చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు


Sun,April 28, 2013 11:43 PM

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అసలు తెలంగాణను ఏవిధంగా సాధించవచ్చు అనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టత గానీ, అనుసరించాల్సిన వ్యూహంగానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఆ వ్యూహాన్ని అమలుపరిచే రాజకీయ పట్టుదల గానీ లేనే లేవు. మూడు సంవత్సరాల వ్యూహ రచనలు అందుకే శూన్యంగా మారా యి.

ఈ సందర్భంలో తెలంగాణవాదుల్లో కొన్ని కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.గతంలో రాజకీయ పట్టుదలను నిరూపించుకోలేనప్పుడు వీరంతా కొత్త సమీకరణాలను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటి? త్వరలో రానున్న ఎన్నికల కారణంగానే కొత్త వ్యూహాలను ప్రతిపాదిస్తున్నారని తద్వారా తెలంగాణ సాధనకు వీరు ఎంతవరకు దోహదపడతారో చెప్పలేమనే సందేహాలున్నాయి. ఇవి తీరనప్పుడు వీరందరిని రాజకీయ కురుక్షేవూతంలో గెలుపు గుర్రాలుగా భావించడం కూడా హేతుబద్ధం కాదేమోనని తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ ధర్మ సంకటంపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో తెలంగాణవాదులను వేధిస్తున్న తీవ్రమైన ఒక ప్రశ్నను గమనించాలి. కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే చిత్తశుద్ధి, రాజకీయ లక్ష్యం ఉన్నదా? లక్ష్యం లేనప్పుడు ఎన్ని వ్యూహాలు రచించినా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.1969లో జరిగిన ఉద్యమం, ఆ తర్వాత కాం గ్రెస్ పార్టీ పాత్రను తలుచుకుంటే ఈ అనుమానం బలపడుతున్నది.అంతేకాదు ఒకసారి 2004 నుంచి 2013 వరకు పరిణామాలను విశ్లేషిస్తే ఆసక్తికరమైన నిజా లు వెలుగులోకి వస్తాయి.

1) 2004 ఎన్నికల్లో అప్పటి వరకు రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదాన్ని ఉపయోగించుకున్నది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి కాదు. దీనికి గులాం నబీ ఆజాదే సాక్ష్యం. అదేకాలంలో భారత రాష్ట్రపతి చేత తెలంగాణ సమస్య పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్న ప్రకటన చేయించింది కూడా కాంగ్రెస్ వారు కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, వినోద్‌కుమార్ లాంటివారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలనే కాకుండా, దేశంలోని 36 పార్టీల మద్దతు సేకరించిన ఫలితం అది! ఇదంతా చరివూతాత్మక వాస్తవం.

2) 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణవాదాన్ని మళ్లీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఉపయోగించుకున్నదని, 2009 డిసెంబర్10న తేటతెల్లమైంది. అయితే కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతీయ ద్వేషాల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేర్చింది. అయితే తొలి విడత పోలింగ్ తెలంగాణలో పూర్తికాగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నంద్యాల సభలో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. సమైక్యవాదిగా అవతారమెత్తి మలి విడత ఓట్లు వేటలో పడ్డాడు.అయినా తెలంగాణ కాంగ్రెస్ వారు వ్యతిరేకించలేదు. పైగా ఆయనను తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్ఢి ప్రభుత్వంలో మంత్రులయ్యారు. పదవులు పొందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తారు.
3) 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభ
మవుతుందని చిదంబరం ప్రకటన వచ్చిందంటే, అది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తన ఆమరణదీక్షతో పరిపూర్ణం చేసిన కేసీఆర్ వల్లనే. కానీ చరివూతాత్మక ప్రకటనను కాపాడుకొని, రాష్ట్ర సాధన కోసం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సీమాంవూధుల నాయకత్వంలో ఉన్న ఈ రెండు పార్టీలు అధికారం కోసమే తెలంగాణవాదాన్ని ఉపయోగించుకున్నాయని మరోసారి రుజువైంది.అయినా ఈ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలకు జ్ఞానోద యం కలగలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్, టీడీపీ, పీఆర్‌పీ సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీ అవతరించడానికి కారకులయ్యారు.

4) శ్రీకృష్ణ కమిటీ పేరుతో చర్చలు జరిపి తెలంగాణపై నిర్ణయాన్ని సాగదీసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభీష్టాన్ని అపహాస్యం చేసి నివేదికను సమర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎంతటి రాజకీయ అమాయకులంటే, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదికను ఇవ్వబోతుందని నమ్మారు, ప్రచారం చేశారు.
సీమాంవూధులను ఒప్పించడానికే ఈ నివేదిక తంతు అని ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పారు. చివరికి ఆ నివేదికలో ఎనిమిదో చాప్టర్‌ను బహిర్గతం చేయకపోయినా, కోర్టువారు దా న్ని ప్రజలకు అందించారు.దాంట్లో ఉన్న నిజాలను తెలుసుకొని కరుడుగట్టిన సీమాంధ్ర నేతల నోట్ల పచ్చి పడినట్లయింది. పొలిటికల్, మీడియా మేనేజ్‌మెంట్ తదితర అస్త్రాల ద్వారా తెలంగాణ వాదాన్ని మరుగున పరచడానికి కార్యాచరణ సూత్రాలను పొందుపరిచారు. ఇదంతా సీమాంధ్ర నేతలు, కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వం పన్నిన కుట్ర అని తెలిసినా మన కాంగ్రెస్ ప్రజావూపతినిధులు సర్దుకుపోయారు. దీన్ని ప్రతిఘటించి కేంద్రానికి గుణపాఠం చెప్పలేకపోయారు.

5) శ్రీకృష్ణ కమిటీ కుట్రలను భగ్నం చేస్తూ 2001లో జరిగిన సకల జనుల సమ్మె కీలకమైనది. చరివూతాత్మకమైనది. దాని పర్యవసానంగానే ఆంధ్రవూపదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి కీలకమైన సందర్భంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వారితోపాటు టీడీపీ వారు మరోసారి వెనుకడుగు వేశారు. సీమాంధ్ర నేతల రాజకీయ ఎత్తుగడలకు పావులుగా మారారు.దీనికి వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

6) సకల జనుల సమ్మె తర్వాత చెప్పుకోదగ్గ పరిణామం 2012లో జరిగిన అఖిలపక్ష సమావేశం. చివరకు ఇక్కడ కూడా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ పూర్తిగా రాజకీయ వైఫల్యాన్ని చవి చూశాయి. కనీసం ఆ తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు రాజకీయ పాఠాలు నేర్చుకోలేదు.వాస్తవంగా పొలిటికల్ జేఏసీ ఆధ్వరంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నా వీరందరూ ప్రేక్షక పాత్ర పోషించారు. కానీ వీరి సీమాంధ్ర నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణను సాధించలేకపోయారు. అందుకోసమే కదా వెయ్యిమంది వజ్రాల్లాంటి తెలంగాణ బిడ్డలు ప్రాణాలను బలిచేశారు? వీరికి మనం చెప్పే సమాధానం ఏమిటి?

1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కాలంలో కూడా ప్రధానంగా కాంగ్రెసేతర ప్రజాశక్తుల ద్వారానే తెలంగాణ ఉద్యమం ప్రారంభించబడింది. 1969 నుంచి నేటి దాకా కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్ని స్తూ, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అణచివేయాలనే కుట్రలు చేసింది. అంతేతప్ప తనంతట తానుగా రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో కాంగ్రెస్‌పార్టీ ప్రయత్నించిన దాఖలాలు లేవు. అంతెందుకు ఇంత వరకు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తన అభివూపాయాన్ని కూడా చెప్పలేదు.అంతేకాదు కాంగ్రెస్ నేతలు అవసరం వచ్చినప్పుడు తమ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన విషయం మనకు తెలిసిందే.

రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లనే కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. పార్లమెంటులో అణు ఒప్పం దం, ఎఫ్‌డీఐల విషయంలో పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు మన కాంగ్రెస్ నాయకులు వత్తాసు పాడారన్నది సత్యం. రేపు వీరు పార్లమెంటులో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై బిల్లు పెట్టకపోతే, ఆర్థిక బిల్లుపై ఓటింగ్ వస్తే, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఎటువైపు ఉంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలప్పుడు చేయవలసిన రాజకీయ వ్యూహాలపై చూపే శ్రద్ధను, కొత్త సమీకరణాలపై చేసే ప్రకటనల కంటే, వారు ఇప్పటి వరకు తెలంగాణ సాధనలో ఎందుకు విఫలమయ్యారో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకొని తగు తక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. అలా చేయనప్పుడు కొత్త సమీకరణాల్లో కాంగ్రెస్ వారు దృఢమైన పునాదుల మీద నిలబడడం అంత సులభం మాత్రం కాదని సకల జనుల అభివూపాయం.

-డాక్టర్ చెన్నమనేని రమేష్ శాసనసభ్యులు

35

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క