కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమా?


Sat,October 6, 2012 04:26 PM

raju-copy talangana patrika telangana culture telangana politics telangana cinemaఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. అదొక సోమరిపోతుల రాజ్యం. యూపీఏ ప్రభుత్వం యావత్తు నిద్ర మత్తులో జోగుతున్నది. తాను చేసిన ప్రకటనలకు కట్టుబడే పరిస్థితి లేదు. చేసిన తప్పులు బయటపడి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రోజూ ఎదురవుతున్నది. ఇప్పటికే అనేక కుంభకోణాలు బయటపడ్డాయి. అవినీతి కేసులకు అంతే లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఉత్తరవూపదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం ఎదురైంది. ప్రధాన ఆర్థిక సలహాదారుడు అమెరికా వెళ్లి యూపీఏ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ధైర్యంగా చేపట్టే పరిస్థితి లేదని వెల్లడించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వ పరువు పోయింది. మొత్తం వ్యవహారం చూస్తుంటే సోనియాగాంధీ పట్టు సడలిపోతున్నదేమో అనిపిస్తున్నది.

యూపీఏ ప్రభుత్వ పరిస్థితి పరమ అధ్వాన్నంగా తయారైంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడబోతే అదేమీ చక్కగా లేదు. పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణా రాహి త్యం నెలకొన్నది. మంత్రుల మధ్యన గొడవలు ఉన్నాయి. మంత్రులకు, పార్టీ నాయకులకు మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. చివరికి అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇక రాష్ట్రాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు, నడిమి తలకాయలు... ఎవరి దారి వారిది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ది ఒక వర్గం. పీసీసీ నేత జేపీ అగర్వాల్ ముఠా మరొకటి. ఈ ఇరు వర్గాల గొడవలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఉత్తరాఖండ్‌లో మఖ్యమంత్రి బహుగుణ, మంత్రి రావత్‌కు మధ్య తూతూ మైమై సాగుతూనే ఉన్నది.

ఇక ఆంధ్రవూపదేశ్‌లో పార్టీ చక్కదనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అటు జగన్ వర్గం వేరే కుంపటి పెట్టుకున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు బాటలో ఉన్నారు. సోనియమ్మ కోటరీ రాజకీయాలు పరిస్థితిని ఇంతా అధ్వాన్నంగా మార్చాయి. కోటరీ రాజకీయాలు పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వ్యక్తిగత స్వార్థం ఫ్యూడల్ మనస్తత్వం గల నాయకుల వల్ల పార్టీ గిలగిలాడిపోతున్నది. పైనుంచి కింది వరకు రక్తంపీల్చుకు తాగే జలగలు తయారయ్యాయి. నామినేటెడ్ సంస్కృతి పాదుకుపోవడంతో సోనియా విధేయత ప్రధానమైపోయిందని ఒక నాయకుడు ఇటీవల వాపోయాడు. నిర్ణయాలు తీసుకోవడం చాలా మెల్లగా సాగుతున్నది. సోనియాగాంధీ ఇదే పరిస్థితి కొనసాగిస్తే పార్టీ కుప్పకూలిపోతుందని ఆయన వాపోయారు.

కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమ స్య ఆంతరంగిక ప్రజాస్వామ్యం లోపించడం. దీంతో సోనియా ఆదేశాలు వస్తే తప్ప ఏ స్థాయిలో నూ చలనం ఉండదు. దీనివల్ల పార్టీ యంత్రాంగం గడ్డకట్టుకుపోయింది. ఏదైనా సమస్యపై చర్చ సాగినప్పుడు తప్పొప్పులకు స్థానం లేకుండా పోయింది. సోనియా విధేయులుగా ఎవరు ఏమంటున్నారు? అనేదే ప్రధానమైపోయింది. దీంతో చెంచాల మాట చెల్లుబాటు అవుతున్నది. ఇప్పుడు దేశ రాజకీయాల లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ యే. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు భళ్లున బద్దలైతే ఆ ప్రభావం అనివార్యంగా యూపీఏ ప్రభుత్వంపై కూడా పడుతుంది. శరద్‌పవార్, మమతాబెనర్జీ వంటి యోధానుయోధులు కాంగ్రెస్ పార్టీ తో ఎప్పుడు కలియబడదామని ఎదురుచూస్తుంటా రు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనత బయటపడ్డది. దీంతో మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ను ఆటాడించడానికి మళ్లీ అవకాశం లభించినట్టయింది. కాంగ్రెస్‌కు మిత్రపక్షాలకు మధ్య పరస్పర అనుమానాలు పెరిగిపోతున్నాయి.కానీ మిత్రపక్షాలను నొప్పించలేని బలహీన స్థితి లో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. కేంద్రం బలహీనపడ్డదన్న విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థమైపోయింది. ముఖ్యమంవూతులు కొందరు కేంద్రానికి వ్యతిరేకంగా జట్టుకట్టి కీలక నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోగలుగుతున్నారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎస్‌సీటీసీ) గూడ్స్ అండ్ సేల్స్‌టాక్స్, ఎఫ్‌డీఐ మొదలైన అంశాలపై ముఖ్యమంవూతులు కేంద్రాన్ని ఇరుకు న పెట్టగలుగుతున్నారు. దీంతో జాతీయస్థాయి రాజకీయాలలో అయోమయం రాజ్యమేలుతున్నది. ప్రభుత్వాన్ని నిర్ణయరాహిత్యం నుంచి ప్రభుత్వాన్ని బయటపడేసేందుకు సృజనాత్మకంగా ఆలోచించే నాయకుడు లేకుండాపోయాడు. ఇదే విధంగా కాంగ్రెస్‌ను తీర్చిదిద్దే నాయకులు కూడా లేరు. ఇవే పరిస్థితులు కొనసాగితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

కాంగ్రెస్ పార్టీ రెండు రకాల రుగ్మతలతో చిక్కిశల్యమై ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నాయకులు అంటూ లేకుండాపోయారు. ఇదొక పెద్ద సమస్య. మరోసమస్య అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం. పైనుంచి వచ్చే ఆదేశాలు అందరికీ శిరోధార్యం. కిందిస్థాయి నాయకులు గొడవలు పడుతున్నప్పుడు దానినే అంతర్గత ప్రజాస్వామ్యంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌పార్టీలో రాచరికపు సంస్కృతి పేరుకుపోయి ఉన్నది.అందువల్ల కిందిస్థాయిల్లో ఎంత చతురులైన నాయకులు ఉన్నప్పటికీ వారి చాతుర్యం పార్టీకి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. తమ పార్టీలో సమర్థులైన నాయకులు ఉంటే వారిని గుర్తించే స్థితిలో అధిష్ఠానం లేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద ఇటీవల ఆరోపణలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆ ఆరోపణలకు స్పందించే శక్తి కూడా ఆ పార్టీ నాయకులకు లేకుండాపోయింది.

కామన్ గేమ్స్, 2 జీ స్పెక్ట్రం, మైనింగ్ తదితర కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు ఆ పార్టీ నాయకత్వం స్వయంగా సృష్టించుకున్నవే. సమస్యలు తానే సృష్టించుకుని తన నిర్వహణ లోపం ద్వారా వాటిని మరింత పెద్దగా చేసుకుంటున్నది.
ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తీరే అసంబద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభు త్వం రాజకీయాలతో సంబంధం లేకుండా నడుస్తున్నది. ఎన్నికైన ప్రజావూపభుత్వానికుండే శక్తియుక్తులు ఇప్పుడు యూపీఏ ప్రభుత్వానికి లేవు. సోనియాగాంధీ కుటుంబ ఆదేశాల మేరకే వ్యవహారాలు నడుస్తున్నాయి. సోనియాగాంధీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిర్మాణం జరిగింది. అందువల్ల దేశానికి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించలేక యూపీ ఏ ప్రభుత్వం గందరగోళంలో పడిపోతున్నది. యూపీఏ ప్రభుత్వం అసమర్థతకు మారుపేరుగా నిలిచింది.

ప్రధాని మన్మోహన్‌కు మంత్రులపై పట్టులేదు. దీంతో మంత్రులు ఎవరి ఎజెండా ప్రకారం వాళ్లు నడుచుకుంటున్నారు. ఎవరి సామ్రాజ్యాన్ని వారు ఏలుకుంటున్నారు. ఎవరికి వారు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాలు, కలహాలు నిత్యకృత్యమయ్యాయి. పైన సమర్థుడైన నాయకుడితో పటిష్టమైన పాలనా యంత్రాంగం నిర్మితమై ఉండాలి. కానీ కేంద్రంలో అటువం టి జాడలు లేవు. సోనియాగాంధీకి గానీ, మన్మోహన్ గానీ పరిస్థితిని చక్కదిద్దే సమర్థత లేదు. 41 ఏళ్ల వయసు గల యువనేత రాహుల్‌గాంధీ తన అసిస్టెంట్లపైన, కంప్యూటర్లపైన ఆధారపడి పార్టీని నడిపిస్తుంటాడు. పేద ప్రజలతో కలిసిపోవలసిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తుంటాడు. పై నాయకులు మాత్రం పెట్టుబడిదారీ మిత్రవర్గం తో, గూండాలతో సహవాసం చేస్తుంటారు. విలసవంతమైన కార్లలో తిరుగుతుంటారు. యూపీఏ ప్రభు త్వం మూడేళ్లుగా సాధించిందేమిటో చెప్పుకునే పరిస్థితిలో లేదు.

కాంగ్రెస్ పార్టీకి ఇక విముక్తి లేదా? పార్టీ బాగుపడాలంటే సోనియా కుటుంబ పాలనను దాటి ఆలోచించగలగాలి. నెహ్రూ కుటుంబంతో నిమిత్తం లేకుండా సమస్యలకు పరిష్కారం అన్వేషించగలగాలి. ఎంత పెద్ద నాయకులు లేకున్నా రాజకీయా లు ఉంటాయి. దేశాలు నడుస్తుంటాయి. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి.

కాంగ్రెస్ పార్టీని నెహ్రూ కుటుంబం నడిపించ లేకపోతున్నదని, ప్రజల్లో ఆ పార్టీ ప్రతిష్ట దిగజా రిందని యూపీ ఎన్నికలతోనే బయటపడింది. పాత వ్యవస్థ కూలదోసి కొత్త వ్యవస్థను నిర్మించుకోవాలనే విషయాన్ని పార్టీ నాయకులు గ్రహించాలి. జీ హుజూర్ నాయకులను వదిలించుకుని సమర్థులు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు కలిగించాలి. కాంగ్రెస్ పార్టీని మూలాల నుంచి పునర్ నిర్మించినట్టయితే ఆ పార్టీకి ఒక కొత్త రూపు వస్తుంది. ఇది చాలా కష్టమైన పని. కానీ అసాధ్యమేమీ కాదు.
కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్నప్పటికీ సోనియాగాంధీకి కొన్ని పరిస్థితులు కలిసి వస్తున్నాయి. బీజేపీ బలహీనంగా ఉన్నదిపాంతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో వ్యవహించలేకపోతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గోతిలో నుంచి బయటపడేసే శక్తి సోనియాకు, ఆమె అనుయాయులకు ఉన్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదీఏమైనా 2014 నాటికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో ఉండాలంటే మౌలిక మార్పులు అవసరం.

-పూనమ్ ఐ కౌశిష్
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్ (INFA)


35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Featured Articles