కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా


Sun,May 22, 2016 01:20 AM

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణలో తేలింది.. గత ప్రభుత్వాలు అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటి లక్ష్యం తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలను, కృష్ణాలో 376 టీఎంసీలను పూర్తిగా వినియోగంలోనికి తేవడం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందించడం, తద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడం. తెలంగాణ ప్రజల కళ్ళల్లో వెలుగు చూడటం.

sridar
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే చెరువుల పునరుద్ధరణకు మేధోమథనాన్ని ప్రారంభించినారు ముఖ్యమంత్రి కేసీఆర్. రోజుల తరబడి చర్చ జరిగింది. జూలై 2014లో మొదట చెరువులను లెక్కగట్టే పని జరగాలని తలంచి మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ జరపాలని ఆదేశించినారు. వారం రోజుల సెన్సెస్ అనంతరం 10 తెలంగాణ జిల్లాల్లో తేలిన చెరువుల సంఖ్య 46 351. వాటి కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. ఇందులో100 ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 38,411. వాటి కింద 20.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు తేలింది. అత్యధికంగా చెరువులున్నది మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు. విచిత్రమైన విషయమేటంటే ఈ రెండు జిల్లాలు అత్యంత కరువు బారిన పడిన జిల్లాలు. 25 సెప్టెంబర్ 2014న జేఎన్‌టీయూ ఆడిటోరియంలో దినమంతా సాగునీటి శాఖ ఇంజినీర్ల సదస్సు జరిగింది.

ముఖ్యమంత్రి ఈ సదస్సులో ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన 265 టీఎంసీ (కృష్ణా బేసిన్ 90, గోదావరి బేసిన్ 175 టీఎంసీలు) నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించుకోవాలని, ప్రతి ఏటా ఇరవై శాతం చెరువులను రాజకీయాలకు అతీతంగా పునరుద్ధరణకు ఎంచుకోవాలని, మైనర్ ఇరిగేషన్ పాలనా వ్యవస్థను పటిష్టం చెయ్యాలని, టెండర్ల ప్రక్రియను సరళతరం చెయ్యాలని, ప్రతీ చెరువుకు ఒక టెండర్‌ను ఈ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫాం ద్వారా నే పిలవాలని, చెరువును సమగ్రంగా పునరుద్ధరించాలని, రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, భూగర్భ జలశాఖలతో సమన్వయం చేసుకోవాలని, స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు కల్పించాలని, చెరువుల పునరుద్ధరణలో ప్రజలను భాగస్వాములను చెయ్యాలని.. ఇట్లా పలు అంశాలతో కార్యాచరణ రూపొందింది. విజయవంతంగా అమలవుతున్నది.

మొదటి దశలో 8105 చెరువులకు ప్రభుత్వం 2591 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. ఇందులో 8039 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభమయ్యాయి. చెరువు మట్టి కట్టలను వెడల్పు చేసి బలోపేతం చేయడం, చెరువుకట్టల మీద, లోపల పెరిగిన తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను , గుర్రపు డెక్క తదితర పిచ్చి చెట్లను తొలగించడం, తూము, అలుగులను మరమ్మతు చేయ డం, అవసరమైన చోట పునర్నిర్మాణం, చెరువులకు నీటిని తెచ్చే కట్టు కాలువలను (ఫీడర్ చానల్స్) ను పునరుద్ధరించడం, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువు శిఖంను గుర్తించి రాళ్ళు పాతడం, చెరువు వద్ద హరితహారంలో భాగంగా వేలాది ఈత, సిల్వర్ ఓక్ తదితర చెట్లను నాటడం జరిగింది. చెరువుల పునరుద్ధ రణలో అత్యంత కీలకమైన పని పూడిక తొలగింపు. ఇది రైతుల భాగస్వామ్యంతో అద్భుతంగా జరిగింది. 2 కోట్ల 52 లక్షల 14 వేల ట్రాక్టర్ ట్రిప్పుల పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తరలించుకుపోయారు.

ఇది 6 కోట్ల 53 లక్షల 37 వేల క్యూబిక్ మీటర్లతో సమానం. రైతులు చాలా చోట్ల తమకు సరిపడినంత పూడిక మట్టి లభించలేదని షికాయతు చేసి పోరాడి అదనంగా పూడిక మట్టి ని తరలించుకపోయినట్టు ఇంజినీర్లు సమాచారమిచ్చినారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తం గా పూడిక మట్టిని తరలించుకపోవడానికి రైతులు సుమారు 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్టు అంచనా. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ కొనసాగిందనడానికి ఇది ప్రబలమైన దాఖలా. ఈ వ్యాసం రాసే నాటికి అంటే 20 మే 2016 నాటికి మొదటి దశలో 6158 చెరువుల పనులు పూర్తి అయినాయి. మిగతా 1881 చెరువుల పనులు మే నెలాఖరుకు పూర్తి అవుతాయి.

2015లో వానలు కురవకపోవడం చేత చెరువుల పునరుద్ధరణ జరిగినా నీరు చేరకపోవడంతో ఫలితాలు అందలేదు. కానీ ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ గోదావరి ప్రాంతంలో వర్షాలు కురిసిన కొన్ని మండలాల్లో చెరువుల్లోకి నీరు చేరింది. స్థానిక ప్రజలతో ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారందరు చెరువుల పునరుద్ధరణ అద్భుతంగా సాగిందని, పూడిక మట్టిని చల్లుకున్న తమ పొలాల్లో పంట ఏపుగా పెరిగిందని, ఎరువుల వాడకం తగ్గిందని, మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టినారని, రజకులకు బట్టలు ఉతకడానికి సౌకర్యం ఏర్పడిందని, గొర్లు మేకల కు ,పశువులకు తాగునీటి సౌకర్యం ఏర్పడిందని , భూగర్భ జలాలు పైకి వచ్చినాయని వెల్లడించినారు. భూగర్భశాఖ వారు ఈ విషయాన్ని ధృవీకరించినారు. సగ టున 1.5 మీ ల నుంచి 2 మీ దాకా భూగర్భ జలాలు పైకి వచ్చినట్టు తెలిపారు.

మిషన్ కాకతీయ ఫలితాలను సమగ్రంగా అంచనా వేయాలంటే మరికొంత కాలం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వికాసానికి చెరువులపునరుద్ధరణ ఏ విధంగా దోహదం చేసిందో మదింపు చేయాలంటే మరో రెండు దశలు పూర్తికావాలని, అప్పుడే సామాజిక ఆర్థిక వికాసాన్ని గణాంకాలతో వివరించగలమని అంటున్నారు. పూడిక మట్టి చల్లుకోవడం వలన పంట దిగుబడిలో పెరుగుదల, రసాయనిక ఎరువు, పురుగు మందుల వాడకం తగ్గుదల అన్న అంశాల ను రైతుల అనుభవాలతో మేళవించి గణాంకాలతో వివరించడానికి వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అధ్యయనం చేయవలసి ఉన్నది. భూగ ర్భ జలాల పెరుగుదల, నీటి నాణ్యత తదితర అంశాలపై భూగర్భ జలశాఖ వారూ అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు అడ్డుక ట్ట వేసేందుకు కూడా చెరువుల పునరుద్ధరణ దోహదం చేస్తుందని సామాజికవేత్త లు అభిప్రాయ పడుతున్నారు.

మిషన్ కాకతీయ రెండో దశ కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లోని అన్ని మండలాలో పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం అందుతున్నది. ఇప్పటి వరకు (10.5.2016) రెండో దశ పునరుద్ధరణలో భాగంగా 9 జిల్లా ల్లో మొత్తం 9,032 చెరువులకు 2,970 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. 8819 చెరువుల పునరుద్ధరణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. 6,676 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చెరువుల పనులు ప్రారంభం కాబోతున్నాయి. మే నెలాఖరు వరకు మొదటి దశ పనులు పూర్తిగా ముగుస్తాయి. దీంతో మొదటి దశ, రెండో దశలో పునరుద్ధరణ జరిగిన దాదాపు 16,000 చెరువులు నీరు నిలుపుకునేందుకు సిద్ధంగా ఉంటాయి.

ఈసారి వర్షాలు ఎక్కువే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. అదే నిజమైతే మిషన్ కాకతీయ ఫలితాలు రైతుల, ప్రజల అనుభవాల్లోకి రానున్నాయి.చెరువుల పునరుద్ధరణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంలోనూ అంకితభావంతో సాగుతున్నది. సాగునీటి శాఖా మంత్రి హరీశ్‌రావు నిరంతరం సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, పర్యటనలు చేస్తూ, ప్రాజెక్టుల వద్ద నిద్ర తీస్తూ ప్రాజెక్టు ల పనులను వేగవంతం చేస్తున్నారు. పదేండ్లుగా ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా ఉన్న భూ సేకరణ, అటవీ అనుమతులు, ధరల పెరుగుదల, రైల్వే, రోడ్డు క్రాసింగులు తదితర సమస్యలను పరిష్కరించుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు.

ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకు టార్గెట్లు పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఈ జూలై నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులు, వచ్చే సంవత్సరం జూలై నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి నిధుల కొరత లేకుండా చూడటం, ప్రభుత్వపరమైన అనుమతు లు ఇప్పించడం తదితర అంశాలపై దృష్టి సారించారు. భూ సేకరణకు విధానపరమైన మార్పు తీసుకరావడం జరిగింది. రైతుల, భూ యాజమానుల స్వచ్ఛంద అనుమతితో భూములను ప్రభుత్వం కొనే ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత పదేండ్లలో సేకరించిన భూమితో పోల్చినప్పుడు ఈ ఆరు నెలల్లోనే అంతకు నాలుగు రెట్ల ఎక్కువ భూమిని న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు లేకుండా ప్రభుత్వం సేకరించగలిగింది.

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయన లోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ లో తేలింది. అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ, ముంపు సమస్యలు, జలాశయాల సామర్థ్యం లేకపోవడం తెలియవచ్చింది. వీటన్నింటిని పరిహరించి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల, దేవాదుల, శ్రీరామసాగర్ వరద కాలువ, రాజీవ్ ఇందిరా సాగర్, కంతనపల్లి ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌ను చేపట్టింది. గత ప్రభుత్వాలు అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటి లక్ష్యం తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలను, కృష్ణాలో 376 టీఎంసీలను పూర్తిగా వినియోగంలోనికి తేవడం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందించడం, తద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడం. తెలంగాణ ప్రజల కళ్ళల్లో వెలుగు చూడటం.

933

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర