అనుసంధానంపై అలసత్వమేల?


Sat,October 6, 2012 04:27 PM

అయిదు రాష్ట్రాల ఎన్నికల సంబరం ముగిసింది. ఫలితాలపై ఎవరికపూక్కలు వారు చెప్పుకొని సంతృప్తిపడుతున్నారు. నదుల అనుసంధానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుఈ ఎన్నికల కోలాహలంలో కలిసిపోయింది. ఫలితాలు వెలువడి ప్రజల హృదయాల్లో ఎవరి స్థానం ఏమిటో తేలిపోయిన తర్వాత, ఇకనైనా నదుల అనుసంధానంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.
దశాబ్దకాలంగా నదుల అనుసంధానంపై పెండింగులో ఉన్న ‘పిల్’పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల పంపకం సమస్యలు పరిష్కరించాలని సూచించింది. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. సత్వరమే నదీ జలాల సమస్యను, రాష్ట్రాల మధ్య ఉన్న పంపకం సమస్యలను పరిష్కరించకపోతే.. దేశం లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే.. నదు ల అనుసంధానంపై అత్యున్నత విధాన నిర్ణయక కమిటీని ఏర్పరిచి 2016 కల్లా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

జాతి ప్రయోజనాల దృష్ట్యా దీనిని వెంటనే చేపట్టి, పరిష్కరించాలని సూచించిం ది. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నీటి సమస్యను గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అభినందించతగ్గది. ఆహ్వానించతగ్గది. 21వ శతాబ్దంలోకి పరుగులు తీస్తున్నామని చెప్పుకుంటున్న తరుణంలో.. దేశం గుక్కెడు నీరు కోసం గుక్కపట్టి ఏడుస్తున్న తీరు అవమానకరం. రాజస్థాన్‌లోని 12 గ్రామాలకు నాలుగు రైళ్లతో తాగు నీరు అందిస్తున్నారు. దేశం లో పది నగరాలలో మూడు రోజులకొకసారి నీరందిస్తున్నారు. మరో 31 నగరాల్లో రెండు రోజులకొకసారి నీళ్లొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 116 మున్సిపాలిటీలలో 34 మున్సిపాలిటీల్లో మాత్రమే వారంలో రెండురోజులు గంటసేపు నీరు ఇస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలోని మూడు కోట్ల మందికి మంచినీరు ట్యాంకర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో 1200 ఫీట్ల లోతులో కూడా నీటి చుక్క లేదు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉండే చిరపుంజిలో కూడా ట్యాంకర్ల ద్వారానే మంచినీరు సరఫరా చేస్తున్నారు.

ఇలా దేశంలో ఏమూల చూసినా మంచినీటికోసం తహతహలాడుతున్నారు. దేశంలో నీటి వనరుల లభ్యత మూడు శాతం ఉంటే, జనా భా 17 శాతం ఉన్నది. గంగా, యమునా లాంటి స్వచ్ఛమైన జీవ నదులను పారిక్షిశామిక వ్యర్థాలతో కలుషితం చేస్తూ వాటిని చెత్త డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారు.
అధిక జనాభా కారణంగా కూడా తాగు నీటి సమస్య తలెత్తుతున్నదని నిపుణులు అంటున్నారు. అయితే రాజకీయ నేతలు మాత్రం నీటి సమస్యలతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతపూరాష్ట్ర కలహాలు ఎక్కువవుతున్నాయి. నదీ జలాల పంపకంపై దేశంలో అన్ని రాష్ట్రాల మధ్యన తగువులు ఎక్కువవుతున్నాయి. ఇవి నానాటికీ పెరిగిపోతూ న్యాయ, రాజకీయ పోరాటాలుగా మారుతున్నాయి. రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయమై తగాదాలు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ ఇష్టానుసారం నదులపై ప్రాజెక్టులు, నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ నదీజలాల పంపకం సమస్య లు వివిధ రాష్ట్రాల, రాజకీయ పార్టీల మధ్యనే కాకుండా, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కూడావస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా తగువులు వస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.


దురదృష్టవశాత్తూ అన్ని రాజకీయ పార్టీలు నదీ జలాల పంపకం విషయంలో సూత్రబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదు. పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం నదీజలాల పంపకాన్ని జటిలం చేస్తూ, సమస్యలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ జలాలకోసం ఆంధ్ర, కర్ణాటక మధ్య తగువు తలెత్తింది. అలా గే కావేరీ నదీజలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య, గోదావరి జలాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక మధ్య, నర్మదా జలాల కోసం మధ్యవూపదేశ్, గుజరాత్ రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. అంతపూరాష్ట్ర నదీజలాల పంపకం ట్రిబ్యునల్-1956 ప్రకారం ఇప్పటిదాకా అయిదు ట్రిబ్యునల్‌లు సమస్యలను పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. నీరు పై ఐదు ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. జల వనరుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, పట్టణాభివృద్ధి, అహార, పర్యావరణ శాఖలు నీటి యాజమాన్యం గురించి ప్రత్యేక శాఖలుగా పనిచేస్తున్నాయి. ఈ మంత్రిత్వ శాఖలతో నీటి యాజమాన్యం, పంపకం, నిర్వహణ సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా జటిలం అవుతున్నాయి. ప్రధానం గా వీటి మధ్య సమన్వయం లేక మరింత సమస్యాత్మకంగా తయారైంది.

ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమంటే.. జల వనరుల మంత్రిత్వ శాఖ అధ్యయనం ప్రకారమే.. 2025 నాటికి దేశంలోని 11 నదుల్లో నీటి కొరత ఏర్పడుతుందని తేలింది. దీంతో 90 కోట్ల ప్రాణులు నీటి కటకటతో సతమతమవుతాయి. పర్యావరణంలో తీవ్రమైన వినాశకరమైన మార్పులు సంభవిస్తాయి. దీంతో వాతావరణం లో వేడి గణనీయంగా పెరగడంతో పాటు, భూమి కూడా విపరీత కోతకు గురై ప్రజలు నిర్వాసితులవుతారు. నర్మదా ప్రాజెక్టు విషయంలో స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళన దీనిలో భాగంగానే జరుగుతోంది. ఈ పరిస్థితులను ముందే ఊహించిన అప్పటి ప్రభు త్వం ఐదవ పంచవర్ష ప్రణాళికలోనే 169 ప్రాజెక్టులు కట్టి ప్రజల నీటి సమస్యను తీర్చాలని సంకల్పించింది. కానీ ఈ ఆలోచనలు ఏమాత్రం ఆచరణరూపం తీసుకోలేదన్నది నేటి సమస్యలు చెప్పకనే చెప్తున్నాయి. నాడు చెప్పిన వాటిలో మెజారిటీ ప్రాజెక్టులు నిధులు లేవని నిలిచిపోగా.., మరికొన్ని చాలినన్ని నీళ్లు లేవని నిలిపేశారు.


ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తీవ్రతను గుర్తించి, సమస్య పరిష్కారానికి నిజాయితీగా కృషిచేయాలి. నీటిని జాతీయ సంపదగా గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం నదుల అనుసంధానంపై సురేష్ ప్రభు చైర్మన్‌గా ఓ టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. కానీ.. ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రభుత్వాలు, కోర్టు లు, ట్రిబ్యునల్‌లు ఇచ్చిన తీర్పులను నిజాయితీగా అమలు చేస్తే... నదీ జలాల పంపకం సమస్యలు ఉండకపో గా, రైతుల ఆత్మహత్యలు కూడా ఉండవు. అలాగే.. ప్రతి సంవత్సరం వస్తున్న వరదలు, కరువు, అనావృష్టి సమస్యలు కూడా తలెత్తవు.

బ్రహ్మపుత్ర, మహానది, గంగా, గోదావరి నదీ జలాలను కాలువల ద్వారా దక్షిణ భారతానికి మళ్లిస్తే.. దేశం సస్యశ్యామలం అవుతుంది. భూమి కోత, పర్యావరణ సమస్యలు తీరుతాయి. ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగి దేశ ప్రజల ఆహార సమస్య తీరుతుంది. అలాగే 40 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. నదుల అనుసంధానం వల్ల 16 కోట్ల హెక్టార్ల భూమి వ్యవసాయయోగ్యంగా మారి, 45 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నేడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు నదుల అనుసంధానమే సమాధానం. దీని ద్వారానే దేశాన్ని అభివృద్ధిమార్గంలో పయనింపచేయవచ్చు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలు నదుల అనుసంధానంతోనే అభివృద్ధిబాటన పయనిస్తూ.., సమస్యలను పరిష్కరించుకున్నాయి. మన దేశం కూడా ఆబాటలోనే నడిచినప్పుడే సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది.

చివరిగా సుప్రీంకోర్టు తన తీర్పుతో నదుల అనుసంధాన సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పెట్టింది. దీనిపై పాలకులు ఎలా స్పందిస్తారో! పాలకులు నదుల అనుసంధానం విషయాన్ని దేశ ప్రజల తక్షణావసరంగా గుర్తిస్తారా? జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పాలకులు ప్రవర్తిస్తారా? ఎంతకాలం నదులను కలుషితం చేస్తూ చెత్త డంపింగ్ యార్డులుగా మారుస్తారు? దేశ ప్రజల దాహార్తిని తీర్చడానికి యూపీఏ ప్రభుత్వం ఆచరణాత్మక ఆలోచన చేస్తుందా?

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య