సీమాంధ్రుల ‘దండ’యాత్రలు


Thu,January 3, 2013 11:45 PM

ఒక్కరా ఇద్దరా.. వేయిమంది విద్యార్థి యువ కిశోరాల నెత్తుటితో తడిసిన నేల.. ఆ నెత్తుటి జ్ఞాపకాలు రోజూ గుండెను పిండేస్తున్నాయి. 2009 డిసెంబర్ 9 ప్రకటన అమలవుతుందన్న హామీ సీమాంధ్ర నాయకుల విద్రోహంవల్ల వెనక్కి నెట్టబడి, మూడేళ్లు గడిచిపోతూ రోజుకొక్కరినైనా పొట్టన పెట్టుకుంటున్న సందర్భం.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు.. అంటూనే తెలంగాణ అమరవీరుల త్యాగాలను వాళ్ళ నెత్తుటిదారుల్ని తమ సీమాంధ్ర అవకాశవాద విద్రోహ పా(ద)డు యాత్రతో ఆ అమరుల త్యాగాల్ని కనుమరుగు చేసే విద్రోహ యాత్రలు తెలంగాణ నెత్తుటి దారుల్లో కొనసాగిస్తున్నారు. ఇది ఈ ప్రాంత ప్రతి గుండెను మండిస్తున్నది. నాయకుల విద్రోహనికి ఈ పాదయావూతల్లో ఛిద్రమవుతున్న దేహాలు చంద్రబాబు పాదయావూతను అడ్డుకోవడంలో చురుకైన పాత్ర నిర్వహించిన పాలమూరు మట్టిబిడ్డ వెంక శవమైపోవడం, ఖమ్మంలో విజయమ్మ, షర్మిల పాదయావూతల్లో జర్నలిస్టులపై జరిగిన దాడి, ఓ వృద్ధుణ్ణి బలితీసుకోవడం, అడుగడుగునా తెలంగాణపై స్వచ్ఛమైన వైఖరి కోసం నిలదీస్తున్న తెలంగాణబిడ్డల వీపులు ఛిద్రమవ్వడం, కేసుల్లో ఇరుక్కోవడం.. ఆత్మహత్యల పరంపర కొనసాగడం నిరంతరాయంగా కొనసాగుతున్నది.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా, మాట్లాడే ప్రచారం చేసుకునే పాదయావూతలు చేసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ పాదయావూతల్లో ,ఆ ప్రచార యాత్రల్లో ప్రజలకు గతంలో ఇచ్చిన వాగ్దానాలు, చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉండాలి. లేకపోతే వాళ్ళను నిలదీసే హక్కు, అడ్డుకునే హక్కు, అవసరమైతే.. మానుకోటలో లాగా రాళ్ళతో సమాధానం చెప్పే హక్కు ఉంటుంది. అక్రమ అరెస్టులతో, సీమాంధ్ర గూండాలచే దాడులుచేస్తూ పాదయావూతలు చేస్తు న్న నేతలకు ఇది తెలియకపోవడం, తెలిసినా తమ ఆధిపత్య అహంకార దురంకారంతో వాళ్ళ గొంతులు నొక్కుతున్నారు. ఆధిపత్యం, అధికారం కోసం అసత్యాలతో ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసగించాలనుకోవడం అప్రజాస్వామికం.

అట్లాంటి నాయకుల్ని, వాళ్ల వాగ్దానాలను రైతుల, విద్యార్థుల ఫీజల, వృద్ధాప్య పెన్షన్ కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళ మోసపూరిత ప్రసంగాలకు ఇంకా కొంతమందైనా సీమాంధ్ర నేతల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడుతున్నారు. తెలంగాణ విద్యార్థుల నెత్తుటి కూడును తినడానికి సిద్ధపడ్డ తెలంగాణ ద్రోహులు ఆయా పార్టీల నేతల పాదయావూతలకు పాడు చేష్టల కు సహకరించడం, పాల్గొనడం తెలంగాణ తల్లికి ద్రోహం చేయడమే. వందలాదిబిడ్డల నెత్తుటి జ్ఞాపకాలను కనుమరుగు చేస్తున్నారు.

అలాంటి రాజకీయ నాయకుల విద్రోహానికి కరీంనగర్‌లో అమ్మాయి, మెదక్ జిల్లాలో మరో విద్యార్థి అఖిలపక్షంలో పార్టీల దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ బలిదానం చేసుకున్నారు. ఎందుకు రాలిపోతపు నువ్వెందుకు రాలిపోతవని’ విమలక్క పాడినా, బలిదానాలు వద్దురా బరిగీసి గెలవాలిరా అంటూ దేశపతి గానం చేసినా సీమాం ధ్ర నేతల పాదయావూతల కింద తెలంగాణబిడ్డలు నెత్తుటి మడుగు ఏరులై పారుతున్నది. కనీసం ఆ నెత్తుటిలో రాలిపోయిన శవాలు పాదయావూతల్లో చేస్తున్న నాయకుల్ని నిలదీస్తున్న ప్రశ్నలు కోకొల్లలు.. అయినా బతికున్న అవకాశవాద పార్టీల నాయకులకు ఏవీ పట్టడం లేదు.

కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా ఎందుకు తెలంగాణ దక్కడం లేద ని, పోలవరం, పోతిడ్డిపాడులను మాట వరుసకు కూడా వ్యతిరేకమనడం లేదు చంద్రబాబు. కానీ తెలంగాణ రైతు కోసం పాదయాత్ర చేస్తున్నట్టు ‘వస్తున్నా మీ కోసం’ అంటున్న చంద్ర బాబు వేలాదిమంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడు. వ్యవసాయరంగాన్ని గాట్ లాంటి ఒప్పందాల్లో బందీచేసి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టాడు. ఆయన పాలనలో తెలంగాణ రైతాంగం, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కరెంటు కోతలతో కోల్పోయిందెంతో చనిపోయిన రైతులెంత మందో పాదయావూతల్లో బహిర్గతం చేయాల్సి ఉన్నది.


తొమ్మిదేళ్ల కాలంలో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలు ప్రపంచబ్యాంకు షరతులు, తెలంగాణ గురించి ఉచ్చరించనీయని దుర్మార్గ నిర్బంధ పరిపాలన. బెల్లి లలితను తెలంగాణ గొంతుల్ని ముక్కలుగా నరికిన దుష్ట పరిపాలన. ఆయన తెలంగాణ ‘బోనం’ఎత్తుకున్న జై తెలంగాణ అని ఓట్ల కోసమే. బాబును నమ్మి ఆయన పాలనను కోరుకోవడం అంటే తెలంగాణ ప్రజలు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి తమ జీవితాల్ని దుర్భరం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. అట్లాంటి పాలనను తలుపులు బార్లా తెరిచిన వైఎస్సార్ పార్టీ పాదయాత్ర షర్మిల విజయమ్మల హావభావాల్లో స్పష్టమౌతున్నది. రైతు బాంధవుడిలా వేషం వేసుకుని తెలంగాణ గడ్డపై పాదయావూతల్లో పల్లెకన్నీరు పెడుతున్నదని తెలంగాణ ప్రజల దుఃఖాన్ని ఓట్ల పెట్టెల్లో బంధించి పోతిడ్డిపాడు ద్వారా తెలంగాణ ప్రజల జలాల్ని హైదరాబాద్ చుట్టూత భూముల్ని, బయ్యారం బొగ్గు గనుల్ని ఎమ్మార్, వాన్‌పిక్, సెజ్‌ల పేరిట అన్ని రంగాలను లూటీ చేశాడు వైఎస్. పక్షుల్ని పట్టడం కోసం గింజలు చల్లినట్టు తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో సీమాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి.

అప్పనంగా తెలంగాణను ఏళ్ల తరబడి దోచుకున్న సీమాంధ్ర నాయకులు, వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న తెలంగాణ ద్రోహులు ఆ దోపిడీలో భాగం అవుతూ ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం తలపెట్టారు. తమ ప్రాణాల్ని తృణవూపాయంగా తెలంగాణ కోసం సూసైడ్ నోట్‌తో అర్పిస్తున్న బలిదానాలొకవైపు, రేపటి అవకాశాలకోసం డబ్బు సంచుల కోసం, 2014లో గెలుపుకోసం ఉద్యమాలను పక్కదారి పట్టిస్తూ, ఆయాపార్టీల్లో చేరి జెండాలు మారుస్తున్న నాయకులు మరోవైపు ఉన్నారు. ఇలాంటి నేతల అసలు స్వరూపాలను తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలనే పెట్టుబడిగా ఓట్ల రాజకీయం చేస్తున్న దగాకోరు నేతలను ఎండగట్టాలి. తెలంగాణద్రోహల పట్ల పల్లెబాటల్లో ఆయా పార్టీల నేతలను ప్రజ లు గుర్తించి ప్రశ్నించాలి. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసే వాడే మావాడని చాటాలి. ఓట్ల కోసం రాజకీయం చేసే వాడిని ఊరి పొలిమెరలకు కూడా రానీయొద్దు. సబ్బండ ర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బంగారు తెలంగాణను సాధించుకునే దిశగా ప్రజలంతా కదనానికి కదలాలి. రకరకాల పేర్లతో చేస్తున్న పాదయావూతల మోసాన్ని అర్థం చేసుకోవాలి.

-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

35

PRABHAKAR K

Published: Fri,July 21, 2017 01:28 AM

భూ ఆక్రమణలకు చెక్!

ముఖ్యమంత్రి ఆలోచిస్తేనో, కొందరు మంత్రులు ప్రయత్నిస్తేనో, కొం దరు అధికారులు తలచుకుంటేనో ఈ సంస్కరణలు, మార్పులు సాధ్యం కాదు. దేశంలోనే

Published: Fri,June 30, 2017 01:12 AM

రైతులు శాస్త్రీయంగా ఆలోచించాలె

తెలంగాణలో రైతేరాజు అన్నది సీఎం కేసీఆర్ దృష్టిలో ఓట్లు దండుకొని వదిలేసే ఎన్నికల నినాదం కాదు. ముందుచూపు లేని ఉమ్మడి పాలకులు ధ్వంసం చ

Published: Sat,May 27, 2017 11:33 PM

రాజనీతి ఆచార్యుడు

ప్రగతి భవన్‌లో జరిగిన కవులు, రచయితలు, కళాకారుల సమావేశంలో సినీకవి అనంత్ శ్రీరామ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్న మాటలు ఆ సమావేశంలో నన్ను

Published: Wed,April 26, 2017 12:38 AM

వ్యవసాయానికి వెన్నుదన్ను

ముందుచూపులేని ఉమ్మడి పాలకులు వ్యవసాయాన్ని దండగమారి ఆటగా మార్చారు. దీనిని ఆడేది రైతే. ఓడేది రైతే. చివరికి అప్పుల పాలై బతుకు వీడేది

Published: Sat,March 25, 2017 11:53 PM

సామాన్యుని బడ్జెట్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ బడ్జెట్ ఇది. కుల వృత్తులను కాపాడాలని, కుల సంఘాలు కట్టి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మార్క్సిస్టులు మూర

Published: Thu,December 29, 2016 11:52 PM

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్ష

Published: Thu,January 22, 2015 02:15 AM

అసలు నిజాలు దాచిన అసర్

అసర్ నివేదిక ఆధారంగా ఒక పత్రిక కామెంట్ ఇది.. Millions of school children are growing up.. functionally illiterate... ప్రథమ్ అనే స

Published: Sat,June 22, 2013 01:17 AM

నిర్బంధాలను ఛేదించి..

చలో అసెంబ్లీకి వెళ్తారేమోనని మిమ్మల్ని బైండోవర్ చేయమని మా పై అధికారి వత్తిడి చేస్తున్నారు. ‘సార్, ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి

Published: Thu,November 1, 2012 05:58 PM

కలం కవాతుకు కదులుదాం

‘వేయి విచ్చుకత్తులకు భయపడను కానీ ఒక్క కలానికి వణుకుతాను’ అన్న మాటలు జీవవైవిధ్య సదస్సుకు హాజరైన మన ప్రధాని పర్యటన సందర్భంగా రుజువైం

Published: Sat,October 6, 2012 04:32 PM

జయశంకర్ సార్ బాటలో..

ఆగస్టు 6, జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కొన్ని రోజులుగా సం స్థలు,ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప

Published: Sat,October 6, 2012 04:33 PM

ర్యాంకుల రాట్నం

మనం తింటున్న అన్నం మెతుకులకు కారణమైన పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఉన్న వ్యక్తి బాలయ్య సార్. ‘ఎలా ఉన్నారు సార్’ అనగానే, గ

Published: Sat,October 6, 2012 04:33 PM

బతుకు-ఉద్యమాన్ని బతికించు

ఒక్కరా.. ఇద్దరా విద్యార్థి అమరులు. తెలంగాణ పోరులో ఒరిగిన వీరులు. నవయవ్వన తేజంతో మఖ్దూం మొహియుద్దీన్ అన్నట్టు ‘చలేతో చలో.. సారే దున

Published: Sat,October 6, 2012 04:34 PM

మరో మిలియన్‌మార్చ్ కావాలి!

ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని,

Published: Thu,October 18, 2012 05:57 PM

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?

‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంవూధుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంవూధ

Published: Sat,October 6, 2012 04:35 PM

అణచివేత అసాధ్యం

అందరికీ ఆమోదమైన పరిష్కారాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందన్న మాటల్లోని నిగూడార్థం బయటపడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన జేఏ సీ నాయకుల ప్రయత్న

Published: Sat,October 6, 2012 04:35 PM

తెలంగాణ ఉద్యమ శిఖరం ..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ రెండుదశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్తకర్తగా పనిచేస్తున్నాను. జయశంకర్ సార్ ఉపన్య