చలో అసెంబ్లీని సక్సెస్ చేసిన సర్కార్


Sat,June 15, 2013 12:50 AM


చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని అడ్డుకోవడానికి వారం రోజులుగా కిరణ్ సర్కార్ చేసిన ప్రయత్నాలను, పడ్డ ఆపసోపాలను చూసి ప్రపంచం నవ్వుకుంటున్నది. వారం రోజుల ముందునుంచే తెలంగాణ జిల్లాల్లో నిర్బంధకాండ మొదలైంది. వేలాదిమంది ఉద్యమకారులపై బైండోవర్ కేసులు వేసింది. చెక్‌పోస్టులు నిర్మించి వాహనాలను తనిఖీ చేసింది. బెదిరింపులకు పాల్పడింది. హైదరాబాద్‌లోనైతే బందోబస్తు చర్యలు చూసినప్పుడు ఏదైనా శత్రు దేశం యుద్ధ ప్రకటన చేస్తే తీసుకునే ముందు జాగ్రత్త చర్యలను తలపించింది. అసెంబ్లీ భవనాన్ని కాపాడటమే తమ రాజధర్మం అన్నట్లుగా పోలీసులు వ్యవహరించి, ఎత్తైన బారికేడ్లు, ముళ్ల కంచెలు నిర్మించారు. వేలాదిమంది సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.చలో అసెంబ్లీ రోజున అర్ధరాత్రి నుంచే పోలీసులు తమ డ్యూటీలు ప్రారంభించారు. ఎన్ని తనిఖీలు, ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా ప్రజలు తరలి రానున్నారన్న సమాచారం పోలీసుల వద్ద ఉన్నది. రెండురోజుల ముందే వేలాదిమంది ఉద్యమకారులు హైదరాబాద్ చేరుకున్నారన్న వార్తలు వారికి చేరినాయి. అసెంబ్లీ వద్ద బందోబస్తు నభూతో న భవిష్యత్ అన్న పద్ధతిలో ఉన్నది. అయితే చలో అసెంబ్లీ ఇందిరాపార్క్ వద్ద నుంచి ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది.

కనుక ప్రజలను ఇందిరాపార్క్‌కు కూడా రానివ్వకుండా పోలీసుల చర్యలు అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. అటు అసెంబ్లీకి, ఇటు ఇందిరాపార్క్‌కు దారితీసే అన్ని మార్గాలను పోలీసులు మూసివేసినారు. ఈ రెండింటికి దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్లు మూసివేయబడినాయి. అంచెలవారీగా బారికేడ్లు, ముళ్ళ కంచెలు నిర్మించారు. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ రూట్లలో బస్సులు బందైనయి. హైదరాబాద్‌కు వచ్చే అన్ని రైళ్లను లింగంపల్లి, ఘట్‌కేసర్ తదితర శివార్లలోనే నిలిపివేశారు. లోకల్‌రైళ్లను నిలిపివేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను విస్తృతం గా తనిఖీచేసి, అనుమానస్పద వ్యక్తుల ను దించేసి జూబ్లీస్టేషన్ వరకే అనుమతించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల బస్సులను ఎల్బీ నగర్ దగ్గర, ఆరాంఘ ర్ దగ్గర నిలిపివేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం గతంలో మిలియన్‌మార్చ్, తెలంగాణ మార్చ్ సందర్భంలో కూడా అమలు చేసినా అన్ని నిర్బంధాల ను ప్రజలు అధిగమించి లక్షలాదిగా తరలివచ్చి ఆ ఉద్యమాలను జయవూపదం చేశారు. పైగా ఆ కార్యక్షికమాలకు ప్రభు త్వం అనుమతి కూడా ఇచ్చి ఉన్నది. ఇప్పుడేమో అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చిన వాటికి నిర్బం ధం అమలు చేసిన ఈ ప్రజాస్వామిక ప్రభుత్వం అనుమతి ఇవ్వని కార్యక్షికమంపై మరింత తీవ్రమైన నిర్బంధకాండను అమలు చెయ్యబోతుందని ఉద్యమకారులకు తెలుసు. కాబట్టి ప్రజలకు ఈ నిర్బంధా న్ని ఎట్లా అధిగమించాలో వారి వ్యూహా లు వారికి ఉన్నాయి.

ఉదయం నుంచే ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలైన అశోక్‌నగర్, గాంధీనగర్, దోమలగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతాలలో వేలాదిమంది జట్లుజట్లుగా చేరుకుంటూనే ఉన్నారు. పోలీసులతో యుద్ధం జరుపుతూనే ఉన్నారు. అటు ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థులకు పోలీసులతో నిరంతరంగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల కండ్లు గప్పి న్యూడెమోక్షికసీ, పీడీఎస్‌యూ కార్యకర్త లు వందలాదిమంది బషీర్‌బాగ్ చౌరస్తాకు చేరుకోవడం, ముళ్లకంచెల ను తొలగించి అసెంబ్లీకి దారి తీయడం ఒక రోమాంచిత పోరాట దృశ్యం. రక్తాలు కారుతున్నా వారు ముండ్ల కంచెలను తీసేస్తూ అసెంబ్లీవైపు దూసుకెళ్తుంటే పోలీసులు ప్రజాశక్తి ముందు ఎంత దుర్భరులో, వారి వ్యూహాలు ప్రజలను అడ్డుకోజాలవని రుజువైంది. ఉదయం నుంచే టీఆర్‌ఎస్‌తో మొదలు అనేక జట్లు అసెంబ్లీ పరిసరాలకు వెళ్లి జై తెలంగాణ నినాదం ఇవ్వడంతో తెలంగాణ పోరాట పటిమ వెల్లడైంది. అసెంబ్లీలో టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన పోరాటం వారి అరెస్టులను పోలీసుల దురుసుతనాన్ని టీవీల్లో ప్రజలు చూస్తూనే ఉన్నారు. కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, దేవీవూపసాద్, జాగృతి కవిత, ఎంపీ విజయశాంతి అరెస్టుల సందర్భంగా పోలీసుల దురుసు ప్రవర్తన ప్రపంచం చూస్తూనే ఉన్నది. అశోక్‌నగర్, గాంధీనగర్ పరిసరాలలో వేలాదిమందిపై పోలీసుల లాఠీచార్జీల్లో అనేకమంది ఉద్యమకారులు గాయపడినారు.

ఇంజనీర్ల జేఏసీ నాయకుడు మహేందర్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, తెలంగా ణ విద్యావంతుల వేదిక కార్యదర్శి ఆవునూరి సమ్మయ్య (కరీంనగర్) అశోక్‌నగర్ లో జరుగుతున్న యుద్ధాన్ని, పోలీసుల దుర్మార్గాలను ఈ వ్యాస రచయిత ఎప్పటిప్పుడు చేరవేస్తూనే ఉన్నారు. ఏండ్ల తరబడి పరిష్కరించకుండా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నది. ప్రజాస్వామిక ప్రభుత్వాలేనా? జూన్ 14న నడవాల్సిన అసెంబ్లీ నడవలేదు. సెక్ర పని పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు పది శాతానికి మించి లేదు. స్కూళ్లు బందు, కాలేజీలు బందు, బస్సులు బందు, రైళ్లు బందు, రహదారులు బందు.. చలో అసెం బ్లీ సంపూర్ణంగా జయవూపదం అయిందనడానికి ఇంతకంటే ఏ రుజువులు కావాలి. జేఏసీ ర్యాలీ తీయలేకపోయింది. ప్రజలు లక్షల సంఖ్యలో గుమిగూడలేకపోయి ఉండవచ్చు. కానీ చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని ఏ లక్ష్యం తో తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరింది. పరోక్షంగా ప్రభుత్వమే నెరవేర్చిం ది. చలో అసెంబ్లీ కార్యక్షికమం ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేసింది. ప్రభుత్వానికి మూడురోజులుగా నిద్రలేకుండా చేసింది. ఇది సీమాంధ్ర వలస ప్రభుత్వమేనని చాటి చెప్పింది. ఇది తెలంగాణ ప్రజలకు పరాయి ప్రభుత్వమేనని రుజువు చేసింది. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ ఉన్నట్లు తెలంగాణ అట్టుడికిపోతుంటే, సీమాంధ్ర వలస ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంటే వీరికి వత్తాసు పలుకుతున్న కేంద్ర పాలకవర్గాలు తమకేమీ సం బంధం లేనట్లు వ్యవహరించ డం ఏ విధంగా చూసినా ఇవి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రభుత్వాలుగా చెప్పడానికి వీల్లేదు.

కిరణ్ సర్కార్ తనని తాను దిగ్బంధించుకొని, తెలంగాణ ఉద్యమకారుల చలో అసెం బ్లీ విఫలం చేశామని చంక లు గుద్దుకోవడం చూస్తుంటే శివుడు-శని గురించి ప్రచారంలో ఉన్న పురాణకథ గుర్తుకు వస్తున్నది. దేవతలందరు శని ప్రభావం పడినవాడు ఎంత కష్టా నష్టాలకు గురవుతాడోనని చర్చించు కుంటున్నారు. శివుడు శని దేవునిపై ఆక్రోశపడి ‘ఏదీ నీ ప్రభావం ఏమిటో నా మీద చూపించు’ అన్నాడట. శని సరేనన్నా డు. శివుడు శని ప్రభావాన్ని తప్పించుకోవడానికి కాకులుదూరని కారడవిలో, సూర్యుడు దిగని చిట్టడవిలో ఒక గుహలో దాక్కుని శని ప్రభావం నుంచి తప్పించుకుందామనుకున్నాడట. వారం గడిచింది. శని ప్రభావం ఏమీ లేదు. శివుడు బయటకు వచ్చి శనితో ‘ఏమయ్యా వారం రోజులు గడిచాయి. ఏదీ నీ ప్రభావం?’ అన్నాడట. నీవు నీ కైలాసాన్ని వదిలి, నీ భార్యబిడ్డల్ని వదిలి కారడవిలో ఒంటరిగా, దిక్కులేకుండా బిక్కుబిక్కుమంటూ దాగి ఉన్నావు కదా! అది నా ప్రభావ ఫలితమే’ అన్నాడట శని. ఇవ్వాళ కిరణ్ సర్కార్ పని శివుడితో పోల్చదగిందే. చలో అసెంబ్లీని విఫలం చేద్దామని ప్రయత్నించి ఉద్యమ ఒత్తిడికి లోనై తానే అపూర్వంగా జయవూపదం చేశాడు. మూడురోజులు పోలీసుల ముట్టడిలో గడిపింది అసెంబ్లీ. మరో కంట కనపడకుండా ఉదయం ఆరు గంటలకే ముఖ్యమంత్రి అసెంబ్లీకి వచ్చాడట. ఇదే చలో అసెంబ్లీ సాధించిన విజయం. ఇటువంటి ఒత్తిడినే ఏ ఉద్యమమైనా ప్రభుత్వం మీద వేయాలనుకుంటుంది. చలో అసెంబ్లీ అది సాధించింది. ఇక ఈ పరాయి పాలక ప్రభుత్వంతో కుమ్మక్కయిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మొఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారు?

-శ్రీధరరావు దేశ్‌పాండే
గ్రేటర్ హైదరాబాద్ విద్యావంతుల వేదిక అధ్యక్షులు

35

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్