సామాన్యుని బడ్జెట్


Sat,March 25, 2017 11:53 PM

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర్కిస్టులుగా మారిపోయారు. ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుల వృత్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి 152 రోజుల పాదయాత్ర అనంతరం పెట్టిన సభలో ఏమి మాట్లాడారో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు టీవీ లో చూసేవారు, మరునాడు పేపర్లో చదువగలిగే వారు ఐదు శాతం మంది మాత్ర మే. వారిలోనూ ఆసక్తి ఉన్న వాళ్లే బడ్జెట్ గురించి మాట్లాడుకోవడం గతంలో కనిపించేది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పాలనకు భిన్నంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ల పట్ల నిరక్షరాస్యులైన పేద ప్రజలు కూడా ఆసక్తి చూపు తున్నారు. పేద సామాజిక వర్గాలు మాకు ఏం వచ్చాయని ఆసక్తిగా చూసే పరిస్థితి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో 91 శాతానికి పైగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గా ల ప్రజలే ఉన్నారు. ఈ వర్గాలను 60 ఏళ్లలో సీమాంధ్ర పాలకులు ఓటుబ్యాంకుగానే చూశారు తప్ప వారి అభ్యున్నతికి కృషి చేయలేదు. గడిచిన 20 ఏళ్లలో పదేళ్లు టీడీపీ, మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిన కాలంలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రమైన చేతివృత్తులు కనీవిని ఎరుగని రీతిలో ధ్వంసమయ్యాయి. చేతి వృత్తులు నాశ నం కావడమంటే పూర్తిగా బీసీల జీవనం అస్తవ్య స్తం కావడమే. తెలంగాణ ఉద్యమ సమయంలో నూ సీఎం కేసీఆర్ మన రాష్ట్రం మనకు రాగానే కులవృత్తులకు మళ్లీ జీవం పోస్తామని పదేపదే చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయ పద్ధతులను పరిరక్షించుకుంటూనే కొంత టెక్నాలజీని జోడించి మళ్లీ కులవృత్తులను నిలబెట్టాల ని కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటివరకూ ఏ పాలకులు పట్టించుకోని అత్యంత వెనుకబడిన వర్గాల వారి జీవితాలను తీర్చిదిద్దడానికి కేసీఆర్ తీసుకున్న మరో అద్భుత నిర్ణయం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు. ఎన్నో సంచార జాతులు.. ఉదాహరణకు పింజర, పిచ్చకుంట్ల, దాసరి, మందెచ్చుల, బాలసంతులు, బయటి గుడిసెల వారు.. ఇలా అనేక జాతుల వారు ఎక్కడ ఉం టారో, ఎక్కడ తిరుగుతారో, ఎక్కడ తింటారో కూడా తెలియదు. ఆ కులాలకు చెందినవారు అసెంబ్లీ మెట్లు ఎక్కడం కాదుకదా ఓట్లు వేసిన దాఖలాలు కూడా లేవు. కానీ మన ముఖ్యమం త్రి ప్రతి కార్యక్రమానికి ఎన్నికలకు లింకు పెట్టకుండా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ సంక్షేమ పథకాలు అందుకోవాలని ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలో కులవృత్తులను నిలబెట్టే వరుస నిర్ణయాలు కూడా బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్నవే. ఇందులోభాగంగానే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మిషన్‌కాకతీయ పథ కం ద్వారా పునరుద్ధరణ పూర్తయిన చెరువులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. చెరువుల పునరు ద్ధరణతో ఒక్క వ్యవసాయరంగం మాత్రమే కాకుండా వ్యవసాయాధారిత కులవృత్తులు కూడా ప్రాణం పోసుకోవాలని ప్రభుత్వం తలపించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కూడా మత్స్యకారుల సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ.101 కోట్లు కేటాయించి వారి అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇందులో భాగంగానే దాదా పు రూ.50 కోట్ల రూపాయల విలువైన చేప పిల్లలను ఆ చెరువుల్లో వదిలి మత్స్యకారుల జీవితా లు నిలబెట్టే ప్రయత్నం చేసింది. చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా ఒక్క చేపల పెంపకంపైనే ఒక రోజంతా అసెంబ్లీలో చర్చించి వారు గర్వపడేలా ప్రభుత్వం వ్యవహరించింది. మత్స్యకారుల వృత్తిని ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చెప్పడమే కాకుండా చేపలు పట్టుకోవడానికి అవసరమై వలలు, పడవలు, ఇతర పనిముట్లను ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇవ్వడం ద్వారా మత్స్యకారు ల్లో నమ్మకం కలిగించింది. అలాగే రాష్ట్రంలో ప్రముఖంగా చెప్పకోదగింది గొల్ల, కురుమల సామాజిక వర్గం. రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి నాలుగు లక్షల యాదవ కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వారందరికీ తగిన తోడ్పాటునందించి గొర్రెల పెంపకం వృత్తిని రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా మార్చాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నది. ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలు, ఒక గొర్రెపోతును కలిపి ఒక యూనిట్‌ను మంజూరు చేయాలని, ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భారతీయ సంస్కృతికి సజీవ సాక్ష్యమైన చేనే త వృత్తికి పునరుజ్జీవం ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న ది. ఉమ్మడి పాలకుల హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో అంతమంది చేనేత కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నా రు. చేనేతలు అధికంగా ఉండే సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన పాపం సీమాంధ్ర పాలకులది. ఒక వైపు రాష్ట్రం రావాలని బలమైన కాంక్షను విస్తరింపజేస్తూ మరోవైపు కనుమరుగవుతున్న, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు జీవితంపైన భరోసా కల్పించడానికి బాధ్యతను భుజాన వేసుకున్న నాటి సామాజిక కార్యకర్త కేసీఆర్ గారు, టీఆర్‌ఎస్ పార్టీ యంత్రాంగం భిక్షమెత్తి భూదాన్‌పోచంపల్లిలోని కొన్ని కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. అప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుబ్బాక, సిరిసిల్ల, భూదాన్‌పోచంపల్లి, కోకొయ్యలగూడెం, సంస్థాన్‌నారాయణపురం, పుట్టపాక తదితర ఆరు గ్రామాల చేనేత కార్మికులను కాపాడుకునే ప్రయత్నం జరిగింది. ఆ కార్యక్రమాలన్నిటికీ పార్టీ కార్యకర్తగా నాతో పాటు సాయమందుకున్న కుటుంబాలే కాక తెలంగాణ సమాజం నిలువెత్తు సాక్ష్యం. స్వరాష్ట్రం వచ్చి టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగానే చేనేతల సంక్షేమంపై ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది.

ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలతో అట్టుడికి న సిరిసిల్ల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌కే చేనేత శాఖను అప్పగించారు. మంత్రి కేటీఆ ర్ చేనేత రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు ధరిద్దామంటూకేటీఆర్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. సినీతారలు. వివిధ రంగాల ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారులు చేనే త వస్ర్తాలు ధరిస్తూ చేనేతకు తగిన చేయూతనిస్తున్నారు. దీంతో గతంలో రోజు నాలుగైదు లక్షల రూపాయలు కూడా మించని చేనేత వస్ర్తాల విక్రయాలు ఇప్పుడు రూ.12 లక్షలకు పెరిగాయి. చేనేత రంగంలోని ప్రతి వ్యక్తికి నెలకు రూ.15-20వేల ఆదాయం రావాలని ఇప్పటికే కేసీఆర్ ఉన్నతాధికారుల సమీక్షలో నిర్దేశించారు. చేనేత కార్మికుల రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో చేనేతకు రూ. 1200కోట్లు కేటాయించడం గొప్ప విషయం.

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర్కిస్టులుగా మారిపోయారు. ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కుల వృత్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి 152 రోజుల పాదయాత్ర అనంతరం పెట్టిన సభలో ఏమి మాట్లాడారో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణను గొప్ప సంక్షేమ రాష్ట్రంగా ముందు కు నడుపుతున్న కేసీఆర్‌ను అభినందించడం తమ్మినేని అబద్ధాలకు చెంపపెట్టు.
(వ్యాసకర్త, టీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు)
Karne-prabhakr

1117

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య