భరించువాడే భారతీయుడు..!


Sun,December 25, 2016 02:47 AM

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారును బతుకు అన్నంతగా
తయారైంది దేశం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎవరన్నా అంటే ఇప్పుడు దేశద్రోహులతో సమానంరా నాయనా.

అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఏ గ్రేట్ సర్జన్. హీ కెన్ డూ ఎనీ థింగ్. హీ క్రియేట్ వండర్స్. లేకపోతే అనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయగల సమర్థ సర్జన్‌ను పట్టుకొని ఎన్నేసి మాటలంటారు?


పొరపాటున అట్లా ఎవరన్నా అనాలని ట్రై చేసేరు మహాప్ర భూ.. మీకు మూడుద్ది. కట్ట లు కట్టలుగా గుట్టలు గుట్టలుగా పోగుబడిపోతున్న పసి డి కడ్డీల పడావు. ఎస్...బాస్,,! ఈ ముప్పదికి పైగా మాసములలో ఎప్పుడూ లేనంతగా మోదీ దేశాన్ని శుద్ధి చేసే పని లో బిజీబిజీగా ఉన్నారు. కాలసర్పపు ధనవంతులను అదే బ్లాక్ మనీ హోల్డర్స్‌ను బుద్ధిమంతులుగా మార్చేందుకు నవీన బుద్ధుడిగా అవతారమెత్తాడని ఆ కాషాయ బుద్ధిమంతులు ఆకాశానికెత్తుతున్నారు. అప్పుడప్పుడూ భారత్‌ను సందర్శించి తరించీ, పర్యటించి, పాలించి. లాలించి.. బుజ్జగించి వేళ్లే మోదీ ఈ మధ్య దేశాన్ని పట్టుకునే ఉంటున్నారు. ఈ దేశాన్ని కడిగి పారేస్తానని చీపురు పట్టుకొని ఊడ్చేస్తున్నారు. నల్ల మబ్బుల్ని పాతాళంలోకి దింపి తెల్లని వర్షాలను కురిపిస్తానని తన కళ్ల వెంట నీళ్లు పారిస్తూ ప్రవక్తలా ఉద్వేగపు ప్రసంగాలు చేస్తున్నారు. చప్పట్లు కొట్టండబ్బా.. ఇంత చేసిన వారికి కనీస మర్యాద ఇవ్వకపోతే దేశద్రోహం సుమీ! ఆలోచించండీ ఆపై మీ ఇష్టం.

పెద్ద నోట్లను రద్దుచేస్తే చేశాడు. కానీ, ఆల్టర్‌నేట్స్‌ను ప్రపోజ్ చేస్తే బాగుండునయ్యా అని ఊరికెనే సలహాలివ్వకండయ్యా! తలలు పండీ గెడ్డాలు మీసాలు పెంచి సన్యాసులవలే ఫోజులిచ్చే ప్రొఫెసర్లకు ఏం తెలుసుద్దీ పాసూ! నాలుగ్గోడల మధ్య మహా అయితే అప్పుడప్పుడూ అధ్యయనాలనీ, ప్రసంగాలనీ ఏవో నలుగురు పిల్లకాయలకు పాఠాలు చెప్పే దేశదేశాల ప్రొఫెసర్లకు ఏం తెలుసుద్దయ్యా.. వాళ్లట్లగే అంటరు. పుస్తకాలు చూసి చెప్పుడే కదా వారి పని. అటువంటప్పుడు మనీ కష్టాలు వారికెలా తెలుస్తా యి? అవును నిజమే మోదీ సారూ! మీకంటే కోటానుకోట్ల విలువ చేసే వేసుకునే కోట్లుంటాయి కానీ వాటికి సంబంధించిన పాట్లేముంటాయి చెప్పండీ! అదేదో సినిమాలో భరణి చెప్పినట్టు ఆడు మగాడ్రా బుజ్జీ..! అన్నట్టే మోదీ కూడా సేమ్ టూ షేమ్. ఎంత మగాడు కాకపోతే ఒక్క నిర్ణయంతో దేశాన్ని మొత్తం నడిరోడ్డు మీద క్యూలో నిలబెట్టా డు. మొన్నటిదాకా కొంతమంది మాత్రమే గంటల తరబ డి వంతు ప్రకారం క్యూలో నిలబడి సరుకులు తెచ్చుకునే ది. రైతులు ఎరువులు, విత్తనాలు తెచ్చుకునేందుకు వాళ్లతో పాటు వారి కాలిజోల్లూ క్యూలో నిలబడేది. ఇప్పుడు మాత్రం జాతిపిత ముఖవర్చస్సూ గల కాగితాల కోసం డబ్చిచ్చే యంత్రాల ముందు అదేనండీ ఏటీఎంల ముందు బారులు తీరి పగలనకా రాత్రనకా క్యూలో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐదేండ్లకోసారి ఓటేసేందు కు నిలబడితే అదొక విలసిల్లి విరబూసే ప్రజాస్వామ్యానికి సంకేతమైనప్పుడు దాచుకున్న తన సొమ్మును బ్యాంకు ఖాతాల్లోంచే తీసుకోవడానికీ నిలబడక్కర్లేదా..! ఏం మాట్లాడుతున్నరు మీరు అని క్యూలో నిలబడటం మహా అపరాధమైనట్టు మోదీని ఆడిపోసుకుంటున్నారు? అందు కే ఆయణ్ని మగాడ్రా బుజ్జీ అనకపోతే ఏమనాలి..?

నల్లకుబేరులందరినీ నోటు నుంచి నరుక్కురావాలని ఆయన చేస్తున్న మహాయజ్ఞంలో మనమూ భాగస్వామ్యం కావాలి సుమా! లేదంటే మీ ఇష్టం వద్దన్నవాళ్లందరినీ, వారించిన వారందరినీ దేశద్రోహులుగా ముద్రించే ప్రమా దము మరిచిపోయేరు సుమా! అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఏ గ్రేట్ సర్జన్. హీ కెన్ డూ ఎనీ థింగ్. హీ క్రియేట్ వండర్స్. లేకపోతే అనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయగల సమర్థ సర్జన్‌ను పట్టుకొని ఎన్నేసి మాటలంటా రు? మత్తు మందివ్వకుండా ఆపరేషన్ చేసినప్పుడు మహా నొప్పి ఉంటుంది. రెండు మూడు రోజులు కాకపోతే రెండు మూడు నెలలు ఓర్చుకుంటే నొప్పి అలవాటైనట్టూ ఇదీ అంతే వెరీ సింపుల్. దినచర్యలో నొప్పి ఒక భాగమైపోతుం ది. అదే జరుగుతుంది కదా! దాదాపు నెలన్నర దాటింది. చావుల్లో కొత్త ట్రెండొకటి ఈ దేశం అనుభవంలోకి వచ్చిం ది. కష్టకాలంలో ఉన్నప్పుడు క్యూలో నిలబడకలేక పోతే ఎట్లా బ్రదర్. బ్యాంకుల ముందర సొమ్మసిల్లి సోసొచ్చి. తూళి పడిపోతే పుర్రె బలహీనత వల్ల.. నరాలు చిట్లిపోవ డం వల్ల అట్నుంచి అటే పాడె మీదికి వెళ్లిపోవచ్చు. నోటు కోసం క్యూలో నిలబడి ప్రాణం కూడా త్యాగం చేయలేని పౌరుడికి ఈ దేశంలో నివసించే హక్కెక్కడుంది.? ఇప్పుడంతా స్మార్ట్. ఏది జరిగినా స్మార్ట్‌గా జరిగిపోవాల్సిందే. దింపుడుగల్లం కాడ కూడా పిలిచే చివరి పిలుపు చెవుల్లో కాదు మరణించిన వ్యక్తి తాలూకూ పాస్‌వర్డో, బ్యాంక్ అకౌంట్‌నెంబరో తెలుసుకొని ఆర్టీజీఎస్‌లో జమచేయాలి అప్పుడే ఆతని ఆత్మకు నోటు శాంతి కలుగుతుంది. ఏమండోయ్ మీరు క్యూలో నిలబడితే చెప్పండీ టిఫిన్ అవసరమై తే అమెజాన్ ద్వారా పంపిస్తాను. కానీ నువ్వు మాత్రం నాకు స్పర్శాత్మక నోటే తేవాలి. ఇది మాత్రం ఆన్‌లైన్‌లోనే పంపిస్తానంటే నువ్విక ఆఫ్‌లైనే.. చివరాఖరుకు వైఫ్ కూడా నైఫ్‌లా మెరుస్తుంది బాసూ..! ఇంతకాలం ఆవిడ మాటకే పదునెక్కువ అనుకున్నా కానీ అంతకంటే మోదీ మానియాకే విలువెక్కువని అనుభవంలోకి వచ్చింది.

Tax less and less cash Economyలో మేమిచ్చిన ఐదు పాయింట్లలో ప్రభుత్వం రెండు మాత్రమే అదీ పాక్షికంగా తీసుకుంది. మిగతా మూడు కూడా తీసుకొని అమలు చేసి ఉంటే ప్రజలకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావు అని వాపోయాడు అనిల్ బోకిల్ అనే మరట్వాడా అర్థ క్రాంతి ప్రతిష్ఠాపన్ సంస్థ నిర్వాహకుడు. ఇంతకీ ఈ అని ల్ బోకిల్ ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మోదీకి నోట్ల రద్దు సలహా ఇచ్చాడట. మోదీ బుద్ధి శుద్ధి తెలియక ఆయనలా వాపోయి ఉండవచ్చు. కానీ, నిజానికి చేసిన మహత్కార్యం మామూలుది కాదు.
srinivass
నల్లనడ్డి విరిచి విల్లంభులు చేతబట్టి ప్రతి మనిషొక సైనికుడై దేశాన్ని పుణీతం చేసే ప్రక్రియలో భాగంగానే టీటీడీ సభ్యుడి కోటానుకోట్ల సంపద వెలుగుచూసింది. ఇటువం టి ఘనాపాఠీలు ఏ బాత్‌రూం చిన్నసందుల్లో దాగున్నా రో.. దాచుకున్నారో తెలుసుకునే కిటుకొకటి కొత్త నోటులో దాగుందట సామీ!రొంబొచ్చలు గుద్దుకోనక్కర్లేదు బాసూ! కలుగులో దాగున్న నకిలీ పులుల్ని సైతం మెడపట్టి ఈడ్చి వేయగల అసలైన మందు ఇదే మరీ. చీకట్లను చీల్చే మోదీ వెలుతురును కనిపెట్టలేకపోతిమి అని దేశం ఒకింత రంది కూడా పడుతుందని వాళ్లే అంటున్నారు. అప్పటిదాకా ఈ దేశం క్యూలో నిలబడక తప్పదు. కంటేయినర్లు రావచ్చు.. రాకపోనూవచ్చు. మనం మాత్రం క్యూలో నిలబడక తప్ప దు. ఎంతకాలం అంటే. చెప్పలేం భాయ్.. నోటు కష్టాలు చేతికంది తీరేదాక. అవసరమనుకుంటే రాత్రిళ్లు కూడా బ్యాంకుల ముందు వంతులవారీగా ఇంటిల్లిపాది నోటు కావలి జాగరణలు చేద్దాం. ఒక మంచి పని చేసే ముందు కొన్ని కష్టాలు భరించక తప్పదు. భరించువాడే భారతీయుడు. లేదంటే.. తెలుసుగా..!!

2334

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Wed,July 15, 2015 12:23 AM

ప్రకృతి నిజం..మనిషి అభూతం..!

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్క

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ