సాహిత్య సాంస్కృతిక అస్తిత్వ వేదిక


Sun,April 7, 2013 09:18 AM

tgవర్తమాన తెలంగాణ ఉద్యమం 1996లో చిన్నపాయగా మొదలై ఇవ్వాళ స్పష్టమైన, స్థిరమైన ప్రవాహంగా మారింది. ఈ ఇరవై ఏండ్ల ఉద్యమంలో అనేక మైలురాళ్లు దాటుకొని, అనేక పోరాట అనుభవాలతో రాటుదేలి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆకాంక్షను నలుమూలలకు వ్యాప్తి చేసింది. ఈ కాలంలో అనేక ఆటుపోట్లు. విజయాలు, వైఫల్యాలు, లొంగుబాట్లు, విద్రోహాలు, వెన్నుపోట్లు.. సమస్త అనుభవాల సమాహారం ఈ ఉద్యమం. ఎన్ని ఉన్నా ఉద్యమం విస్తరించిందే తప్ప తిరోగమనం లేదు. ఇందులో సమస్త తెలంగాణ ప్రజానీకం అనితర సాధ్యమైన తెగువ, సాహసం, అంకుఠిత దీక్షతో తెలంగాణ ఉద్యమ దీపాన్ని ఆరిపోనివ్వకుండా ఎత్తిపట్టారు. ఈ ప్రయాణంలో తెలంగాణ బుద్ధిజీవులు, రచయితలు, కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి పటిష్ఠమైన సైద్ధాంతిక భూమికను నిర్మించడంలో విశేషంగా శ్రమించారు. ఈ సిద్ధాంత భూమికను స్థూలంగా చెప్పుకోవాలంటే ...

1) తెలంగాణకు ఒక సహవూసాబ్ది కాలం పాటు ప్రత్యేక, స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తి ఉన్నది. 1948లో ఇండియన్ యూనియన్‌లో ఈ ప్రాంతం విలీనమైనాక 1956 వరకు స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తి బలహీనపడుతూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అవతరణతో తెలంగాణ పరాధీనం అయ్యింది. ఇవ్వాళ తెలంగాణ కోల్పోయిన స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తిని తిరిగి పొందాలనుకుంటున్నది.

2) తెలంగాణకు ప్రత్యేక భాషా సాంస్కృతిక అస్తిత్వం ఉన్నది. 1956 తర్వాత తెలంగాణ భాషా సంస్కృతులు వివక్షకు, అణచివేతకు గురై కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చరివూతపై మట్టి కప్పబడింది. ఇవ్వాళ తెలంగాణ తన ఘనమైన భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నది. తన సుదీర్ఘమైన, ఉన్నతమైన చరివూతను తిరిగి పునర్ నిర్మించుకోవాలనుకుంటున్నది. తన సాంస్కృతిక ప్రత్యేకతని, ఆనవాళ్లను పునర్ ప్రతిష్టించుకోవాలనుకుంటున్నది.

3) తెలంగాణ గత యాభై ఏండ్లుగా వలస దోపిడీకి గురవుతున్న ది. సమస్త ప్రకృతి వనరులు, మానవ నిర్మిత వనరులు వలస దోపిడీకి గురవుతున్నవి. నీళ్లు, నిధులు, నియామకాలు, భూమి, బొగ్గు, చెట్టు పుట్ట, మట్టి, గుట్ట అన్ని దోపిడీకి వనరులుగా మారిన పరిస్థితి. వలసపాలకుల వివక్ష, దోపిడీ విధానాలతో తెలంగాణలో సమస్త జీవన రంగాలు సంక్షోభంలోకి నెట్టబడినాయి.

tg2తెలంగాణకు రాజ్యాధికారం ఉంటే తప్ప దోపిడీని నిలువరించలేదు. వనరులను తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకోలేము. తెలంగాణ భాషా సంస్కృతులను పరిరక్షించుకోలేము. అందుకే రాజ్యాధికారం తప్ప మరేది ప్రత్యామ్నాయం కాజాలదని ఉద్యమం చెబుతూ వస్తున్నది. ఈ ప్రాతిపదికలపైన బుద్ధిజీవులు సంఘాలు స్థాపించుకొని ఉద్యమంలోకి సమీకృతం అవుతున్న ఒక క్రమాన్ని ఈ సుదీర్ఘ మలిదశ ఉద్యమంలో చూడగలం. ఉద్యమం తొలినాళ్లలో భాషా సాంస్కృతిక రంగంలోనే కృషి మొదలైంది.

కవులు, రచయితలు, కళాకారులు తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ కవిత్వం, పాటలు, కథలు, వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అయితే ఎవరికి వారు విడివిడిగా కాకుండా ఒక జెండాకింద, ఒక్క వేదిక మీద, సంఘటితంగా ఈ రంగంలో కృషి జరగాలన్న స్పృహతో రచయితలు, కవులు, కళాకారులు ఆలోచించడం మొదలైంది. ఆ క్రమంలోనే తెలంగాణ జిల్లాల్లో సాహిత్య, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న అనేక సంస్థలతో తెలంగాణ రచయితల వేదిక ఏర్పడిం ది. సిద్దిపేట కేంద్రంగా పనిచేస్తున్న మంజీర రచయితల సంఘం ఇటువంటి ఒక ఐక్య వేదిక ఏర్పడడానికి చొరవ చూపింది. ‘మర సం’ చొరవతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న సంస్థ లు, వ్యక్తులు తెలంగాణ రచయితల వేదిక ఏర్పడానికి దోహదపడినారు. ఉద్యమం తొలినాళ్లలో ఏర్పడిన సంస్థల్లో తెలంగాణ రచయితల వేదిక ఒకటి.

2001లో ఏర్పడిన తర్వాత ఈ పదేండ్ల కాలంలో ‘తెరవే’ నిర్వహించిన పాత్ర, విస్తరింపజేసిన భావ చైతన్యం అపూర్వమైనది. వరంగల్ 2002 ఏప్రిల్ 7న వేదిక మొదటి మహాసభ ను నిర్వహించుకున్నది. ఆ మహాసభలో ప్రజాకవి కాళోజీ గౌరవాధ్యక్షుడిగా, ప్రముఖ కవులు నందిని సిధాడ్డి అధ్యక్షుడిగా, వేణు సంకోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వేదిక ప్రస్థానం ఆగలేదు. ఐదవ రాష్ట్ర మహాసభలు, జిల్లా మహా సభలు, (రంగాడ్డి, ఖమ్మం జిల్లాలో తప్ప) అపూర్వంగా జరిగాయి. జిల్లా సభ అని పేరేగానీ ప్రతీ సభ ఒక రాష్ట్ర మహాసభగానే జరిగింది. ప్రతీ జిల్లా సభకు అన్ని జిల్లాల నుంచి రచయితలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. రచయితలు, కవులు తమ పుస్తకాలను ఆ వేదిక మీద ఆవిష్కరించుకోవడానికి ఉత్సాహపడ్డారు. ఆ వేదికల మీద ఉపన్యసించడం ఒక అద్భుతమైన అనుభవంగా వక్తలు భావించా రు. ఆ వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం కళాకారులు గొప్పగా భావించారు.

ఇట్లా ‘తెరవే’ నిర్వహించిన సభల్లో తెరవె ప్రచురించిన పుస్తకాలతో పాటు రచయితలు తాము ప్రచురించిన పుస్తకాలు కొన్ని వందలు ఆవిష్కరించబడినాయి. సభలు నిర్వహించిన జిల్లా ల్లో ఒక సాహిత్య, సాంస్కృతిక ఉత్సవం నిర్వహించిన భావన. రచయితలే గాక ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు.. ఇట్లా తెలంగాణ బుద్ధి జీవులందరూ పాల్గొన్నారు. ఈ సభల్లో సాహిత్య, సాంస్కృతిక అంశాలే గాక రాజకీయాంశాలు కూడా విస్తృతంగా చర్చకు వచ్చాయి. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు, ఎన్. వేణుగోపాల్, ఆర్. విద్యాసాగర్‌రావు తదితరులు రాజకీయాంశాలు చర్చించారు. కళాకారులు ప్రజా వాగ్గేయకారులు గద్దర్, గోరటి వెంకన్న, అంద్శై, విమల, సంతోష్, రసమ యి, దేశపతి శ్రీనివాస్‌లతో పాటు వర్ధమాన గాయనీ గాయకులు వేదిక సభల్లో ప్రదర్శనలు ఇచ్చి సాంస్కృతిక చైతన్యవ్యాప్తికి దోహదం చేశారు.

వరంగల్ మహాసభల తర్వాత తెర వే సాంస్కృతిక యాత్ర ప్రారంభమైంది. 2002 జూలైలో నల్లగొండ జిల్లా మహాసభలు, 2002 నవంబర్‌లో నిజామాబాద్‌లో జిల్లా మహాసభలు, 2003 మార్చిలో సిద్దిపేటలో రెండో రాష్ట్ర మహాసభలు, 2003 జూలైలో కరీంనగర్‌లో, సెప్టెంబర్‌లో ఆదిలాబాద్‌లో జిల్లా మహాసభలు, 2004 మార్చిలో హైదరాబాద్‌లో మూడో రాష్ట్ర మహాసభలు, 2004 సెప్టెంబర్‌లో మహబూబ్‌నగర్‌లో జిల్లా మహాసభలు జరిగాయి.

ఈ సభల్లో ‘తెలంగాణ సోయి’ పత్రిక ప్రత్యేక సంచికలు రూపొందినాయి. ఈ సభల అనంతరం 2006లో నందిని సిధాడ్డి స్థానంలో జూకంటి జగన్నాథం అధ్యక్షుడిగా, వేణు సంకోజు స్థానంలో జూలూరు గౌరీశంకర్ ప్రధా న కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వీరి నాయకత్వంలో 2006లో సిరిసిల్లాలో నాలుగో రాష్ట్ర మహాసభ, 2009లో హైదరాబాద్‌లో ఐదో రాష్ట్ర మహాసభ, 2011 ఏప్రిల్‌లో అఖిల భారత తెలంగాణ రచయితల మహాసభలు జరిగాయి. జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన 2012 సెప్టెంబర్ 2న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ‘తెరవే’ ఆరో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి.

ఈ పదేండ్ల తెరవే ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ సమాజం మీద, తెలుగు సాహిత్యం మీద చూపిన ప్రభావాలు ఏమిటి? ఇవి ఇవ్వాళ కీలకంగా చర్చించుకోవాల్సిన అంశం. తెరవే ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రచయితల సంఘటిత కృషి ఆరంభమైంది. ధైర్యంతో, తెగువతో సాంస్కృతిక వలసీకరణను, అంతర్గత వలసదోపిడీని వ్యతిరేకిస్తూ రచనలు కొనసాగించారు. పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ప్రచురించారు. పాటల సీడీలు వెలువరించారు.

తెలంగాణ ఒక నూతన సాంస్కృతిక సాహిత్య వెల్లువకు తెరవే సభలు పునాది వేశాయి. తెలంగాణ సోయి అనేకమంది వర్ధమాన తెలంగాణ రచయితలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తూ రాస్తున్న కవిత్వానికి, కథలకు, వ్యాసాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చింది. అట్లా వందలాదిమంది నూతన కవులకు ఆత్మవిశ్వాసాన్నిచ్చి రచయితలుగా నిలబెట్టింది ‘తెలంగాణ సోయి’. కలం మూసేసిన పద్య కవులనూ తట్టిలేపి పద్యకవులనూ ఉద్యమకవులు గా నిలబెట్టింది సోయి. వందలాది పుస్తకాలను తెరవే ప్రచురించిం ది. ఇవ్వాళ్టి ఉద్యమ అవసరాలకు, భావ వ్యాప్తికి తోడ్పడతాయని భావించిన పాత పుస్తకాలను పునర్ ముద్రించింది. వట్టికోట సంపాదకత్వంలో 1955లో వెలువడిన ‘తెలంగాణం’ రెండు సంపుటాల ను, బిఎన్ శాస్త్రిగారు 1952లో రాసిన ‘రెండు తెలుగు రాజ్యాపూందుకు?’ గోలకొండ కవుల సంచికలు మొదలైనవి ముద్రించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అనర్ఘ రత్నాలను వెలుగులోకి తెచ్చింది తెరవే.

రచయితలు, కవులనే కాదు చరివూతకారులనూ ఉత్తేజపర్చి వారినీ ఉద్యోమోన్ముఖులను చేసింది తెరవే. ప్రముఖ తెలంగాణ కవుల పద్యపాదాలకు చిత్రరూపం కల్పించి అన్ని సభల్లో ప్రదర్శించారు. అవి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోనెలింగరాజు, శ్రీనివా స్ నాయక్, అన్నవరం శ్రీనివాస్ ఇట్లా వెలుగులోకి వచ్చిన యువ చిత్రకారులు. గోనె లింగరాజు గీసిన తెలంగాణ బతుకు చిత్రాలు విశేష ఆదరణ పొంది అవి తెలంగాణ పుస్తకాలకు అట్టమీది బొమ్మలైనాయి. శ్రీనివాస్‌నాయక్ గీసిన తెలంగాణ కవుల పోట్రయిట్స్, పద చిత్రాలు సభల్లో సంచలనం. అన్నవరం శ్రీనివాస్ గీస్తున్న స్కెచ్‌లు, ముఖచివూతాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ విధంగా చిత్రకారులు, కార్టూనిస్టులూ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి తెరవే దోహదపడింది.

తెరవే ఇచ్చిన స్ఫూర్తితో ప్రభావితులైన వారు తమ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ధూంధాంలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి భావనను గ్రామ స్థాయికి తీసుకపోవడానికి, ఆ భావన స్థిరపడడానికి తెరవే భావ ప్రచారమే కారణమని భావించాలి. ఆ తర్వాత అనేకచోట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్ఠింపబడినాయి. తెరవే ప్రభావం వల్ల తెలంగాణ భాషలో కవిత్వం, కథలు విస్తృతంగా రావ డం మొదలైంది. తెలంగాణ భాషకు ఒక సాహిత్య గౌరవం దక్కింది.

సీమాంధ్ర పత్రికలు తెలంగాణ భాషలో వస్తున్న కవిత్వాన్ని, కథలను తిరస్కరించే పరిస్థితి ఇవ్వాళ లేదంటే అది తెరవే ప్రభావమే. తెరవే ఆధ్వర్యంలో కవులు రచయితలు అనేక ఉద్యమాలకు క్రియాశీల మద్దతునిచ్చారు. సకల జనుల సమ్మెకు ముందు ‘సింగిడి’తో కలిసి ‘కవుల గర్జన’ జరిపింది. కేంద్ర సాహిత్య అకాడమీ కథా సదస్సులో తెలంగాణ కథా రచయితలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని నిరసిస్తూ ఆ సభలను తెరవే ఆధ్వర్యంలో బహిష్కరించారు. తెలంగాణ అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా మారనున్న తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల బహిష్కరణకు పిలుపునిస్తూ ప్రపంచ తెలంగాణ మహాసభల నిర్వహణకు పూనుకుంటున్నది. మిలియన్‌మార్చ్‌లో విగ్రహాల విధ్వంసంపై సీమాంధ్ర పెద్దలు సృష్టించిన గగ్గోలుకు వెరవక ‘విరుగుడు’ను ప్రచురించింది తెరవే. ఈ దెబ్బతో విగ్రహాల విధ్వంసంపై చర్చ బందయింది.

ఈ రకంగా ప్రతి కీలక సందర్భంలో తెరవే తన స్పందనని తెలియజేసింది. ఉద్యమంలో తానూ భాగస్వామినని రుజువు చేసింది. అయితే తెరవే ‘తెలంగాణ సోయి’ పత్రికను క్రమం తప్పకుండా వెలువరించడంలో విఫలమైందని అందరి భావన. తెలంగాణ రచయితలకు ఒక భరోసాను, నమ్మకమైన వేదికనిచ్చిన సోయి నిలిచిపోవడం అందరికి బాధాకరంగా ఉన్నది. ‘తెలంగాణ సోయి’ తిరిగి వెలువడాలని అందరి భావన, ఆకాంక్ష.

తెరవే కృషిని ఒక్కమాటలో చెప్పాలంటే... భావజాల రంగంలో సీమాంవూధుల ఆధిపత్యాన్ని సమూలంగా చితక్కొట్టింది. ఇప్పుడు వారి ప్రతిఘటన అంతా రాజకీయ రంగంలోనే సాగుతున్నది. ఈ పదేండ్ల ప్రస్థానంలో నిర్మల్‌లో ఆరో మహాసభలు జరుపుకుంటున్న తెరవే మరింత క్రియాశీలంగా పనిచేస్తుందని ఆశించవచ్చు. నూతన అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, నూతన ప్రధాన కార్యదర్శి సూరేపల్లి సుజాత తెరవే ఆశయాలను, లక్ష్యాలను సాధిస్తారని ఆశిద్దాం.

తెలంగాణ రచయితల వేదిక ఆరవ మహాసభలు
వచ్చే నెల 2 వ తేదీ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ని రాజరాజేశ్వరి గార్డెన్స్ (మంచిర్యాల రోడ్)లో తెలంగాణ రచయితల వేదిక ఆరవ మహాసభలు జరుగనున్నాయి. సామల సదాశివ వేదికపై ప్రారంభ సమావేశం ఉదయం 10 నుంచి 12గంటల వరకు. జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరుగు సమావేశంలో ఆత్మీయ అతిథులుగా కె. రామచంవూదమూర్తి, టంకశాల అశోక్, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, రాజేందర్‌డ్డి, స్కైబాబా తదితరులు హాజరవుతారు. ముఖ్యఅతిథులుగా జస్టిస్ ఎల్. నర్సింహాడ్డి విచ్చేస్తారు.

ప్రధాన కార్యదర్శి నివేదిక సూరేపల్లి సుజాత సమర్పిస్తారు. జలజం సత్యనారాయణ, డాక్టర్ నలిమెల భాస్కర్, మచ్చ ప్రభాకర్, వంశీకృష్ణ, సీతారాం, ప్రసేన్, నాళేశ్వరం శంక రం, డాక్టర్ ముత్యం, మల్లయ్య, సంకేపల్లి నాగేంద్ర శర్మ, అన్నవరం దేవేందర్, కోట్ల వేంక వసంతరావ్ దేశ్‌పాండే, బి. మురళీధర్, డాక్టర్ దామెర రాములు, డాక్టర్ అప్పాల చక్రధారి, బన్న ఐలయ్య, ఎస్ రఘు, పొట్లపల్లి శ్రీనివాసరావు, అనిశెట్టి రజిత, బైసా దేవదాసు, బెల్లి యాదయ్య, హనీఫ్, అంబటి వెంకన్న అతిథులుగా వస్తున్నారు. రెండవ సమావేశం (బోయ ధర్మయ్య పంతులు స్మారక వేదిక) మధ్యా హ్నం 12నుంచి 1 గంట వరకు. కొండ మల్లాడ్డి సభాధ్యక్షుడు. సి.కాశీం, బి.నర్సింగరావు ప్రసంగిస్తారు. మూడవ సమావేశం మధ్యా హ్నం 2నుంచి 3 గంటల వరకు గూడ అంజయ్య అధ్యక్షతన జరుగు సమావేశంలో గద్దర్, గోరటి వెంక న్న, అంద్శై, మిత్ర, రసమయి బాలకిషన్, విమలక్క, అల్లం వీరయ్య తదితరులు ఆట, పాటలతో అలరిస్తారు.

నాలుగవ సమావేశం మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు
ఎనిశెట్టి శంకర్ అధ్యక్షతన జరుగు సమావేశంలో పెద్దింటి అశోక్ కుమార్ ప్రసంగిస్తారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. తుమ్మూరి రామ్మోహనరావు, శ్రీధర్ దేశ్‌పాండే, గుడిపాటి, భూపాల్, మునీర్ తదితరులు హాజరవుతారు.

వెంగళ నాగరాజు బృందంచే పాటలు ఉంటాయి.
-తెలంగాణ రచయితల వేదిక
-శ్రీధరరావు దేశ్‌పాండే
9491060585

37

SRIDHAR RAO DESH PANDE

Featured Articles