బహుజన పాలకుడు సర్వాయి


Sat,October 6, 2012 04:37 PM

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగాడి చట్టమొచ్చునా పాలెగాడి చట్టమొచ్చునా...’

Papannaఅంటూ బడుగు వర్గాల రాజ్యాధికార ఆకాంక్షను ప్రకటించాడు మన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. తెలంగాణ ప్రజాయుద్ధవీరుడిగా, బహుజన రాజ్యాధికార పోరాట దిక్సూచిగా కీర్తింపబడిన వాడు సర్ధార్ పాపన్న. తెలంగాణలోని బహుజనుల బానిసత్వాన్ని పారదోలే కర్తవ్యాన్ని అందుకున్న వీరయోధుడు. మరాఠాగడ్డపై మొగలాయి ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్నది శివాజీ అయితే, తెలంగాణలో మొగలాయిల విస్తరణను మొట్ట మొదట అడ్డుకున్నది సర్వాయి పాపన్న. అగ్రకుల జాగీర్ధార్లు, జమీందార్లు, పటేల్, పట్వారీలు, నవాబులు ఔరంగజేబు అండతో చేసే దోపిడీ, పీడన, దౌర్జన్యాలకు అంతేలేదు. వీరి దోపిడీ, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా బడుగు వర్గాలను కూడగట్టి అగ్రకుల భూస్వామ్య దోపిడీ శక్తుల గడీలపై దాడి చేసి బహుజన రాజ్యాధికార జెండాను రెపపలాడించినవాడు సర్దార్ పాపన్న.

తెలంగాణలో అగ్రకుల భూస్వామ్యశక్తుల కుల వివక్ష, వెట్టిచాకిరి, బానిసత్వం, అధికశిస్తులు, వడ్డి దోపిడీలు ఎక్కువగా అణగారిన కులాల బడుగు వర్గాలను పట్టి పీడించేవి. వీటికితోడు మలేరియా,కలరా, చర్మవ్యాధులతోపాటు తీవ్రమైన అనారోగ్యం, కరువు విలయతాండవం చేస్తుండేవి.దీంతో.. ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారు. ఇలాంటి రక రకాల సమస్యలతో తాళలేక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. మొగలాయిరాజులు రాజ్యవిస్తరణకు పూనుకున్నారు. దీనికి తెలంగాణలోని అగ్రకుల భూస్వాముల అండను తీసుకున్నారు. ఈ దోపిడీ దారుల పీడనలో బతుకుతున్న గౌడ కుల ప్రజ ల వెట్టి గీత, వెట్టి కల్లు, వెట్టి శ్రమతో అష్టకష్టాల పాలయ్యారు. ఈ తరుణంలో పాపన్న తండ్రి అగ్రకుల భూస్వాముల దాడుల క్రూరత్వానికి బలైపోయాడు.

తండ్రి మరణంతో దోపిడీ దౌర్జన్యాలను సహించలేక దోపిడీపాలనకు చరమగీతం పాడేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ అగ్రకుల భూస్వాముల,మొగలాయిల పాలనను అంతమొందించడం ఒక్క గౌడ కుల ప్రజలతో సాధ్యంకాదని, అందు కు మొత్తం బహుజన పీడిత కులాలను (దళిత బహుజన ఆదివాసీ గిరిజన, ముస్లిం ప్రజలు) ఐక్యం చేశాడు. దోపిడీ రాజ్యాన్ని కూల్చాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 12,000 సైనికులను తన సోదర కులాల ప్రజలతో ఏర్పా టు చేశాడు. దీంతో పాటు (వరంగల్ జిల్లా) ఖిలాషాపూర్‌లో పటిష్టమైన కోటను నిర్మించాడు. సైన్యానికి యుద్ధ నైపుణ్యాలు నేర్పాడు. బడుగు వర్గ బహుజన ప్రజల సంపదను ఆక్రమించుకున్న అగ్రకుల భూస్వామ్య శక్తుల రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యంగా అడుగులు వేశాడు. ఊరు-వాడలను కొట్టడం కాదు, కొడితే గోల్కొండ, కందవోలు, మహల్, మైసూరు కోటలను కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.

ఈ క్రమంలోనే తెలంగాణలోని అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేయడం ప్రారంభించాడు. ఆ గడీలను కోటలను స్వాధీనం పర్చుకున్నాడు. కోటలలో దాచుకున్న సంపదను బహుజన పేదలకు పంచాడు. బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల వర్గాల ప్రజలను విడిపించాడు. ఆ తర్వాత భువనగిరి, వరంగల్, గోల్కొండ కోటలను స్వాధీన పర్చుకున్నాడు. గోల్కొండ కోటలో ఏడు నెలలపాటు రాజ్యపరిపాలన చేశాడు. రాజ్యాధికార ఆకాంక్షను 310 సంవత్సరాల క్రితమే ప్రకటించి బహుజన రాజ్యం కోసం దిశా నిర్దేశనం చేశాడు మన సర్వాయి పాపన్న. బ్రాహ్మణీయ నిచ్చెనమెట్ల కుల అసమానతలలో పీడితు లు విద్య, రాజ్యాధికారాన్ని కాంక్షించరాదన్న హిందూత్వశక్తుల నీతిని తిరగ రాశాడు.

పాపన్న ఆలోచన, ఆచరణకు బెంబేపూత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నవాబులు ఎన్ని కుట్రలు పన్నినా వాటిని తిప్పికొట్టాడు. కీస్తు పూర్వం వర్ణ, కుల, వర్గేతర ఘన కమ్యూన్ సమాజాలైన మగధ, మౌర్య సామ్రాజ్యాలను ఆర్య శుంగ వంశరాజు ధ్వంసం చేసినట్టు.. ఆ వారసులైన బ్రాహ్మణీయ అగ్రకుల శక్తులు పాపన్న నిర్మించిన బహుజన రాజ్యాన్ని కూల్చడానికి అనేక ప్రన్నాగాలు పన్నారు. పాపన్న సైన్యాన్ని దెబ్బతీయడం ప్రారంభించారు. దీంతో పాపన్న సైన్యం రోజురోజుకు బలహీన పడింది. దీంతో.. మొగలాయిల చేతికి చిక్కి చనిపోవడం ఇష్టంలేక తనకు తానుగా ఆత్మర్పణం చేసుకున్నాడు.ఇలాంటి వీరుని చరివూతను, పాపన్న చారివూతక ఘట్టాల్ని నేటి అగ్రకుల పాలకులు చరివూతాంశాలలో చేర్చలేదు.అయినా.. ఆయన తెలంగాణలోని జానపదుల గొంతులలో వీరగాథగా ప్రతితరాన్ని తట్టిలేపుతున్నాడు. ఈ బ్రాహణీయ అగ్రకుల దోపిడీ సంస్కృతిలో కూరుకుపోయిన సంప్రదాయ గౌడ కుల నాయకత్వం ఆ కులాన్ని రాజ్యాధికారానికి చేరువ కానివ్వడం లేదు.రాయితీలు, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఈ ధోర ణి సర్వాయి పాపన్న ఆలోచనలకు విరుద్ధం. కుల వర్గ వ్యవస్థల్ని కూల్చి బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే పాపన్న ఆచరణను నిలపడం. దళిత, బీసీ, గిరిజన, మైనార్టీలను ఏకం చేసి బహుజన రాజ్యం కోసం సర్వాయి పాపన్న బాట లో పయనిద్దాం
-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ ప్రధాన కార్యదర్శి

35

NAGARAJU PAPANI

Published: Fri,May 16, 2014 01:29 AM

అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:38 PM

గీత వృత్తిపై పాలకుల కత్తి

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి

Published: Sat,October 6, 2012 04:39 PM

శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’

పదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దా

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయ

Published: Sat,October 6, 2012 04:40 PM

సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే