బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం


Mon,October 7, 2013 01:11 AM


కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్నంటింది. ఒకనినొకరు అభినందించుకుంటూ మెసేజ్‌లు పంపుతున్నారు.ఫోన్లు చేసుకుంటున్నారు. పటాకలు కాల్చుకుంటున్నారు. ఇందులో తప్పు పట్టవలసింది ఏమీలేదు. అయితే తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకోవలసిన సమయం రాలేదని గమనించాలి.తెలంగాణది దోఖా తిన్న అనుభవం. మోసపోయిన అనుభవం.అందుకే పార్లమెంటు లో బిల్లు ఆమోదం పొందేవరకు సంబురాలు జరుపుకోవద్దని, ఇం కా చెప్పాలంటే బిల్లుపై రాష్ట్రపతి సంతకం అయ్యేదాకా సంబురాల కు పోవద్దని జేఏసీ చైర్మన్ కోదండరాం ఇప్పటికే ప్రకటించి ఉన్నా రు. షిండే ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆయనతో పాటు కేసీఆర్ కూడా బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇది ఆషామాషీగా చేసిన ప్రకటనకాదు. గతంలో ధోఖా తిన్న అనుభవంలోంచే ఈ ప్రకటన వచ్చిందని తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా గతంలో అప్రమత్తంగా లేకపోవడం చేత అరవై ఏండ్లుగా ఎంతటి నష్టాల్ని చవిచూడవలసి వచ్చిందో గుర్తు చెయ్యడమే ఈ వ్యాసం ఉద్దేశం.1956లో ఆంధ్ర తెలంగాణ విలీనం జరిపి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పాటు బిల్లును రూపొందించినప్పుడు బిల్లులో రాష్ట్రంపేరు తెలంగాణ అండ్ ఆంధ్రా. బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపితే సెలెక్ట్ కమిటీ కూడా అదే పేరును ఆమోదించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందే సమయంలో ఆంధ్రులు ఒక సవరణను ప్రతిపాదించారు. ఆది రాష్ట్రం పేరు మార్పు సవరణ. రాష్ట్రం పేరులోంచి ‘తెలంగాణ’ పదాన్ని తొలగించి ఆంధ్ర పక్క న ‘ప్రదేశ్’ అన్న హిందీ పదాన్ని చేర్చి రాష్ట్రం పేరును ఆంధ్రవూపదేశ్‌గా మార్చినారు. ఆ సవరణతోనే ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. ఈ సవరణ ప్రతిపాదిస్తున్న సమయంలో తెలంగాణ లోకసభ సభ్యులు బహుశా నిద్రపోతున్నారో! మరి సభలోలేరో! కొత్త రాష్ట్రం తెలంగాణ,ఆంధ్ర పేరుతోకాక ఆంధ్రవూపదేశ్‌తో ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టుకతోనే తెలంగాణకు ద్రోహం తలపెట్టింది. తెలంగాణ పదం ఎప్పటికైనా తెలంగాణ ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రాజేస్తుందని వారికి తెలుసు. తెలంగాణ ఆస్తిత్వాన్ని శాశ్వతంగా ఖతం చేయడానికే ఆ సవరణ తీసుకవచ్చి తెలంగాణ పదాన్ని తొలగింపచేసినారు. ఆ తర్వాత పెద్దమనుషుల ఒప్పందాన్ని ఎట్లా ఉల్లంఘించారో మనందరికి తెలిసి న విషయమే.


1973లో జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చేందుకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆరు సూత్రాల పథకాన్ని మనగుడ్డి నాయకత్వం గుడ్డిగా అంగీకరించింది. హైదరాబాద్ రాజ్య ప్రజలు పోరాడి సాధించుకున్న ముల్కీ రూల్స్ రద్దు, పెద్దమనుషుల ఒప్పందంలో ఒక ప్రధానాంశంగా ఉన్న తెలంగాణ రీజినల్ కమిటి రద్దు కూడా ఆరు సూత్రాల పథకంలో ఉన్నాయి.అందులో మూడవ సూత్రం ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించి అన్ని ప్రాంతాలకు సమన్యాయాన్ని కల్పించడం. అందులో భాగంగానే రాజ్యాంగ సవరణ ద్వారా అర్టికల్ 371డి ని రాజ్యాంగంలో చేర్చా రు. ఉద్యోగాల కల్పనలో అన్ని ప్రాంతాలకు సమ న్యాయం కల్పించడానికి ఒక ఉత్తర్వును జారీ చెయ్యడానికి రాష్ట్రపతికి 371 డి ఆర్టికల్ ద్వారా సంక్రమించింది. అట్లా సక్రమించిన అధికారంతో 18-10-1975 న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినాయి. ఆ ఉత్తర్వుల్లోని అంశాలను తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరూ చదివి ఉండరు. చదివినా అందులోని కుట్రపూరితమైన పేరాలను పసిగట్టి ఉండరు. పసిగట్టినా అమ్ముడుపోయి మిన్నకుండిపోయి ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వులో పేరా 14అనే మినహయింపుల క్లాజ్ ఉన్నది. ఈ పేరా తెలంగాణకు ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో అంచనా వేయలేము. ఈ మినహయింపుల పేరా కారణంగా సచివాలయంలో శాఖాధిపతుల కార్యాలయాల్లో రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థలలో స్థానిక రిజర్వేషన్లు ఉండవు కనుక ఈ కార్యాలయాల్లో సీమాంవూధులు దిగపోయారు. అధికారికంగా హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలన్ని సీమాంవూధుల వశమయ్యాయి. ఆర్టికల్ 371డి చెప్పిన అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఇక్కడ భూస్థాపిమైంది. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయంలో తెలంగాణకు నామమావూతమైన భాగస్వామ్యమే దొరికింది. ప్రభుత్వవిధానాలు, బడ్జెట్ కేటాయింపులు, భూ కేటాయింపులు పర్మిషన్లు, ఇతరత్రా ప్రభుత్వ నిర్ణయాలు జరిగే సచివాలయంలో తెలంగాణకు కీలక పోస్టుల్లో భాగస్వామ్యం లేనందువల్ల 40 ఏండ్లు గా ప్రభుత్వ వివక్షకు లోనై తీవ్రంగా నష్టపోయింది. ఉద్యోగ సంఘా ల, తెలంగాణ రాజకీయ నాయకుల మంత్రుల నిర్లక్ష్యం వల్ల, వారు అప్రమత్తంగా లేకపోవడం వల్ల తెలంగాణ ఆర్థికంగా, అభివృద్ధి పరంగా కోలుకోలేనంతగా నష్టపోయింది.

1956, 1975లో ధోఖా తిన్న, మోసపోయిన అనుభవం తెలంగాణకు ఉన్నది కనుకనే బిల్లు ఆమోదం పొందేదాకా సీమాంవూధులు ఏ స్థాయిలోనైనా కుట్రా రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉన్నది. కనుకనే బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడేదాక మనం అప్రమత్తంగా ఉండక తప్పదు. సరదాకే అయినా కోదండరాం అనేక సభలలో ఒక ముచ్చట చెప్పారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం అయినాక రాష్ట్రపతి సంతకం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పెన్ను మాయం చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ పెన్ను దొరికినా పెన్నులో ఇంకు లేకుండాచేస్తారు. సీమాంవూధుల కుట్రాజకీయాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాల్నో చెప్పడానికే ఆ ముచ్చట చెప్పారు. ఇప్పటికి కేంద్రమంవూతుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కూడా రాజీనామా ల పర్వం కొనసాగవచ్చు. ఈ కుట్రాజకీయాలు ఏ స్థాయికైనా పెరుగుతాయి. షిండే ప్రకటనలో మనం అప్రమత్తంగా ఉండవలసిన అంశం 10 ఏం డ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కేబినెట్ నోట్‌లో ఏ అంశమైనా రేఖామావూతంగానే ఉంటుం ది తప్ప వివరంగా ఉండదు. ఉమ్మడి రాజధాని అంటే ఏమిటి? దాని స్వ రూప స్వభావాలు ఏమిటి? ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌లో లాండ్ అడ్మినిస్ట్రేషన్, శాంతిభవూదతలు ఎవరి చేతిలో ఉంటాయి? ఉమ్మడి రాజధానిగా ఉండబోయే ప్రాంతాలు ఏవి? ఈ ప్రశ్నలకు కేబినెట్ నోట్‌లో సమాధానం దొరకదు. వాటి నిర్వచనాలు వివరంగా బిల్లులోనే పొందుపరుస్తా యి. బిల్లులో ఏమి ఉంటుందో అన్నదే కీలకమవుతుంది. ఈ అంశాలన్నింటిని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రర్స్ అధ్యయనం చేసి బిల్లులో పొందుపరుస్తారు. బిల్లులో అక్షరం అక్షరం చదివి తెలంగాణకు గొడ్డలి పెట్టులాంటి క్లాజ్‌లను పసిగట్టి వాటిని తొలిగింప జేసుకొనే వ్యూహం రచించుకోవాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులోని అపసవ్య క్లాజ్‌లను తొలగించడానికి బీజేపీ సహకారం అవసరమవుతుంది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరి దేన్ని బీజేపీ అంగీకరించదని ఆ పార్టీ నేతలు ఇదివరకే ప్రకటించారు. షిండే ప్రకటనను వారు స్వాగతించారు. బిల్లు ఆమోదానికి మద్దతు ఇస్తామన్నారు. కనుక వారు బిల్లులో షిండే ప్రకటనకు భిన్నంగా ఏ రకమైన క్లాజ్‌లను చేర్చినా వాటిని తొలగించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. జేఏసీ కూడా వారి నుంచి ఈ రకమైన సహయాన్నయినా ఈ కీలక సమయంలో ఆహ్వానించవలసి ఉన్నది. ఏదిఏమైనా పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలి.

-శ్రీధర్ దేశ్‌పాండే
తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ శాఖ అధ్యక్షులు

155

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Published: Sat,June 15, 2013 12:50 AM

చలో అసెంబ్లీని సక్సెస్ చేసిన సర్కార్

చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని అడ్డుకోవడానికి వారం రోజులుగా కిరణ్ సర్కార్ చేసిన ప్రయత్నాలను, పడ్డ ఆపసోపాలను చూసి ప్రపంచం నవ్వుకుం

Published: Sat,October 6, 2012 04:00 PM

బతుకును ప్రేమించే గడ్డ మనది

తెలంగాణ పోరాటాల గడ్డ అని, మనది వీరుల గన్న నేల అని ఎంత గర్వంగా చెప్పుకుంటాము?.నిజమే మనది పోరాటాల గడ్డనే. మనది వీరుల గన్న నేలనే. మర

Published: Sat,October 6, 2012 04:01 PM

గ్రామాలకు తరలుదాం!

ఆగస్టు 17 నుంచి సకల జనుల సమ్మెకు జేఏసీలు పిలుపునిచ్చిన సంగతి అందరికీ ఎరుకే. తెలంగాణ సమాజమంతా ఈ సమ్మెలో పాల్గొనవలసి ఉన్నది. ఉద్యోగు