రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?


Mon,June 24, 2013 11:23 PM


చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బాష్పగోళాలు విసిరారు. తరువాత వాటిని వదిలేసి వెళ్లిపోయారు. హక్కులను ఆనాడు కాలరాసిన గుర్తులు హైదరాబాద్ ను ఇంకా విడవలేదు. పోలీసులు రోడ్డు మీద వదిలేసిన బాష్పవాయు గోళాలు ఇద్దరు పిల్లలను గాయపరిచాయి. 13 ఏళ్ల సంతోష్ రెడ్డి, 17ఏళ్ల వినోద్ రెడ్డి ఆ గోళాల్ని చేతుల్లోకి తీసుకుని, అందులో రసాయనాలు బయటకు తీసి, అగ్గిపుల్ల గీసినప్పుడు అవి పేలాయి. ఆ ఇద్దరు గాయపడి ఆస్పత్రి పాలైనారు. బాష్పవాయుగోళాల్లో పేలుడు పదార్థం ఉంటుందని, అది మరునాడైనా పేలుతుందని ఆ పిల్లలకు తెలియదు. దురదృష్టవశాత్తూ వాటిని విసిరిన పోలీసులకు కూడా తెలియదు. ఇదొక దౌర్భాగ్యం. ఒప్పందాలు మరిచిపోయినా సమ్మెలు చేయకూడదు. ఎవరైనా సరే పోలీసులు అనుమతిస్తేనే అసెంబ్లీకి వెళ్లాలె. ఏలినవారు అనుమతిస్తేనే డౌన్ డౌన్ అనాలె. లాఠీచార్జీల్లో దెబ్బలు తినాలె.

బుల్లెట్లు పేల్చితే గుండెలు చీల్చుకోవాలె. జట్టుపట్టి గుంజి వ్యాన్‌లో పారేస్తే సొమ్మసిల్లి పడిపోవాలె. అంతేకాదు మరునాడు పేలకుండా పడి ఉన్న బాష్పవాయు గోళాన్ని తీసేసే బాధ్యత గానీ, రోడ్డు మీద ప్రమాదకర వస్తువులను తొలగించే బాధ్యత కాని ఈ శాంతి రక్షకుల కు ఉండదు. హైదరాబాద్‌లో చలో అసెంబ్లీని సర్వనాశనం చేసినందుకు ఎంతో ఆనందంగా విజయోత్సవం చేసుకున్న ప్రభుత్వం వారు పోలీసులు, తెల్లారి ఇద్ద రు పిల్లలు గాయపడితే ఎందుకు బాధ పడతారు. పైగా పోలీసులు పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కనుకనే గాయపడ్డారని తీర్పు ఇచ్చారు. పేలుడు పదార్థాలను యుద్ధ భూమి గా మార్చిన భూమి నుంచి తొలగించాల్సిన బాధ్యత ఉంది. ఆ నిర్లక్ష్యం గురించి అసలు మాట్లాడే వారే లేరు. కనీసం ఆ విధంగా పేలని వస్తువులు వదిలేసి తమ విధిని విస్మరించినందుకు క్షమాపణ కూడా చెప్పలేదు.

నా హక్కును కాలరాసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని అడగడానికి ప్రజలకు వీల్లేని పరిస్థితి ఉంది. తప్పులు చేసి, అతిగా వ్యవహరించి, ఆడమగా, పిల్ల లు, పెద్దలు తేడా లేకుండా శాంతి భద్రతలకోసం దౌర్జ న్యం చేసే రక్షకుల భక్షక కార్యక్షికమాలను కోర్టులో ప్రశ్నించబోరు. పరిహారం కోరాలని తెలియదు. తెలిసినా కేసులు వేయరు. చెప్పవలసిన సమాచారం చెప్పకపోతే 25 వేల రూపాయల దాకా జరిమానా విధించవచ్చని సమాచార హక్కు చట్టం 2005లో స్పష్టమైన నిబంధన చేర్చడం వల్ల అంతో కొంతో సమాచారం ఇస్తున్నారు. లేకపోతే ఆ చట్టం చట్టుబండలైపోయేది. ప్రభుత్వోద్యోగుల మీద అటువంటి బాధ్యత మోపే చట్టం మరొకటి ఏదీలేదు. ఒకడు మరొకడిని కొడితే నేరం. కాని పోలీసులు కొడితే నేరం కాదా? సమ్మె చేసే హక్కు ఉందని చట్టాలు చెప్పినా, హక్కులకోసం ఊరేగింపులు తీయవచ్చునని, సత్యాక్షిగహాలు జరిపే స్వేచ్ఛ ఉందని రాజ్యాంగం చెప్పినా వాటిని పట్టించుకునే వారెవరూ లేరు. అతిగా వ్యవహరించి, అధికారాన్ని అతిక్షికమించి, జనం హక్కులను ఉల్లంఘిస్తే పోలీసుల పైన నష్టపరిహారం కోసం కేసులు వేసే అవకాశాలు అనేక ప్రజాస్వామ్యదేశాల్లో రాజ్యాంగాలు కల్పించాయి. సివిల్ దావాలు వేసి పరిహారం వసూలు చేసి న సందర్భాలు వేలకు వేలున్నాయి. కొన్ని రిట్ పిటిషన్లలో తప్ప జిల్లా కోర్టుల్లో నష్టపరిహారం కోరిన సందర్భాలు కాని ఇచ్చిన న్యాయాలు కాని జరగలేదు.

రైలు ఆలస్యంగా రావడం వల్ల, నగరంలో అర్థరాత్రి దిగిన ఒక బంగారం వర్తకుడిని పోలీసులు దొంగ అని అనుమానించారు. బంగారు వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఆ వర్తకుడు తాను దొంగను కానని నిరూపించుకున్నా డు. తన నగలుతనకు ఇవ్వాలని కోరాడు. కాని అప్పడికే ఒక కానిస్టేబుల్ ఆ నగ లు చోరీ చేసి పారిపోయాడు. తనకు పరిహారమైనా ఇవ్వాలని ఆ వర్తకుడు కోరితే, తాము అనుమానించి అరెస్టు చేయడం, సొమ్ము స్వాధీనం చేసుకోవడం రాచకార్యాలనీ, ఆ గొప్పపనిచేయడంలో పొరబాట్లు జరిగితే పరిహారం చెల్లించవలసిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్ సర్కారు వాదించింది. రాజ్యాంగంలో ఆవిధంగా చేసిన ప్రభుత్వోద్యోగులను పరిహారం చెల్లించేందుకు బాధ్యులను చేసే చట్టాలు చేయలేదని, ఆదురదృష్టకరమైన చట్టాల పరిస్థితిలో పరిహార చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని, ఆ వర్తకుడు కస్తూరీలాల్ నగలు కోల్పోవలసిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1965లో వచ్చిన ఈ తీర్పుతరువాతైనా హక్కులు హరించే విధంగా తప్పులు చేసే పోలీసులపైనా, అధికారుల పైనా పరిహారం చెల్లిం చే బాధ్యత విధిస్తూ ప్రభుత్వం చట్టాలు చేయలేదు. అయితే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ప్రభుత్వం గానీ అధికారులుగానీ పోలీసులు గానీ పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

దాదాపు ప్రతిసారీ ప్రభుత్వం ప్రజల ఖజానానుంచి డబ్బు తీసి గాయపడిన పౌరులకు ఇచ్చిందే గాని తప్పుచేసిన పోలీసుల నుంచి పరిహారం వసూలుచేయలేదు. అంటే జనం గాయాలకు జనమే బాధ్యత వహించి డబ్బు చెల్లించాలన్న మాట. పోలీసుల మీద కేసులు వేసి నష్టపరిహారం వసూలుచేయడంలో గాయపడిన అమెరికా పౌరులు వెనుకాడరు. హక్కులను కాలరాస్తే వారు కేసులు పెడతారు. సివిల్ క్రిమినల్ కోడ్‌ల కింద ఇటువంటి కేసులు వేస్తారు. రాష్ట్ర చట్టాలు సమాఖ్య చట్టాలు కూడా ఇటువంటి బాధ్యతను అధికారుల మీద మోపుతాయి. పోలీసుల సివిల్ క్రిమినల్ బాధ్యతలు అనే అంశంపైన పరిశోధన చేసిన ఆర్ వి డెల్ కార్మెన్ తన పత్రంలో పోలీసులు తమ విధుల పరిధిని దాటి వ్యవహరించకూడదని, ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలని, అసలు నియమాలేవో తెలుసుకొని ఉండాలని, వివాదాస్పద అంశాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా రాయాలని సలహా ఇచ్చారు.

42 యు ఎస్ సి ఎస్ 1983 లేదా సెక్షన్ 1983 చట్టం అని పిలిచే ఒక చట్టం కింద అమెరికా సమాఖ్యలో అక్రమంగా ప్రవర్తించిన పోలీసులపైన అనేక సివిల్ లా దావాలు పడుతున్నాయి. ఎవరైనా పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామనే ముసుగులో, రాజ్యాంగం, చట్టాలు ప్రజలకు ఇచ్చిన హక్కులు, ప్రత్యేకాధికారాలు, మినహాయింపులను ఉల్లంఘించే విధంగా గాయపరిస్తే అందుకు దావా వేసి పరిహారం కోరే హక్కు ప్రజలకు ఉందని చాలా స్పష్టంగా చెపుతున్నది. న్యూయార్క రాష్ట్ర రాజ్యాంగం ఆర్టికల్ 1 లో పౌరుల హక్కుల జాబితా ఇచ్చారు. అందులో వివక్షకు గురి కాకుండా ఉండే హక్కు, అక్రమంగా తమ ఇండ్లను ఇతర స్థలాలను శోధించకుండా ఉండే హక్కు, హక్కులకు భంగం కలిగితే, నష్టపరిహా రం కోరే హక్కు ప్రాణాలు తీసే విధంగా గాయపరిస్తే పరిహారం డిమాండ్ చేసే హక్కు ఉన్నాయి.

మన రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి హక్కును స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచకపోవడం ఆశ్చర్యకరం. మనదేశంలో ప్రజలకు తప్ప అందరికీ హక్కులున్నాయి. ప్రత్యేకాధికారాలున్నాయి. మినహాయింపులున్నాయి. పెద్దలు రచించిన రాజ్యాంగం గద్దలు చించిన పుస్తకమైంది. ప్రజాస్వామ్యం పౌరహక్కులు సంవిధాన నియమాలు మార్గదర్శక సూత్రాలు అన్నీ గంగపాలు. పోలీసులకు మినహాయింపులు, న్యాయమూర్తులను విమర్శలనుంచి రక్షించడానికి కోర్టు ధిక్కార చట్టం, అధికారులను రక్షించడానికి రహస్యా ల చట్టం, చట్టసభ సభ్యులు ఏం మాట్లాడినా వోటు వేయడానికి ఏవిధంగా వ్యవహరించినా సరే ఏమీ అనకుండా వదిలేయాలనే రాజ్యాంగ నియమాలు ఉన్నాయి. ప్రజలకు పౌరులకు ప్రాధమిక హక్కుల జాబితా పెద్దగానే ఉంది. కాని పోలీసులు అధికారులే తప్పు చేస్తే వారిని జవాబుదారు చేసే హక్కుల ప్రస్తావనే లేదు.

రాజ్యాంగం అమలు తీరును సమీక్షించిన కమిషన్ లో ప్రముఖ న్యాయమూర్తులు ఎం ఎన్ వెంకటాచల య్య, జీవన్ రెడ్డి ఈ పరిస్థితిని చర్చించారు.. ప్రభుత్వాధికారులు చేసే తప్పులకు బాధ్యత వహింప చేసే న్యాయమైన శాసనం కాని, సరైన విధానం కానీ లేదు. రాచకార్యాల నిర్వహణ పేరుతో అక్రమాలు చేసిన ప్రభుత్వాధికారులనుంచి పరిహారం పొందే అవకాశాలను చట్టం నిరాకరిస్తున్నది. ఇది ఏకపక్ష నియంతృత్వ విధానం. రాజ్యం ప్రజల కోసమే నిర్మితమైన మాటే నిజమైతే చట్టం ఈ విధంగా ఉండకూడదు. పౌరులనురక్షించడానికి వారిసంక్షేమాన్ని పెంచడానికి ఏర్పాటయిన రాజ్య యంత్రాంగం తమ ప్రతినిధులుచేసిన తప్పులకు బాధ్యత వహించే సూత్రాన్ని అనుసరించి తీరాలి. అసలైన ప్రత్యేక పరిస్థితులో తప్ప ఈ సూత్రానికి మినహాయింపులే ఉండకూడదు అని ఈ కమిషన్ నివేదిక (2002) లో పేర్కొన్నది. చలో అసెంబ్లీకి అనుమతించకపోవడం ఒక అక్రమం. అందులో పాల్గొనడానికి నిరాయుధంగా వస్తున్న జనాలను ఆపడం, గాయపరచడం, వాహనాల్లోకి విసిరేయడం, విచక్షణారహితంగా వేలాది అరెస్టులు చేయడం వంటి ఒక్కొక్క హక్కు భంగాన్ని గాయాన్ని నిలదీసి, కోర్టులో వేలాది దావాలు వేయవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమ పార్టీ మీద, న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి మీద ఉంది. రాజ్యాంగంలో ఇటువంటి హక్కును స్పష్టంగా కల్పించి, పోలీసుల కు అధికారులకు తప్పులుచేసే అధికారం, చేసి తప్పించుకునే వెసులు బాటు లేదని హెచ్చరించే బాధ్యత ఉంది.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన

Featured Articles