బతుకును ప్రేమించే గడ్డ మనది


Sat,October 6, 2012 04:00 PM

తెలంగాణ పోరాటాల గడ్డ అని, మనది వీరుల గన్న నేల అని ఎంత గర్వంగా చెప్పుకుంటాము?.నిజమే మనది పోరాటాల గడ్డనే. మనది వీరుల గన్న నేలనే. మరి ఏమిటీ వైపరీత్యం. ఏందుకీ ఆత్మ బలిదానాల పరంపర. యుగయుగాలుగా ఈ నేల మీద మహత్తర పోరాటాలు జరిగినయి. ఈ పోరాటాలలో ఎందరో వీరులు నేలకొరిగిండ్రు. సమ్మక్క సారక్కలు కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాటంలో అమరులయిండ్రు. తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్, రాంజీగోండు బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి అమరులయిండ్రు. సర్వాయి పాపన్న గోల కొండ సర్కారుతో పోరాడి నేలకొరిగిండు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య, షోయబు ల్లా ఖాన్, 3000 మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులు నిజాం సర్కారుతో పోరాడి అమరులైండ్రు. అంతకుమించి 5000 మంది సామాన్య ప్రజలను కమ్యూనిస్టుల పేరు మీద, ముస్లింలను రజాకార్ల పేరు మీద నెహ్రూ సర్కారు బలితీసుకున్నది. 1952 గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్య మంలో ఏడుగురు విద్యార్థులను బూర్గుల సర్కారు బలితీసుకున్నది.

1969 ఉద్యమంలో 370 మంది తెలంగాణ విద్యార్థి యువజనులను కాసు కర్కోటక సర్కారు బలితీసుకున్నది. ఆ తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటంలో సీమాంధ్ర సర్కారు అమలు చేసిన అణచివేతకు, బూటకపు ఎన్‌కౌంటర్లకు సుమారు 40వేల మంది అమరులైనట్టు సమాచారం ఉన్నది. ఈ వర్తమాన తెలంగాణ ఉద్యమంలో కూడా బెల్లి లలిత, ఐలయ్య, సాంబశివుడు లాంటి వారిని సీమాంధ్ర సర్కారు బలితీసుకున్నది. ఇవ్వాళ పరిస్థితిని చూస్తే అందు కు భిన్నంగా కనిపిస్తున్నది. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం నుంచి నేటి సిరిపు రం శ్రీకాంత్ ఆత్మ బలి దానం దాక లెక్కగడితే 50కి పైగానే విద్యార్థి యువజనులు ఆత్మ బలిదానాలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఉధృతంగా సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు కూడా రోజూ ఇద్దరు ముగ్గురు మన విద్యార్థి యువజనులు ఆత్మ బలిదానాలకు పాల్పడినా రు. ఇప్పుడు ఆరు శాసనసభా నియోజకవర్గాలలో తెలంగాణ అభ్యర్థులు గెలిచినప్పటికీ అత్మబలిదానాలు కొనసాగుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఇది మన యువకులలో వచ్చిన అసాధారణ మానసిక వైకల్యంగా చెప్ప క తప్పదు. ఇది మన పోరాట సంప్రదాయం కానేకాదు.

ఇంతమంది అమరుల రక్తంతో తడిసిన తెలంగాణ నేలపై బలిదానాలు జరగడం ఎంత అవమానం! వారి అమరత్వాలు చిన్నబోవా? కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకుంటు న్న, ఉరి పోసుకుని చావడానికి సిద్ధపడుతున్న, పురుగుల మందు తాగడానికి సిద్ధపడుతున్న మీ సాహసాన్ని పోరాటంలో చూపాలి కదా! అయితే పోరాటంలో అమరులు కావాల్సిన వీరు ఆత్మబలిదానాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? ఇది మనందరం నిజాయితీ గా విశ్లేషించుకోవాల్సిన అంశం. అమరవీరులను తలుచుకుంటూ గానం చెయ్యడం ప్రజలు యుగాలుగా చేస్తున్నదే. యుద్ధంలో మరణించినవారే అమరులవుతారుగాని పోరాడకుండా ఆత్మబలిదానాలు చేసుకున్నవారు అమరుపూట్లా అవుతా రు? ఆత్మహ త్య ఎవరు చేసుకున్నా అది పిరికి చర్యనే. అటువంటి పిరికి చర్యను మనం అమరత్వంగా కీర్తించి గ్లోరిఫై చేసినమా? మితిమీరిన గ్లోరిఫికేషన్ ద్వారా విద్యార్థి యువజనులను మనం ఆత్మబలిదానాలవైపు నెట్టేసినామా? నిరంతర పోరాట కార్యక్షికమాలను రూపొందించుకోకుండా యువకులను నిరాశా నిస్పృహలకులోను చేసినామా? సీమాంవూధుల కుట్రలను, సీమాంధ్ర మీడియా దుర్మార్గపు ప్రచారాలను, తెలంగాణ ఇంటి దొంగల ద్రోహపూరిత ప్రకటనలను నిలువరించడంలో మన నేతల వైఫల్యం, ఉద్యమ వైఫల్యం ఈ మానసిక వైకల్యానికి కారణం కాదా?

2009 డిసెంబరు9 ప్రకటనను నిలుపుకోవడంలో మన వైఫల్యం మన యువజనుల మానసికస్థితిలో తీవ్రమైన మార్పులను తీసుకవచ్చింది. 9 డిసెంబరు నుంచి 23 డిసెంబరు వరకు మనం పోరాటాన్ని విరమించాము. సీమాంవూధులు మన మౌనాన్ని అడ్వాం తీసుకొని వచ్చిన తెలంగాణను వెనక్కుపొయ్యేలాగా చెయ్యగలిగినారు. ఇది ఒక చారివూతక తప్పిదమని చెప్పక తప్పదు. ఈ చారివూతక తప్పిదానికి మనం 50 మంది విద్యార్థి యువజనుల ను కోల్పోయాం. ఇవ్వాళ పోరాటం ఉధృతంగా ఉన్నప్పటికీ ఆత్మబలిదానా ల మానసిక స్థితి మన యువకులను వదలలేదు. తెలంగాణను అడ్డుకుంటు న్న సీమాంధ్ర పెట్టుబడిదారులను, వారి అడుగులకు మడుగులొత్తుతున్న తెలంగాణ దళారులను వదిలి తమని తాము శిక్షించుకోడం ఇప్పటి విషాదం.

ఈ పరిస్థితుల్లో మనమేమి చెయ్యగలం? విద్యార్థి యువజనులకు ఆత్మబలిదానాల వంటి పిరికి చర్యలకు పాల్పడవద్దని కోరుదాం. ఆత్మ బలిదా నం అమరత్వం కాదని, అది వీరులు చేసే పని కాదని చెబుదాం. అటువంటి వారిని అమరుల సరసన చేర్చి కీర్తించడం పోరాటంలో చనిపోయిన అమరులకు అవమానం అని ప్రచారం చేద్దాం. తెలంగాణ కోసమే అయినా ఆత్మబలిదానాలకు పాల్పడినవాళ్ళు తెలంగాణ అమరవీరులు కాలేరని ప్రకటిద్దాం. తనదే చివరి ఆత్మత్యాగం కావాలని యాదిడ్డి కోరిక. ఆ కోరికను తెలంగాణ యువకులు పట్టించుకోనేలేదు. ఇప్పటికైనా ఆయన కోరికను నిజం చేద్దామని యువకులకు పిలుపునిద్దాం. ఇవ్వాళ్టి నుంచి పోరాటంలో చనిపోయినవాడే అమరుడని చాటింపు వేద్దాం. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇక ఎవ్వరు అటువంటి వృథా త్యాగాలకు, వ్యక్తిగత దుస్సాహసాలకు పాల్పడవద్దని చెబుదాం. మిమ్ములను కన్న తల్లిదంవూడులకు, తెలంగాణ తల్లికి కడుపుకోత మిగల్చవద్దని కోరుదాం. బరి గీసి పోరాడి తెలంగాణను సాధించుకుందాము. అందరం కలిసి ఐక్యం గా పోరాటంలో ముందుకు కదులుదాం. విడిగా ఉంటే ఓడిపోతాం కలిసి ఉంటే బలపడతాం. మన ఐక్య పోరాటాలే మన యువకుల ప్రాణాలను కాపాడుతాయి. ఆచార్య జయశంకర్ కూడా కోరుకున్నది ఇదే.

బిడ్డలారా! తెలంగాణ ఎవరి కోసం? మీ కోసం. మీ సుందరమైన భవిష్య త్తు కోసం. మీ కోసం తీసుకురావాలనుకుంటు న్న తెలంగాణలో మీరే లేకుంటే ఎట్లా? 141 మంది ప్రజావూపతినిధులు రాజీనా మాలు చేసిన తర్వాత ఆత్మ బలిదానాలు ఆగిపోతాయనుకుంటే తిరిగి యాదిడ్డి రూపంలో ప్రారంభంకావడం, 12 మంది శాససభ్యులను అద్భుతమైన మెజారిటీతో గెలిపించినాక, సహాయనిరాకరణ, సకలజనుల సమ్మె పోరాటాలు జరిగినా క, మళ్ళీ ఆరుగురిని గెలిపించుకున్నాక కూడాఆత్మబలిదానాల పరంపర ఆగకపోవడం ఎంత విషాదం! ఎన్నో త్యాగాలకు సిద్ధపడి సర్కారు ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, విద్యు త్ ఉద్యోగులు, మునిసిపల్ ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇతర సబ్బండ కులాలవారు, మతాలవారు తెలంగాణ కోసం పోరాటం చేస్తుం మీరు ఇట్లా ఆత్మ బలిదానాలకు పాల్ప డడం భావ్యమేనా? మొన్న 30 మార్చ్ రోజున వీళ్ళందరు మర్నా నై లడ్నా హై అని గొంతు చించుకుంటూ సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ఎర్రటి ఎండలో నడిచారు. వరంగల్‌లో రోజంతా ఉపవాస దీక్ష చేసినారు. ఇవ్వా ళ తెలంగాణను అడ్డుకొనే శక్తి ఈ భూమ్మీద ఎవరికీ లేదు. అడ్డుకున్న ద్రోహిని ఏం చెయ్యాలో మనకు తెలుసు. ఇంటి దొంగని బయటి శత్రు వును ఏం చెయ్యాలో మన కాళోజీ చెప్పనే చెప్పిండు. ఆ మహాకవి మాటలను మల్లొకసారి యాది చేసుకుందాము.

‘ప్రాంతేతరుడు దోపిడి చేస్తే ప్రాంతందాకా తరిమికొడదాం..
ప్రాంతంవాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం.’
బిడ్డలారా! రాబోయే కాలం మనది. రాబోయే రాజ్యం మీది. మనందరి ది. మీ రాజ్యం మీరేలుండ్రి. బతుకును ప్రేమించే గడ్డ మనది. బతుకుని దైవంగా మార్చుకున్న గడ్డ మనది. బతుకు మీద ఆన-బతుకమ్మ మీద ఆన. ఇగ తెలంగాణలో ఆత్మబలిదానాలు జరగవద్దు. ఇది బతుకమ్మకు మా మొక్కు. మా బిడ్డలుగా మా మొక్కుని తీర్చుతారుగదా !

-శ్రీధరరావు దేశ్‌పాండే

35

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్