెండు దశాబ్దాలలో ఈ దేశ ఆర్థిక మంత్రులను మీడియా ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జస్వంత్‌సింగ్, యశ్వంత్‌సిన్హా (బీజేపీ) నుంచి మొదలుకుంటే... చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ (కాంక్షిగెస్)దాకా ఆర్థికమంత్రులందరి అభివూపాయం ఒకేలాగ ఉండటం గమనార్హం! ఈ దేశం నుంచి విదేశాలకు తరలిపోతున్న నల్లధనం తిరిగి దేశంలోకి రావడానికి మారిషస్ లాంటి దేశాలతో ఉన్న ఒప్పందాలు ఉపయోగపడుతున్నాయనే మనోగతం ఈ దేశ ఆర్థిక మంత్రుల నుంచి అనేకసార్లు వెల్లడయింది!

‘దోచుకో... కానీ దాచుకోకు... పెట్టుబడిగా మార్చుకో!’ -విదేశాల్లో అక్రమ సంపద దాచుకున్న నల్లకుబేరులకు మన పాలకులు ఇస్తున్న భరోసా అది! రెండు దశాబ్డాలుగా సరళీకృత ఆర్థ నీతి మన పాలకులకు నేర్పిన నీతి సూత్రం అదే! దీనివల్ల కుంభకోణాలు మరింత వేగంగా పెరుగుతాయో, తరుగుతాయో మన్మోహన్‌లు, మాంటేక్‌లే ఈ దేశ ప్రజలకు జవాబులు చెప్పాలి.
దేశంలో జరుగుతున్న అవినీతి(ఫలానికి ప్రతిఫలం)బాగోతాలపై ప్రభుత్వాలు తమంతట తాముగా దర్యాప్తులు జరిపి వెలికి తీస్తున్నవి లేవు. ప్రజా వ్యాజ్యాలతో లేదా సుమోటో కేసులుగా కోర్టులే స్వీకరించి ఆదేశిస్తే తప్ప దర్యాప్తులు జరుగుత లేవు. అలాగే న్యాయవ్యవస్థ దర్యా ప్తు సంస్థలను ఆదేశించడం, దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాల చేతిలో వుండడం ఈ దేశంలో ఒక విచివూతమైన పరిస్థితి!

ఈ పరిస్థితి గమనించినప్పుడు ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడిపై జరుగుతున్న దర్యాప్తు మన కు గుర్తుకు వస్తుంది.ఆశ్చర్యమేమిటంటే,దోచుకో-కానీ దాచుకోకు- పెట్టుబడిగా మార్చుకో-అనే పాలకుల అంతర్లీన లిబరల్ పాలసీలను ఆయన ఉపయోగించుకుని వుంటాడని అనుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలకు ఆయన తండ్రి ప్రభుత్వ భూములు, రాయితీలు కట్టబెట్టి, ఆ కంపెనీల నుంచి మరొక మార్గంలో కుమారుడికి ప్రతిఫలాలు అందించారనేదే ప్రధాన అభియోగం. వచ్చిన ప్రతిఫలాలను ఆయన తన సంస్థలు, కంపెనీలలోకి పెట్టుబడుల రూపం లో మరల్చుకున్నారని సిబిఐ, ఈడీలు చెబుతున్నాయి. గమ్మత్తేమిటంటే, నల్లకుబేరులకు పరోక్ష వెసులు బాటులు కల్పిస్తున్న పాలకుల లిబరల్ నీతులనే ఆయన తండ్రిగానీ,అయనగానీ ఆసరా చేసుకున్నారనే విషయాన్ని మన దర్యాప్తు సంస్థలు ఏ మేరకు గుర్తిస్తున్నాయందాం? దర్యాప్తు సంస్థలు లిబరల్ అర్థ నీతులలోని దోషాలను న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకుపోవడంగానీ, ప్రభుత్వాలకు ఎత్తిచూపడం గానీ చేయగలుగుతున్నాయా? ఉదాహరణకు, మారిషస్ లాంటి దేశాలతో ఉన్న ఒప్పందాలను చంకలో పెట్టుకొని..దేశంలో అక్రమ ఆస్తులపై దర్యాప్తులు జరుగుతుంటే ప్రజలు వాటిని ఏ కోణంలో స్వీకరిస్తారందాం? పాలకుల అంతర్లీన లిబరల్ పాలసీలు, వారి మైండ్‌సెట్‌లు మారకుండా ఈ దేశంలో అవినీతిని అరికట్టడం సాధ్యం కాదు.

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles