గ్రామాలకు తరలుదాం!


Sat,October 6, 2012 04:01 PM

ఆగస్టు 17 నుంచి సకల జనుల సమ్మెకు జేఏసీలు పిలుపునిచ్చిన సంగతి అందరికీ ఎరుకే. తెలంగాణ సమాజమంతా ఈ సమ్మెలో పాల్గొనవలసి ఉన్నది. ఉద్యోగు లు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కోసం మానసికంగా సంసిద్ధమై ఉన్నారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగవర్గాలకు, కార్మిక వర్గాలకు సమ్మెలో పాల్గొనడానికి నిర్దిష్ట కార్యాచరణ ఉన్నది. అయితే వీరు తెలంగాణ జనాభాలో రెండు శాతం మాత్రమే ఉన్నారు.

మిగతా 98శాతం ప్రజానీకం అసంఘటిత రంగంలో ఉన్న గ్రామీణ రైతాంగం, కూలీలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, స్త్రీలు సమ్మెలో పాల్గొనడం ఎట్లా? వీరికి నిర్దిష్టమైన కార్యాచరణను ఉద్యమ నాయకత్వం ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే మేమేం చెయ్యాలి? అని ప్రజలు అడుగుతున్న సంఘటనలు అనేకం జిల్లాల్లో ఉన్న జేఏసీల నాయకత్వానికి ఎదురవుతున్నాయి. ఆగస్టు 4న నిర్మల్ ఈ వ్యాసకర్తకే అటువంటి ప్రశ్న ఎదురైనప్పుడు స్పష్టంగా నిర్దిష్టంగా కార్యాచరణను ప్రకటించలేని నిస్సహాయత! అసంఘటితంగా ఉన్న అశేష ప్రజానీకాన్ని సకల జనుల సమ్మెలోకి ఎట్లా సమీకృతం చెయ్యగలం అన్న అంశంపై మరింత మేధోమథనం జరగాలి.

ఇవ్వాళ ఉద్యమంలో నిలబడి ఉన్న శ్రేణులను గమనిస్తే మొదటి వరుసలో ఉద్యోగులు, విద్యార్థులు, రెండవ వరుసలో ప్రజలు, మూడో వరుసలో రాజకీయ నాయకులు కనిపిస్తున్నారు. యుద్ధంలో మొదటి శ్రేణిలో ఉండవలసిన రాజకీయ నాయకత్వం వెనుక వరుసలో ఉండటమే విషాదం. ఉద్యోగులు, విద్యార్థులు ఎంతటి త్యాగాలకైనా సంసిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగులను భయవూభాంతులకు గురిచేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 165, 166 జీవోలను జారీచేసి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే ప్రభుత్వ శాఖలను ఎస్మా పరిధిలోకి తెచ్చింది. ఆఫీసులను పారామిలటరీ బలగాలతో నింపి మానసిక యుద్ధం మొదలుపెట్టింది. ఎస్మాలు, గిస్మాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని ఉద్యోగవర్గాలు ఇప్పటి కే స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఉద్యోగులకు, విద్యార్థులకు ఉండే పరిమితుల దృష్ట్యా రాజకీయ నాయకత్వం ముందుండాలి. అప్పుడే సమ్మె లక్ష్యం నెరవేరుతుం ది. లేనిపక్షంలో సహాయనిరాకరణ ఉద్యమం ఎట్లా మారిందో సకల జనుల సమ్మె కూడా ఉద్యోగుల సమ్మెగా మిగిలిపోతుంది.

రాజకీయ నాయకత్వం ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సకల జనుల సమ్మెలో క్రియాశీల క పాత్ర పోషించాలి. వారంతా గ్రామాలకు తరలవలసి ఉన్నది. ఎవరి నియోజకవర్గంలో వారు సమ్మెలో ప్రజలను సమీకరించే పనిలో మునిగిపోవాలి. వారు కదిలితేనే అశేష ప్రజాక్షిశేణులు కదులుతారు. సమ్మెలోకి సమీకృతం అవుతారు. ఉద్యోగులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన వేదికల మీద ప్రసంగాలు చేస్తూ, సమ్మెకు మద్దతు ప్రకటిస్తే సరిపోదు. మద్దతును కార్యాచరణలో చూపాలి. ‘గ్రామాలకు తరలండి’ అనేది ఇవ్వాళ సకల జనుల సమ్మెకు ఒక ప్రధాన నినాదం, ఆయుధం కావాలి.

ప్రజలు సమ్మెలో ఏం చెయ్యాలన్నది ఇప్పటికే ఒక స్పష్టత లేని అంశమే. అయితే మనకు ప్రజలేం చెయ్యాలో, వారు స్వచ్ఛందంగా ఆచరించి చూపిన అనుభవాల నుంచి కార్యాచరణను రూపొందించవచ్చు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో గ్రామక్షిగామాన ఒక ప్రజా వెల్లువను మనం చూశాం. ప్రజలు రాజకీయాలతో సంబంధం లేకుండానే సంఘటితంగా కదలివచ్చిన అపూర్వమైన అనుభవం అది. నాటి ప్రజా వెల్లువలో కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, కూలీలు, వ్యాపారవర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు మొత్తం తెలంగాణ సమాజం అంతా లేచి నిలబడింది. ఇంత చైతన్యయుతంగా సాగిన ఉద్యమానికి కేసీఆర్ ఆమరణదీక్ష, ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల వీరోచిత పోరాటాలు ప్రేరణగా నిలిచాయి. రాష్ట్రాన్ని కుదిపేసిన ఆ పదిరోజులు ప్రజా ఉద్యమం సకల జనుల సమ్మె సందర్భంగా పునరావృతం చెయ్యగలమా? అలాంటి కదలికకు ప్రేరణగా ఇవ్వాళ ఏం చేస్తే సాధ్యమవుతుంది? ప్రజలు కదలడానికి సిద్ధంగానే ఉన్నారు.

కదిలించే శక్తి గ్రామాలకు తరలి ఉంది. ఉద్యోగులు, కార్మికులు తమతమ కార్యాస్థలాల్లో ఉద్యమ నిర్మాణంలో మునిగి ఉంటారు. కనుక గ్రామాలకు తప్పని సరిగా తరలి ప్రజల్ని కదిలించాల్సిన శ్రేణుల్లో రాజకీయ పార్టీలు, యూనివర్సిటీల అధ్యాపకులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, కళాకారులు ఉండాలి. ఈ కార్యక్షికమాన్ని మనం ఎంత విజయవంతం చేయగలుగుతామో సకల జనుల సమ్మె అంతగా విజయవంతం అవుతుంది.

మనం ఏం చేద్దాం? కరపవూతాలతో, పోస్టర్లతో, పాటలతో, కవిత్వంతో ప్రజల్లోకి వెళ్లి ప్రజలను, కుల సంఘాలను, వృత్తి సంఘాలను, రైతు కూలీ సంఘాలను వీధుల్లోకి తీసుకవచ్చేందుకు ప్రచారం జరగాలి. నవంబర్ 29-డిసెంబర్ 9 నాటి 10 రోజులు పోరాటంలో చేసినట్టుగా తమ తమ వృత్తి పరికరాలతో, సాంస్కృతిక చిహ్నాలతో వీధుల్లో ఊరేగింపులు తీయాలి. ఊర్లు ప్రజలతో పోటెత్తాలి. నినాదాలతో హోరెత్తాలి. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలు బహిష్కరించి కార్యక్షికమాలను చేయాలి. వారికి మద్దతుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మార్గనిర్దేశనం చేయాలి.

వ్యాపార వర్గాలు దుకాణాలను మూసివేయకుండానే ఉద్యమానికి ఆర్థికంగా, వస్తు రూపేణా మద్దతునిస్తూ అండగా నిలబడాలి. ప్రభుత్వానికి ఒక్క పైసా టాక్స్ చెల్లించకూడదు. ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయవనరు మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నదే. అది 70 శాతం తెలంగాణ నుంచి వస్తున్నదే. ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ వచ్చే వరకు సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలి. మద్యం అమ్మకందారులు స్వచ్ఛందంగా వైన్ షాపులు, బెల్టు షాపులు మూసివేసి మద్య నిషేధానికి సహకరించాలి.

ప్రజలు ఎటువంటి పన్నులు కట్టవద్దు. బ్యాంకు రుణాలు చెల్లించవద్దు. కరెంటు బిల్లు చెల్లించవద్దు. బస్సుల్లో, రైళ్లలో టికెట్‌లు తీసుకోవద్దు. జై తెలంగాణ నినాదాలతో ప్రయాణం సాగించాలి. గ్రామాలకు తరలివచ్చే కార్యకర్తలకు, విద్యార్థులకు, కవులకు, రచయితలకు, మేధావులకు అన్నంపెట్టి ఆకలి తీర్చే బాధ్యత ఆ ఊరి ప్రజలదే. ఉద్యమకారులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తే సంఘటితంగా వారిని విడిపించుకునేందుకు ధర్నాలు, రాస్తారోకోలు శాంతియుతంగానే చేపట్టాలి. ‘తెలంగాణ’ పేరుతో బోర్డులు మార్చేపని పెద్ద ఎత్తున జరగాలి. భవనాలు, పార్కులు, లైబ్రరీలు, ప్రాజెక్టులు, వీధులు, కూడళ్లు తదితర పేర్లను తెలంగాణ వైతాళికుల పేర్లుగా మార్చాలి.

తెలంగాణలో ఎక్కడ అరెస్టులు, దాడులు, కాల్పులు, లాఠీచార్జీ లు జరిగినా వాటిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్షికమాలను వెంటనే చేపట్టాలి. గ్రామాలలో, మండలాలలో, జిల్లాల్లో జరుగుతున్న కార్యక్షికమాలను ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేయాలి. సీమాంధ్ర వస్తు బహిష్కరణ విధిగా అమలు చేయాలి. తెలంగాణ ఉత్పత్తులను విరివిగా ప్రోత్సహించాలి. సీమాంధ్ర సినిమాలను తెలంగాణలో పూర్తిగా నిషేధించాలి. థియేటర్ల యజమానులు సీమాంధ్ర సినిమాలకు బదులు తెలంగాణ సినిమాలను, హిందీ, ఇంగ్లిష్ సినిమాలను ఆడించి ఉద్యమానికి తోడ్పాటునివ్వాలి.

గ్రామాల్లో సాంప్రదాయక జానపద కళా ప్రదర్శనలను, ధూమ్ ధామ్‌లను నిర్వహించుకోవాలి. ఉద్యమం సందర్భంగా గ్రామాల్లో, పట్టణాలలోని ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటే కార్యక్షికమాలు, ఇతర పారిశుద్ధ్య కార్యక్షికమాలనూ చేపట్టవచ్చు. హైదరాబాద్-రంగాడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర నగర శివారు జిల్లాల్లో సీమాంవూధులు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల వివరాలు సేకరించి వాటిలో తెలంగాణ జెండాలు పాతే కార్యక్షికమాలు చేపట్టాలి. ఆ భూముల నుంచి సీమాంవూధులను తరిమికొట్టాలి. ఉద్యమంలోకి కలిసిరాని రాజకీయ నేతలను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించి, వారి ఫ్లెక్సీలను బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ప్రధాన చౌరస్తాల్లో వేలాడదీయాలి. తెలంగాణపై విషం కక్కే సీమాంధ్ర నాయకుల దిష్టి బొమ్మలను ఎప్పటికప్పుడు తగులబెట్టాలి. ప్రజలు తమకు తోచిన ఇతర సృజనాత్మక కార్యక్షికమాలను రూపొందించుకొని సకల జనుల సమ్మెలో భాగస్వాములు కావాలి.

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే
తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు

35

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Fri,January 3, 2014 01:09 AM

విలీనంతో తెలంగాణకు చేటు

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొంద

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్