ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!


Sat,October 6, 2012 03:58 PM


ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి ఎగజిమ్మినట్లు.., అడవి దారులన్నీ అలాయ్ బలాయ్ తీసుకుంటున్నాయి.కోయిల పాటల కోలాటంతో జంపన్న వాగు ‘అబ్బియ’ రాగాలతో పునీతం అవుతోంది. భవంతుల్ని మరిచి భాగ్యాల్ని మరిచి మనుషులంతా బంగారు రాసులవుతారు. ప్రపంచమే కుగ్రామమై, కుగ్రామమే ప్రపంచమై వినియోగం ఉన్నచోట వియోగం ఎంత మాత్రం సహించని సకల మొబైల్ టవర్లు చెట్ల మీద, గుట్టల మీద పిట్టలై వాలిపోయాయి. అది మార్కెట్ మంత్రం కావచ్చు. మార్పుల లోకంలో మౌన సమాజంలో ఉండలేని తనం కావచ్చు. మానని గాయాల పైపూతల మర్మయుగంలో మనుషులకు ఓ చారివూతక నమ్మకం ఇంకా సజీవంగానే సహజీవనం సాగిస్తోందనడానికి మేడారం ఓ కొండగుర్తు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారివూతక సత్యం సమ్మక్కపకృతి పరాక్షికమ శక్తికి దర్పణం చిలుకలగుట్ట. ఆడబిడ్డను అమ్ముల పొదిగా దాచుకున్న ఆయుధం కన్నెపల్లి సారలమ్మ. ప్రపంచ వాస్తవిక చలనత్వానికి నెత్తుటి నక్షత్రం జంపన్నవాగు. దారి పొడవునా విఘ్నాలను తొలగించే వెన్నంటే ఉండే నేస్తం గట్టమ్మ.
‘మేడారం’ దట్టమైన అడవిలో దాగిన దట్టించిన చారివూతక విశ్వా సం. అందమైన పూమాల మధ్య పురివిప్పిన ఆత్మీయ గుభాళింపు. అనిర్వచనీయఅపురూప ఘట్టం. అది జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కుగ్రామం. దానికి కనీసం గ్రామ పంచాయతీ హోదా కూడా లేదు. కానీ మూడు రోజులు ‘సమ్మక్క-సారలమ్మ’లు ‘గద్దె’లపై ప్రతిష్టించే పరివేష్టితమైన గిరిజన సంప్రదాయ ప్రపంచం. కోయజాతి ‘కో’ అంటే కోటి మంది భక్తులు తండోపతండాలుగా కదిలే మోదుగుపూలవనం. ముత్తయిదువల పరస్పర వాయినాలతో వనమంతా పూనకాలతో మేడారం మహా కోయనగరంగా మారుతుంది. మేడారంలో మహా అయి తే 90 ఇళ్లుంటాయి. రెండు సంవత్సరాలు కూనిరాగం తీసే ఒకానొక అడవిగూడెం. కోయిల గుంపువలే శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు జలకళలు. మొత్తంగా మేడారం తన రూపును, అసలు తన స్వరూపాన్ని మూడు రోజులపాటు మరిచిపోయి ఆధునిక హంగుల మేళవింపుగా కనిపిస్తోంది.
మాఘ మాసపు పున్నమి వెళ్లిన పాడ్యమి నుంచి, తల్లీబిడ్డలయిన ఆ అడవి బిడ్డలిద్దరూ గద్దెనెక్కిన దగ్గరి నుంచి, అక్కడి ఆకాశం పసుపుతో పీతాంబరం అవుతుంది. కుంకుమతో రాగరంజితం అవుతుంది. బెల్లం నైవేద్యంతో గాలి గుప్పుమంటుంది. ఊగీ తూగీ వివశులయ్యే మనుషులు, కోరికలు దట్టించుకొని నారీకేళమై పగిలిపోయే ధీనులు, నుదుటి మీద అమ్మలను ధరించి ధైర్యం పొందే సామాన్యులు. ఆదిమమైన ఉద్వేగపు భాసతో ‘సంభాషణ’ ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తుందం టూ జాతర పరిసరాలను వర్ణిస్తారు. గిరిజన సంస్కృతి, సాహితీ ప్రేమికులు ఆధునిక యుగంలోనూ ఆదిమ గిరిజన సంస్కృతికీ వారధి కట్టి అనంత విశ్వంలో ఇంకా ఆవగింజంత విశ్వాసం ఉందని చెప్పేందుకు జాతరనాడు జువ్విచెట్టుపై నిలబడి సర్పరాజు అవతారమెత్తిన యుగపురుషుల దర్శనం. ఆ నమ్మకంలోంచే పుట్టిన పురా ఆత్మల దర్శనం మేడారం.
ఈ దేశంలో రాసుకున్నవాడిదే చరిత్ర, చెప్పుకున్నవాడిదే ఘనతగా ప్రచారమై .. యథార్థమైన నేపథ్యంలో సమ్మక్క చరిత్ర కానీ, ఆదివాసీల బతుకు పోరాటం కానీ అంతగా పట్టింపులేని వ్యవస్థ ఇది. ఇక్కడ కొమురం భీం ‘చరివూత’పాఠం కాలేదు. రాంజీగోండు అల్లూరి సీతారామారాజు వలె వీరుడు కాలేదు. కానీ ఇక్కడి ప్రజల్లో ఇంకా సమ్మక్క బతికే ఉంది. వారి మనసుల్లో జంపన్న వాగులో నీరై ప్రవహిస్తోన్నాడు. మేడారంలో తిరుమల తిరుపతి దేవస్థానం వలె, ఉత్తరాధిన కుంభమేళ వలె పోటెత్తె జనానికి సౌకర్యాలు ఉండవు. దట్టమైన అడవి దారుల గుండా అమ్మలను ధర్శించి తరించేందుకు దూరతీరాలను, వ్యయభారాలను, సకల సంపదలను వదిలి ‘తల్లీ నీవే దిక్కు’ అంటూ సకల ప్రపంచం మేడారంలో మోకరిల్లుతున్నది. ఇటువంటి మహత్తర ఉద్విగ్నభరిత ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదని అందరూ అంగీకరించే సత్యం. ఇటువంటి సత్యాన్ని లోకానికి చెప్పే పనికి సర్కారు పూనుకోకపోవడమే విషాదం. సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యతల్ని కనీసం యూనివర్సిటీలు కూడా విస్మరిస్త్తున్నాయి. చరివూతకారులూ అదేస్థాయిలో విస్మరిస్తోన్నారు. సింధూ నాగరికతను పట్టణ నాగరికతగా ఎంతగా అభివర్ణించినా, ఇప్పటిదాకా అక్కడ లిపి కనుక్కోనట్టే మేడారం సాంస్కృతిక వారసత్వాన్ని అక్షరీకరించలేకపోవడం మహావిషాదమే. సింధూనాగరికతకు లేని సౌలభ్యం మేడారానికి ఉంది. ఇక్కడ మౌఖిక సాహిత్యం, పురాణ గాథలు అందుబాటులో ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఆదివాసీ సంస్కృతులకు సంబంధించి గ్రంథస్తం చేయాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. జాతర సమయాల్లో సౌకర్యాలు కల్పించి ఆదివాసీ గిరిజనులే మూల దైవాలుగా నాలుగు రోజులు గౌరవిస్తారు. అయితే వారి శాశ్వత డిమాండ్లను సర్కారు పట్టించుకోవడం లేదనడానికి అనేక ఉదహరణలున్నాయి.
మేడారం జాతరలో ఆదివాసీ సంప్రదాయాలను క్రమ క్షికమంగా హైందవీకరిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆదివాసీ జీవన సంస్కృతిలో విగ్రహారాధన ఉండదు. తమతమ దైవాలకు రూపాలను ఆపాదిస్తే వారు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. ప్రకృతినే దైవంగా కొలుస్తారు. అటువంటిది దేవాదాయ శాఖ మెల్ల మెల్లగా జాతరలో పూజా విధానంపై తమ ఆజమాయిషిని చొప్పించే ప్రయత్నం మెల్లమెల్లగా సాగిస్తోంది.భాష పేరుతో, ఆచరణ పేరుతో ఆదివాసీ విధానాన్ని ఆధునీకరిస్త్తున్నారనడాకి ఈసారి సమ్మక్క-సారలమ్మల గద్దెల ప్రాంగణాన్ని ఆలయం అని ప్రచారం చేస్త్తున్నారు. ప్రసాదం అంటూ లడ్డూలను అమ్ముతున్నారు. నిజానికి లడ్డూలు అక్కడ అమ్ముడుపోవు. పులిహోర ప్యాకెట్లకూ ఆదరణ ఉండదు.
గద్దెల చుట్టూ ‘మహాసాల’హారం నిర్మించారు. అది భద్రాచలం ఆలయ ప్రాంగణాన్ని పోలిన ఆకారంలో ఉంటుంది. దాన్ని ఆదివాసీ సంఘాలు ఎంతగా వద్దని వారించినా అలంకరణల పేర గద్దెల ప్రాంగణాన్ని సాలహారంతో కప్పేశారు. ఇలా అనేకం ఆదివాసీ సంప్రదాయానికి విరుద్ధంగా యథేచ్ఛగా కొనసాగుతొన్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో..ఆదివాసీ ఐక్యకార్యాచరణ పేరిట సంఘాలన్నీ ఏకమై సంస్కృతిని కాపాడాల్సిన పరిస్థితిని గుర్తించాయి. తామంతా సంఘటితమై తమ అస్తిత్వం కోసం ఉద్యమిస్తామని ప్రకటించాయి. అందుకు ఇక్కడి నేల నేపథ్యమే కారణం. తెలంగాణది యుగస్త్రీల చరిత్ర. రాజ్యం కత్తిగట్టినా రాజరికం ముందు మోకరిల్లని చరిత్ర. తమకు లొంగి పోవాలని ఫత్వా జారీ చేసినా తమవాళ్ల కోసం ఎదురు నిలిచారు తప్ప వెన్నుచూపని ధైర్యవంతులు ఆదివాసీలు.ఈనేలలోనే రాజ్య ఖడ్గాన్ని చేబూనిన రాణిరువూదమదేవీ పోరాడి వీరనారి అయ్యింది. ఇదంతా ఒక ఎత్తు అయి తే కాకతీయ సామ్రాజ్యంపై ఆత్మగౌరవం కోసం కత్తిపట్టిన సమ్మక్క-సారలమ్మలు ధిక్కారానికి దివిటీలుగా వెలసిన అజరామర చరిత్ర మేడారానిది. భూమి కోసం దేశ్‌ముఖ్ గుండాలకు ఎదురు నిలిచిన చాకలి ఐలమ్మ చరిత్ర ఈ నేలది.తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజ్యాన్ని సవాలు చేసిన రాయినిగూడెం అమ్మల పోరాట వారసత్వం నేటికీ కొనసాగుతోంది. తెలంగాణ మరోసారి రతనాల సీమగా నిరూపించుకున్నది. తెలంగాణ మండుతున్న నిప్పుకణికగా మారడానికి ఓరుగల్లు చారివూతక ధిక్కారం వారసత్వంగా వస్తోంది. అమరత్వం రమణీయమే కాదు, కోట్లాది ప్రజల కొంగు బంగారమై పోరాట వారసత్వాన్ని అందించే పోరుగడ్డగా మేడారం జాతిజనులను జాగృతం చేస్తోంది.
-నూర శ్రీనివాస్

35

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ