నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య


Sat,October 6, 2012 04:40 PM

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయితే దేశంలో అన్ని స్థాయిల్లోనూ సమర్థవంతమైన బోధన కరువైంది. విద్యాసంస్థల సంఖ్య అవసరంగానీ, ఉపాధ్యాయుల అవసరం గానీ రోజురోజుకు పెరుగుతున్నా విద్యారంగం ప్రణాళికబద్ధంగా కొనసాగడం లేదు. పాలకులు గానీ, అధికారులుగానీ ఏ ఒక్కరు కనీస నియమ నియమనిబంధనలను పాటించకుండా బాధ్యతా రాహిత్యంగా ఉంటూ.. విద్యాసంస్థలను నిర్వహించుకోమంటున్నారు. విద్యాసంస్థల్ని నెలకొల్పే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రవేటు సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించింది. దీంతో విద్య ముఖ్య లక్ష్యం నెరవేరడం లేదు.దీనికి ఉదాహరణగా.. ఉపాధ్యాయ అభ్యర్థులను ఉత్పత్తి చేసే బీఇడీ, డీఇడీ, ఎంఇడీ కళాశాలలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

గతంలో 2002 లో 98 బీఇడీ కాలేజీలు ఉండగా, అవి 2007 నాటికి 450 కి పెరిగాయి .ఆ సంఖ్య ఇప్పుడు 615 కు చేరింది. వీటికి తోడు డిఇడీ కాలేజీలు 224 ఉన్నాయి. విద్యాసంవత్సరం పూర్తి అయ్యే నాటికి కూడా ఆపె్లై చేసుకున్న యజమాన్యాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నది. మ్యాథ్స్ కు 30 శాతం, సోషల్ స్టడీస్‌కు 30 శాతం, బయోలజీకి 25 శాతం, ఫిజికల్ సైన్స్‌కు 15 శాతం సీట్లుగా భర్తీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా సోషల్ స్టడీస్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల 60 నుంచి 80 శాతం సీట్లను సోషల్ స్టడీస్ అభ్యర్థులచే భర్తీ చేస్తున్నారు.

మరో వైపు అవసరానికి మించి మైనారిటీ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. అందులో నాన్ మైనారిటీలే ఎక్కువ దొడ్డిదారిన అనుమతులను పొందారు. వీరికి ప్రత్యేక కౌన్సిలింగ్‌లు, అర్హత పరీక్షలను నిర్వహించుకునే అవకాశం కల్పించడం జరుగుతోంది. అవసరానికి మించి కాలేజీలు అనుమతులు పొందటంతో వేలల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఖాళీలను పూరించుకోవడానికి యజమాన్యాలే స్పాట్ అడ్మిషన్ పేర సీట్లను భర్తీ చేసుకుంటున్నారు. ఈ కాలేజీలకు బిల్డింగ్‌లు ఉండవు. అర్హులైన ఆధ్యాపకులు ఉండరు. కాలేజీలు రికార్డులోనే ఉంటాయి. గ్రూప్ ఆఫ్ కాలేజీల్లో ఎక్కడో మారు మూల ప్రాంతంలో ఈ కళాశాలలు ఉన్నట్లు చూపించి, పట్టణ పరిసర ప్రాంతాలలో ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఏ , ఫార్మసీ, మెడికల్, డెంటల్ కాలేజీల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు.

ఈసారి ఈ సాంకేతిక విద్యకు డిమాండ్ తగ్గినందుకు బిఇడీకి ఎక్కువ గిరాకీ వచ్చింది. డిఇడీ అభ్యర్థుల ద్వారానే ఎస్‌జిటీ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం మూలంగా ఈ కోర్సుకు రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. నిజానికి ఉపాధ్యాయులు నూతన రాజకీయ, సామాజిక , శాస్త్ర రంగాల అభివృద్ధిలో విద్యార్థులను రాటుదాల్చే పనిని చేపట్టాలి. ఈ పనికి ఉపాధ్యాయులు గానీ, ఉపాధ్యాయ చదువు గానీ చేయడం లేదు. ఈ కోర్సు చదువుతున్న అభ్యర్థులు కోర్సు పూర్తి అయ్యేవరకు తరగతులకు హాజరవుతూనే పాఠశాలలేని గ్రామాల్లో పిల్లలను ఒకే దగ్గరకు చేర్చి చదువు చెప్పించాలి. దీని ద్వారా ఆ గ్రామ పంచాయతీ , పాఠశాల ఉపాధ్యాయులందరి చేత అర్హుడని తెలిపే సర్టిఫికేట్లను కాలేజీల ద్వారా ఇప్పించాలి. ఈ విధంగా ఆ అభ్యర్థి, విద్యార్థిని సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోగలడు. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలలో ప్రాక్టికల్స్‌లో గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల అక్రమాలు జరుగుతున్నవి. ప్రాక్టికల్స్ చేయకపోయినా సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారు.

ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన చట్టాలను రూపొందించాలి. ప్రైవేటుకు బదులు ప్రభుత్వాధీనంలో ఈ విద్యాసంస్థలను నిర్వహించాలి. గుంటూరు జిల్లాలోని కనగాల గ్రామంలో బీఇడీ కాలేజీలో అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీలో బైటపడింది. ఈ ఒక్క కాలేజీలోనే కాదు మొత్తం 19 కాలేజీలు అక్రమాలకు నిలయాలని అధికారుల తనిఖీ బైటపెట్టింది. యాజమాన్యం పైరవీ పెట్టి ఆ కాలేజీపై చర్యలు తీసుకోకుండా సిపార్సు చేయించుకున్నది. ఈ కాలేజీ తోపాటుగా 19 కాలేజీలు చర్యలు తీసుకోకుండా మినహాయింపు పొందాయి. బీఈడీ, డీఈడీ కాలేజీల్లో సబ్జెక్టు సీట్లను మరొక సబ్జెక్టు సీట్లతో భర్తీ చేయడం లాంటివి అరికట్టాలి. ప్రొఫెసర్లతోనే చదువు చెప్పించాలి. అర్హతలేని సిబ్బందితో నడుస్తున్న కాలేజీలలో కౌన్సిలింగ్ నిలిపివేయాలి. యాజమాన్య కోటాలు పూర్తిగా ఎత్తివేసి రిజర్వేషన్ల ప్రాతిపదికగా అర్హతగల విద్యార్థులందరికి చదివే అవకాశం కల్పించాలి.

- పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు

35

NAGARAJU PAPANI

Published: Fri,May 16, 2014 01:29 AM

అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:37 PM

బహుజన పాలకుడు సర్వాయి

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగా

Published: Sat,October 6, 2012 04:38 PM

గీత వృత్తిపై పాలకుల కత్తి

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి

Published: Sat,October 6, 2012 04:39 PM

శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’

పదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దా

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే