అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న


Fri,May 16, 2014 01:29 AM

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయ న చూపిన సామాజిక రాజకీయ విప్లవోద్యమం మనందరికీ మార్గం చూపుతున్నది. ఈ దేశంలో వివిధ అస్తిత్వాల్లాగానే కులంకూడా ఒక అస్తిత్వమని, ఆకులవ్యవస్థను నిర్మూలించేందుకు ఆ కులాన్ని సాధనం చేసుకోవాల్సిన అవసరముందని వీరన్న అన్నాడు.

దీనికోసం ప్రత్యామ్నాయ దక్పథంతో ప్రత్యేక కుల పోరాటాన్ని నిర్మించాలన్నాడు. ఈ ప్రత్యామ్నాయ కులవర్గ జమిలి పోరాటాలకు సాయుధ విప్లవం దళిత కార్మిక వర్గదక్పథంతో నాయకత్వం వహించాలన్నాడు. సాయుధ విప్లవం సారథ్యం వహిస్తే అణగారిన సబ్బండ వర్ణాలు అధికారం హస్తగతం చేసుకుంటాయని గ్రహించిన దోపిడీ కులాలు, వర్గాలు ఆ పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సామాజిక న్యాయం కోసం ప్రత్యేక పోరాటాలు అవసరం లేదని దోపిడీ పాలకవర్గాలు బీసీ, ఎస్సీ ముఖ్యమంత్రి అని సరికొత్త నినాదాన్ని తెరమీదికి తెచ్చా యి. ఇవి వారి దోపిడీని మరికొంత కాలం కొనసాగించుకోవడానికి వేసిన ఎత్తుగడలే. ప్రత్యామ్నాయ దక్పథం తో దోపిడీ, అగ్రకుల వ్యతిరేక పోరాటాలతోనే బహుజనులకు నిజమైన న్యాయం దక్కుతుంది.

ఈ క్రమంలో కుల చైతన్య పోరాటాల్ని వక్రమార్గం పట్టించే అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఉద్యమాలను, కుల చైతన్య పోరాటాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కుల వ్యతిరేక చైతన్య పోరాటాలను కుల స్థిరీకరించే సాంప్రదాయ బ్రాహ్మణీయ ఆలోచనలతో కులభేరీలను, సమ్మేళనాలను నిర్మిస్తున్నారు. అలాగే కుల నిర్మూలన అవగాహన నుంచి వైదొలిగి సబ్సిడీ, రాయితీల లాంటి పరిమిత పోరాటాలకు కుదిస్తున్నారు. ఏ కులానికి ఆ కులం అనేదాన్ని పెంచి పోషిం చి సామాజికంగా వెనకబడ్డ వర్గాల ఐక్య పోరాటాలు అవసరం లేదంటున్నారు.

పీడితులుగా అందరూ ఏకమై సంఘటితంగా పోరాడాల్సింది పోయి విడి పోరాటాలే మేలనే తప్పుడు చైతన్యాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ప్రధా నం చేసి వాటి విభజనను ముందుకు తెచ్చి కులాల ఐక్యతను కావాలనే దెబ్బతీస్తున్నారు. కులాల మధ్య శత్రు వైరుధ్యాలకు నారుపోసి నీరు పోస్తున్నారు. ఎస్సీలకు, బీసీలకు మధ్యన శత్రు వైరుధ్యాలు సష్టిస్తున్నారు. లక్షింపేటలో తూర్పు కాపులు దళితుల (మాల )పై దాడి చేస్తే.., బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్య భావజాలంగల కులవాదులు సాంప్రదాయ దళిత సంఘాల చేత దళిత మాలలపై బీసీల హత్యాకాండగా చిత్రీకరిస్తూ శత్రువైరుధ్యంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మిత్ర వైరుధ్యాన్ని శత్రువైరుధ్యంగా మార్చడమే.

ఆదివాసీ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గా లు, ముఖ్యంగా దళితులు అడవిని కొట్టి సాగుయోగ్యం చేసుకుని భూములు స్వంతం చేసుకుంటే.. ఆదివాసీ భూములను దళితులు ఆక్రమించుకుంటున్నారని లేని వైరుధ్యా న్ని ముందుకు తెస్తున్నారు. ఇది ఆధిపత్య అగ్రకుల దోపిడీదారుల కుట్ర. ఇలాగే మైనారిటీల కోటా, మహిళా బిల్లు విషయంలో బీసీ మహిళల వాటా ముందుకుతెచ్చి అసలుకే ఎసరు పెడుతున్నారు. బీసీల్లో.డీలో ఉన్నవారిని ఏలో చేర్చాలనే డిమాండ్లను బీసీ కులాల మధ్య చిచ్చురేపే విధంగా చేస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాల సంక్షే మ పథకాలను కూడా వివిధ సెక్షన్ల ప్రజల మధ్య శత్రు వైరుధ్యాలను సష్టించేందుకు వాడుకుంటున్నారు.
ఈ చారిత్రక పరిస్థితుల్లో మార్క్సిస్టుల్లోని విప్లవ వాదు లు, పూలే అంబేద్కరిస్టుల్లోని మేధావులు, ఆదివాసీలు, బీసీలలో ఉన్న అనైక్యతను ఐక్య పోరాటాలతో రూపుమాపాలి. దళితులపై దాడులు చేసి హత్యాకాండ జరిపిన రెడ్డి, కమ్మ లాంటి దోపిడీ కులాల సరసన బీసీ కులాలను చేర్చడంలాంటి ధోరణు లు ఈ మధ్యన ఎక్కువయ్యాయి.

కొందరు దీన్ని పనిగట్టుకుని చేస్తున్నవారూ ఉన్నారు. దళితులపై దాడి చేసిన వారు బీసీలైనా ఖండించాల్సిందే. శిక్షించాల్సిందే. కానీ వర్గ స్వభావ రీత్యా లేని శత్రు వైరుధ్యాన్ని బీసీలు, దళితుల మధ్య తేవాల్సిన పనిలేదు. సామాజిక మార్పుకు దోపిడీకి బలవుతున్న కులాల మధ్య ఐక్యత పునాదిగా హామీ గా ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అసహజ కారణాల నేపథ్యం లో జరిగిన ఘటనలను మొత్తంగా సామాజిక పీడన ఆధిపత్యంగా చిత్రీకరించడం సమాజ మార్పుకు మేలు చేయకపోగా కీడు చేస్తుంది. ఈ అవగాహనతోనే మారోజు వీరన్న దళిత బహుజన మహాసభ ద్వారా దళితులను, బీసీలను, ఆదివాసీలను, మహిళలను ఐక్య పోరాటాల్లోకి తీసుకురావాలని సిద్ధాంతీకరించాడు.ఆచరణలో అలాంటి ఐక్య ఉద్యమాలకు ఊపిరి పోశాడు. వీరన్న మార్గంలో పయనించడమంటే.. కుల స్థిరీకరణ ఉద్యమాలను ఎండగట్టి, కుల నిర్మూలనా పోరాటాలను సబ్బండ వర్ణాల ఐక్యపోరాటాలుగా ముందుకు తీసుకుపోవడమే వీరన్నకు నిజమైన నివాళి.

-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ ప్రధాన కార్యదర్శి
(నేడు మారోజు వీరన్న 15వ వర్ధంతి)

1297

NAGARAJU PAPANI

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:37 PM

బహుజన పాలకుడు సర్వాయి

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగా

Published: Sat,October 6, 2012 04:38 PM

గీత వృత్తిపై పాలకుల కత్తి

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి

Published: Sat,October 6, 2012 04:39 PM

శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’

పదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దా

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయ

Published: Sat,October 6, 2012 04:40 PM

సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే

country oven

Featured Articles