ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు


Tue,August 20, 2013 01:44 AM

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర వీధుల్లో సాగుతున్న ఆందోళనల తీరు. అదొక సాంస్కృతిక ప్రదర్శన. అందులో రికార్డింగ్ డాన్సులుంటాయి. అది భాషావూపదర్శన కూడా. తెలంగాణ నాయకులను బూతులు తిడుతూ ఉంటా రు. అది నాటక వేదిక, వివిధ వేషాలు వేసుకున్న కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ మధ్య మధ్య జై సమైక్యాంధ్ర అంటూ ఉంటారు. అక్కడ రహదారుల కూడళ్లు దిష్టిబొమ్మలను తగలబెట్టే కేంద్రాలు. అక్కడ కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబడతాయి. వాటికి అంత్యక్షికియలు చేస్తున్నారు. పిండాలు పెడుతున్నారు. బొమ్మలకు గుండు గీస్తున్నారు.అప్పుడప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు విరగ్గొడతారు.

తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి ఈ ఇద్దరితో ఏ సంబంధం లేదన్న ఇంగితం ఉన్న వారు దాదా పు అక్కడ లేరు. వారి దయతో ఎంపీలయిన నాయకులు కూడా మౌనంగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెసనీ, అందుకు కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయా పార్టీలు అంగీకరించాయని వారికి తెలియజెప్పే తెలివైన వారికి సీమాంవూధలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. కనీసం ఆ విధంగా అన్నారని, తామే ఎన్నోసార్లు ఆ విషయం వార్తలు రాసామని ఒక్క విలేకరి కూడా అడగడు.తెలుగు వారంతా కలిసి ఉండాలంటారు. కాని తెలంగాణను వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కరూ తెలుసుకోరు. ఇన్నాళ్ల తెలంగాణఉద్యమంలో ఒక్క ఆంధ్రా ఉద్యోగిపైన కూడా దాడి జరగలేదు. అంతలోనే తెలంగాణకు చెందిన ఉద్యోగుల మీద దాడులు, వి.హనుమంతరావు మీద దాడులు. సీమాంవూధలోని వారికి, తెలంగాణలో ఉన్న సీమాంవూధులకు, సీమాంధ్ర మీడియా వారికి తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉందని కనిపించదు. పత్రికల్లో రాస్తున్నవి కలాలు కాదు కులాలు, ప్రమాణాలు కాదు ప్రయోజనాలు. ప్రశాంతంగా రోడ్ల మీద పండుగలు చేసుకుంటూ తీరిగ్గా నాట్యంచేస్తూ ఉంటే అదే ఉద్యమం అని ఇరవై నాలుగు గంటలు ప్రసారం చేస్తూ మీడియా ప్రచారబాధ్యతను కొనసాగిస్తున్నది.

ఏపీ ఎన్జీవోల సంఘం అంటే సీమాంధ్ర సంఘం. అందు లో ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా సభ్యుడు కాదు. తెలంగాణ ఎన్జీవోల సంఘం అంటే తెలంగాణ వారే ఉంటారు. అందు లో ఒక్క సీమాంధ్ర సభ్యుడు ఉండరు. ఈ విభజన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేయలేదు. కొన్ని దశాబ్దాల కిందట వీరే వేరయ్యారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వసంస్థలో ఉద్యోగులు రెండు ప్రాంతాలుగా చీలి పోయారు. సమైక్యాంధ్ర అంటే సీమాంధ్ర అని వీరే చాటిచెప్తున్నారు. తెలంగాణ ఎన్‌జీవోలు తమది తెలంగాణ అని నిజం చెపుతున్నారు. సీమాంధ్ర ఎన్జీవోలు నిజానికి సీమాంధ్ర ఎన్జీవోల సంఘం అని పేరు పెట్టుకోవాలి. కాని వారు ఆంధ్రవూపదేశ్ అనే పేరును దుర్వినియోగం చేసుకుంటున్నారు. అవాస్తవం చెపుతున్నారు. తమకు సమైక్యత లేదని చాటుకుంటూనే రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని స్క్రిప్టు లో రాసిన డైలాగులు లాగుతున్నారు.

ఉద్యోగులుగా కలిసి ఒక సంఘంలో ఉండలేని వారు తెలుగువారంతా ఒక్కటి అని నినాదాలు చేస్తూ ఉంటే వేదాలు వల్లిస్తున్న దయ్యాలు గుర్తుకు వస్తాయి. తాము తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని, వారు తమతో కలిసి ఉండక పోయినా బలవంతంగా తమతో కలిపి ఉంచాలనే వారి సమైక్య గోముఖం వెనుక ఉన్నది నిజమైన వ్యాఘ్రం. జై సీమాంధ్ర అంటే జై ఆంధ్రవూపదేశ్ కాదని చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తుంది. కేసీఆర్ కోదండరాం చిత్రాల్ని నీచంగా ఫ్లెక్సీలలో చూపడం, తలలు నరికేయాలని సందేశాలు ఇవ్వడం ఈ ఉద్యమంలో కనిపిస్తున్న దిగజారుడు సంస్కారం. రికార్డింగ్ డాన్సుల ద్వారా అసభ్య అశ్లీల వ్యవహారాలను ప్రదర్శనలలో భాగం చేసి ఉద్యమగౌరవాన్ని, స్థాయిని దెబ్బ తీసారని విప్లవ రచయితల సంఘం అధ్యక్షులు వరవరరావు విమర్శించారు.

జై ఆంధ్ర అని ఒకనాడు ఉద్యమం చేసిన వారు, కొందరు ఎంపీలు, మాజీ నాయకులు ఇప్పుడు జై సమైక్యాంధ్ర అంటున్నారే కాని జై ఆంధ్ర ప్రదేశ్ అనడం లేదు. జై తెలంగాణ అనడం లేదు. ఇంత కన్న వేరు భావన మరేదైనా ఉంటుందా? వీరా సమైక్యవాదులు. తెలంగాణ లేని, జై తెలం గాణ అనలేని ఈ అసలు సిసలు వేర్పాటు వాదులు సమైక్యం అని అవాస్తవాలు రాస్తున్నారు. పలుకుతున్నారు. సమైక్యభావాన్ని సమాధిచేసి కేవలం పదవులకోసం సమైక్యాన్ని మిగిల్చిన వారే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు. భాషావూపయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఒకే భాష మాట్లా డే జనం ఒకే రాష్ట్రంలో కలిసి ఉంటారన్న నమ్మకాన్ని నాశనం చేసిన సమైక్య ద్రోహులు. అన్నదమ్ముల వలె కలిసి ఉండే వాళ్లను విడగొట్టారని అబద్దాలు మాట్లాడే వారే భ్రాతృ ద్రోహులు. తెలుగు భాష మాట్లాడే వారిలో ఇటువంటి అనైతిక వ్యక్తులు ఉండడం తెలుగు తల్లి చేసుకున్న దౌర్భాగ్యం.

తెలంగాణ తల్లి అంటే తండ్రి ఎవరు అని ఒకపత్రికా రచయిత తమ ఆదివారం కాలంలో వ్యాఖ్యానించారు. ఇదేమాట భారత మాత, తెలుగుతల్లి అనే గౌరవనీయపదాలకు కూడా ఎదురు మాటగా విసిరితే వారు తమ శిరస్సును ఏ ఇసుకలో దాచుకుంటారు? ప్రపంచంలో ఎక్కడా భాషల పేరుతో తల్లులు లేరు. భరత మాత అంటారు గానీ హిందీ తల్లి అనరని అంతపెద్ద రచయితకు తెలియకపోవడం ఆశ్చర్యం. దేశాన్ని తల్లిగా భావించి గౌరవిస్తారు. తెలుగుతల్లి అనేది భాషతో మాతను జోడించిన ఏకైక ఉదాహరణ. దీనికి సాటి లేదు. అయినా తెలుగు తల్లి పదాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. కాని తెలంగాణతల్లి అని తెలంగాణ పదిజిల్లాల నేలను గౌరవించ దలచుకున్న తెలంగాణ ప్రజలను తెలంగాణ తల్లి అనే మాటను అవమానించవలసిన అవసరం ఏమిటి? ఇటువంటి దురహంకార అవమానాలు భరించలేక తెలంగాణ ఉద్యమించింది.

తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరిగిన తరువాత ఈ వివాద పరిష్కారం కోసం మరో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలని కేంద్రంలో ఉన్న ఏపీ రాష్ట్ర మంత్రులు ఆంటోనీ కమిటీకి నివేదించారు. తెలంగాణ ఏర్పాటు చేయాలా లేదా అని తేల్చడం కోసం దేశంలో మొత్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరాలను అధ్యయనం చేయాలా? అసలు వీరికి ఏంకావాలో తెలుసా? ఒకవేళ ఎస్సార్సీ వేస్తే వీరే వెళ్లి ఆంధ్రవూపదేశ్‌ను విభజించకూడదని మనవి చేస్తారు. కావాలంటే దేశంలో కొత్త రాష్ట్రాలు చేసుకోండి కాని ఏపీని మాత్రం విభజించకండి అంటారు. ఇప్పుడేమో తెలంగాణ ఇస్తే దేశంలో అనేక రాష్ట్రా లు కావాలనే ఉద్యమాలు వస్తాయని, దేశం ముక్కలవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఎవవరు ఎక్కడెక్కడ రాష్ట్రాలు అడగబోతున్నారో వివరిస్తూ పత్రికలు రాస్తున్నాయి. టీవీలు అదే పనిగా ఆ విషయాలే ప్రచారం చేస్తూన్నాయి. ఒకే ఒక ఎస్సార్సీ ఇప్పడి వరకు ఉండింది. అది కూడా తెలంగాణ ను ఆంధ్రతో కలపాలని సూచించలేదు. కలిపినా తాత్కాలికంగానే కలపాలని, ప్రజాభివూపాయం ప్రకారం వ్యవహరించాలని ఫజల్ అలీ కమిషన్ వివరించింది. ఆ ఎస్సార్సీని గౌరవించని ఈ పెద్ద మనుషులు ఇంకో ఎస్సార్సీని అడగడం చిత్తశుద్ధి లేని అనైతిక లక్షణమే.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన రాజకీయ పార్టీలు అవకాశ వాదాన్ని ప్రదర్శిస్తున్నాయని ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితిని రాజకీయ నాయకులే కల్పించారు. 2009 డిసెంబర్ 7,8తేదీల్లో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్‌లో ఉన్న వర్గాలు, అన్ని రాజకీ య పార్టీలలో ఉన్న సీమాంధ్ర ప్రతినిధులు లిఖితపూర్వకంగా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించారు. తెలంగాణ ప్రకటించగానే తమ నిజ స్వరూపం ప్రదర్శించి యూ టర్న్ తీసుకుని రాజీనామాల దుర్మార్గానికి ఒడిగట్టారు. మళ్లీ అనేక సార్లు ఈ పార్టీలు ‘తెలంగాణ ఇవ్వండి, ఇచ్చేది మీరే, మేం ఇవ్వలేము, మీరే ఇవ్వడం లేదు. మీరు ఇస్తే ఆపము. అన్న వారే వీరంతా.

తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీ వంటి కరడు గట్టిన సీమాంధ్ర పార్టీలు కూడా తెలంగాణ ఇస్తే ఇవ్వండి మీరే కదా ఇచ్చేది అని ఉత్తరాలు రాసారు. సిద్దాంతపరంగా తెలంగా ణ కాదంటూ విశాలాంధ్ర అనే సీపీఎం కూడా తాము వ్యతిరేకం కాదన్నారు. మొత్తం యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఒప్పుకున్నాయి. ప్రతిపక్షంలో ప్రధానపక్షమైన బీజేపీ అంగీకరించింది. సమాజ్ వాది పార్టీ కాదన్నా బహుజన్ సమా జ్ పార్టీ తెలంగాణ ను సమర్థించింది. అంటే దాదాపు దేశమంతా అంగీకరించింది, ఏకాభివూపాయం ఉన్నట్టే. చివరకు నిర్ణయం కూడా వచ్చిన తరువాత యూటర్న్ తీసుకున్న నాయకులు సీమాంవూధకు చెందిన ఆంధ్రవూపదేశ్ పార్టీల అధినేతలు.

రాష్ట్రాన్ని చీల్చి దేశ ద్రోహం చేసిందని కాంగ్రెస్‌ను తిడుతూ ఓట్లు సీట్లు సంపాదిద్దామని, వైఎస్‌ఆర్‌సీపీతో టీడీపీ పోటీ పడుతున్నది. ఇదంతా సమైక్యం కోసం కాదు. ఆ పేరుతో ఓట్లు సీట్లు దండుకోవచ్చుననే ఆశ. ఇదంతా ముందే ఊహించి కాంగ్రెస్ వారి తెలంగాణ ప్రకటన రాకముందే తెలంగాణ నేతలను జగన్ పార్టీ తన్ని తగలేసింది. వీరికి హైదరాబాద్ మీద ఆశలు చావవు. ఎందుకంటే హైదరాబాద్ నుంచే వీరు సీమాంధ్రలో ఉద్యమాలను రచించాలి. సీమాంధ్ర ఉద్యమ రాజధాని, సీమాంధ్ర రాజకీయ తాత్కాలిక రాజధాని హైదరాబాద్ అన్నమాట. వీరి పత్రికలు, టీవీలు పార్టీ ప్రధాన కార్యాలయాలు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, హైదరాబాదును, తెలంగాణను, తెలంగాణ ప్రజల ను తిడుతూ అవమానిస్తూ ఈ ఒక్కొక్క తిట్టును సీమాంవూధలో ఒక్కొక్క ఓటుగా తరువాత సీటుగా మార్చుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఎన్నికలమీద కన్ను వేసి పోటీలు పడి నిరాహార దీక్షలకు తయారవుతున్నారు. పైకి సమైక్యం అంటూ, తెలంగాణలేని సీమాంధ్రను సమైక్యాంవూధవూపదేశ్ అంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్న ఈ అవకాశ వాదులను ఎవరూ నమ్మరు. ఇక్కడ ఆ పార్టీలను తిరస్కరించే బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది. సీమాంధ్ర ప్రజలు వీరికి లక్ష్య శుద్ధి లేదని, వాస్తవాలు మాట్లాడబోరని, చెప్పేదొకటి చేసేదొకటి అని కూడా గమనించాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

109

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన