సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు


Sat,October 6, 2012 04:40 PM

getting-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaరాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దానిపై చర్చించాలి. నిజానికి ఈ విశ్వవిద్యాలయాలు సమాజ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. కానీ ఈ విశ్వవిద్యాలయాకు సామాజిక బాధ్యత పట్టదని వాటి నిర్వహణ విధానం, పరిశోధన పద్ధతి పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ విశ్వవిద్యాలయాలలో అనేక రకాల కోర్సులు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల అవసరాలు తీరడం లేదు. వీటితో ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారనేదే మౌలిక ప్రశ్న!

అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధిలో ఎవవరు భాగస్వాములవుతారు? అభివృద్ధి అవసరం ఎవరికి? ఇలా అనేక ప్రశ్నలు వేసుకొని విశ్వవిద్యాలయాలు పరిశోధనలను చేయాలి. ఇలాంటి పరిశోధనలు నేటి విశ్వవిద్యాలాయాలు సాగడమే లేదు. ఈ దేశంలోని మెజారిటీ ప్రజలైన దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసీ, గిరిజనుల ఆకలి ఏ ప్రాతిపదికన ఉద్భవిస్తుందో ఈ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలి. అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ వంటి సమస్యలతో మంచినీటి సౌకర్యం పొందలేకపోతున్న పరిస్థితిపై పరిశోధనలు చేసి పరిష్కారాలు సూచించాలి. కానీ అదీ లేదు. అటవీ ప్రాంతంలో గిరిజనులు అనారోగ్యంతో మరణిస్తున్నారు. నాగరిక సమాజంలోకి వీరు రాకపోవడాని కి కారణాలు వెతకాపూ.

మైదాన ప్రాం తంలో నివసించే వ్యవసాయేతర చేతి వృత్తులపై జీవించే బడుగువర్గాల వారు అభివృద్దిలో ముందుండేవారు. ఈ బడుగుల చేతి వృత్తులు ప్రపంచీకరణ వల్ల నశించిపోతున్నాయి. చేతి వృత్తుల్ని అభివృద్ధి చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా జీవించే పరిస్థితిని కల్పించడానికి పరిశోధనలు జరగాలి. వర్షాభావంతో అనేక రాష్ట్రాల్లో కరువు ఉంది. ఈ ప్రాంతాలలో మనుగడపై పరిశోధనలు జరగాలి. కార్పొరేట్ వ్యవసాయం పేరుతో సంప్రదాయ వ్యవసాయోత్పత్తులు నాశనం అవుతున్నాయి. వీటి స్థానంలో దేశీయ వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసే దిశగా పరి శోధనలు సాగాలె. ఆడపిల్లలు పుడితే పురిట్లో చంపివేసే సంస్కక్షుతి పెరిగిపోతున్నది. ఇలా అనేక సామాజిక రుగ్మతలు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను ఇప్పటి వరకు మన మేధావులు సూచించలేకపోతున్నారు.

విశ్వవిద్యాలయాల్లో ప్రతి కోర్సును సమాజమే పునాదిగా పెట్టుకొని బోధన, పరిశోధనలు జరగాలి. కానీ ఇవి బహుళజాతి కంపెనీల మార్కెట్‌కు ఉపయోగపడే పరిశోధన లు చేస్తున్నాయి. సమాజ మార్పుకు దోహదపడే విధంగా ఏ విద్యార్థి అయినా ముందు కు వస్తే అందుకు సహకరించే ప్రొఫెసర్లు కరువవుతున్నారు. ఇప్పుడు సమాజం ఎదు ర్కొంటున్న సమస్యలకు తగిన చర్యలు చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించే వారు ఉన్నారా అంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కొద్ది మంది అణగారిన కులాల పేద విద్యార్థులు మాత్ర మే సమాజ అవసరాల్ని నెరవేర్చే లక్ష్యంతో పరిశోధకులుగా వస్తున్నారు. మిగతా వారం తా అగ్రకులాల వారే. వారు తమ అవసరాలే పరిశోధనగా అడుగుపెడుతున్నారు. సమాజంలోని బహుజనుల భాగస్వామ్యం పెంచకుండా పరిశోధనా రంగాన్ని, విద్యా రంగాన్ని మెరుగుపరచడం అసాధ్యం. ఈ విషయంలో మనం చైనా నుంచి నేర్చుకోవల్సిన అవసరం ఉంది.

చైనాలో మావో విశ్వవిద్యాలయాల విద్యార్థులు గ్రామాలకు తరలాలని పిలుపునిచ్చారు. చరిత్ర, రాజకీయశాస్త్రం, అర్థశాస్త్రం, సాహిత్యం, కళలు, న్యాయశాస్త్ర రంగాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, పాలక సిబ్బంది మావో పిలుపునందుకొని గ్రామాలకు వెళ్లారు. అక్కడి వెళ్లిన వీరు అనేక సామాజిక వర్గాలను అధ్యయనం చేశారు. ఆ సముదాయాలను జన చైనా కోసం జరిగే పోరాటంలో భాగస్వాములను చేశారు. కానీ మన దేశంలో, రాష్ట్రంలో అధ్యాపకులు, పాలక మండళ్ల వారందరు గ్రామాలకు వెళ్లరు. ప్రజలు ఎదుర్కొంటున్న అనే రుగ్మతలను అధ్యయనం చేయరు. వీటికి పరిష్కారం కనుగొనరు. క్రమంగా పాలక మండళ్లు విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, సర్టిఫికెట్లను ముద్రించి అందించే ఫ్యాక్టరీలుగా మారాయి. ఉన్నత విద్యను సాధించడం, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొ నిరావడం, ప్రాంతీయ, కుల, మత, వర్గ అసమానతల్ని పాటించకుండా తగు చర్యలు తీసుకోవడం ఈ పాల క మండళ్ళ చేత కావడం లేదు.

విద్యార్థులకు, పరిశోధకులకు కావాల్సిన సదుపాయలు, సిబ్బంది కొరత కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నది. తెలంగాణలో నెలకొల్పిన విశ్వవిద్యాలయాలు పైన పేర్కొన్న సమస్యలకు పరాకాష్ట. ఇప్పుడిప్పు డే మహాత్మ జ్యోతిరావ్ ఫూలే, డాక్టర్ అంబేడ్కర్‌ల పోరాట ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్ల వల్ల, సామాజికోద్యమాల స్ఫూర్తితో బడుగులు విశ్వవిద్యాలయాలకు చేరువవుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కొద్ది మంది కూడా వారి జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. పోనీ ఆ ప్రైవేట్ సంస్థల్లో అయినా సమాజ మార్పుకు విద్యార్థులను కార్యోన్ముఖులుగా తయారుచేస్తున్నారా అంటే అదీ లేదు. వారిని యంత్రాలుగా మారుస్తున్నారు.

విశ్వవిద్యాలయాలు సమాజాభివృద్ధికి దిశానిర్దేశం చేయకుండా అగ్రకుల దోపిడీ వర్గ పాలకులు అడ్డుకుంటున్నారు. అందువల్లనే సమాజంలోని సామాజిక రుగ్మతల్ని కనుగొని వాటికి పరిష్కార మార్గాలను వెతికే విద్యార్థులను కోరుకోవడం లేదు. పాలకుల విధానాలకు భిన్నంగా విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి ఇరుసుగా, ఇంధనంగా మారాలి. ఇవి సామాజిక, ప్రజాస్వామ్య దృక్పథంతో గ్రామాల్లో బడుగుభశామిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలి. విశ్వవిద్యాలయాలు జాతీయ, రాష్ట్రీయ ప్రణాళిక సంఘాలకు అనుసంధానంగా ఉండాలి. అప్పుడే ప్రతి గ్రామాన్ని పరిశోధన కేంద్రంగా మార్చే అవకాశం ఉంటుంది. దీని కోసం విద్యార్థులు కృషి చేయాలి. గురువుల దినోత్సవం సందర్భంగానైనా విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.

-పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం అధ్యక్షులు

35

NAGARAJU PAPANI

Published: Fri,May 16, 2014 01:29 AM

అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:37 PM

బహుజన పాలకుడు సర్వాయి

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగా

Published: Sat,October 6, 2012 04:38 PM

గీత వృత్తిపై పాలకుల కత్తి

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి

Published: Sat,October 6, 2012 04:39 PM

శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’

పదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దా

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయ