అసలు నిజాలు దాచిన అసర్


Thu,January 22, 2015 02:15 AM

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా పాఠశాల విద్యావ్యవస్థలో ప్రమాణాల మీద వెలువరిస్తున్న వార్షిక విద్యా నివేదిక-2014(ASER-Annual status of education report) దిగజారుతున్న విద్యా ప్రమాణాల విషయంలో అసలు నిజాలను విస్మరించిందనిపిస్తున్నది. ప్రతి ఏటా శాంపిల్ సర్వే లాగా దాదాపు దేశ వ్యాప్తంగా 577 జిల్లాల్లో జిల్లాకు ఎంచుకున్న 30 ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో సర్వే నిర్వహించింది.

దేశ వ్యాప్తంగా సర్వే జరిపిన 15వేల పాఠశాలల్లో 8,844 ప్రాథమిక, 6,362 ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుల్లో నాణ్యత తగ్గుతున్నదని స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం జరిగే సర్వేలో భాగంగా జరిపిన అసర్ నివేదిక తను ఎంచుకున్న పాఠశాలల్లో గణితం, తెలుగు, ఆంగ్లంలో, ఇతర రాష్ర్టాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో చదువుల్లో సర్వే నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఉమ్మడిగా జరిపిన సర్వేలో రెండవ తరగతి చదివే విద్యార్థులు 1 నుంచి 10 అంకెలను గుర్తించలేకపోతున్నారని, 5వ తరగతి వరకు విద్యార్థులు (174-57, 63-27, 58-49) లెక్కలను, 8వ తరగతి విద్యార్థులు మూడంకెల సంఖ్యను ఒక అంకెతో భాగహారం చేయడంలో విఫలం చెందారని తెలిపింది. అట్లాగే తెలుగులో వీణ,కాకి, ఫలం, మేక, దోమ, పాము, ఆమె, శుభం,బడి, నేల వంటి పదాలను చదవడంలో కూడా వైఫల్యం చెందారని గుర్తించింది.

ఆంగ్లంలో dog, fat, cup, boy, out, box లాంటి పదాలను గుర్తించలేక కనీసం 5వ తరగతి వరకు ఆల్ఫాబెట్స్‌ను గుర్తించడంలో స్పష్టత లేదని కూడా తెలిపింది. 8వ తరగతి స్థాయి వరకుకూడా చిన్న చిన్న ఇంగ్లీషు వాక్యాలను కూడా చదివి, అర్థం చెప్పడం కూడా సాధ్యం కాలేదని నివేదికలో పొందు పరిచింది. ఈ ఫలితాలను వెల్లడించడానికి ప్రథమ్ సంస్థకు తన పరిశీలనకు ఎంచుకున్న విధానం కానీ, పరిశోధన తీరును కానీ తప్పు పట్టవలసింది లేదు. కానీ పరిశీలనలో కేవలం ప్రమాణాలను చూసి, గుర్తించవలసిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని అనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో ఎస్‌సీఆర్‌టీ కూడా నేడున్న అనేకానేక ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో కూడా కనీస ప్రమాణాలు కొరవడ్డాయని గుర్తించింది.

ఇవ్వాళ.. అనేక ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలల్లో కనీస వసతులు లేవ ని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 70శాతం పాఠశాలలకు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆటస్థలాలు, మధ్యాహ్న భోజనం సరిగ్గా లేవని నిర్ధారించింది. అట్లాగే తరగతికో గది, టీచర్ లేని పాఠశాలలు 30శాతం దాకా ఉన్నాయని, ఐదు తరగతులు ఒక్కరు లేదా ఇద్దరితో నడిచే ప్రాథమిక పాఠశాలలే అత్యధికమని ప్రథమ్ నివేదిక గుర్తించలేకపోయింది. ఇద్దరు, ముగ్గురు టీచర్లతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఆంగ్లం, తెలుగు, గణితంలో కూడా కనీస ప్రమాణాలు లేకపోవడానికి అసలు ప్రాథమిక విద్యారంగంలో కొనసాగుతున్న అపసవ్య విధానాలను గూర్చి చర్చించకపోవడం అన్యాయం.

70శాతం మాత్రమే మౌఖికంగా గుర్తించిన హాజరు శాతం, వాస్తవ రూపంలో ప్రతిరోజు పాఠశాలకు అనేక కారణాల రీత్యా పాఠశాలకు రాలేకపోతున్న పిల్లల అవసరాలను గుర్తించాలి. తెలుగు రాష్ర్టాల్లో దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు, ఉప విద్యాశాఖాధికారుల నియామకాల పట్ల అలసత్వం, ముందుకు సాగని కామన్ సర్వీస్ రూల్స్ తదితర అంశాల ను గుర్తించ వలసి ఉన్నది. ప్రాథమిక విద్యారంగం ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగవలసి ఉన్నది. అది మాతృభాషలో పూర్వ ప్రాథమిక దశనుంచి పాఠశాల, కళాశాల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కేజీ టూ పీజీ విధానాన్ని అమలు చేయాలె.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయాయన్న ప్రథమ్ సంస్థల్లాంటి ప్రచారాలు అబద్ధం చేయడానికి కామన్‌స్కూల్ విధానాన్ని, నైబర్‌హుడ్ పాఠశాల వ్యవస్థగా అమలుకు సిద్ధపడాలె. ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ అంటున్నట్లు అమీన్ హో యా గరీభ్ హో సబ్‌కో సమాన్ శిక్షా అమలు చేయాలి. అత్యున్నత సీఎం, సచివాలయం నుంచి గ్రామ సచివాలయం దాకా ఏ అధికారి, ఉద్యోగి టీచర్ పిల్లలైనా, గ్రామీణ రాజకీయ నాయకుల నుంచి అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం ద్వారా ప్రజలకు హామీ ఇవ్వాలి. అట్లాగే విద్యాహక్కు చట్టం కనీస వసతుల పట్ల సూచించిన మంచినీరు, టాయ్‌లెట్స్, ఆట స్థలాలు, గ్రంథాలయాలు, సైన్స్ కంప్యూటర్ ల్యాబ్‌లతో, కరికులర్ కో కరికులర్ అంశాలు సమ్మేళనంగా పాఠశాల విద్యా ప్రణాళిక అమలుకు సిద్ధపడాలి.

తరగతి గది బ్లాక్ బోర్డ్, టీచర్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, శిక్షణలు, పర్యవేక్షణలు ఫలితాలు, సిసిఇ అమలుతీరు పాఠ్యాంశాల రూపకల్పన తదితర అంశాలన్నింటిని పరిశీలించాలి. గ్రామీణ ప్రాం తాల్లో చాలాచోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు, టీచింగ్ గ్రాంట్ టీచర్లకు అందని అంశాలతో పాటు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే పర్యవేక్షణ విషయాలను పరిశీలించి ఉంటే బాగుండేది. కనీసం విద్యా సంవత్సరంలో ఒక్కసారైనా మండల విద్యాధికారి, జిల్లా విధ్యాధికారి ఐదేళ్ళలో ఒక్కసారైనా పాఠశాలను సందర్శించకపోతే బాధ్యులు ఎవరు? పెరిగిపోయిన బాధ్యతారాహిత్యంతో, లాభాపేక్షతో నెలకొల్పిన విద్యాసంస్థలు రాజ్యాంగ వ్యతిరేకమని తెలిసినా నియంత్రించలేని అధికార, ప్రభుత్వ విధానాలు సమీక్షించాలి. ప్రైవేటీకరణను నియంత్రించడం ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయాలి.

దీనికితోడు ప్రాథమిక దశలో అంగన్ వాడీలను బలోపేతం చేయడం స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలి. అట్లాగే 6 -14 సంవత్సరాల పరిధిని జీరో నుంచి 18 ఏళ్లకు పెంచాలి. పూర్వ ప్రాథమిక దశలోనే విద్యార్థి, శారీరక మానసిక ఎదుగుదలకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మెజారిటీ విద్యార్థులు పౌష్ఠికాహార లోపం విద్యాభ్యాసానికి నిరాసక్తత కారణమౌతున్నది. అందుకే ఉదయం పాలు, మధ్యాహ్నం మెరుగైన భోజనం, మంచినీళ్ళు, సాయంత్రం బ్రెడ్, అరటి పండులాంటి ఆహారంతో పాటు విద్యార్థి అభ్యసనానికి అవసరమైనవన్నీ ఉచితంగా అందించాలి.
ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా కొనసాగుతున్న హాస్టల్స్ అనేక సమస్యలతో నరక కూపాలుగా కొనసాగుతున్నవి. పాఠశాల స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయి కార్యాలయాల వరకు అవినీతి రాజ్యమేలుతున్నది. ఇట్లాంటి విధానాలను రూపుమాపాలి.

అన్నింటికన్నా ముఖ్యంగా ప్రథమ్ డైరెక్టర్ రుక్మిణి బెనర్జీ అన్నట్లు మిస్ మ్యాచింగ్ ఆఫ్ సిలబస్ అండ్ చిల్డ్రన్స్ ఎబిలిటి పట్ల చర్చించాలి. విద్యార్థుల సామర్థ్యాలకు భిన్నంగా, కొనసాగుతున్న సిలబస్, నిరంతర సమగ్ర మూల్యంకనం (సిసిఇ) గూర్చి ప్రధానంగా ఆలోచించవలసి ఉంది.

కనీస సామర్థ్యాలు లేని పిల్లలు ప్రతి సంవత్సరం ఒక తరగతి నుంచి మరొక తరగతి లోనికి పంపబడుతున్నారు. అట్లా ఐదవ తరగతి వరకు ఒక్కరో ఇద్దరో టీచర్లతో ఏదో ఒక సబ్జెక్టు లేదా రెండు సబ్జెక్టుల్లో సంపూర్ణత సాధించకుండా మల్టీగ్రేడ్ టీచింగ్ పేరిట కనీస సామర్థ్యాలకు దూరం చేయబడ్డ పిల్లలకు, ఒకటో తరగతి సమ్మెటిక్ ప్రశ్నాపత్రం ఆంగ్లం చూస్తే టీచర్ల కళ్లు బైర్లు కమ్మి పడిపోవాల్సిందే. ఆరవ తరగతిలో ఆల్ఫాబెట్ గుర్తించలేని విద్యార్థులకు, ఇరవై ఏళ్ళక్రితం నిద్రపోయిన రిఫ్‌వాన్ వింకిల్‌లా తిరిగి మీ గ్రామానికి వస్తే జరిగే సంభాషణను రాయమంటే టీచర్లకే సాధ్యం కాని అంశం.

రెండవ తరగతిలో చేయాల్సిన కూడికలు, తీసివేతలు, భాగహారాలు ఇప్పుడు ఎనిమిదో తరగతిలో చెప్పాలా? లేక సిసిఇ మోడల్ ప్రశ్నాపత్రానికి ఏ సామర్థ్యాలు లేని పిల్లల్ని సన్నద్ధం చేయాలో తెలియక, ఎ,బి,సి, గ్రేడ్‌లు నింపి పంపడం తప్పా ప్రమాణాలు లేని బోధనతో మిస్ మ్యాచింగ్ ఆఫ్ సిలబస్ ఒక అవరోధంగా మారిపోయిందన్నది వాస్తవం. నిజానికి అసర్ నివేదిక పరీక్షించిన సామర్థ్యాలు ఆ నివేదికలో రూపొందించిన ప్రశ్నావళి మేరకు 70 శాతం విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు ఉండి వుంటే అసాధ్యమేమీ కాదు. కానీ ఆ అంశాలను కూడా గుర్తించలేని పిల్లల్ని మనం తయా రు చేస్తున్నాం. ఇందుకు ఏ ఒక్కర్నో అసలు మూలల్లోకి వెళ్ళకుండా నిందించడం టీచర్లే కారణం అన్నట్లు చర్చించడం సరికాదు. ఇందుకు ముందుగా ప్రభుత్వ విధానాలు ప్రైవేటు వ్యాపారీకరణతో పాటు పర్యవేక్షణాలోపం, బాధ్యతారాహిత్యం, పేదరికం, అవిద్య, కుటుంబ ఆర్థిక, సామాజిక అంశాలు పరిగణనలోనికి తీసుకొని సరిచేయాలి.వాటిని సరిచేయలేని వ్యవస్థదే తప్ప వ్యక్తులది కాదు.

1384

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,January 3, 2013 11:45 PM

సీమాంధ్రుల ‘దండ’యాత్రలు

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య