విద్యాహక్కు చట్టం చేస్తే చాలా?


Sat,October 6, 2012 04:26 PM

మన పాలకులు విద్యాహక్కు చట్టాన్ని చేసి ఏదో సాధించినట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఏమి సాధించారు? ప్రభుత్వం చెబుతున్నట్టు విద్యాహక్కు పేద బాలలకు తగ్గుతుందా? విద్యా హక్కు అంటే ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని పిల్లలు నాలుగు ఇంగ్లిషు పదాలు నేర్చుకోవడమేనా? విద్య అంటే పిల్లలకు చిర్ర గోనె ఆడే తీరిక కూడా లేకుండా చేయడమేనా?
ప్రైవేట్ పాఠశాలల్లో నాలుగోవంతు సీట్లు పేద వర్గాల పిల్లలకు కేటాయించాలని నిర్దేశిస్తున్న విద్యా హక్కు చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిం ది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు కొన్ని సీట్లు రిజర్వు చేయాలంటూ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం చరివూతాత్మకమైనది అనడంలో సందేహం లేదు. విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తున్న లక్ష్యం కూడా ప్రశంసనీయమైనదే. అందరికీ సమానావకాశాలు కల్పించడం ద్వారా సామాజిక సంబంధాలు పటిష్టం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. పేదలకు ఉచిత నిర్బంధ విద్య అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికి బోధించాలె అనే నినాదం వినడానికి బాగానే ఉంటుంది. కానీ కార్యాచరణ అంత సులభం కాదు. పైగా, విద్య అంటే ఏమిటనే విషయంలో స్పష్టత రావలసి ఉన్నది. పేద బాలుడికి తన పేరు రాసుకోగలిగితే చాలు విద్యావంతుడైన విద్యా హక్కు చట్టం లక్ష్యం నెరవేరుతుందా? విద్యావంతులు అంటే అక్షరాస్యులేనా? విద్య లక్ష్యం కొందరిని అక్షరాస్యులను చేసి వదలివేయడమేనా? ఈ విషయాలు తాత్వికంగా చర్చించవలసి ఉన్నది.

ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు రిజర్వు చేయాలనడం వల్ల, ప్రభుత్వం పాఠశాలలు అనే భావన దెబ్బ తింటున్నది. పాఠశాల పిల్లలకు విద్యా బోధన చేయాలనే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకున్నట్టవుతుంది. ప్రభుత్వ ఆజ్ఞలను పాటించాలంటూ ప్రైవేటు స్కూళ్ళను కట్టడి చేయడం కూడా పొరపా ఆరేళ్ల లోపు పిల్లలు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రారు. దీనివల్ల చిన్న పిల్లలకు ఆ వయసులో అవసరమైన పోషణ లభించదు. సంపన్న కుటుంబాలలోని ఆరేళ్ళలోపు పిల్లలకు మనో వికాసానికి సంబంధించిన బోధన ఆటాపాటల ద్వారా లభిస్తుంది. రంగులు చెప్పడం, ఉత్సుకత పెంచడం వంటి బోధన ఉంటుంది. పాఠశాలకు వెళ్ళక ముందే మేధో వికాసం సాగుతుంది. శైశవ దశలో పెంపకం తీరు వారికి ప్రైవేటు పాఠశాలల్లో బోధనకు అవసరమైన పునాదిని అందిస్తుంది. కానీ పేదలకు అటువంటి ఏర్పా ట్లు ఉండవు. బాల్యాన్ని విద్య నుంచి విడదీసి చూడకూడదు. 1992 నాటి ఐక్యరా జ్య సమితి విద్యా నిబంధన ప్రకారం- బాల్య దశలో శ్రద్ధ, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత. ఈ ఐక్యరాజ్యసమితి నిబంధనపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. పాఠశాల విద్యకు ముందు దశను నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నట్టు?
ప్రైవేటు పాఠశాలలకు పేద పిల్లలను పంపడం ద్వారానే విద్యా హక్కు చట్టం విజయవంతం కాదు. వారు ఏ పరిస్థితు ల్లో పాఠశాలకు వస్తున్నారనేది ప్రధానం. వారికి తగినంత నిద్ర ఉంటున్నదా? తగిన పోషకాహారం లభిస్తున్నదా? పాఠశాలకు పంపడానికి ముందు అవసరమైన పునాది పడిందా అనేది పరిశీలించా లె. గ్రామీణ ప్రాంతాలలోని సగం మంది విద్యార్థులు తమ తరగతికి చెందిన విద్యా ప్రమాణాలు కలిగి లేరని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. అంతే కాదు, సగటున ప్రతి మంది పిల్లలలో నలుగురు అర్ధాకలితో పాఠశాలకు వస్తున్నారని కూడా వెల్లడైంది.

ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేదలకు కేటాయించడం వరకు సరే. కానీ మిగతా పిల్లల సంగతేమిటి? వారు ఎక్కడికి పోవాలె? వీరి విషయంలో ప్రభు త్వం తన బాధ్యత నిర్వహిస్తున్నదా అనేది ప్రధానం. మిగతా పేద ప్రజానీకానికి విద్యబోధన చేసేందుకు తగినన్ని పాఠశాలలు ఉన్నాయా? తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నారా? లేవు. పేద పిల్లలకు అవసరమైన విద్యా వసతులు ప్రభుత్వం కల్పించడం లేదు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్న ది. ఎనిమిదవ తరగతి వరకే ప్రభుత్వం విద్యా హక్కు బాధ్యత తీసుకుంటున్న ది. ఎనిమిదవ తరగతి దాటిన తరువాత వీరి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం వీరి బాధ్యతను స్వీకరించడం లేదు. సార్వవూతిక ప్రాథమిక విద్యనే ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. అనేక గ్రామాలకు పాఠశాలలు అందుబాటులో లేవు. పొరుగు ఊరికి వెళ్ళి చదువుకోదలిచిన వారికి తగిన రవాణా వసతి కూడా లేదు. ప్రభుత్వ పాఠశాలల టెక్స్‌బుక్‌ల నాణ్యత దయనీయంగా ఉంటుంది. ఆంగ్లంలో వ్యాకరణ దోషాలు ఉంటాయి. పేద తల్లిదంవూడులకు పిల్లలు పనిలో ఆసరాగా ఉంటారు. అందువల్ల బడికి పంపడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేద తల్లిదంవూడులు భావిస్తుంటారు. పేద కుటుంబాల జీవన పరిస్థితి మెరుగు పరచడం కూడా విద్యా హక్కు చట్టంలో అమలు చేయడానికి అవసరమే.

విద్యా హక్కు చట్టం ప్రభుత్వం ఓట్లు తెచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడుతుంది. కానీ దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఎట్లా తెస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ వ్యయంలో కేంద్రం 65 శాతం, రాష్ట్రం 35 శాతం భరించాలె. పాఠశాల విద్యకు ఇప్పుడు 48, 781 కోట్లు కేటాయించారు. విద్యాహక్కు చట్టం అమలుకు ఈ మొత్తం కన్నా మరో ఐదు రెట్లు ఎక్కువ నిధులు అవసరం. వార్షిక సబ్సిడీలు 1.1 లక్ష కోట్లు. ఇప్పుడు విద్య కోసం ఇంతకు మించి ఖర్చు చేయవలసి వస్తుంది. దినదినం ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అమలు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలె. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు అటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్టు కనిపించడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మన దేశంలో అక్షరాస్యత 66 శాతమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యులలో 33.2 శాతం మన దేశంలోనే ఉన్నారు. ప్రభుత్వం విద్య కోసం వెచ్చిస్తున్న నిధుల శాతం ప్రపంచ వ్యాప్త సగటు కన్నా తక్కువగానే ఉన్నది.

ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిం చి, తల్లిదంవూడులమీదకు తోసివేసినప్పు డు విద్య నాణ్యత దెబ్బ తింటుంది. విద్యా వసతులు, ఉపాధ్యాయులు లేకుం డా పాఠశాల విద్యావ్యవస్థను ప్రభుత్వం బలహీనపరిచింది. ప్రజలకు విద్యాబోధన పేర నాణ్యత లేని నామ్‌కే వాస్తే బోధ న గరపడం వల్ల ఫలితాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలల పట్ల పూర్తిగా నమ్మకం పోయింది. పేద వర్గాలకు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల పెద్దగా నమ్మకం లేదు. ఆధునిక విద్యలో, విద్యా ప్రణాళికలో గ్రామీణ జీవనానికి తగిన ప్రాధాన్యం లేదు. గ్రామీణ జీవనం పట్ల చూపిన ఈ వివక్ష వల్ల గ్రామీణ పేద పిల్లలు బడికి మానివేస్తున్నారు. ఈ పిల్లలను మళ్లీ పాఠశాలలో చేర్పించే విధానమేమిటో మన పాలకులకు అర్థం కావ డం లేదు. ప్రభుత్వ దృక్కోణమే దీనికి కారణం. దీనివల్లనే వివక్ష పెరిగిపోతున్న ది. వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. విద్యాబోధనలో తారతమ్యాలు పెరిగి పోవడం వినాశకర ఫలితాలకు దారి తీస్తుంది. భారత్ జనాభాలో యువతరం సంఖ్యారీత్యా పెరిగిపోనున్నది. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో యువత సంఖ్య రీత్యా పెరిగిపోతున్నది. 2020 నాటికి దేశ జనాభా సగటు వయసు 2 ఏళ్లు! ఈ యువతరానికి ఏటా కోటి ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నదా?
విద్యా హక్కు అనేది బాగానే ఉన్నది. కానీ అందరికి ఉత్తమమైన విద్యా హక్కు లభించాలనేది మన నినాదం కావాలె. అందుకు తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలె. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.

-పూనమ్ ఐ కౌశిశ్
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్ (INFA)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య