చర్చలు సాగని చట్టసభలు


Wed,August 12, 2015 01:47 AM

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రకంగా పార్లమెంటు హాలును వీధిపోరాట కేంద్రంగా మార్చేశారు. దీన్నే రాజకీయంగా భావించే పరిస్థితి వచ్చింది. ఈ పరి స్థితిలోంచే వర్షాకాల
సమావేశాలు నిండా మునిగిపోయాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాలు, చట్టసభ్యుల బహిష్కరణలతో ముగింపుకు చేరుకున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు అరుపులు, కేకలతో కాలం వెల్లబుచ్చుతున్నారు. మొత్తంగా వర్షాకాల పార్లమెంటు ఎగువ, దిగువ సభ లు మునుపెన్నడూ లేనివిధంగా పార్టీల వ్యవహార శైలి పుణ్యమాని గందరగోళంతో నిండిపోయాయి. విలువైన చట్టసభల కాలమంతా మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణాల విషయంలో పట్టుబట్టిన కాంగ్రెస్, మెట్టుదిగని బీజేపీ కారణంగా పార్లమెంటు సమావేశాలు సస్పెన్షన్లు, వాయిదాలతో ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నార్థకం చేశాయి. చివరికి ఇరవై ఐదు కాంగ్రెస్ ఎంపీల ఐదు రోజుల బహిష్కరణతో పార్లమెంటు సమావేశాలే అనిశ్చితిలో మునిగిపోయాయి. రాజకీయ పార్టీల సంకుచిత ధోరణులతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య సౌధమే అభాసుపాలయ్యే పరిస్థితి ఏర్పడింది.

లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణాల విషయంలో బాధ్యులైన మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టి డిమాండ్ చేస్తున్నది. దీనికి ససేమిరా అంటున్న బీజేపీ అవసరమనుకుంటే ఏ చర్చకైనా సిద్ధమే కానీ రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ సభా కార్యక్రమాలను తీవ్రంగా అడ్డుకున్నది. దీంతో కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ ఆందోళనను మరింత ఉధృతం చేసింది. సోనియా గాంధీ ఈ పరిస్థితిని ఏకంగా బ్లాక్ డేగా అభివర్ణించారు. తనయుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. దీంతో ఎన్డీయేతర ప్రతిపక్ష పార్టీలు ఎన్‌సీపీ, డీఎంకే, తృణముల్ కాంగ్రెస్ పార్టీ లు కాంగ్రెస్‌కు మద్ధతు ప్రకటించాయి. అలాగే పార్లమెంటు సమావేశాల కు కాంగ్రెస్‌తో పాటుగా దూరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదం పొందాల్సిన అతిముఖ్యమైన బిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితికి ఏ ఒక్కరినీ నిందించలేని పరిస్థితి ఉన్నది. వ్యక్తికేంద్రంగా సాగుతు న్న పార్టీల కారణంగా ఈ పరిస్థితి దాపురించింది. ఎన్డీఏ అయినా, యూపీఏ అయి నా అటు నరేంద్ర మోదీ, ఇటు సోనియా గాంధీల చుట్టూ తిరగడమే చేస్తున్నాయి. సమష్టి నిర్ణయాలు, సమష్టి నాయకత్వం లేని పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజ లు ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా? ప్రజలు ఏ గురుతరమైన బాధ్యతతో పార్లమెంటుకు పంపారో ఈ పార్టీలు గుర్తిస్తున్నాయా? ఒక్క రోజైనా ప్రజల కోసం అర్థవంతమైన చర్చలు చేద్దామని అనుకుంటున్నాయా? పాలక మంత్రిమండలి నుంచి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రకటన అయినా ఇప్పించడానికి ప్రయత్నించా రా? లేదనే చెప్పాలి. ఇలా పార్లమెంటులో వైరి వర్గాలుగా విడిపోయి కలహించుకోవడం కంటే, సామరస్యంగా కలిసి చర్చించుకుంటే మంచిదనే విషయం అర్థం కాదా!

పార్లమెంట్ సభా సంప్రదాయాలు, నియమాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకే విధంగా ప్రవర్తించిన చరిత్ర ఉన్నది. ఇందులో రెండు పార్టీలూ ఒకే తానులోని గుడ్డలుగా ప్రవర్తిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సభా నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి 18 మంది సొంత పార్టీ సభ్యులను సస్పెన్షన్ చేసింది. తెలంగాణ విషయంలో సభాకార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని సస్పెండ్ చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో కూడా ప్రతిపక్ష సభ్యలు 56 మందిని సభ నుంచి గెంటివేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఈ విషయంలో బీజేపీ కూడా తక్కువేమీ తినలేదు. గతంలో బీజేపీ కోల్‌గేట్ కుంభకోణం విషయంలోనూ, 2జీ కుంభకోణం విషయంలోనూ బీజేపీ నాడు సభా కార్యక్రమాలను అడ్డుకున్నది. పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసింది. మహిళా రిజర్వేషన్ విషయంలోనూ బీజేపీ సభలను అడ్డుకున్నది. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. బీజేపీ అదే బాటలో నడిచి కాంగ్రెస్ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేసింది. ఇదే సందర్భంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా రాష్ట్ర హైకోర్టు విషయంలో పార్లమెంటులో ఆందోళనకు దిగినా సభాపతి కార్యకలాపాలకు ఆటంకం కలిగించలేదు.

ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు తమపై ఉన్న గురుతరమైన బాధ్యతలను గుర్తి స్తే మంచిది. కోట్లాది మంది ప్రజలు పన్నులు చెల్లించి, ఆ డబ్బుతో తమకు జీత, భత్యాలను చెల్లిస్తుంటే వారి కోసం చేయాల్సిన కర్తవ్యాలను మరువ రాదు. బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ వర్షకాల సమావేశాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా దాదాపు 70 కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. ఉభయ సభల్లో కలిసి గంటకు కోటీ యాభై లక్షల రూపాయల ఖర్చు అవుతున్నది. ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపి ప్రతి సభ్యుని దినవారీ ఖర్చుకో సం రోజుకు రెండువేల రూపాయల అలవెన్సు చెల్లిస్తున్నారు. వీటన్నింటినీ గుర్తించకుండా మెజారీటీ సభ్యులు ప్రజల తరఫున తమకు అందుతున్న రాయితీలను తమ జన్మహక్కుగా భావిస్తున్నారు.

పార్లమెంటు జరుగుతున్న తీరు అందరికీ జుగుప్సను కలిగిస్తున్నది. ప్రజాస్వా మ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నది ఇందుకేనా అని అనిపిస్తున్నది. దీనికి వ్యక్తులను తప్పు పట్టి లాభం లేదు. దీనికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలి. పార్టీలన్నీ తమ కార్యాచరణను సమీక్షించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల విధులను, బాధ్యతలను గుర్తించాలి, గౌరవించి నడుచుకోవాలి. నిజానికి ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. దేశం ఇవ్వాళ ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలు, సామాజిక అశాంతి, పెరుగుతున్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాల నేపథ్యంలో ప్రజాప్రతనిధులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. సమస్యల పరిష్కారానికి శాంతియుత చర్చల ద్వారా సమాధానాలు వెతకా లి. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడాలి. విచ్ఛిన్నకర కార్యకలాపాలను సంఘటితంగా ఎదుర్కోవాలి. అలా కాకుండా సభా కార్యక్రమాలే జరుగకుండా పక్కదారి పట్టిస్తే అంతిమంగా అది ప్రజలకు, ప్రజాస్వామ్యానికే తీవ్ర నష్టం.

దురదృష్టవశాత్తూ.. ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్ద పీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రకంగా పార్లమెంటు హాలును వీధిపోరాట కేంద్రంగా మార్చేశారు. దీన్నే రాజకీయంగా భావించే పరిస్థితి వచ్చింది. ఈ పరి స్థితిలోంచే వర్షాకాల సమావేశాలు నిండా మునిగిపోయాయి. మొండి పట్టుదల, సంఖ్యా బలంతోనే అంతా సాధిద్దామనే ధోరణితో వ్యవహరిస్తున్న పార్టీల తీరులోనే అసలు సమస్య ఉన్నది. ఈ పరిస్థితి ఇలానే ఉంటే పార్లమెంటుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే ప్రమాదమున్నది. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటు ఉన్నతిని, గౌరవాన్ని కాపడాలి. పార్లమెంటుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులే కానీ ప్రభువులు ఎంతమాత్రమూ కాదు. ఇదే ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన విషయం. దీన్ని మన ప్రజా ప్రతినిధులు ఎంత తొందరగా తెలు సుకుంటే అంత మంచిది. ఈ క్రమంలోనే అటు మోదీ కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ తమ సంఖ్యాబలాలే అంతిమం కాదని, అందులో ప్రజలు, ప్రజల ఆకాంక్షలు కూడా ఇమిడి ఉన్నాయని గుర్తించాలి. ఇదే మన ప్రజాస్వామ్యానికి రక్ష.

697

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles