ప్రతిస్పందన


Sat,October 6, 2012 03:55 PM

అసంబద్ధ పోలిక
ఏప్రిల్ 27న ‘ఘంటాపథం’ (గాంధీ,అంబేద్కర్, రాజ్యాంగ వ్యవస్థ) చదివి స్పందిస్తున్నాను. అంబేద్కర్ చేసిన కృషి గురించి వ్యాసకర్త రాసి న ఏ ఒక్క పదం పట్ల ఎవరికీ విభేదం ఉండదు. ఉండకూడదు కూడా! ఒక మహోన్నతుని గొప్పతనాన్ని చాటడానికి, మరొక మహోన్నతుని గౌరవాన్ని తగ్గించడమే ఎవరూ హర్షించరు! వాస్తవానికి ప్రజల దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే . అందులో ఒకరి గొప్పతనాన్ని చాటడానికి, మరొకరి గొప్పతనాన్ని తెగనాడటం ప్రజల దృష్టిలో మంచి పనికాదు. వాస్తవంలో అంబేద్కర్ అందరివాడు. కానీ పరోక్షంగా కొందరు(అందరు కాదు ) దళిత మేధావులే తమ ఉపన్యాసాలు, రాతల ద్వారా, అంబేద్కర్ దళిత నాయకుడు మాత్రమే అన్నట్లు గిరిగీస్తుంటారు! అందరివాడిని కొందరివాడిగా చేస్తుంటారు! అంబేద్కర్ అందరివాడని చివర్లో ముక్తాయింపులిస్తుంటారు!

ఆనాటి విపరీత అస్పృశ్యతా, కుల వివక్షలతో బలహీనపడిన భారత సమాజం విదేశీ దురాక్షికమణలకు కారణమైంది. సుమారు వెయ్యేళ్ళు ఈ దేశం పరాయి పాలనకు గురైంది. అలాంటి దేశం,స్వాతంత్య్రం పొందాక కూడా సామాజిక సమానత్వానికి తగిన రాజ్యాంగ రచన చేసుకోలేకపోతే.. ఈ దేశ సమున్నతి, దృఢత్వం పట్ల మనకు ఇవాళ ఇంత విశ్వాసం ఉండేదే కాదు. అందుకే అంబేద్కర్ ఈ దేశంలోని అన్ని సామాజిక వర్గాలకు కావలసిన వాడు. అయితే సామాజిక సమానత్వం కోసం చేసిన చట్టాలు ఈ దేశంలో ఓటు బ్యాంకులకు సాధనాలుగా మారిపోవడం, క్రీమీలేయర్ విధానంలేక అవి అందరికి అందకుండాపోయి కొందరే అనుభవిస్తూ దుర్వినియోగం చేయబడుతుండడం... చూసి అంబేద్కర్ బతికుంటే ఏమనే వాడో నేటి కుహనా మేధావి లోకం ఒక్కసారి ఆలోచి స్తే చాలు, ఆయన ఆలోచనా విధానాన్ని గౌరవించిన వారవుతారు! అంతే తప్ప ఆయన గొప్ప తనాన్నిచాటడానికి గాంధీనో, మరొకరినో తెగనాడాలని మాత్రం ఆయన కోరుకునే వాడు కాదు!

‘గాంధీజీకి ఇపుడున్న రాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు’ - అని వ్యాసకర్త చెప్పడం జరిగింది. వాస్తవానికి గాంధీ మరణించాకనే ఈ దేశ రాజ్యాంగం రచింపబడ్డది, తదుపరి అమలులోకి వచ్చింది. అలాంటపుడు ఇప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఆయనకు గౌరవమే లేదని చెప్పడంలో అర్థం ఉందా? మరో రెండేళ్ళు గాంధీ బతికుంటే.. ఆయనకు మన రాజ్యాంగం పట్ల ఎలాంటి అభివూపాయం ఉండేదో అర్ధమయ్యేది. బ్రిటిష్ వారి శాసనాలను ఉల్లంఘించిన సంఘటనలను దృష్టి లో ఉంచుకొని, గాంధీకి చట్టాల పట్ల గౌరవం ఉండదని భావించడాన్ని ఏమందాం? ఆయన దేశం కోసం పరాయి చట్టాలను ఉల్లంఘించాడు. దాన్ని ఆసరా చేసుకొని గాంధీకి చట్టాల పట్లనే గౌరవం లేదని ఆపాదించడంలో బుద్ధి కుశలత ఏపాటిదందాం?

రెండో ప్రపంచ యుద్ధానంతర ప్రపంచ పరిణామాలే పరోక్షంగా ఈ దేశ స్వాతంవూతానికి ప్రముఖ కారణమని తెలియంది కాదు. అంతమావూతాన మన స్వాతంవూతోద్యమాల పాత్ర ఏమాత్రం లేదని కాదు. అలాగే, బ్రిటిష్ పాలకులు అప్పటిదాకా అమలు చేసిన చట్టాలనే చాలా మేరకు మన రాజ్యాంగంలోకి కూడా తీసుకున్నాం. అంత మాత్రాన మన రాజ్యాంగంలో అంబేద్కర్ ఆలోచనా విధానాలు లేవని కాదు. కాబట్టి గాంధీ కన్నా అంబేద్కర్ గొప్పోడనో, అంబేద్కర్ కన్నా గాంధీ గొప్పోడ నో పోల్చడమే అసంబద్ధం.
ఈ దేశ ప్రజలకు సమాన హక్కులు రాబట్టటంలో అవిరళ కృషి చేసిన ఒక మహోన్నతుడిగానే అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అది తెలంగాణ ఉద్యమకారుల డిమాండు కూడా! ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం ఉంది కాబట్టే, అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టాలని పోటీతత్వంతో మాత్రం ఎవరూ కోరుకోవడంలేదు. అలాంటి అసలు విషయాన్ని మరుగుపరిచి, గాంధీ వర్సెస్ అంబేద్కర్‌గా చిత్రిస్తూ సమాజాన్ని గందరగోళ పరిచడాన్ని మాత్రం ఎవరూ హర్షించలేరు!

-కల్లూరి శ్రీనివాస్‌డ్డి
ఆసిఫ్‌నగర్, హైదరాబాద్

35

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles