గీత వృత్తిపై పాలకుల కత్తి


Sat,October 6, 2012 04:38 PM

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి, నేత, కుమ్మరి,కమ్మరి, వడ్రంగి, యాదవ, కం సాలి, గౌడ తదితర కులవృత్తులు నాశనమై ఈ వృ త్తిపై ఆధారపడి జీవిస్తున్న వారంతా జీవనాధా రం కోల్పోతున్నారు. చాలామంది మరో వృత్తిచేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గౌడవృత్తి పరిస్థితి ప్రత్యేకమైనది. ఈ వృత్తిలో ఇప్పటికీ ఎలాంటి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా గౌడ కులవృత్త్తి ని సులభతరం చేసే విధానాలేవీ ఆవిష్కరణలకు నోచుకోలేదు. అగ్రకుల పాలక ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ విధానాలు చూపకుండానే గౌడవృత్తిని ధ్వంసం చేశాయి. రాష్ట్రంలో గౌడ కుల ప్రజలు కల్లుగీత కానీ, నీరా ఉత్పత్తికానీ చేయడానికి ఎంతో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో కల్లుగీతకు వనరుగా ఉన్న తాడిచెట్లు ఐదు కోట్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 12.27 లక్షల చెట్లను కల్లు గీతకు, మిగిలినవాటిని నీరా ఉత్పత్తికి వాడుకోవచ్చని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నేడు 10 లక్షల చెట్లదాకా తరిగిపోయాయని అంచనాలున్నాయి. 1968 లో మొదటిసారిగా నీరా ఉత్పత్తి, అమ్మకాలు ప్రారంభించినా.. ,ఆరోగ్యపరమైన, మరి ఇతర స్పల్ప కారణాలు చూపి తరువాతి సంవత్సరమే నీరా ఉత్పత్తి, అమ్మకాలను ప్రభుత్వం ఆపేసింది. కానీ శాస్త్ర ప్రకారం చూసినా కల్లులో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుందనీ, ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని కూడా వైద్యు లే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే..కల్లు, నీరాలో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడి యం, పొటాషియం, కార్బోహైవూడేట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవని వేరే చెప్పనక్కర లేదు. గౌడ కులస్తుల దగ్గర తాము చేస్తున్న వృత్తిని ఒక పరిక్షిశమగా మార్చే ఆర్థికశక్తి లేకపోవడంతో..ఇది నానాటికీ కనుమరుగుఅవుతున్నది. ప్రభుత్వ ప్రొత్సాహం ఉంటే.. కల్లుగీతను, నీరా ఉత్పత్తిని పరిక్షిశమగా అభివృది ్ధచేస్తే..లక్షలాదిగా ఉన్న గౌడ కులస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పాలకులు ప్రజల జీవితాలను మరిచి బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్‌ఎల్) ఉత్పత్తుల వల్ల కల్లుగీత అమ్మకాలు పూర్తిగా దెబ్బతిన్నవి. హైదరాబాద్‌లో కల్లును నిషేధించడం కూడా బహుళజాతి కంపెనీల లిక్కర్ అమ్మకాలు పెంచడంలో భాగంగానే జరిగిం ది. రకరకాల అభివృద్ధి పేరుతో, సెజ్‌ల పేరుతో సహజంగా ఉన్న తాటిచెట్లను నరికి గౌడ కులస్తుల జీవనోపాధిని నిర్వీర్యం చేశారు.

ఈవిధంగా దేశంలో వివిధ కులవృత్తులతోపాటు కల్లుగీతను కూడా పాలకులు ధ్వంసం చేస్తుంటే..,శ్రీలంక, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో గీతవృత్తిని ఎంతో అభివృద్ధి చేశారు. మలేషియాలోనైతే.. తాటిగింజల నుంచి తీసిన నూనెతో బస్సులను నడిపిస్తున్నారు. ఇతర దేశాలను చూసిఅయినా పాలకులు దేశీయ వృత్తులను కాపాడాల్సిన విషయాన్ని గుర్తిస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. 1998 డిసెంబర్‌లో ముంబాయిలో ‘ALCOBEV’ 98 పేర ప్రపంచ మత్తు పానీయాల ఉత్పత్తిదారుల సమావేశం జరిగింది. దీనిలో దేశంలో అమ్మడవుతున్న మత్తుపానీయాల జాబితా చూసి అందులో కల్లు ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయారు. కల్లు ఉత్పత్తినే దెబ్బతీసే కుట్రలు ఆ సమావేశంలోనే రూపుదిద్దుకున్నాయి. బహుళ జాతి కంపెనీల పెద్దల మాటలకు వంతపాడే మన పాలకులు ఆనాటినుంచీ కల్లుగీతపై కత్తి గట్టారు. రకరకాల ఆంక్షలు పెట్టి మొత్తం మీద గీత వృత్తిని నాశనం చేసి కల్లును కానరాకుండా చేయాలని కుట్రలు పన్నారు. దీని ఫలితంగానే నగరాలలో కల్లు అమ్మవద్దనే నిర్ణయం తీసుకున్నారు. అలా గే వివిధ జిల్లాల్లో కల్తీకల్లు పేర జరుగుతున్న మరణాలను సాకుగా చూపి కూడా కల్లును అమ్మకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నా రు. నిజానికి కల్లుగీసే గౌడ కులస్తుడు అమ్మే కల్లులో ఎలాంటి కల్తీ ఉండదు. ఎవరూ చనిపోయే అవకాశం కూడా లేదు. ఎప్పుడైనా.. బడా కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన అగ్రకుల పెత్తందారుల ధనదాహం కారణంగానే స్వచ్ఛమైన కల్లు కల్తీ అవుతున్నది. మత్తును పెంచే రసాయన పదార్థాలను మోతాదుకు మించి కలిపి వారే మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటిదాకా కల్తీ కల్లు మరణాలకు కారణమైన సంఘటనలన్నింటిని పరిశీలిస్తే.. అవన్నీ అగ్రకుల కాంట్రాక్టర్ల పాపమేనని ఎవరికైనా అర్థమవుతుంది. గీత కార్మికునికి ఐదు ఎకరాల భూమిని కేటాయించి ప్రత్యేకంగాను కల్లుగీత వృత్తిని, వృత్తిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. బీహర్‌లో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దారివూద్యరేఖకు దిగువగా ఉన్న జాతికుల వృత్తులకు (గీత)ఎలాంటి పన్నులు వసూలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో ఒకే పన్ను విధానం ఉన్నది. కానీ ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం వివిధ పదిరకాల పన్నులతో గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలను వేధిస్తున్నది. కల్లుగీత వృత్తిని నిర్లక్ష్యం చేయరాదంటూ, తాటి, ఈత చెట్లను స్థానిక, అగ్రకుల భూస్వాములు నిర్మూలించడం వెంటనే ఆపివేయాలంటూ చట్టం చేయాలి. అభివృద్ధిలో బీసీల చేతి వృత్తు లను భాగం చేసి జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నది.

-పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కో-కన్వీనర్

35

NAGARAJU PAPANI

Published: Fri,May 16, 2014 01:29 AM

అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:37 PM

బహుజన పాలకుడు సర్వాయి

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగా

Published: Sat,October 6, 2012 04:39 PM

శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’

పదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దా

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయ

Published: Sat,October 6, 2012 04:40 PM

సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే

Featured Articles