ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?


Sat,October 6, 2012 04:14 PM

ntpc talangana patrika telangana culture telangana politics telangana cinemaఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్వానిస్తారు. ఒక సంస్థ విస్తరణను వ్యతిరేకిస్తున్నారంటే అందులో ఏదో తిరకాసు ఉండి తీరుతుంది. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితినే జాతీయ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఎన్టీపీసీ)కి చెందిన రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎదుర్కొంటున్నది. ఈ థర్మల్ కేంద్రం లో 00 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మరో రెండు యూనిట్లను నిర్మించనున్నట్లు ఆ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే ఈ థర్మల్ కేంద్రం లో 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏడు యూనిట్లు పనిచేస్తున్నాయి. 00 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మరో రెండు యూనిట్లను ఇక్కడ నిర్మిస్తే ఈ థర్మల్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరుగుతుంది.

దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రా ల్లో ఒకటిగా చరివూతకెక్కుతుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇంతటి ఘనకీర్తిని మోసుకురాబోతున్న రామగుండం సూపర్ థర్మల్ విద్యు త్ కేంద్రం విస్తరణను ప్రజపూందుకు వ్యతిరేకించాలి? రామగుండం పారిక్షిశామిక ప్రాంత ప్రజల అనుభవాల నుంచి పరిశీలించినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. లేని పక్షంలో ఇక్కడి ప్రజలు ‘అభివృద్ధి నిరోధకులు’గా ప్రపంచానికి కనిపించే ప్రమాదం ఉన్నది.

197లో అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్ ఎన్టీపీసీ- రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి శంఖుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ ‘విస్తారమైన నేల బొగ్గు నిక్షేపాలు, పుష్కలమైన నీటివసతి, శ్రమగణం, మానవ సంపద కలిగిన గోదావరి నదీ పరివాహక ప్రాంతం (సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాలు) ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తితో భవిష్యత్తు లో దేశంలోనే అత్యంత తేజోవంతమైన ప్రాంతంగా, అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని’ చెప్పారు. సూపర్ థర్మల్ విద్యుత్ ఉత్ప త్తి కేంద్రం స్థాపనతో రామగుండం ప్రాంతం పారిక్షిశామికంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు తరాల సంక్షేమానికి హామీ ఉంటుందని ఇక్కడి ప్రజ లు ఆశపడ్డారు. రామగుండం, కమాన్‌పూర్ మండలాల పరిధిలోని పదహారు గ్రామాలకు చెందిన సుమారు 10 వేల ఎకరాల భూమిని ఈ విద్యుత్ కేంద్రం కోసం సేకరించారు.

వేలాదిమంది ప్రజలు తరతరాలుగా తిండిగింజలు అందిస్తున్న పంటపొలాలను ధారాదత్తం చేశారు. కుల వృత్తులు, వృత్తి కులాలవాళ్లు తమ ఉపాధిని త్యాగం చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించడంలోనూ, థర్మల్ కేంద్రంలో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలోనూ, పునరావాస ప్యాకేజీని అమలు చేయడంలోనూ ప్రభుత్వం, ప్రాజెక్టు అధికారులు వివక్షపూరితంగానూ, నిర్లక్ష్యంగానూ వ్యవహరించింది. భూనిర్వాసితులకు హామీ ఇచ్చిన ఉద్యోగ అవకాశాల కోసం 30 ఏండ్లుగా ఇక్కడి యువకులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలామంది వయోపరిమితిని దాటిపోయారు. ఎన్టీపీసీ- రామగుండం సూపర్ థర్మల్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న బొగ్గు నుంచి వెలువడుతున్న బూడిద, పొగ, పారిక్షిశామిక వ్యర్థాలు శబ్ధ, వాయు, నీటి కాలుష్యాలకు కారణమవుతున్నాయి. ఈ థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్తు ఇక్కడి పారిక్షిశామిక అభివృద్ధికి, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుందనే ఆశలు కూడా మూడు దశాబ్దాల అనుభవంలో ఆవిరైపోయాయి.

తెలంగాణ వనరుల వినియోగంలో సీమాంధ్ర పాలకవర్గాలు అనుసరిస్తున్న దోపిడీ పద్ధతులు, విద్యుత్ కేటాయింపుల్లో వివక్షకు ఎన్టీపీసీ- రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఒక సజీవ సాక్ష్యం. ఈ థర్మల్ కేంద్రంలో 2600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం రోజుకు సగటున 40 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ఈ బొగ్గును స్థానిక సింగరేణి బొగ్గుగనుల నుంచి సరఫరా చేస్తున్నారు. ఆరు నుంచి ఏడు టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తరలిస్తున్నారు. అయితే ఈ థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో కేవలం 29 శాతం విద్యుత్ మాత్రమే రాష్ట్ర అవసరాలకు కేటాయిస్తున్నారు. (ఆంవూధవూపదేశ్- 754 మెగావాట్లు-29 శాతం, తమిళనాడు-572 మెగావాట్లు-22శాతం, కర్ణాటక-416 మెగావాట్లు-16 శాతం, కేరళ- 312 మెగావాట్లు-12 శాతం, గోవా-130 మెగావాట్లు-5 శాతం, పాండిచ్చేరి -52 మెగావాట్లు-2 శాతం, ఎవరికీ కేటాయించనిది- సెంట్రల్ గ్రిడ్ -364 మెగావాట్లు -14 శాతం) ఇదే ఎన్టీపీసీ సంస్థ విశాఖపట్నం సమీపంలోని సింహాద్రి వద్ద 1000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిం ది. ఈ థర్మల్ కేంద్రానికి అవసరమైన నీటిని సముద్రం నుంచి, బొగ్గును ఒరి స్సా నుంచి తెచ్చుకుంటున్నారు.

కానీ అక్కడ ఉత్పత్తి చేస్తు న్న మొత్తం 1000 మెగావాట్ల విద్యుత్తును ఉత్తరాంధ్ర జిల్లాలకు (విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం) మొత్తం కేటాయిస్తున్నారు. ఎన్టీపీసీ- రామగుండం సూపర్ థర్మల్ కేంద్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తరలిస్తున్న ఆరు నుంచి ఏడు టీఎంసీల నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 70 వేల ఎకరాల భూమిని సాగు చేసుకునే అవకాశముంటుం ది. ఈ ప్రాజెక్టుకు సరఫరా చేస్తున్న సింగరేణి బొగ్గును జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే మనరాష్ట్రానికి కనీసం రెండు వేల మెగావాట్ల విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉండేది. తెలంగాణ ప్రాంత విద్యుత్ అవసరాలను తీర్చే వెసులుబాటు లభించేది. ఎన్టీపీసీ- సింహాద్రి థర్మల్ కేంద్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైనది. సముద్రం నీటి ని వాడుకోవడం వల్ల ఉత్పత్తి ఉతరాంధ్ర రైతాంగానికి కలిగే నష్టం ఏమీలేదు. బొగ్గు పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల స్థానిక వనరులకు ఇబ్బంది కూడా ఏమిలేదు.

కానీ ఎన్టీపీసీ- రామగుండం థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి 29 శాతం విద్యుత్తును కేటాయించి, అదే ఎన్టీపీసీ-సింహాద్రి థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తు మొత్తాన్ని కేవలం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకే కేటాయించడం సీమాంధ్ర పాలకులు అనుసరిస్తున్న ప్రాంతీయ వివక్షకు నిదర్శనం.
2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం కోసం ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ- రామగుం డం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో అదనం గా మరో 500 మెగావాట్ల ఏడవ యూనిట్‌ను 2004లో నాటి సీఎం వైఎస్ ప్రారంభించారు. ఈ యూనిట్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడు తూ ఎన్టీపీసీ నుంచి స్థానిక అవసరాలకు ప్రత్యేకంగా విద్యుత్‌ను కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ పని ని ఏ ముఖ్యమంత్రి చేయలేదు . అధికార, ప్రతిపక్ష తెలంగాణ ప్రాంత నాయకులు ఈ విషయంలో ఇప్పటివరకూ నోరుమెదపలేదు. ఎన్టీపీసీ-సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి మొత్తం విద్యుత్తును ఉత్తరాంవూధకు కేటాయించాలని కోరుతూ ఆ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రధానికి ఉమ్మడిగా వినతిపత్రం అందచేసి సాధించుకున్నా రు. కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం చేతగానితనానికి ఎన్టీపీసీ-రామగుండం సూపర్ థర్మల్ కేంద్రం ఒక ఉదాహరణంగా నిలుస్తున్నది.

33ఏళ్ల ఈ సుదీర్ఘ అనుభవాల నేపథ్యంలో ఎన్టీపీసీ-రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మూడోసారి 00 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు యూనిట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి అవసరమైన బొగ్గు లింకేజీ (రోజుకు సుమారు 24 వేల టన్నులు) కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విదేశీ బొగ్గు దిగుమతి బూచిని చూపించి, స్థానికంగా సింగరేణి నుంచి దీర్ఘకాలిక కోల్ లింకేజీని సాధించే ఎత్తుగడలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ ఇటీవల రామగుండంలో ‘సహజ వనరుల-స్థానిక అభివృద్ధి అంశంపై నిర్వహించిన సదస్సు అనేక కీలకమైన అంశాలను తెరమీదకు తెచ్చింది. ఈ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో కనీసం 50 శాతం తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలని, ఎన్టీపీసీ విస్తరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని, ‘జెన్‌కో’ ఆధ్వర్యంలోని జవహర్‌లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (రామగుండం‘బి’ థర్మల్ కేంద్రం) విస్తరించాలని ఈ సదస్సు డిమాండ్ చేసింది.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి


35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన