తెలంగాణ ఏర్పాటు-పాఠాలు


Thu,February 6, 2014 12:15 AM

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భారత మొట్టమొదటి హోం మంత్రి సర్దార్ పటేల్ అన్నారు. పటేల్ ఏ సమస్య గురించి అన్నా.. అది ఇప్పుడు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ఏర్పాటు గురించి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేక ఆటంకాలను, చిక్కులను ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ వెనక్కి పంపారు. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధుల నుంచి తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రతిఘటన, వ్యతిరేకత ఒకవైపు ఉంటే, తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రాష్ర్టా న్ని ఏర్పాటు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితికి నెట్టబడింది యూపీఏ ప్రభు త్వం. ఇరు ప్రాంతాల్లో పార్టీ నష్టపోకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల ని చేసిన ప్రయత్నాలన్నీ వ్యతిరేక ఫలితాలనే ఇచ్చినట్లు కనిపిస్తున్నది. స్వయాన ముఖ్యమంత్రే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కడం చేస్తుంటే.. ప్రజాప్రతినిధులూ వంతపాడుతున్నారు.

ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు తమ తమ ప్రాంతాల వారీగా చీలిపోయి ఉద్యమాలకు దిగుతున్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పుకుంటూ.. హై కమాండ్ నిర్ణయాలను ధిక్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏమీ చేయలేని స్థితిలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ పరిస్థితినంతా తన కు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రాజకీయంగా తన శక్తి, యుక్తుల ను ప్రయోగించి రాజకీయ వాతావరణాన్ని తెలంగాణకు అనుకూలంగా మార్చేస్తున్నాడు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో టీ బిల్లును వెనక్కి పంపిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్లమెంటులోనూ అదే దూకుడుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టకుండా ఎత్తుగడలమీద ఎత్తుగడలు వేస్తున్నారు. సభల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టకుండా ఉభయసభల్లోనూ గందరగోళం సష్టించి సభలు వాయిదా పడేలా చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు శిబిరాలుగా చీలిపోయి ఢిల్లీలో ఉద్యమాలతో వేడి పుట్టిస్తున్నారు. ఎవరెన్ని ఎత్తులు, జిత్తులు వేసినా 12 రోజులు నడిచే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ అంశం తేలిపోనున్నది.

అయితే జాతీయస్థాయిలో ప్రధాన వైరి పక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అంశంతో లబ్ధిపొందేందుకు పావులు కదుపుతున్నాయి. తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుపై తామంటే తామే చిత్తశుద్ధితో ఉన్నామని చాటుకునేందు కు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదని, స్వంతపార్టీ నేతలనే ఒప్పించే స్థితిలో లేకుండా తన నైజాన్ని చాటుకుంటున్నదని బీజేపీ విమర్శిస్తున్నది. కాంగ్రెస్ వెనకడుగు వేసినా తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటిస్తున్నది. అయితే.. కాంగ్రెస్ తనదైన వ్యూహంతో జరుగుతున్న పరిణామాలను చూస్తూనే మెల్లగా అడుగుదీసి అడుగు వేస్తున్నది.

అయితే.. స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అన్న సిద్ధాంతానికి బలం చేకూర్చే విధంగా దేశంలో అనేక చిన్న రాష్ర్టాల ఏర్పాటు ఉదాహరణలుగా ఉన్నాయి. దేశంలో అతి పెద్ద రాష్ర్టాలుగా ఉన్న ఉత్తర భారత రాష్ర్టాలు అనేక సమస్యల తో, పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్నాయి. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ప్రజల ముంగిట పాలన అన్న నినాదానికి అనుగుణంగా చిన్న రాష్ర్టాల పాలనా తీరు ఎన్ని లోపాలున్నా మంచి ఫలితాలిచ్చిన ఉదంతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వతంత్ర భారతావణిలో ఆరుదశాబ్దాల అనుభవం చెబుతున్నది చిన్నరాష్ర్టాలతోనే మంచి ఫలితాలున్నాయని చాటుతున్నాయి. అభివద్ధిలో, పాలనా పరమైన సౌలభ్యాలలో చిన్న రాష్ర్టాలే ఆదర్శంగా ఉన్నాయి. ఈ క్రమంలోంచే.. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్‌నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్‌నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు ఏర్పడ్డాయి. దీనికనుగుణంగానే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలు కూడా గతంలో ఏర్పడ్డాయి.

మరో విధంగా చూస్తే.. అస్సాంలోని ఒక జిల్లా నాగాలాండ్, మిజో రం రాష్ర్టాల కంటే పెద్దదిగా ఉన్నది. అయితే అన్ని సమస్యలకు చిన్న రాష్ర్టాల ఏర్పాటే సమాధానమని చెప్పే పరిస్థితి కూడా లేదు. అలాగే రాష్ర్టాన్ని విభజించి చిన్న రాష్ర్టాలు చేసిన తర్వాత కూడా ఇరు రాష్ర్టాల మధ్య దీర్ఘకాల సమస్యలుగా మిగిలిపోయిన ఉదంతాలూ ఉన్నాయి. పంజాబ్, హర్యానా రాష్ర్టాలు రెండూ చండీగఢ్ తమకే చెందుతుందని వాదించుకుంటున్నాయి. అది ఒక తెగని పంచాయితీగా పీటముడిగామారి కూర్చున్నది. సరైకల, ఖర్సూన్ ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని ఒడిషా ఎప్పటినుంచో పోరాడుతున్నది. అసోం, మణిపూర్ రాష్ర్టాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలు తమ రాష్ట్రంలో కలపాలని నాగాలాండ్ అంటున్నది. జార్ఖండ్‌లో కలిపిన ఖనిజవనరులున్న ప్రాంతాలను కొన్నింటిని తమ రాష్ట్రంలో కలపాలని బీహా ర్ కోరుతున్నది. అలాగే ఆంధ్రా-తమిళనాడు, తమిళనాడు-కర్నాటక, పంజాబ్- హర్యానా రాష్ర్టాల మధ్య అంతర్‌రాష్ట్ర వివాదాలు ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణకు తోడు దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతీయ ఉద్యమాలు ఉన్నాయి.

తమకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని పోరాడుతున్నాయి. మహారాష్ట్రలో విదర్బ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌నుంచి హరిత ప్రదేశ్, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ఏర్పాటుకోసం ఈశాన్య ఉత్తర ప్రదేశ్ లో పోరాటాలు, కర్ణాటక నుంచి కొడగు, అసోంనుంచి బోడోలాండ్, కశ్మీర్‌నుంచి లఢక్, మేఘాలయ నుంచి గారోలాండ్, ఉత్తర బీహార్ ప్రాంతంలో మైథిలాంచల్,పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్ పోరాటాలు ఉండనే ఉన్నా యి. ఈ పోరాటాలన్నీ తమ ప్రాంతీయ ఆకాంక్షలను చాటుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సమస్య మూలాల్లోకి పోయి నిజమైన పరిష్కారాలను వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రాంతీయ ఉద్యమాలు, చిన్న రాష్ర్టాలు కొందరి అధికార దాహం తీర్చేందుకోసమో, జాగీర్దార్‌లకోసమో ఎంతమాత్రమూ కాకూడదు. అలా చేస్తే.. దీర్ఘకాలికంగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లడమే గాక, దేశం అస్థిర పాలవుతుంది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రంలోని కాంగ్రె స్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఆచితూచి అడుగేసి సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయాలి. తెలంగాణ ఏర్పాటు సమస్య పరిష్కారం కోసం చేసిన మంచి ముందడుగుగా ఉండాలి. ఇది దేశ ప్రజలందరి ఆశ, ఆకాంక్ష.
-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

213

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Published: Sat,October 6, 2012 04:26 PM

కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమా?

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. అదొక సోమరిపోతుల రాజ్యం. యూపీఏ ప్రభుత్వం యావత్తు నిద్ర మత్తులో జోగుతున్నది. తా

Published: Sat,October 6, 2012 04:26 PM

విద్యాహక్కు చట్టం చేస్తే చాలా?

మన పాలకులు విద్యాహక్కు చట్టాన్ని చేసి ఏదో సాధించినట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఏమి సాధించారు? ప్రభుత్వం చెబుతున్నట్టు విద్యాహక్కు

Published: Sat,October 6, 2012 04:27 PM

అనుసంధానంపై అలసత్వమేల?

అయిదు రాష్ట్రాల ఎన్నికల సంబరం ముగిసింది. ఫలితాలపై ఎవరికపూక్కలు వారు చెప్పుకొని సంతృప్తిపడుతున్నారు. నదుల అనుసంధానంపై సుప్రీంకోర్టు