నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ


Fri,September 20, 2013 12:26 AM

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న ధైర్యం ఏమిటో, నలభైవేల మంది సీమాంవూధులకు, వారి మధ్య నిలిచి, చాటి చెప్పినవాడు ఒక్క బక్కచిక్కిన ప్రాణి, పేరు శ్రీనివాస్. అతను సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు తినే డీజీపీ కాదు. అభిశంసనలు పొందే చీఫ్ సెక్రటరీ కాదు, వారిపైన పెత్తనం చెలాయిం చే పక్షపాత ప్రభుత్వాధినేత కాదు. వారందరికి చాలా కింది స్థాయిలో పనిచే స్తూ చిన్న జీతం తీసుకునే అతి చిన్న ఉద్యోగి, ఒక కానిస్టేబుల్.

ఏపీఎన్జీవోల పేరు మీద సీమాంధ్ర కాంగ్రెస్ రాజకీయ నాయకులు తెర వెనుక నుంచి నడుపుతున్న సోకాల్డు సమైక్యాంధ్ర ఉద్యమం గురించి తెలియని వారెవరూ లేరు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు కూడా తెలుసు. సీమాంధ్ర 13 జిల్లాల నుంచి వచ్చిన వారిలో ఉద్యోగులు కొందరైతే ఇతరులు ఇంకెందరో అనీ తెలుసు. హైకోర్టు ఏమన్నా, ఎన్జీవోలు కాని వారిని సభలోకి పోలీ సు ఉన్నతాధికారులే దగ్గరుండి తీసుకుపోతారని ఎందుకంటే వారూ సీమాంవూధులే అని శ్రీనివాస్‌కు తెలుసు. ముఖ్యమంవూతి నుంచి మొదలైతే ప్రతి వూపభు త్వ విభాగంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ పట్ల ద్వేషభావంతో రగిలిపోతున్నారని తెలుసు.

ఒక్కమాట వ్యతిరేకంగా చెప్పినా ప్రాణాలకే ముప్పు అనీ తెలుసు. కాని భయంలేదు. ఇంతమంది మద్దతుతో నలభై వేలమంది గుంపు బలంతో ఉన్న ఏపీఎన్జీవోల మధ్య తను గొంతెత్తి జై తెలంగా ణ అన్న అతని గుండె ధైర్యం సమైక్యాంధ్ర వైఫల్య శంఖారావం. సమైక్యత నిండు సున్నా అని చెప్పిన ఒక్క బక్కగొంతు శ్రీనివాస్ అన్న జై తెలంగాణ నినాదం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నలభై వేలమంది వ్యతిరేకతను వినడానికి సిద్ధంగా ఉంటే నలభై వేల మంది ఒక్క వ్యతిరేక గొంతుకను వినలేని దుస్థితిలో ఉన్నారు. సమైక్యత అంటే తెలంగాణ కూడా బాగుండాలనే అర్థం కనుక మనం కూడా అతనితొ గొంతుకలిపి జై తెలంగాణ అందాం అన్న వివేకం అందులో ఒక్కరికి కూడా లేకపోవడం అందరూ గమనించాల్సిన వాస్తవం.

సర్కారు సాయంతో సాగే ఈ సాంస్కృతిక కార్యక్షికమాన్ని ఉద్యమం అం సర్కారు అండదండలు తమకు లేకపోగా తమ వ్యతిరేకులకు మెండుగా ఉన్నా భయపడకుండా నినదించడాన్ని ఏమంటారో ఆ సభలో మాట్లాడిన వారికి చెప్పినా అర్థంకాదు. లక్షల రూపాయలు పెట్టుబడితో సాగుతున్న ఉద్యమానికి ఆ ఒక్క గొంతుక జవాబిచ్చింది.తెలంగాణ లేని ఈ సమైక్యాంవూధానికి సమాధానం ఆ జై తెలంగాణ. ఏపీఎన్జీవోల తెలంగాణ వ్యతిరేకతకు వారి వైఖరి ప్రత్యక్ష సాక్ష్యం. పోలీసు అనుమతితో ఈ తెలుగు జన వ్యతిరేకులు చేసిన శంఖారావానికి చెవుడు పుట్టించే నినాదం జై తెలంగాణ. శ్రీనివాస్ ఒంటిమీద పడిన ఒక్కొక్క దెబ్బ, ఇక్కడ ఎక్కడా సమైక్యమే లేదని, ఇది దశాబ్దాలుగా సాగే సర్కారీ దుర్మార్గమని చెప్పే ఒక్కొక్క గుర్తు.
తమది సమైక్యతో కాదో చెప్పడానికి ఏపీఎన్జీవో లు ప్రయత్నం కూడా చేయకపోవడం వారి ఘోర వైఫల్యం. కేవలం 13 జిల్లాల నుంచి మాత్రమే వారి జనం వచ్చారు. వచ్చిన వారు ఎన్జీవోలో కాదో తెలియదు.

ఆటలాడుకోవలసిన ఫతేమైదాన్‌లో కొట్లాటకు కాలుదువ్వడం, తొడలు చరచడం, మీసాలు మెలేయడం, గొంతు కోస్తాననడం, పైఅంతస్తులోంచి విద్యార్థిని తోసేయడం, ఉస్మానియా నిజాం కళాశాల విద్యార్థులను పోలీసులు, సీమాం ధ్ర నుంచి వచ్చిన కండల వీరులు తరిమికొట్టడం, దెబ్బలు తిన్న వ్యక్తిని పోలీసు వ్యాన్‌లో విసిరివేయడం...ఇవీ వారి విజయ దృశ్యాలు. లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజాస్వామ్యం, సమైక్యత ఈ విధంగా పరిఢవిల్లింది. ఈ దశ్యాల్ని చూసిన తెలంగాణ ఆవేదన చెందింది. ఇటువంటి సీమాంవూధుల కబంధ హస్తాల నుంచి స్వాతంత్య్రం త్వరగా రావాలన్న కోరిక తెలంగాణలో మరింత బలపడింది. తెలంగాణపై ద్వేషంతో సమావేశం జరిపించిన వ్యక్తి సీమాంవూధలో నాయకుడవుతాడో లేదో చెప్పలేము కాని తెలంగాణ కోసం పోరాటాన్ని సుదృఢం చేసిన ఘనత దక్కించుకుంటారు.
ఈ సమావేశంలో దెబ్బతిన్న శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ యాదవ్, శ్రీశైలం వంటి యువకిశోరాలకు తెలంగాణ ఉద్యమంలో కొన్ని నాయకత్వ బాధ్యత లు ఇప్పించి, సీమాంవూధులు చేసిన అవమానాలను నిర్మూలించే సన్మానం చేయడం తక్షణ కర్తవ్యం.

తెలంగాణలో జై తెలంగాణ అంటే నేరం అని సీమాంధ్ర చాటిచెప్పింది. కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన సమైక్యాంధ్ర వాదులు వరసగాగంటల కొద్దీ తెలంగాణ ను రెచ్చగొడతారు, దుమ్మెత్తిపోస్తారు. వీరంతా తెలుగుతల్లి, ఆమె గర్భం, అందులోంచి సమైక్యం వంటి మాటలు మాట్లాడడంఒక వింత. జై తెలంగాణ అన్న తమ కానిస్టేబుల్ సహచరుడిని పొలీసు ఉద్యోగులై ఉండి కూడా దౌర్జన్యం చేయడం వీరితోపాటు గూండాకూడా ఒకరు ఉండడం పోలీసు, గూండా సమైక్యతకు నిదర్శనం కావచ్చు.

తెలంగాణలోని 10 జిల్లాల నుంచి వచ్చిన వారే లేరు. అయినా అది సమైక్యం ఏ విధంగా అవుతుందని ఆలోచించిన వారు లేరు. అడిగిన వారు అంతకన్నా లేరు. వచ్చింది 40వేల మందే అని వారే అంటున్నా పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలైన పత్రికలు, పక్షపాతానికి, వ్యాపారానికి పుట్టిన ఛానళ్లకి అది జన ప్రభంజనం, ఝరి ఇంకా ఎన్నెన్నో. తెలంగాణ ఉద్యమకారులు ఆటంకాలు కల్పించారన్నారు. కాని ప్రభుత్వంవారు, పోలీసులు దగ్గరుండి చేసిన సౌకర్యాల గురించి ఎవరూ మాట్లాడరు. రాజ్యాంగ పీఠం మీద కూర్చున్న వారి సోదరులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే జై తెలంగాణ అన్న వాడిని, హాస్టల్ కిటికీలోంచి చూస్తున్న వాడిని బరా బరా ఈఢ్చి పోలీసులే తన్నుతూ ఉంటే ఇంక వారికి అడ్డేముంది. అదుపేముంది.
సీమాంవూధుల మీద దాడి చేయడం అన్యాయమని శైలజానాథ్ వంటి సీమాంధ్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉంటే, సీమాంధ్ర నుంచి వచ్చిన వారు మామూలుగా సభచేసుకోకుండా తెలంగాణ వారిపైన దాడి చేయడం ఏమిటని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అడిగారు. జై తెలంగాణ అంటే తప్పా ఆ నినాదం చేసినందుకే దౌర్జన్యం చేసే వారు సమైక్యం అనేమాటను ఎలా పలుకుతారని తెలంగాణ మంత్రులు గీతాడ్డి సునీతారెడ్డి తదితర మంత్రులు విమర్శించారు. ఎల్ బి నగర్, పంజ గుట్ట చౌరస్తాల్లో జై సమైక్యాంధ్ర నినాదానికి జవాబుగా జై తెలంగాణ అని నినాదాలు చేస్తే జవాబు తన్నులా అని టీఆర్‌ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ అడిగారు.

హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయడానికి కంకణం కట్టుకున్నారా అనిపించే పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ నడిగడ్డన రాజధానిలో సమైక్య వాదం వినిపించాం అని విజయగర్వం ప్రకటిస్తున్నారు. ఇది ఆరంభమే ఇంకా గర్జిస్తాం అంటున్నారు. అంటే ఇంకా దౌర్జన్యాలు జరుగబోతా యి. అదీ హైదరాబాద్ లో అని పక్కాగా చెప్పేస్తున్నారు. సంస్కృతి సమైక్యం అర్థాలు వారి ప్రసంగాల్లో కూడా తేల లేదు. వారికి తెలంగాణ విడిపోకూడదన్న ప్రగాఢ వాంఛ ఉందని అంగీకరించినా నిజానికి వారి సమైక్యత తెలంగాణ విడిపోకుండా తమ అధీనంలో ఉంచుకోవడమే. మీ అధీనంలో ఉండలేనని తెలంగాణ గొంతెత్తి ప్రకటిస్తున్నా వీరికి వినబడడం లేదు.

ప్రగాఢ వాంఛ ఒక్కటే సరిపోదు. దశాబ్దాలపాటు సాగిన తెలంగాణ పోరాటానికి ఎల్‌బీ స్టేడియం సర్కారువారి దయతో, పోలీసువారి లాఠీల సాయం తో, ఆర్టీసి బస్సులను సమైక్య బంద్ పేరుతో ఆపి తమ ప్రయివేటు బస్సులకు లాభాలు చేకూరుస్తున్న సర్వీసులు వారి బస్సుల సాయంతో రాజధానికి సాగిన దండయాత్ర ఒక్కటే సమాధానం కాబోదు. సమైక్యం పేరుతో సాగుతున్న దుర్మార్గానికి,తెలంగాణ పట్ల విద్వేషాన్ని కురిపించే దౌర్జన్యానికి ఆలవాలంగా మారిన ఈ ఉద్యమానికి నైతికమైన, న్యాయమైన కారణాలు ఏవీ లేవు. ఎన్జీవోలు ఇంతవరకు తమ సమ్మె కారణాలను కోర్టులోనూ చెప్పలేకపోయారు. లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సభలోనూ వివరించలేకపోయారు. తెలంగాణ వారు లేని సమైక్యం ఏ విధంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం కూడా చేయలేని వారే అక్కడ పాటలు పాడారు, ప్రసంగాలుచేసిశారు. అర్థంచేసుకోగల ప్రపంచానికి వీరి సభలో సాగిన అతి గొప్ప అసత్యం సమైక్యతే అని తెలిసి పోయింది. తెలంగాణ పట్ల ఆక్రోషాన్ని వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం తప్ప ఏపీ ఎన్జీవోలు కల్పించిన అవగాహన ఏదీ లేదని రాయలసీమ పౌర ప్రముఖులు భూమన్, రమణాడ్డి చెప్పారు.అశోక్ బాబు రాజకీయం మాట్లాడాడే గాని అవగాహన కల్పించడానికి ఏ ప్రయత్నమూ జరగలేదని వివరించారు. ఈ మాటలు అన్న వారు తెలంగాణ వారు కారని తెలుసుకుంటే చాలు.

తెలంగాణ కలిసివచ్చే అవకాశం లేకపోగా తమ సీమల్లోనే విస్తరిస్తున్న విభజనానుకూల అభివూపాయం సీమాంధ్రలో ఉద్యమాలు చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న స్వార్థ శక్తులకు కనిపిస్తూనే ఉంది. ఆ స్వార్థ శక్తులకు చెందిన మీడియా దాన్ని అణచివేస్తున్నది. వి6, టీ ఛానెల్, హెచ్‌ఎం టీవీ తప్ప కోస్తా రాయలసీమలలో సాగుతున్న విభజనానుకూల సమావేశాలను గురించి చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సామాజికాంధ్ర సామాజిక రాయలసీమ అనే నినాదాలు నెమ్మదిగా రాజుకుంటున్నాయి. సమైక్య వాదంలోనే సమైక్యం లేదని, విడిపోతే నష్టమేమీ లేదనే వాదం వేళ్లూనుకుంటున్నదని అనేక ప్రజాసంఘాల నాయకుల ప్రకటనలు విశదం చేస్తున్నాయి.ఏపీ ఎన్జీవోలు ఈ సమావేశం తరువాత ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా రుజువు చేశారు.

వారికి సమైక్యత అంటే ఏమిటొ తెలియదనేది ఇదివరకే తేలిపోయింది. కొత్తగా తేలిందేమంటే వారి ఎన్జీవోల సంఘానికి ఏపీ అని పేరు పెట్టుకునే అర్హత లేదు. నినాదంలో నిజంలేకపోయినా కనీసం పేరులోనైనా నిజం ఉంటే బాగుంటుంది కనుక వారు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల ఎన్జీవోల సంఘం అని పేరు పెట్టుకుంటే వారు ఒక్క నిజమైనా చెప్పినట్టు ఉంటుంది. ఇక తెలంగాణ వ్యతిరేకత, రాయలసీమ ఆంధ్ర పక్షపాతంతో వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారి డీజీపీకి ఆ పదవిలో ఉండే అర్హత రెండు కారణాల ఆధారంగా లేదు. ఒకటి -తెలంగాణ వ్యతిరేకత. రెండు -అక్షికమాస్తుల సంపాదన నేరాన్ని విచారించాలని సుప్రీంకోర్టు చేత చీవాట్లు తిన్నందుకు. దినేష్ రెడ్డి ఆస్తులకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఆరోపణలు వచ్చినా ఫిర్యాదును ప్రభుత్వం ఎందుకు పరిశీలించలేదని సుప్రీంకోర్టు నిలదీసింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గౌరవించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పొగరుబోతు తనాన్ని ప్రదర్శించారనడానికి మేమేమీ సంకోచించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర పదజాలాన్ని వినియోగించింది. ఆయన శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి మా దగ్గర పదాలే లేవని సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా విమర్శించింది. దినేష్‌రెడ్డి తన భార్య, ఇతర బంధువుల పేరున భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు ఫిర్యాదులు దస్తావేజులతో సహా అందిన తరువాత, దస్తావేజులు తప్పుడువి కావని తేలిన తరువాత, హోం శాఖ దర్యాప్తు జరపాలని ఆదేశించిన తరువాత కూడా చర్య ఎందుకు తీసుకోలేదు. దినేష్‌రెడ్డిని వదిలేసి ఆయన ప్రత్యర్థి ఉమేష్ కుమార్‌ను వేధించడానికే ప్రాధాన్యం ఇచ్చిందని అభిశంసించింది సుప్రీంకోర్టు. 14 జులై 2013న సుప్రీంకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని ఆదేశించిన తరువాత కూడా సర్కారులో ఏ కదలికా లేదు.

ఈ కేసులో అసలు నేరస్తుడు ఒకరైతే, వారిని కాపాడిన నింద మోస్తున్నది అత్యున్నతాధికారి ఛీఫ్ సెక్రటరీ. ఈ ఇద్దరికీ నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం కూడా సిగ్గుతో తలవంచవలసిన అభిశంసనలు సుప్రీంకోర్టునుంచి వచ్చాయి. కనుక వారు నేరస్తులే అవుతారు. ఇంతటి అభిశంసన తరువాత ఆ ప్రభుత్వానికిపభువులకు పదవుల్లో ఉండే అర్హత లేదు. ఈ మాట ప్రతిపక్షం డిమాండ్ కావాల్సి ఉంది. కాని వారు దరిదాపుల్లో లేరు. పత్రికలైనా రాయాలి. వారికీ ఆ లక్ష్యం లేదు.

తెలంగాణ వ్యతిరేకత, సీమాంధ్ర పక్షపాతం కారణంగా, అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని తెరచాటు రాజకీయాలతో వ్యతిరేకించే నాయకుడు సభానాయకుడుగా ఉండడానికి, ప్రతిపక్ష బాధ్యత నిర్వహించవలసిన వ్యక్తి యూటర్న్ లు తీసుకోవడంలో బిజీగా ఉన్నందున ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అర్హత ఉందా? అని జనం ప్రశ్న.

తెలంగాణ ఏర్పాటు కావలసిన ఈ సమయంలో పక్షపాతం లేని ప్రభు త్వం ఉండవలిసిన రోజులు. ఎట్లాగూ అడిగిన మేరకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం అంటూ కీలకమైన ప్రయోజనాలకు గండి కొట్టే విభజన నిర్ణయా లు తీసుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో సీమాంధ్ర మంత్రులు, వారికి అడుగులకు మడుగులొత్తే అధికార గణం, పోలీసు యం త్రాంగం చేయబోయే పన్నాగాలను ఉపముఖ్యమంత్రి నాయకత్వంలోని తెలంగాణ మంత్రులు, టీఎన్‌జీవోలు తిప్పి గొట్టగలుగుతారా? లేక ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి నిష్పాక్షికమైన ప్రభుత్వం కావాలని డిమాండ్ చేస్తా రా? ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

153

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

country oven

Featured Articles