ప్రకృతి నిజం..మనిషి అభూతం..!


Wed,July 15, 2015 12:23 AM

మనిషి ప్రకృతితో సంభాషించే అరుదైన ఆవిష్కరణ పుష్కరాలు. తనువును మరిచి, తలంపులు వదిలి తన్మయత్వంతో జలచేతన ప్రదర్శించే దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కారమవుతు న్నాయి. తనను తాను మరచిపోవడమే కాదు అప్పుడప్పుడూ ప్రకృతిని సైతం శాసిస్తానని ప్రగల్బాలు పలుకుతున్న మనిషి ఎప్పుడో ఒకసారి ఆ ప్రకృతికే మోకరిల్లడం సహజంగా దర్శనమిస్తూనే ఉంటుంది. అటువంటి అరుదైన సన్నివేశాలనేకం గోదావరి పుష్కరాల సందర్భంగా ఆవిష్కారమవుతున్నాయి. భోగాలను మరిచి భాగ్యాలను మరిచి తెలిసో తెలియకో చేసిన తమ తప్పుల్ని కడిగేయమని నదీమతల్లి ముందు మోకరిల్లడం పుష్కరాల సందర్భం గా మానవాళి గోదారమ్మను వేడుకుంటుంది. తెలంగాణ తన అస్తిత్వ పతాక ఆకాశమంత ఎత్తున నిలిచి గెలిచిన తరుణంలో వచ్చిన గోదావరి

nsrinivas


పుష్కరాలకు ప్రత్యేకమైన సందర్భమే ఉన్నది. గోదావరి అంటే చిన్నప్పుడు ఆంధ్రకేసరి సినిమాలో వేదంలా ఘోషించే గోదావరి.. అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ.. తరతరాల చరిత గల సుందర నగరం.. గత వైభవ దీప్తులకు కమ్మని హారం.. అంటూ గోదా రి మీద, గోదావరి పరీవాహక ప్రాంతమంటే కేవలం రాజమహేంద్రవరంలా స్థిరపడిపోయింది. అదే నిజమని భ్రమపడేలా చేసిన దుస్థితి నుంచి తెలంగాణ ఉద్య మ ప్రస్థానం కాలంలో గతంలో క్రితం వచ్చిన పుష్కరాల సందర్భంగా గోదావరి అంటే ఆంధ్రాది మాత్రమే కాదు. ఆంధ్రాలో కేవలం రెండంటే రెండు జిల్లాలకే పరిమితమైనదిగా తెలిసివచ్చినప్పటి నుంచి గోదావరి నదీమతల్లి తెలంగాణ అస్తిత్వ పతాక అని తేలిపోయింది. తెలంగాణ స్పృహతో గోదావరిని చూడటం మొదలుపెట్టిన తరువాత అనేక సత్యాలు తెలిసి వచ్చాయి.

ప్రపంచంలో ప్రాచీన, ఆధునిక సమాజాలు అన్నీ నదీలోయ నాగరికతలుగానే విలసిల్లాయి. హరప్పా మోహింజోదారాలో పట్టణాలు సింధూలోయ నాగరికతలో వెలుగొందాయి. యూప్రటీస్, టైగ్రీస్ నదు ల మధ్య మెసపోటేమియా నాగరితక ఇలా చెప్పుకుంటూ పోతే చైనా, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలన్నీ నదీలోయ నాగరికతలుగానే పురుడుపోసుకొని వాటి చరిత్రల్ని, ఉనికినీ దేదీప్యమానం చేశా యి. అట్లా చూసినప్పుడు మన తెలంగాణ గడ్డమీద పారుతోన్న జీవనదిలాంటి గోదావరి నదీలోయ నాగరికత ఇంతకాలం మనకు తెలియకుండా చేసింది సమైక్యాంధ్ర విష కౌగిలి. నీళ్లను దోసి, నిధుల్ని దోసి, నియామకాలను కొల్లగొట్టి తెలంగాణను ఎడారిగా మార్చిన కుట్రల్ని ఇప్పుడిప్పుడే తెలంగాణ ఛేదిస్తోం ది. అయినా కుట్ర కత్తులు విచ్చుకుని విషసర్పంలా కాటువేసే కుతంత్రాలు నిత్యం పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. జలం కోసం జనం యుద్ధాలు చేసుకునేలా ముష్టిఘాతుకాలు చెలరేగుతున్న సన్నివేశాలు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్న సందర్భంలో గోదావరి నదీమ తల్లిని మనం ఎట్లా చూడాలి? అన్న ప్రధాన ఆలోచనను కేసీఆర్ సర్కార్ గడిచిన ఏడాది కాలంగా సమయం వచ్చినప్పుడల్లా సమాధానం చెబుతూనే ఉన్నది.

జనప్రాధాన్యాన్ని మానవాళి గుర్తుంచుకునేందుకు వీలుగా మహనీయులు ఎంతో ముందుచూపు తో పుష్కరాల పేరుతో నదులను భక్తితో పూజించే ఉత్సవాలను ప్రారంభించారు. పుష్కరాలు జలచైతన్యానికేకాదు సంస్కృతి, సంప్రదాయాల సమాగమ కేం ద్రాలుగా విలసిల్లుతున్నాయి. చెరువులు జనావాసాలుగా మారిపోవడంతో గ్రామాలు కళతప్పుతున్నా యి. నీటికోసం యుద్ధాలు చేసుకునే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ సర్కార్ విస్మరణకు గురైన నీటి (నదులు కావచ్చు, చెరువులు కావచ్చు) విస్తృతిని ఒక పవిత్ర కార్యంగా చేపట్టింది. మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణ గొలుసుకట్టుగా నేలను ముద్దాడిన చెరువుల చెరసాలను విడిపించేందుకు తాపత్రయపడుతోంది. మిషన్ కాకతీయ తొలి దశ చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పను లు శరవేగంలా ఉద్యమస్ఫూర్తితో సాగి చివరి అంకానికి వస్తున్నాయి. మిషన్ కాకతీయ మహత్తర ఫలా లు ఇప్పుడిప్పుడే కళకలలాడే చెరువులను చూస్తే పోగొట్టుకున్న జలసిరులు మళ్లీ మనమొహాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నాయి. జలప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం గోదావరి నది మీద ఇంతకాలం చూపిన వివక్ష వల్లపోగొట్టుకున్న జల సిరుల్ని మళ్లీ పాదుకొల్పేందుకు కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో మరో మహా యజ్ఞానానికి సంకల్పిస్తోంది.

pushkarl


ఇప్పుడు గోదావరి పుష్కర సందర్భం కనుక పుష్కర పవిత్ర పుష్కర స్నానానికే పరిమితం కాకుం డా గోదావరి నది పరీవాహక ప్రాంతం అంతా కేవ లం తాగునీరు, సాగునీరుకు పరిమితమైన అంశం కాదన్న సత్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్న ది. నిజానికి గోదావరి నది వ్యవసాయక వరప్రదాయిని మాత్రమే కాదు తెలంగాణ తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా ఉన్న ఖనిజ భాండాగారం కూడా. ఖనిజాలకు పుట్టిల్లు గోదావరి. ఖనిజాలకు పుట్టిల్లు అంటే అది ఉభయ గోదావరి జిల్లాల్లో కంటే తెలంగాణలోనే పారకం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో అపార ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సిమెంట్ తయారీకి అవసరమైన లైమ్‌స్టోన్ పుష్కలం గా ఉండటం చేతే ఈ రెండు జిల్లాల్లో సిమెంట్ పరిశ్రమలు వెలిశాయి. అంతేకాదు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అపారమైన బొగ్గు గనులు ఉండటం తెలంగాణకు ఈ మూడు జిల్లాలు నల్లబంగారపు నగను తొడిగాయి. ఖమ్మం, వరంగల్ జిల్లా ల్లో ముడి ఇనుము. ఇక్కడ సమృద్ధిగా ముడి ఇను ము ఉండటం వల్లే ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు బీహెచ్‌ఈఎల్ లాంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలో టాల్క్ ఖనిజం ఆధారిత పరిశ్రమలు నెలకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది.

గోదావరి పుష్కర స్నానం పరమ పవిత్రంగా అదీ 144 సంవత్సరాల తరువాత వచ్చిన మహాపుష్కరాల సందర్భంగా తెలంగాణ సమాజం పుష్కర సం కల్పం చేసుకోవాల్సిన అనివార్యతలను సృష్టించుకోవాలి. కొల్లగొట్టబడిన ప్రతిష్టను పరిపుష్టితో పవిత్ర లక్ష్యంతో కార్యాచరణను రచించుకొని ఆచరించుకోవాలి. పుష్కరాలంటే రాజమండ్రే అన్నట్టుగా ప్రచా రం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడి దుః ఖాన్ని నటించే నయవంచక క్రీడకు కారకులెవరో తెలుగు సమాజానికి బాగా తెలుసు. నిజానికి తెలంగాణ కంటే తామే గొప్ప అన్నట్టుగా వ్యవహరించి ప్రచార పటాటోపం ప్రదర్శించి, భక్తజనం పోటెత్తుకోవడం ద్వారా తామే హీరోలమని ఉభయ గోదావరి జీరోలు పోజుకొట్టడం వల్ల, దానికి వంతపాడి గోరంతలు కొండంతలు ప్రచారం చేయడం వల్ల రాజమండ్రిలో అంతమంది అమాయకులు బలయ్యారు.

తెలిసి చేసిన పాపమే ఇటువంటి పాపాన్ని కూడా ఇవ్వాళ అదే సీమాంధ్ర మీడియా జనానిదే తప్పన్నట్టుగా వ్యవహరించే దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తోంది. అంతమంది తన బిడ్డలు తనువులు అదీ తన సన్నిధిలో చాలించడం వల్ల తల్లిగోదారి ఎంత తల్లడిందో మనసున్న ప్రతివాడూ ప్రాంతాలకు అతీతంగా అంతే తల్లడిలారు. పగవాడికీ రాకూడని గుండెకోత అది. అయితే కొన్ని దుష్టశక్తులు తెలిసి చేసిన పాపం వల్ల పుష్కరాలకు అపకీర్తి ఆపాదించే పనులు అప్పుడే మొదలయ్యాయి. పవిత్ర జలానికి అపవిత్రం అంటగట్టే ప్రయత్నాలను మానుకొని జనానికి సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని, అనివార్యతని పుష్కర ప్రారంభం రోజే స్పష్టమైపోయింది. ప్రకృతికి పబ్బతిపట్టి జలసిరిని ఒడిసిపట్టే ప్రయత్నాలు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సాగేందుకు ఇవ్వాళ తెలంగాణ సమాజం పవిత్ర పుష్కరాల సందర్భంగా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. ప్రకృతి ప్రసాదిత పంచభూతాల్లో జలమే బలంగా బంగారు తెలంగాణను నిర్మించుకోవాలి. అందుకు తల్లిగోదావరి దీవెనలు ప్రతీ ఒక్కరికి కలగాలి..నిజమైన ప్రకృతికి.. మనిషి భూతం కాకుండా అభూతంగా అద్భుతాలు సృష్టించి విలసిల్లేందుకు గోదారమ్మ గంగమ్మలా ఆశీర్వదించేలా మనచేతలు..జలచేతన కావాలి !

పవిత్ర జలానికి అపవిత్రం అంటగట్టే ప్రయత్నాలను మానుకొని జనానికి సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని, అనివార్యతని పుష్కర ప్రారంభం రోజే స్పష్టమైపోయింది. ప్రకృతికి పబ్బతిపట్టి జలసిరిని ఒడిసిపట్టే ప్రయత్నాలు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సాగేందుకు ఇవ్వాళ తెలంగాణ సమాజం పవిత్ర పుష్కరాల సందర్భంగా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. ప్రకృతి ప్రసాదిత పంచభూతాల్లో జలమే బలంగా బంగారు తెలంగాణను
నిర్మించుకోవాలి. అందుకు తల్లిగోదావరి దీవెనలు ప్రతీ ఒక్కరికి కలగాలి.

1851

SRINIVAS NOORA

Published: Fri,December 22, 2017 01:20 AM

పత్రికల్లో తెలంగాణ భాష

ఔట్ సోర్సింగ్‌ను పొరుగు సేవలంటున్నాం. నిజానికి పొరుగు సేవలు అంటే పక్కింటోళ్ల సేవలా అన్నఅనుమానం, చరవాణి చెరబట్టిన భాషకు సంకేతమా? గు

Published: Thu,November 9, 2017 10:55 PM

ఒగ్గు కథకు వేగుచుక్క

ఒగ్గు కథకు ఆయన వేగుచుక్క. ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య. అసలు పేరు చౌదరిపల్లి సత్తయ్య. నెత

Published: Sun,December 25, 2016 02:47 AM

భరించువాడే భారతీయుడు..!

బాధిత భారతం. నోటు ముందర ఓడిపోతున్న మనిషి. మోదీ మానియా. అవును ఇప్పుడు జగమంతా మోదీ మానియా. మూడున్నా లేకున్నా మోదీ అనకపోతే మొద్దుబారు

Published: Sat,October 6, 2012 03:57 PM

ఏడేళ్ల కిందటి ‘యాది’

ఆదిలాబాద్‌లో ఎవరు కాలుపెట్టినా సామల సదాశివ మాస్టా రు ఇంటికి వెళ్లాల్సిందే. వరంగల్‌లో కాలుమోపిన వాళ్లు కాళోజీ ఇంటికి వెళ్లినట్టు, క

Published: Sat,October 6, 2012 03:57 PM

జాతీయ పార్టీలు-తెలంగాణ..!

తెలంగాణకు సానుకూలంగా ఉండే పార్టీలనే తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటామని బీజేపీ అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేవకర్ చెప్పినా, తెలంగాణ 2014

Published: Sat,October 6, 2012 03:58 PM

ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!

ము లుగు దారులన్నీ మేడారం వైపు సాగుతున్నాయి. చీమలు పుట్టల్లోంచి ఆత్మగౌరవ తొలి మెరుపు మేడారం..!పోటెత్తినట్లు.., ఉసిళ్లు దండెత్తి

Published: Sat,October 6, 2012 03:59 PM

కుత్తుకలపై కత్తులు..చేతుల్లో అక్షరాళ్ళు?

-వరంగల్ జర్నలిస్టుల ఉద్యమానుభవాలు ‘శిబిరాల పేరు వినబడితే మనకు శరణార్థులు గుర్తుకు వస్తారు. తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తంగ