శాస్త్రీయతలేని ‘గ్రేడింగ్’


Sat,October 6, 2012 04:39 PM

Stu0 talangana patrika telangana culture telangana politics telangana cinemaపదవ తరగతి వార్షిక పరిక్షల ఫలితాలను గ్రేడింగ్ పద్ధతిలో విడుదల చేస్తామని గత సంవత్సరం నుంచే ప్రచారంలోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది దానికి కార్యరూపం ఇచ్చింది. గ్రేడింగ్ విధానమని, పాయింట్ల పద్దతని గందరగోళ పరిస్థితుల్లో చివరకు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ గ్రేడింగ్ విధానానికి 2005 డిసెంబర్ నుంచే ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీంతో పాటు 10వ తరగతిలో పరీక్ష పేపర్లను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికోసం ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతి నిధులతో 2005లోనే సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చలో విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయఎమ్మెల్సీలు, విద్యార్థి సంఘాలను భాగస్వాములను చేయలేదు. ఆ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించకపోవడంతో వారు తీవ్ర వ్యతిరేకతను వెలిబుచ్చారు. అయినా ప్రభుత్వం అవేవీ లెక్కలోకి తీసుకోకుండా, ప్రభుత్వానికి అనుకూలమైన తల్లిదంవూడులు, ఉపాధ్యాయ సంఘాలతో వివిధ జిల్లాల్లో సమావేశాల్ని నిర్వహించింది.తూతూ మంత్రంగా చర్చను ముగించేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి ముందే యు.పి.ఎ. ప్రభు త్వం రెండవసారి అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రి కపిల్ సిబల్ దేశావ్యాపితంగా సి.బి.ఎస్.సి. తరహాలో ఒకే పరీక్ష విధానం, ఒకే విద్యాబోర్డ్ ఉండాలని ప్రతిపాదించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఐచ్చికం అని, మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానం ఉండాలనే ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న పరీక్ష విధానంలో శాస్త్రీయత లోపించింది. విద్యార్థులను మానసికంగా కృంగదీస్తున్నది. ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలు వారి పాఠశాలలకు రేటింగ్ పెంచుకొని విద్యావ్యాపా రం చేస్తున్నారు. నిజానికి విద్యార్థుల సృజనాత్మకశక్తి ని, ప్రతిభను వెలికితీయడం ఈ విధానం ద్వారా సాధ్యం కాదు. ఏ శాస్త్రీయ పద్ధతికి అనుగుణంగాలేని మార్కుల విధానం కొనసాగుతున్నది. పాఠ్యాంశాల భారం మరో పెద్ద అవరోధంగా నేటి విద్యార్థులకు తయారైంది. తెలుగు చదివే విద్యార్థికి ఇంగ్లిష్‌పై గానీ, హిందీపై గానీ, గణితంపై గానీ సమగ్ర అవగాహన, పట్టు ఉండకపోవచ్చు. అంతేకాదు 10వ తరగతి విద్యార్థి 7 పాఠ్య పుస్తకాల్ని 11 పరీక్ష పేపర్లుగా రాయాల్సిన స్థితి ఉన్నది. ఈ భారాన్ని తగ్గించాలి. ఈ భారాన్ని తగ్గించకుండా ఇలాగే కొనసాగించి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తే ఫలితం శూన్యమే అవుతుంది. సంవత్సరం పాటు చదివిన విద్యార్థికి ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్కు తగ్గితే సంవత్సరం పొడుగునా చదివిన చదువుకు అర్థంలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇతర రంగాలలో విద్యార్థికి ఉన్న నైపుణ్యం, ప్రతిభా అంశాలు పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ఈ పరీక్ష పద్ధతికి లేదు. ప్రతిభాంశాలు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకునే విధానం అవసరం.

ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రేడింగ్ పద్ధతి వల్ల విద్యార్థుల్లో మార్కుల పోటీ తగ్గుతుందని ఆశించారు. కానీ.. ఈ గ్రేడింగులో కూడా సబ్జెక్టువారీగా పాయింట్లు ఇచ్చే సరికి చివరికి మార్కులు ఎన్ని వచ్చాయో చెసుకునే వీలు కలుగుతున్నది. మరో విధంగా చెప్పాలంటే.. దొడ్డి దారిన మార్కులు తెలుసుకునే అవకాశం ప్రభుత్వమే కల్పించింది.

ప్రభుత్వం ఈ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ముందు ఇంకింత శాస్త్రీయంగా గ్రేడింగ్ లు ఉండేటట్లు చూస్తే బాగుండేది. అలాగే విధ్యార్థుల తల్లిదంవూడులకు, ఉపాధ్యాయులకు గ్రేడింగ్ గురించి సమగ్ర అవగాహన కల్పించి అందరి ఆమోదంతో అమలు చేస్తే బాగుండే ది. ఈ గ్రేడింగ్ విధానాన్ని దాదాపు 50 దేశాలకుపైగా అమలు చేస్తున్నాయి. వాటి ఆచరణ ఫలితాలను, అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర అవగాహనతో ఏర్పాటు చేస్తే బాగుండేది. అలాగే ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలోని విద్యావేత్తలతో, నిపుణులతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి నిర్ణయానికి వస్తే ఆశించిన మంచి ఫలితాలు ఉండేవి. ఈ అధ్యయన సారాంశంతో.. ఈ దేశ సామాజిక, ఆర్థిక,జీవన విధానాల కనుగుణంగా.. విద్యా ఫలితాలను అన్వయించాల్సి ఉంటుంది. పాఠ్య ప్రణాళికలో మార్పుతో పాటు పాఠ్య పుస్తకాల భారాన్ని, పరీక్ష పేపర్ల భారాన్ని తగ్గించాలి. 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రైవేటైజేషన్‌ను నిర్మూలించాలి. అప్పుడు మాత్రమే అందరికీ సమాన విద్య అందుబాటులోకి వస్తుంది.

-పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు


35

NAGARAJU PAPANI

Published: Fri,May 16, 2014 01:29 AM

అస్తిత్వ పోరాట ప్రతీక వీరన్న

కుల వర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్నను అగ్రకుల చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ హత్యచేసి నేటికి 15 ఏళ్లు. వీరన్న భౌతికంగా మన

Published: Tue,May 13, 2014 12:22 AM

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి

Published: Sat,October 6, 2012 04:37 PM

బహుజన పాలకుడు సర్వాయి

ఈదులు గీస్తే ఈండ్రువాడు/కల్లు గట్టితే గౌండ్లవాడు కత్తి పట్టితే మేదరివాడు/కుండ పట్టితే కుమ్మరివాడు కొలిమి పెట్టితే కమ్మరివాడు/మొనగా

Published: Sat,October 6, 2012 04:38 PM

గీత వృత్తిపై పాలకుల కత్తి

దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధి నమూనా ఫలితంగా చేతివృత్తులు, కులవృత్తులు నాశనమవుతున్నాయి. ఈప్రపంచీకరణ కారణంగా కుదేలైన చాకలి, మంగలి

Published: Sat,October 6, 2012 04:39 PM

వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలె

ఆధునిక ప్రాజెక్టులులేని కాలంలో దేశ వ్యాప్తంగా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో వడ్డెరలు కీలకపాత్ర పోషించారు. బావుల త్రవ్వకం, వా

Published: Sat,October 6, 2012 04:40 PM

నాణ్యత లేని ‘ఉపాధ్యాయ’ విద్య

విద్య సమాజాభివృద్ధికి, సామాజిక పరివర్తనకు దోహదపడేదిగా ఉండాలి. అలాంటి విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అయ

Published: Sat,October 6, 2012 04:40 PM

సమాజం పట్టని విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొత్తంగా 45 ఉన్నాయి. ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉండడం మంచిదే. కానీ అవి వాటి అవసరాల్ని నెరవేర్చాయా లేదా అనే