ఒగ్గు కథకు వేగుచుక్క


Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత్తిమీద తెల్లటి చారిక వల్ల ఆయన చుక్క సత్తయ్య అయిండు. ఆ చుక్కే ఒగ్గుకథకు వేగచుక్కలా ఆయనను లోకానికి పరిచయం చేసింది. పూర్వపు వరంగల్ జిల్లా లింగా ల గణపురం మండలం మాణిక్యాపురంలో పుట్టిన సత్తయ్య ఒగ్గుకథలో మణిమానిక్యం అయిండు. నలుగురు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతుల నుంచి పురస్కారాలు అందుకొని తెలంగాణ జానపద కళకు ప్రత్యేకించి ఒగ్గుకథకు ఎనలేని గుర్తింపు తెచ్చిన మహా జానపద కళాకారుడు. తన పదకొండో యేటనే కీలుగుర్రం కథతో మొదలైన ఆయన ఢమరుక కథా విన్యాసం చివరివరకు కొనసాగించారు. ఇంట్లో మూడోవాడిగా పుట్టినా ముక్కంటిని ఇష్టంగా ఆవాహనం చేసుకొని తెలంగాణ ప్రతి పల్లె మూల లో కథచెప్పిండు.

నాటకం, సంగీతం, గాత్రం, కథ, నృత్యం ఇవన్నీ ఏకకాలంలో చేసే అద్భుతమైన ధారణశక్తితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసిన అపురూప కళాకారుడు సత్తయ్య. కీలుగుర్రం, మాందా త, బీరప్ప, మల్లన్నకథ, కొమురెల్లి మల్లన్న, రేణుకా ఎల్లమ్మ, నల్లపోశమ్మ, ఎర్ర పోశమ్మ కథలు వినాలంటే అది ఆయన నోటి నుంచి మాత్రమే వినాలనేలా చేసుకున్నాడు. పల్లెల్లోకి చొరబడని సాంకేతిక యుగంలో ఎడ్ల బండ్లపై వచ్చి కథలు వినేది. ఏ కథ అయినా ఒక్కరోజుతో ముగిసే కథ కాదు. మూడు రోజులు, ఏడు రోజులు ఆయన కథ చెప్పినా జనం చింతగింజలు పట్టుకొని రాత్రు లు నిద్రను కాచేవారంటే అతిశయోక్తికాదు. ఆడ, మగ వేషం వేయాల్సిన సందర్భంలో ఏకకాలంలో ఒకవైపు పురుష వస్ర్తాలంకరణ, మరోవైపు స్త్రీ వస్ర్తాలంకరణ ఒక్కమాటలో చెప్పాలంటే అర్ధనారీశ్వర పాత్ర చుక్క సత్తయ్య ఆడుతుంటే చూడాల్సిందే. అంతేకాదు వేదిక మీద అనేకపాత్రలు వేయాల్సిన సందర్భంలోనూ అన్నిపాత్రల వస్త్రధారణ ఒకేసారి వేసుకొని రెప్పపాటులో వాటిని ఒక్కొక్కటిని విడుచుకుంటూ ప్రేక్షకుల్ని మంత్రముగ్థం చేసే బహుముఖీయమైన కళాకారుడాయన. ఇవ్వాళ తెలంగాణలో ఎంతోమంది జానపద కళాకారులకు బాణీలు సత్తయ్య గాత్రం నుంచే వచ్చేయనడంలో ఎటువంటి సందేహం లేదు.
srinivas
సత్తయ్య కథాప్రయాణం పూలపానుపు కాదు. అనేక ఒడిదొడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన కథ చెప్పిన తొలినాళ్లలో బహు కష్టపడ్డం. మొదట్లో నన్ను కులపోల్లు సుత ఛీత్కరించిండ్లు. అవుతలో ల్లు రానీయ్యలే. కులబహిష్కరణ సుత చేసిండ్లు. అయినా నేను జంకలే. బెంకలే అని తానే చెప్పుకున్న సందర్భాలు అనేకం. అకుంఠిత దీక్షాదక్షతలతో కళను నమ్ముకొని కొన ఊపిరిదాకా ఆ కళతోపాటే ప్రయాణం చేసిన చుక్క సత్తయ్యను ఈలోకం తనవాడుగా అక్కున చేర్చుకున్నది. దానికి కారణం తన పదేండ్ల వయస్సులో రేణుకా ఎల్లమ్మ, పదహారేండ్ల వయస్సులో మహంకాళీ దర్శనమిచ్చి తన ప్రయాణాన్ని ముందుకుతీసుకెళ్లారని తన తపనకు వాళ్ల దీవెనార్తి ఉన్నదని చెప్పుకున్నారు.

మాణిక్యాపురంలో చౌదరిపల్లి వాళ్లు 62 గడపలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 82 మంది కళాకారులున్నారు. వారినే కాదు ఆయన వేలాదిమంది కళాకారుల్ని తయారుచేశారు. ఊరి చావట్లో కొంతమంది ప్రజల మధ్య కథ చెప్పిన సత్తయ్య ఆ కళకు విశేష ప్రాచుర్యం తెచ్చిపెట్టారు. రేడియోలో ఆయన కథ వినిపిస్తే రేడియో పగిలిపోద్దా అన్నంత గంభీరమైన గాత్ర విన్యాసం ఆయన సొంతం. తెలుగువిశ్వవిద్యాలయం జానపద విభాగంలో ఒగ్గు కథ ఇన్‌స్ట్రక్టర్‌గా ఆయన దాదాపు పదేండ్లపాటు పనిచేశారు. ఆయన కోసమే నాడు విశ్వవిద్యాలయం ఒగ్గుకథను ఒక సబ్జెక్ట్‌గా తీసుకురావాల్సిన అనివార్యతలను సృష్టించారు. ఆయన ఒగ్గుకథలో చేసిన సేవలకు కాకతీ య, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించుకున్నాయి. మద్రాస్ కళాసాగర్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి, విశిష్ట పురస్కారాలే కాదు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఏకైక జానపద కళాకారుడిగా చుక్క సత్తయ్య రికార్డు సృష్టించారు. అమెరికా తానా, నాటా వంటి సం స్థలు ఆయనను పిలిపించుకొని కథ చెప్పించుకొని అవార్డులిచ్చి గౌరవించాయి. జానపద బ్రహ్మ, మకుటంలేని మహారాజు, జానపద కళాసామ్రా ట్, ఆధునిక ఒగ్గుకథ పితామహుడు వంటి బిరుదులు ఆయన కళాసేవకు చుక్కలుగా వచ్చి చేరాయి.

చుక్క సత్తయ్య బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ వంటి పురాణేతిహాస గాథ లు మాత్రమే చెప్పలేదు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ప్రభు త్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేసేందుకు ఒగ్గుకథ ఉపయోగపడింది. ఏకంగా ఇందిరాగాంధీ తనను ఢిల్లీకి పిలిపించుకొని ఇరువై సూత్రాల పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినప్పుడు ఆయన ఒగ్గుకథ బాణీల్లో ఆ పథకానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. ఆయన కథను వాడుకున్నారే తప్ప ఆయన్ను ఆదుకున్న దాఖలాల్లేవు.

చుక్క సత్తయ్య ఒగ్గుకథకుడు మాత్రమే కాదు. సీమాంధ్ర పాలనలో నష్టపోయిన సగటు రైతు కూడా. ఆయన రైతు అనే విషయం ఎవరికీ అంత గా తెలియదు. తనకున్న భూమినంతా సాగుచేయాలని ఆయన భగీరథ ప్రయత్నం చేశాడు. తనకున్న వ్యవసాయ భూమిలో 36 బోర్లను వేసిం డు. తొమ్మిది బావులను తవ్విండు. అయినా చుక్కనీరు కనిపించని దయనీయ స్థితి. తనకు పురస్కారాల కింద వచ్చిన లక్షలాది రూపాయల సొమ్మును నీళ్ల కోసం ఖర్చుచేశారు. ఫలితం శూన్యం. చివరికి 15 ఎకరాల భూమిని అమ్ముకున్నడు. అందరైతే చుక్క సత్తయ్య అంటే అబ్బో అంటరు. సీమాంధ్ర పాలనలో ఎవుసం మొగులెక్కిన తీరును సత్తయ్య చెప్పుకున్న సందర్భాలు అనేకం.
chukka-sattaiah
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన జనగామ ప్రాంతంలో చుక్క సత్తయ్య చిన్నపిల్లగాడిగా భాగస్వామ్యమైండు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే బతుకులు బాగుపడుతయని విశ్వసించిండు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వరంగల్‌లో ఆయన జరిగిన ఓ సాం స్కృతిక కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యమైనప్పుడు సత్తయ్యా.. తెలంగాణ వచ్చింది. నీ ఎవుసం బాగయిందా? అంటే అయ్యా..! నేను పాతాళంలో ఉన్న గంగను తీస్కరాలేకపోయిన కానీ చంద్రశేఖర్‌రావు పాతాళంలో ఉన్న తెలంగాణను తెచ్చిండు. ఇప్పుడు మా ఏరియాలో ఎవు సం పచ్చపడ్డది. రైతులు సంతోషంగా ఉన్నరని ఆయన తన పూర్వపు స్థితి ని, ప్రస్తుత తెలంగాణ ముఖచిత్రాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. అంతేకాదు తెలంగాణలో ఇప్పుడు సాంస్కృతిక విప్లవ సారథి చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్నడు. కళలకు బతుకు, కలలకు బతుకు నిం డుగ పండుద్దంటూ ఆయన సీఎం కేసీఆర్‌ను కీర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 జనవరిలో వరంగల్ పర్యటనలో ఉన్నప్పుడు చుక్క సత్త య్య కుటుంబ బాగోగులపై ఆరా తీసి, ఆయనను కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటి పిలిపించుకొని యోగక్షేమాలు అడిగారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర అవార్డు, ప్రశంసాపత్రం, లక్ష రూపాయ ల నగదు పారితోషకాన్ని అందివ్వడమే కాకుండా చుక్క సత్తయ్యకు ప్రత్యే క భృతికింద నెలకు పదివేల పింఛన్ అందేలా చేశారు. ఆయన చరమాంకంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవడమే కాదు ఇటీవల అనారోగ్యానికి గురై మంచాన పడితే నిమ్స్‌లో వైద్యం చేయించారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి చుక్కా సత్తయ్య బతుకు, కళా సాంస్కృతిక సేవలను ఒగ్గు చుక్క పేర డాక్యుమెంట్‌ను తీసి భద్రపరిచింది. తెలుగు విశ్వవిద్యాలయం సైతం చుక్క సత్తయ్యమీద డాక్యుమెంట్ తీసి ఆయన జీవిత విశేషాలనే కాదు ఆయన కళాసేవలను పదిలపరుచడంలో భాగస్వామ్యమైంది. మారుమూల మాణిక్యాపురంలో పుట్టిన అతిసామాన్యు డు ప్రపంచం గర్వించి కీర్తించే స్థాయికి ఎదిగి చుక్కల్లో చంద్రుడై పయ నం అయిండు.

625

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ