దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం


Fri,August 16, 2013 12:36 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో కొన్నిరోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తున్న తీరుతెన్నులు, చిరంజీవి, ఉండవల్లి తదితర నేతల ప్రకటనలు చూస్తే వారి లక్ష్యం ఏమిటో అర్థమౌతుంది. వారి ఉద్దేశ్యం ఆంధ్రవూపదేశ్‌ను అవిచ్ఛిన్నంగా ఉంచడం కాదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేదా ఇరు ప్రాంతాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగానో ప్రకటించడం. హైదరాబాద్ లేకుండా తెలంగాణ వేరుపడితే వారికి అంగీకారమే. అప్పుడు తెలంగాణ వారి తెలుగుతనం వారికి గుర్తుకురాదు. తెలుగు జాతి అన్న భావనకు తావే ఉండదు. వారి ప్రేమ తెలంగాణ వారి తెలుగు మీద కాదు. తెలంగాణ తెలుగు జాతి మీద కాదు. హైదరాబాద్ నగరం మీద. తెలంగాణతో కలిస్తే తప్ప తమకు హైదరాబాద్ దక్కే అవకాశం లేదు. కనుక హైదరాబాద్ కోసం తెలంగాణవారు తెలుగుజాతి అవుతారు. ఈ ఉపోద్ఘాతానికి ఆధారం ఉండవల్లి ప్రకటనే. ఆయన స్పష్టంగా ప్రకటించిన విషయం ఏమిటంటే... ఆంధ్రవూపదేశ్ విభజన ఆలస్యం కావడానికి హైదరాబాద్ నగరమే కారణం. అంటే హైదరాబాద్ నగరంపై తమ ఆధిపత్యం అంతం అవుతుందన్న అక్కసువల్లనే విభజన పట్ల వ్యతిరేకత.ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి సమాయత్తం కావాల్సిన ఆంధ్ర నాయకత్వం, అక్కడి ప్రజలు హైదరాబాద్ కోసం వెంపర్లాడుతూ మరో చారివూతక తప్పిదానికి పాల్పడుతున్నారు. అప్పుడు మద్రాస్ నగరాన్ని దక్కించుకునే ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు హైదరాబాద్ దక్కించుకునే ప్రయత్నంలో కుట్రలు పన్నుతున్నారు. ఇది వారు తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో గానీ చండీగఢ్ తరహాలోనో, ఢిల్లీ తరహాలోనో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని లేదా రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని వారి దురాశ. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల లాభనష్టాలు ఏమైనా వారి అవగాహనలో ఉన్నాయా? చండీగఢ్ అనుభవాలు ఏమి టో వారు అధ్యయనం చేశారా? కేంద్రపాలిత ప్రాం తం అన్న భావనే అప్రజాస్వామికం. రాష్ట్రాలకు ఉండవలసిన, చెందవలసిన రాజ్యాంగబద్ధ హక్కులను కేంద్రానికి దఖలుపరచడం.

దేశ విభజన అనంతరం పంజాబ్ ప్రావిన్స్‌కు రాజధానిగా ఉన్న లాహోర్ నగరం పాకిస్థాన్‌కు పోయింది. అప్పుడు పంజాబ్ కోసం నెహ్రూ చండీగఢ్ పట్టణాన్ని నిర్మించి రాజధానిగా ప్రకటించాడు. ఆనాటి అవిభక్త పంజాబ్ రాష్ట్రంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లు భాగమే. దేశంలోనే ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం చండీగఢ్. అయితే 1966లో హిందీ భాషా ప్రాంతాలైన హర్యానా, హిమాచల్‌వూపదేశ్‌లు పంజాబ్ నుంచి విడిపోయినప్పుడు చండీగఢ్ ఎవరికి దక్కాలన్న ప్రశ్న ఎదురైంది. హిమాచల్ ప్రజలు సిమ్లాను తమ రాజధానిగా ఎంచుకున్నారు. దీంతో చండీగఢ్ ను దక్కించుకోవడానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు పోటీపడ్డాయి. చివరికి పదేళ్లపాటు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. పదేళ్లలో హర్యానాకు కొత్త రాజధాని నగరాన్ని నిర్మి స్తాం. ఆ తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు చెందుతుంది అని కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానా ప్రజలను నమ్మించింది. అట్లా చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతమైంది. పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాజధాని అయింది. ఇప్పుడూ అంటే 46 సంవత్సరాల తర్వాత కూడా చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్నది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. అయితే భౌగోళికంగా చండీగఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వల్ల ఆ సౌలభ్యం ఏర్పడింది. హైదరాబాద్ నగరానికి అటువంటి సౌలభ్యం లేదు. హైదరాబాద్ నగరానికి ఆంధ్ర నుంచి రావాలంటే 200-250 కిలోమీటర్లు తెలంగాణ భూభాగం నుంచి ప్రయాణించవలసి ఉంటుంది. అందుకే ఒక కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయాలట.అసలు పంజాబ్ రాష్ట్రానికి తనకంటూ అన్ని అధికారాలు కలిగిన రాజధాని నగరం లేకపోవడంతో అది కోల్పోయిన ఆర్థికాభివృద్ధి, పంజాబ్ ప్రజలు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలు అంచనాకు అందనివి. చండీగఢ్‌లో ఉండే కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ రెండు రాష్ట్రాలలో దేనికీ చెందవు. చండీగఢ్‌లో చెల్లించిన పన్నులలో ఒక్కపైసా ఈ రెండు రాష్ట్రాలకు చెందవు. అవన్నీ నేరుగా కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకే వెళతాయి. చండీగఢ్ పాలనాధికారం అంతా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్‌దే. కనుక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు కావాల్సిన భూకేటాయింపుల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తలుపు తట్టవలసిందే. తమ రాజధాని నగరంలోనే ముఖ్యమంవూతికి ఏ అధికారం ఉండకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే భంగకరం.

చండీగఢ్ నగరం ఎప్పటికైనా తమకే దక్కుతుందన్న ఆశతో పంజాబ్ తనకంటూ కొత్త రాజధానిని నిర్మించుకోలేదు. ఆ కారణంగా పంజాబ్ రాష్ట్ర ప్రజలు రాజధాని నగరం వల్ల వచ్చే ఆర్థిక ప్రగతిని, కార్పొరేట్ పన్నులను, పారిక్షిశామిక ప్రగతిని, కార్పొరేట్ సంస్థల, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లో పొందగలిగే ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలను దారుణంగా నష్టపోయింది. ఐటీ రంగం, సర్వీస్ రంగాన్ని ప్రోత్సహించడానికి తమకంటూ అన్ని అధికారాలు కలిగిన రాజధాని నగరం లేకపోవడంతో ఆ రంగాలలో పెట్టుబడులు పంజాబ్‌కు రాలేదు. అయితే హర్యానాకు రాజధాని నగరం లేకపోయినా ఢిల్లీకి దగ్గరగా ఉండడం వల్ల గుర్‌గావ్, ఫరీదాబాద్ లాంటి పట్టణాలలో కార్పొరేట్‌సంస్థలు, ఐటీ సంస్థలు, సర్వీస్ రంగ సంస్థలు తమ కార్పొరేట్ కార్యాలయాలను స్థాపించాయి. ఇవి చెల్లించే పన్నులు, కల్పించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు హర్యానా ప్రజలకు దక్కాయి. గుర్‌గావ్, ఫరీదాబాద్, జజ్జర్, రోహతక్, సోనీపట్ తదితర పట్టణాలు ఇండస్ట్రియల్ హబ్‌గా మారాయి. దీంతో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగాయి. ఢిల్లీకి దగ్గరగా ఉండడం వల్ల హర్యానాకు దక్కిన ఈ ప్రగతి ఫలాలు రాజధాని నగరం లేకపోవడం వల్ల పంజాబ్ కోల్పోయింది. వ్యవసాయం మీదే ఆధారపడే పంజాబ్ నెట్టుకొస్తున్నది. చండీగఢ్‌ను వదిలి పంజాబ్ మరో రాజధానిని నిర్మించుకున్నా లేదా కేంద్రంతో పోరాడి చండీగఢ్‌ను దక్కించుకున్నా పంజాబ్ ఆర్థిక ముఖచిత్రం మరోవిధంగా ఉండేది. ఈ అనుభవాలను విశ్లేషించుకుంటే ఆంధ్రా పరిస్థితి ఎట్లా ఉండబోతున్నదో తెలుస్తుంది. హైదరాబాద్ నగరం భౌగోళికంగా తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్ నగరం తెలంగాణకు రాజధానిగా ఉండక తప్పదు. హైదరాబాద్ మీద ఆశతో ఆంధ్రా తనకంటూ అన్ని అధికారాలు కలిగిన రాజధాని నగరాన్ని నిర్మించకోకపోతే అది కోల్పోయే ప్రయోజనాలు ఏమిటో పంజాబ్ అనుభవంలో చూశాం. అటువంటి నష్టాన్ని ఆంధ్రా ప్రజలు ఎందుకు భరించాలి? ఈ సమయంలోనే ఆంధ్రా ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. విభజన అనివార్యం. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉండబోతున్నదని తెలిసిన తర్వాత కూడా తమకంటూ కొత్తరాజధాని నిర్మించుకోక తప్పదు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు సుందరమైన నయా రాయపూర్ నిర్మాణం అయింది. గతంలో బొంబాయిని వదిలి గుజరాతీలు గాంధీనగర్ అనే ప్రణాళికబద్ధమైన రాజధానిని నిర్మించుకున్నారు. కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యమేమీ కాదు. రాజకీయ సంకల్పంలేకపోవడమేసమస్య.

ఇక హైదరాబాద్‌లో ఆస్తులు సంపాదించుకొని, ఇళ్లు కట్టుకొని, వ్యాపారాలు, పరిక్షిశమలు నిర్వహిస్తున్న వారెవరూ హైదరాబాద్‌ను వదలిపోనవసరం లేదు. పొమ్మని ఎవరూ అనడంలేదు. కేంద్ర ప్రభుత్వంలో, రైల్వేలలో, బ్యాంకులలో, ఇన్స్యూన్స్ సంస్థల్లో, కేం ద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు ఇక్కడే ఉం టారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కూడా ఇక్కడే ఉంటారు. బట్వాడా జరిగేది రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, కార్పొరేషన్ల బోర్డుల సభ్యులే. అందు లో సహజంగానే కొందరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పోక తప్పదు కదా! ఇక విద్యావకాశాల గురించి చూస్తే హైదరాబాద్‌లోని కేంద్య్ర విశ్వవిద్యాలయాలలో ఇప్పుడున్న పరిస్థితే ఉంటుంది. జేఎన్‌టీయూ ఇప్పటికే మూడు ముక్కలైంది. ఐఎస్‌బీ, ఐఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యావకాశాలు అందరికి సమానంగా ఉంటాయి. తెలంగాన విశ్వవిద్యాలయాలలో 20 శాతం కోటా ఇతర యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఉండనే ఉంటాయి. ఆంధ్రా ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు ఆంధ్రా విద్యార్థులకు, యువకులకే అందుబాటులో ఉంటాయి. కొత్త రాజధాని చుట్టూ ఏర్పడబోయే ఆర్థిక వికాసం ఆంధ్ర ప్రజల సొంతమే. ఈ వాస్తవిక దృష్టికోణం నుంచి విశ్లేషించుకోకపోతే ఇరు ప్రాంత ప్రజలు నష్టపోక తప్పదు. ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లిపోతాయి. ఈ సమయంలోనే ఇరు ప్రాంతాల పౌర సంస్థలు పరస్పరం సంభాషణకు దిగాలి. ఈ సంభాషణకు ఒకే ఒక్క షరతు పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించడం. అందుకు సిద్ధపడితే తెలంగాణ పౌర సమాజం ఎటువంటి అంశాలనైనా చర్చించడానికి సిద్ధం.

-శ్రీధరరావు దేశ్‌పాండే
తెలంగాణ విద్యావంతుల వేదిక

194

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్