లక్ష్మణరేఖ గీయవలసిందే!


Sat,October 6, 2012 04:18 PM

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకోలేకపోయిం ది. ఈ వైఫల్యాన్ని ప్రజల ముందు ఎండగడతం. 24వ తేదీ వరకు గడువిస్తున్నం’ అని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఒకింత నిరాశతో చేసిన ప్రకటన ఇది. రెండున్నర సంవత్సరాల సుదీర్ఘమైన తెలంగాణ పోరాటం తర్వాత ఇలాంటి ప్రకటన చేయవలసి రావడం శోచనీయం.

ఈ సందర్భంలో తెలంగాణవాదులను వేధిస్తున్న తీవ్రమైన ఒక ప్రశ్నను గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యం ఉన్నదా? 1969లో జరిగిన ఉద్యమం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాత్ర ను తలుచుకుంటే ఈ అనుమానం బలపడుతున్నది. అంతేకాదు ఒకసారి 2004 నుంచి 2011వరకు పరిణామాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి.
1) 2004 ఎన్నికల్లో అప్పటి వరకు రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదాన్ని ఉపయోగించుకున్నది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి కాదు.దీనికి గులాం నబీ ఆజాదే సాక్ష్యం. అదే కాలంలో భారత రాష్ట్రపతి చేత తెలంగాణ సమస్య పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్న ప్రకటన చేయించింది కూడా కాంగ్రెస్‌వారు కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, వినోద్‌కుమార్‌లాంటి వారు యూపీఏ భాగస్వామ్య పక్షాలవే కాకుండా, దేశంలోని 36 పార్టీల మద్దతు సేకరించిన ఫలితం అది! ఇదంతా చారివూతక వాస్తవం.

2) 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణవాదాన్ని మళ్లీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఉపయోగించుకున్నదని, 10 డిసెంబర్, 2009న తేటతెల్లమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతీ య ద్వేషాల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేర్చింది. అయితే తొలివిడుత ఎన్నికలు తెలంగాణలో పూర్తికాగానే వైఎస్ నంద్యాల సభలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. సమైక్యవాదిగా అవతారమెత్తి మలివిడుత ఓట్ల వేటలో పడ్డాడు. అయినా తెలంగాణ కాంగ్రెస్ వారు వ్యతిరేకించలేదు. పైగా ఆయనను తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ ప్రభుత్వంలో మంత్రులయ్యారు. పదవులు పొందారు. వైఎస్ అడుగులకు మడుగులొత్తారు.

3)2009 డిసెంబర్ 9న తెలంగా ణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చిదంబరం ప్రకటన వచ్చిదంటే, అది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తన ఆమరణ దీక్షతో పరిపూర్ణం చేసిన కేసీఆర్ వల్లనే. కానీ ఈ చారివూతక ప్రకటనను కాపాడు కొని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో తెలంగాణ కాంగ్రె స్ నేతలు, తెలుగుదేశం నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సీమాంవూధుల నాయకత్వంలో ఉన్న ఈ రెండు పార్టీలు అధికారం కోస మే తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకున్నాయని మరోసారి రుజువైంది. అయినా ఈ ప్రాం త తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధులకు జ్ఞానోదయం కలగలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, టీడీపీ, పీఆర్‌పీ సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీ అవతరించడానికి కారకులయ్యారు.

4) శ్రీకృష్ణ కమిటీ పేరుతో చర్చలు జరిపి తెలంగాణపై నిర్ణయాన్ని సాగదీసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభీష్టాన్ని అపహాస్యం చేసే నివేదికను సమర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎంతటి రాజకీయ అమాయకులంటే, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదికను ఇవ్వబోతుందని నమ్మారు. ప్రచా రం చేశారు. సీమాంవూధులను ఒప్పించడానికే ఈ నివేదిక తంతు అని ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పారు. చివరికి ఆ నివేదికలో ఎనిమిదో చాప్టర్ ను బహిర్గతం చేయకపోయినా, కోర్టు వారు దాన్ని ప్రజలకు అందించారు. దాంట్లో ఉన్న నిజాలను తెలుసుకొని కరుడుగట్టిన సీమాంధ్ర నేతల నోట్ల పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పొలిటికల్, మీడియా మేనేజ్‌మెంట్ తదితర అస్త్రాల ద్వారా తెలంగాణవాదాన్ని మరుగున పరచడానికి కార్యాచరణ సూత్రాలు పొందుపరిచారు. ఇదంతా సీమాంధ్ర నేతలు, కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వం పన్నిన కుట్ర అని తెలిసినా మన కాంగ్రెస్ ప్రజావూపతినిధులు సర్దుకుపోయారు. దీన్ని ప్రటిఘటించి కేంద్రానికి గుణపాఠం చెప్పలేకపోయారు.

5) శ్రీకృష్ణ కమిటీ కుట్రలను భగ్నం చేస్తూ 2011లో జరిగిన సకల జనుల సమ్మె కీలకమైనది, చరివూతాత్మకమైనది. దాని పర్యవసానంగానే ఆంధ్రవూపదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి కీలకమైన సందర్భంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వారితో పాటు టీడీపీ వారు మరోసారి వెనుకడుగు వేశా రు. సీమాంధ్ర నేతల రాజకీయ ఎత్తుగడలకు పావులుగా మారారు. దీనికి వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కాలంలో కూడా ప్రధానంగా కాంగ్రెసేతర ప్రజాశక్తుల ద్వారానే ఉద్యమం ప్రారంభించబడింది. 1969 నుంచి 2011 దాకా కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అణచివేయాలనే కుట్రలు చేసింది. అంతేతప్ప తనంతట తానుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఇంత వరకూ తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తన అభివూపాయాన్ని చెప్పలేదు. చిత్తశుద్ధితో ఉంటే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ఒకవేళ వారి పార్టీ మాట తప్పితే ప్రజల ఆకాంక్ష మేరకు ఆ పార్టీని వీడి, ప్రజా ఉద్యమంలో భాగస్వాములవ్వాలి.
ఢిల్లీ యాత్రలతో, పార్లమెంటును స్తంభింపజేసి అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తే తెలంగాణ వస్తుందనుకోవడం అవివేకం. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ పార్లమెంటును స్తంభింపచేస్తే అర్థం ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ సొంత పార్టీ, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుంటే, దానికి నిరసనగా నైతిక బాధ్యతతో తమ పదవులకు రాజీనామా చేయాలి. అదే అసలైన రాజనీతి. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ సాధన కోసం తమ సొంత పార్టీపై పార్లమెంటులో, అసెంబ్లీలో పోరాడుతా మన్న మాటలను తెలంగాణ జేఏసీ, అందులోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నమ్మే స్థితిలేదు.

కాంగ్రెస్ నేత లు అవసరం వచ్చినప్పుడు తమ ప్రభుత్వాని కి బాసటగా నిలిచిన విషయం మనకు తెలిసిం దే. అయితే దీన్ని ఆసరాగా తీసుకుంటూ కాంగ్రె స్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం అవలంబించే దాటవేసే ధోరిణిని పరోక్షంగా సమర్థి స్తూ.. నేటి వరకు మన కాంగ్రెస్ ప్రజావూపతినిధలు తమ పదవులను, పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు. ఈ రాజకీయ ద్వంద్వ విధానం తెలంగాణ ఉద్యమానికి లాభం చేకూర్చిందా? నష్టం కలుగుతున్నదా అనే విషయంపై తెలంగాణవాదులు, రాజకీయ జేఏసీ స్పష్టమైన అవగాహనకు రావాలి. ఈ రాజకీయ ద్వంద్వ విధానాన్ని సమర్థించిన కారణంగానే మలివిడుత తెలంగాణ ఉద్యమం (సకల జనుల సమ్మె) తర్వాత ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభంలో భాగంగా జరిగిన రాజీనామాల ప్రయ త్నం విఫలమైందనే విమర్శ ఉన్నది.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం 50 మందికిపైగా ఆత్మబలిదానాల తర్వాత కూడా మళ్లీ ఢిల్లీ వెళ్లి మా వాదనలు వినిపిస్తాం అనే దశలో తెలంగాణ కాంగ్రెస్ వారు ఉన్నారంటే వారికి తెలంగాణపై నిజమైన చిత్తశుద్ధి ఉన్నదా అని ప్రతి తెలంగాణవాది అను మానిస్తున్నాడు. తెలంగాణపై తమ పార్టీలను కాదని, తమ విశ్వసనీయత ను నిరూపించుకున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తారన్న సత్యాన్ని మొన్నటి ఉప ఎన్నికలు నిరూపించాయి. ఇంత జరిగినా కండ్లు తెరవని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ప్రజావూపతినిధులపై ఒత్తిడి పెంచాలంటే అవగాహన యాత్రలు, డెడ్‌లైన్లు మాత్రమే సరిపోవు. ఉద్యమానికి పదును పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ కంటే ప్రజలు ముఖ్యమన్న సత్యా న్ని గ్రహించేటట్లు చేయాలి. తెలంగాణ వైపు ఉంటారా? లేదా పదవులు,పార్టీలు పట్టుకొని వేలాడుతారో వారి ముందు లక్ష్మణరేఖ గీయవలసిందే!

-డాక్టర్ చెన్నమనేని రమేశ్
శాసనసభ్యులు

35

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క