ద్వేషం చిమ్మిన దమనకాండ


Tue,June 18, 2013 12:58 AM

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు త్వం భయపడి భయపెట్టిన ఉదాహరణలు. అన్ని రాజకీయపార్టీల కన్నా ఉత్సాహంతో పాల్గొన్నది ప్రజలు. కాంగ్రెస్ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు వ్యవహరిస్తే, తెలంగాణకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు జై తెలంగాణ అంటూ ఉంటే అందులో ఇతర ప్రాం తాల వారికి అదో తమాషా. ఏదో విజయం సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్ర నాయకత్వం మళ్లీ ఏదో ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నది. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారని, తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే సీమాంధ్ర కాంగ్రెస్ తిరుగుబాటు చేస్తుందని కేంద్రం భయపడుతున్నదని మీడియా వారు, తమ అభివూపాయాలను జోడించి వార్తలు రాశారు. చలో అసెంబ్లీపైన ఉక్కుపాదం మోపి జూన్ 14న తామే బంద్ నిర్వహించిన సర్కారు శనివారం నాడు బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ఆయుధంగా వాడింది. చలో అసెంబ్లీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత పతనమైంది. ప్రజల ఆకాంక్ష మరింత బలపడితే కొన్ని పార్టీల విశ్వసనీయత మరింత ప్రశ్నార్థకంగా మారింది.

అర్థాలు మారిపోయినై. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అంటే తెలంగాణను ద్వేషించే సీమాంధ్ర సర్కారు. ప్రతిపక్షం అంటే తెలంగాణకు రాజకీయం కోసం అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిని దుమ్మెత్తిపోస్తూ అధికారపార్టీతో మమేకం అయ్యే కాంగ్రెస్ తోక పార్టీ. తెలంగాణ మంత్రులంటే తెలంగాణ నుంచి ఎన్నికైనా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించలేని, దద్దమ్మలు అని తిడుతున్నా పట్టించుకుని సహనశీలురైన పదవీ ప్రియులు. పాలకపక్షం అంటే రాస్తారోకో చేసే అధికార వర్గం. ట్రాఫిక్ యంత్రాంగం అంటే ఒక్క సామాన్యుడిని కూడా కదలనీయకుండా రోడ్ల మీద బారికేడ్లు కట్టి రాకపోకలను అడ్డుకునే మంత్రాంగం. పోలీసులు అంటే ముళ్ల కంచెలు కట్టి వాటిని కాపాడడం కోసం అంకిత భావంతో పనిచేస్తూ అడ్డొచ్చే వారిని అడ్డంగా కొడుతూ జనులను, ఎమ్మెల్యేలను, విద్యార్థులను ఎవరినైనా సరే అరెస్టే చేసి భౌతికంగా ఎత్తుకుపోయి వ్యాన్‌లో పడేసే భటులు. ఆడవారు, ముసలి వారు, జబ్బుపడిన వారు, పడిపోయిన వారు అనే ఆలోచనతో సంబంధం లేకుండా కొట్టి, ఎత్తి, గుంజి, అదరగొట్టి, తిట్టి, కట కటాల్లోకి తోసే ప్రజాపాలనా రక్షకులు.

కేంద్రం అంటే ప్రజా ఉద్యమాన్ని అణచివేసిందని మెచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇచ్చే గొప్ప ప్రభుత్వం. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వకుండా ఆ ఉద్యమాన్ని విఫలం చేయడ మే పరమ ధ్యేయంగా వారం రోజుల నుంచి శ్రమిస్తూ పాలనను మొత్తం ఆ పని మీదే కేంద్రీకరించిన గొప్ప వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వం. చలో అసెంబ్లీ అంటే ఆ పిలుపు అందుకునేది ప్రభువులు, పోలీసులు. వారే ముందుగా అసెంబ్లీకి పరుగెత్తిపోయారు. మరోసారి ప్రభుత్వం ఉలిక్కి పడింది. శాంతియుతంగా సాగిన చలో అసెంబ్లీ రోజంతా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. తెలంగాణ ప్రాంతం రాష్ట్రంలో ఒక విస్తారమైన భాగం అనే భావన ప్రభుత్వానికి ఉందా? సమైక్యత అంటే ఇదా? కలిసి ఉండ డం, కలుపుకొని పోవడం అంటే ఇదా? పది జిల్లాల ప్రజల డిమాండ్‌ను, ఉద్వేగాన్ని, ఉద్యమాన్ని ఇంత ద్వేషంతో అణచివేసే ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వమేనా? లేక కేవలం సీమాంధ్ర ప్రయోజనాల రక్షణకే పరిమితమైన సర్కారా?

తెలంగాణ జేఏసీ చలో అసెంబ్లీని జరపాలని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రకరకాలుగా మార్చేసింది. తెలంగాణ ఐకాస బంద్ పిలుపు ఇవ్వకపోయినా రాజధాని ప్రతిష్టంభన చేయాలని కోరకపోయినా రాష్ట్ర పోలీసులు దగ్గరుండి ఆ పని జరిపించారు. బహుశా ఐకాస ఆ పిలుపు ఇచ్చి ఉంటే పోలీసులు దాన్ని ఏ విధంగా విఫలం చేసే వారో ఊహించలేము. రాజధానిలో అసెంబ్లీ దారితీసే రోడ్లన్నిటినీ మూసివేశారు. సాయుధులైన పోలీసులు ప్రతి కీలకమైన ప్రాంతాన్ని ప్రతిష్టంభన కేంద్రంగా మార్చివేసి అణచివేత ఏర్పాట్లు చేసి ఆందోళనను విజయవంతం చేశారు.

అసెంబ్లీ దాకా వస్తే తప్ప ఎంద రు వచ్చారో లెక్కతెలియని స్థితి నుంచి అసెంబ్లీకి వచ్చే వారేమోనని అందరినీ అనుమానించి పాతిక వేలమంది దాకా అరెస్టు చేసి మరికొన్ని వేల మందిని బైండోవర్ నిర్బంధాలకు గురిచేసి, మాజీ ఎమ్మెల్యేలను ఇతర నాయకులను అరెస్టుచేసి. అసెంబ్లీ వైపు దూసు కు వచ్చిన వారిని కొట్టి పోలీసులు అనూహ్యమైన స్థాయిలో తెలంగాణ ఉద్యమ ఘట్టాన్ని ప్రభుత్వ ఖర్చుతో దగ్గరుండి గెలిపించారు. వైద్యం అవసరమైన వారిని కూడా కదలనివ్వని ఘన మానవతావాదాన్ని సర్కారు చాటింది. 1200 వందల మంది పోలీసులు ఎవరినీ అసెంబ్లీ వరకు రానివ్వకుండా శ్రమ పడుతూ ఉంటే ఇతర పోలీసు సిబ్బంది ఒక్కరోజులో1376 మందిని అరెస్టు చేసింది.

పోలీసుల విధులంటే ముళ్ల కంచెలు నిర్మించడం, రాళ్లు విసరడం, లాఠీలు తిప్పడం, బాష్పవాయుగోళాలు పేల్చడం, మనుషుల్ని పోలీసు వాన్లలోకి ఎక్కించడం అన్నమాట. అంబుపూన్స్‌లను కూడా అనుమతించలేదంటే వారికి ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. పోలీసులు పిడిగుద్దులు కురిపించడంలో శిక్షణ పొందినట్టు ఉంది. ముఖ్యమంత్రి సూచించినట్టు ఒక్క రబ్బరు బుల్లెట్ కూడా పేల్చకపోయినా, వేలాది ఆందోళనకారులకు పిడిగుద్డులు వడ్డించారు. మనుషులకు వారి బతుకులకు హక్కులకు మానవ విలువలకు ఏమాత్రం లెక్క లేకుండా, తెలుగు సినిమాల్లో చూపించినట్టు విలన్ గ్యాంగ్‌కు చెందిన వారి కాళ్లు విరిచి, వెన్నెముకను బద్దలు కొట్టి, మెడలు తెంపి, శరీరాలను గిరాగిరా తిప్పి గోడలకు బండరాళ్లకు, కారు అద్దాలకు కొట్టి వేసే ట్రిక్కులు కూడా పోలసులు నేర్చుకుంటారేమోననిపిస్తున్నది.

ఒక పోలీసు కానిస్టేబుల్ ఆందోళన కారుడి మర్మాంగం మీద కొట్టి అతన్ని విజయవంతంగా పడగొట్టాడు. కోదండరాం, విద్యాసాగర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, ఇంద్రసేనాడ్డి పోలీసుల దెబ్బలకు గాయపడ్డారు. ఇంద్రసేనాడ్డిని వ్యాన్లో తోసి, నినాదాలు చేయకుండా నోరుమూసి పిడిగుద్దులు గుద్దారు. శ్రీనివాస్ గౌడ్‌ను కొందరు పోలీసులు వ్యాన్‌లోకి దురుసుగా తోస్తుంటే ఇంకో పోలీసు తల మీద లాఠీతో బాదినట్టు పత్రికలు రాశాయి. ఎల్లయ్య కాళ్లకు తీవ్రగాయాలు చేశారు. కవితను పడదోశారు. ఆమెతో ఉన్న ఇతర మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. ద్వేషం, కసి అమానుషత్వం వంటి దుర్మార్గ లక్షణాలను పోలీసులు బాహాటంగా ప్రదర్శించడం చాలా ఆందోళనకరమైన విషయం.

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య అధ్యాయంలోని చీకటి అణచివేత వ్యూహాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో, అసెంబ్లీ పరిసరాల్లో అక్షరమక్షరం అమలుచేసినట్టు స్పష్టమవుతున్నది. ఎన్ని బారికేడ్లు నిలిపినా, ఎన్ని వేలమందిని అరెస్టు చేసినా అసెంబ్లీ గేట్లదాకా జనం రావడం, అసెంబ్లీలోకి దూసుకుపోయే యత్నం చేయడం ఆందోళన కారుల పట్టుదలను సూచిస్తుంది. అసెంబ్లీ లోపలిదాకా ఆందోళనను వ్యాపింపజేసే పనిని శాసనసభ్యులు నిర్వహించారు. బంద్ పిలుపు ఇవ్వకపోయినా పోలీసులే స్వయంగా దుకాణాలను మూయించి చిన్న పెద్ద రాస్తాలను పూర్తిగా నిలిపివేయడం విశేషం. కొందరు నాయకులను ఇంటికే పరిమితం చేసి వారిని బయటకు రానీయకుండా నిర్బంధించింది. ఇక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాస్తారోకోను స్వయంగా నిర్వహించింది. స్థానికంగా బస్సులను ఆపేసింది. తెలంగాణా జిల్లాల నుంచి బస్సులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నది.

ఎన్ని లక్షల రూపాయల నష్టం వచ్చినా వారికి అనవసరం. తెలంగాణ పౌరుపూవరినీ అసెంబ్లీ దరిదాపులకు రానివ్వకపోవడమే సర్కారు నిర్ధారించిన లక్ష్యం. శ్రద్ధగా పాటించారు. ఈ లెక్కన ఆర్టీసి సంస్థను ప్రజావూపయోజనాలను రక్షించే రవాణా సౌకర్య సంస్థగా కాకుండా, ఆందోళనకారులకు సహకరించే పనేదీ చేయకుండా సర్కారును ఆందోళనల నుంచి రక్షించడానికి ఒక పోలీసు అధికారి వలెనే ఆలోచించే అధికారి మాత్రమే ఉండాలన్నదే అసలైన వ్యూహం అయి ఉండాలి. ఇక ఏప్రభుత్వమైనా ఆర్టీసికి పోలీసు అధికారులనే ఉన్నతాధికారులుగా నియమిస్తారు. పాలన, సౌకర్యాలు సంస్థకు లాభా లు ఇవేవీ ముఖ్యం కాదు. కేవలం ఆందోళనను అరికట్టడమే ముఖ్యం. ఒకరోజు ముందు నుంచే రైళ్లను రద్దు చేసి, తెలంగాణా జిల్లాల్లో రైళ్లను హైదరాబాద్‌కు రాకుండా జూన్ 14 దక్షిణ మధ్య రైల్వే రైల్ రోకోను విజయవంతం గా నిర్వహించింది. లక్షల రూపాయల నష్టాన్ని భరించింది. నగర రైళ్లను కూడా నిలిపివేశారు.

తెలంగాణ ఉద్యమం విషయంలో న్యాయ వ్యవస్థనుంచి సరైన సూచనలు వచ్చాయి. శాసన వ్యవస్థ తెలంగాణ ప్రతినిధుల మైనారిటీ బలహీనతను అణచివేయడానికి ప్రయత్నించినా ఉద్యమ నిరసనను ప్రకటించడానికి, సభా వేదికను, ప్రాంగణాన్ని, అసెంబ్లీ భవనం పైకప్పును, పరిసరాలను కూడా వాడుకోవడం, దిష్టి బొమ్మదగ్ధం చేయడం, శవయావూతలు చేయడం ప్రభుత్వాన్ని కలవర పెట్టి, వారి ప్రజావ్యతిరేకతను జనం కళ్లకు కట్టించిన సంఘటనలు. తెలంగాణవాదులను అరెస్టు చేయడంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్టు నియమాలను పాటించాలని పోలీసులకు రాష్ట్ర హైకోర్టు సలహా ఇచ్చింది. అరెస్టు చేస్తున్నప్పుడు మానవ హక్కుల రక్షణ చేయాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులలో వివరించింది. అవి ఎవరికి గుర్తున్నాయి. ఏ పోలీసులకు వాటిని చెప్తున్నారు? ఏ పోలీసులు వాటిని అమలు చేస్తున్నారు? ఎందరు పౌరులకు ఆ నియమాలు తెలుసు? ఎందరు ఆ నియమాలను అమలుచేయాలని నిలదీయగలుగుతున్నారు? తలలు పగులగొట్టి, కాళ్లు విరగ్గొట్టి, మర్మాంగాల మీద కొట్టే పోలీసులు మానవ హక్కులు భంగపడకుండా అరెస్టులు చేస్తారా? ఈ న్యాయం ఎవరు
చలో అసెంబ్లీలో పౌరహక్కులను ప్రభుత్వం కాలరాసింది. వేలాదిమందిని అక్రమం గా నిర్బంధించింది. వాక్, సమావేశ స్వాతంవూత్యాల్ని హరించింది. తన్నులతో గుద్దులతో, లాఠీలతో కొట్టడంతో పౌరుల జీవన హక్కులను అమానుషంగా భంగపరిచింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం. అమానుషం. మంత్రివర్గం, పోలీసులు ఉన్నా ప్రభుత్వం లేదు, పాలన లేదు. ఉన్నదొకటే అడుగడుగు నా తెలంగాణ ద్వేషం. కరడు గట్టిన అమానుషత్వం. తెలంగాణ ఇవ్వక తప్పదని తెలుసు. కానీ కాంట్రాక్టర్ రాజకీయ నాయకులు తమ దోపిడీని వీలైనంత మేరకు కొనసాగించడానికి వీలైనంత ఆలస్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్యం.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త.

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన