రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?


Sat,October 6, 2012 04:29 PM

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధానికి లేఖ రాయించిన తర్వాతే తమ వద్దకు రావాలని ఆ నేతలకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది.

Chandhra-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాల ను సైతం బలిపెడుతుంటే, కొందరు స్వార్థ రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు అనుసరిస్తున్న రాజకీయ వైఖరి ఈ కోవకే చెందుతుంది. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశంపార్టీ ఎన్నికల ప్రణాళికలో రాసుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. ఈ కారణంగానే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి టీడీపీకి చెందిన 39 మందిని శాసనసభ్యులుగా, ఇద్దరిని పార్లమెంటు సభ్యులుగా గెలిపించిన సంగతి తెలిసిందే. నమ్మిన పార్టీ తమను నట్టేట ముంచినందుకే ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రజావూపతినిధులు రాజీనామా చేయాలని కోరారు. ప్రజల కోరికను ఇంతకాలం లక్ష్యపెట్టని దేశం నేతలు తప్పని పరిస్థితులలో ఇప్పు డు రాజీనామాలు చేసి, ప్రజల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నా రు. ప్రజలు వీరి రాజీనామాలను స్వాగతించినంత మాత్రా నా తమ భుజాలపై పెట్టుకుని ఊరేగిస్తారని, పార్టీకి పూర్వవైభవం తేవచ్చునని దేశం నేతపూవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుంది.

చంద్రబాబునాయుడు కుట్రలను అర్థం చేసుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కొన్ని పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నందునే డిసెంబర్ 23, 2009 ప్రకటన వెలువరించవలసి వచ్చిందని కేంద్ర హోంమంత్రి అనేకసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వైదొలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం. పైగా ఆంధ్రలోని టీడీ పీ నాయకులు తెలంగాణ ప్రక్రియ ను అడ్డుకుంటూ ‘కిరాయి’ ఉద్యమాలను కూడా నడిపారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు న్న కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకతే ఈ పరిస్థితికి కారణం. టీడీపీ వైఖరిని సాకుగా చూపెట్టి కేంద్రం ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్నది. ఫలితంగా సుమా రు ఆరువందలకు పైగా అమాయక పిల్లలు, యువతీయువకులు బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలకు ఏ మాత్రం సోయి ఉన్నా ఆనాడే చంద్రబాబు చెరను వీడి బయటకు రావలసింది.

ఏ కారణంతో తెలంగాణ ఏర్పా టు నిలిచిపోయిందో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. తమ పార్టీ వైఖరిని మార్చుకోకుం డా, చంద్రబాబుతో తెలంగాణకు సానుకూల ప్రకటన చేయించకుండా తెలుగుదేశం తెలంగాణ ప్రతినిధులు కేవలం తమ పదవులకు రాజీనామాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తమ పార్టీకి ‘చిత్తశుద్ధి’ ఉన్నదని ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ అనడం ఎవరిని నమ్మించడానికి? చిత్తశుద్ధి ఉంటే టీడీపీ అధినేతతో తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఒక లేఖను ప్రధానికి రాసి పంపించవచ్చు కదా!

చంద్రబాబు ఆదేశాలతోనే తాము రాజీనామాలకు సిద్ధమైనామని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ మాత్రం దాపరికం లేకుండా ప్రకటించారు. అంటే తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకన్న తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు ప్రయోజనాలే తమకు ముఖ్యమని టీడీపీ తెలంగాణ నేతలు తేటతెల్లం చేశారు. ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు వీరిని రాజీనామా చేయమన్నట్లు? రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోకుండా దేశం సభ్యుల రాజీనామాలు కాపాడుతాయి. వీరి రాజీనామాలను ఇప్పుడెవరూ కోరలేదు. అయినా చేశారు. ఈ చర్య ఆంధ్రవూపాంత టీడీపీ నేతలను, ప్రజావూపతినిధులను రెచ్చగొట్టడానికేననేది స్పష్టం. తాజా పరిణామాలు కూడా దీన్నే సూచిస్తున్నాయి. మరోసారి ఆంధ్రవూపాంతంలో తెలంగాణ పట్ల వ్యతిరేకతను రాజేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణ టీడీ పీ ప్రజావూపతినిధులచే రాజీనామాలు చేయించి ఇరవైనాలుగు గంటలు గడవకముందే ఆంధ్ర టీడీపీ ప్రజావూపతినిధులను కూడా రాజీనామా చేయమనడం మోసపూరిత ఎత్తుగడే అవుతుం ది. అంతేతప్ప దేవేందర్‌గౌడ్ అన్నట్లు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఏ మాత్రం కాదు.

కొంత కాలంగా ఆంధ్రవూపాంతంలో కిరాయి ఉద్యమాలు కూడా సాగడం లేదు. అంటే ఆప్రాంతంలో తెలంగాణ ఏర్పా టుకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రజలు ఏ మాత్రం సుముఖంగా లేరు. అందువల్లనే తెలంగాణ ప్రజా ప్రతినిధులచే రాజీనామాలు చేయించి ఆంధ్రలో అగ్గి రాజేసే కుట్రలకు ఆంధ్రబాబు అంకురార్పణ చేస్తున్నారు. ఈ విషయంలో సీమాంవూధలోని కాంగ్రెస్‌నాయకుల కన్నా దేశం నేతలే ముందున్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ద్వంద్వ విధానాలకు, రెండు కళ్ల సిద్ధాంతానికి తెరదించవలసిన సమయం ఆసన్నమైంది. రాజీనామాల ద్వారా చంద్రబాబు ఆశించిన మరో ప్రయోజనం: తెలంగాణ జిల్లాల్లో ఇంతకాలం దేశం నేతలను ప్రజలు తిరగనివ్వలేదు. రాజీనామాలు చేసి వెళితే ప్రజల్లో వ్యతిరేకతే ఉండదు కాబట్టి ‘జై తెలంగాణ’ అంటూ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జాక్) కార్యక్షికమాల్లో చురుగ్గా పాల్గొంటున్న దేశం కార్యకర్తలను తిరిగి తమ ‘దారి’కి తెచ్చుకోవచ్చ ని, తద్వారా పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చుకోవచ్చుననేది టీడీపీ నాయకుల వ్యూహం.

బస్సుయావూతతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిల దీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధానికి లేఖ రాయించిన తర్వాతే తమ వద్దకు రావాలని ఆ నేతలకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో కుట్రలు చేస్తున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం లేదు. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేతపై తీవ్రమైన ఒత్తిడి తేనంత వరకు చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోరు. సమైక్యవాదమో, తెలంగాణనో ఏదో ఒకటి తేల్చుకోవాలని, తెలంగాణకు సానుకూలంగా నిర్ణ యం తీసుకోకుంటే నాగం బృందం పార్టీ వీడినట్లే తాము కూడా అదే దారిలో వెళ్తామని అధినేతకు ఈ ప్రాంత టీడీపీ ప్రజావూపతినిధులు, నాయకులు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు డైరెక్షన్‌లో వ్యవహరించినంత కాలం తెలంగాణ తెలుగుదేశం నేతపూవ్వరినీ ఈ ప్రాంత ప్రజలు నమ్మరు. తమ గ్రామాల్లో అడుగుపెట్టనివ్వరు.

-విపకాశ్
పొ.జయశంకర్ తెలంగాణ ఆర్ అండ్ డి సెంటర్)

35

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ