విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు


Tue,June 11, 2013 12:43 AM


దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమాన్ని కొందరు కొనసాగిస్తున్నారు. విశాలాంధ (విశాల + అంధ, విశాలాంవూధుల కాదు) మహారభస పేరుతో విశాలాంధ్ర మహాసభ వారి అసత్యాలను ప్రజల ముందుకు తేవడం చారివూతిక అవసరమని గుర్తించి ఎన్.వేణుగోపాల్, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక నాయకులు కొణతం దిలీప్, కె.బాల్‌రెడ్డి (మలుపు బుక్స్ ప్రచురణ సంస్థ)పుస్తక రూపంలో దీటైన జవా బు ఇచ్చారు.‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ మహారభస, పచ్చి అబద్ధాల పరకాలకు అసలు నిజాల జవాబు’ అనే సరైన పేరుతో అబద్ధాలకు సమక్షిగమైన ప్రతి స్పందనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దురదృష్టవశా త్తూ చదువుకున్న వారు తమ కలాలను అమ్ముకుంటున్నారు. వారికి రాజ పోషకులు, కావలసినంత డబ్బు సమకూరుస్తారు. ఢిల్లీలో వేదికలు దొరుకుతాయి. మీడియాలో, పత్రికల్లో రోజూ నాలుగు కాలాలూ కొనుక్కోగలుగుతారు. అట్లా ప్రచారంలోకి వచ్చిన ఒక్కొక్క అబద్ధాన్ని, అబద్ధమని రుజువు చేస్తూ విశాలాంధ్ర శిశుపాలుల నూటొక్క తప్పుల లెక్క తేల్చి, తలల నిం డా విద్వేషపు చీకటి నిండిన శిశుపాలుర శిరశ్చేధం చేసే సుదర్శన చక్రం వంటి పుస్తకం ఆవిష్కరణ ఈరోజు జరుగుతున్నది. వాస్తవాలతో అబద్ధాల ను ఖండించడంసాధ్యమే. కాని కొందరిలో పీకల దాకా నిండిపోయిన తెలంగాణ విద్వేషాన్ని ఖండించడానికి ప్రయత్నించడం అవసరంలేదు. ఈ చారివూతక నేపథ్యంలో వేణుగోపాల్ పుస్తకానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఎవరూ ఒక ఉద్యమాన్ని పూర్తిగా నెగేట్ చేయలేరు. ఒక వాదాన్ని ఖండించే ప్రయత్నం మాత్రమే ఎవరైనా చేయగలిగింది.వాస్తవాలు తెలియకపోవ డంవల్ల, తెలిసినా చూడకూడదనే స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాల వల్ల వాదాన్ని ఖండించడం కూడా చేయలేకపోయారని వేణుగోపాల్ నిరూపించారు. రుజువులు లేని ఉద్యమం అనే మొదటి పేరు ‘తెలంగాణ వేర్పా టువాదుల 101అబద్ధాలు వక్రీకరణలు’ అనే రెండో పేరుతో వచ్చిన తెలు గు పుస్తకం కూడా తప్పుల శీర్షికతో మొదలైంది.

ఉద్యమం ఉందని కొత్తగా రుజువులు చేయాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ దాకా సెగలు తాకిన ఉద్యమం ఉరుముతూ ఉండడం వల్లనే ఇటువంటి భావ దరివూదులు అవాస్తవ పుస్తకాలకు అపరిమిత ప్రచారం ఇచ్చుకునే విఫల ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. పోనీ ఉద్యమవాదనలకు రుజువులు లేవని అనదలచుకున్నా నాలుగేళ్ల ప్రయత్నంలో పరకాల ప్రభాకర్, నలమో తు చక్రవర్తులు మాత్రమే కాదు అటువంటి తలకిందుల మేధావులు (మేతావులు) కనీసం డజను మంది ఉద్యమవాదనలను ఖండించబోయి బొక్కబోర్లా పడిన విషయం తెలుసు. తెలంగాణవాదనలు వినిపించడానికి వందలాదిగా ఉన్నారు. సమైక్యవాదనలు వినిపించడానికి గట్టిగా నలుగురు లేరు అని వాపోయే హైదరాబాద్ పత్రికాధిపతులతో చానెల్ చర్చల నిర్వాహకులలో ఏ ఒక్కరిని అడిగినా ఉద్యమవాదనలు ఎంత బలమైనవో, ఉద్యమ వ్యతిరేక వాదనలు ఎంతబలహీనమైనవో అర్థమైఉండేది. అసలు ఉద్యమ వ్యతిరేకులకు వాదనలంటూ ఏమన్నా ఉన్నాయో లేవో తెలిసి ఉండేది.. అని వేణుగోపాల్ వివరించారు. విశాలాంధ పుస్తకానికి రచయిత లేడు- ఉమ్మడి కృషి ఫలితం అని రాసుకున్నవారి పుస్తకానికి ముందుమాటలో ప్రతి వాక్య మే కాదు ప్రతి అక్షరం ఖండన చేయవలసి వస్తుందని రచయిత పేర్కొన్నా రు. ప్రతివాక్యం అబద్ధం,అహంకారం, మూర్ఖత్వం అని వివరించారు. తమకు తాము జాగ్రత్తగా నిశితంగా పరిశీలించిన శ్రమించిన పరిశోధకులు గా కితాబులిచ్చుకునే ఈ రచయితలు తెలంగాణ వాదుల వాదనలుగా తాము చెపుతున్న ఏ ఒక్కవాదానికి తెలివిగా ఏ ఆధారమూ ఇవ్వలేదు. గనుక ప్రత్యర్థుల వాదనలు తిరగ రాయడంలో విశాలంధ్ర మహాసభ హస్తలాఘవం ఎంత ఉందో ఎవరికి వారు తేల్చుకోవలసిందే.

అది అంధ మహాసభ అని చూపడానికి వెయ్యిన్నొక్క రుజువులున్నాయి. ‘అంజుమన్ ఎ తబ్లీగ్ ఎ ఇస్తామ్’ అనే పేరు కూడా తెలియకుండా ‘అంజుమన్ తబ్లి గులిస్లామ్’ అనే అర్థం పర్థం లేని పదాలతో విశాలాంధ్ర ఇంగ్లిషు పుస్తకం పేజి 16లో చేసిన తప్పుడు వాక్యాలను వేణుగోపాల్ ఎత్తి చూపిన తరువాత కూడా సవరించుకోకుండా తెలుగు అనువాదం ప్రకటించారని రచయిత వెల్లడించారు. హైదరాబాద్‌లో నిజాం పాలనాకాలంలో మత సామరస్యం ఉందని తెలంగాణ చరివూతకారులు రాసిన అంశాన్ని ఖండించడానికి వారు ఆధారపడిన తప్పుడు తడకలను వేణుగోపాల్ వివరించారు. నిజాం కాలంలో నాలుగు హిందూ మత సంస్థలు, మూడు ఇస్లాం మత సంస్థలపైన నిషేధం విధించిన విషయం గానీ, మతసామరస్యంతో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉండి కుటిల రాజకీయం చేస్తున్న మత రాజకీ యవాదులపైన చేసిన పోరాటాలను గానీ విశాలాంధులు పట్టించుకోకుండా వక్రీకరించిన విషయాన్ని రచయిత తేల్చి చెప్పారు.వరంగల్లు జిల్లా బమ్మెర పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతం అని తన కావ్యానికి పేరు పెట్టారని ఈ పరిశోధకులు కనిపెట్టారు. వారికి తెలియనిదేమంటే కావ్యంలో ప్రతి అధ్యాయం చివర కవి తన గురించి పుస్తకం గురించి రాసుకునే సంప్రదాయం ఉందనీ దాన్ని ఆశ్వాసాంత గద్యం అంటారనీ. ఆశ్వాసాంత గద్యలో పోతన ఎక్కడా శ్రీమదాంధ్ర మహాభాగవతం అని రాయలేదు.‘శ్రీమద్భాగవత పురాణంబు’ అని మాత్రమే పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రచురణ కర్తలు చేర్చిన పదం శ్రీమదాంధ్ర మహాభాగవతం అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలో పోతన భాగవతం అని ఉందని వారికి గుర్తుచేశారు. ఆంధ్ర అని కలపడం వల్ల కొత్తగా ఏదో ఒరిగిందని, అదో కుట్రఅని చెప్పబోవడం లేదని ఆంధ్ర అనే పదం పోతన కావ్యంలో లేదనే సత్యం చెప్పడానికే ఈ సాక్ష్యాలు చూపానని వేణుగోపాల్ వివరించారు.

విశాలాంధ మేధావులు ఇంగ్లీషు పుస్తకంలో ఐదు సూత్రాల పథకం అని సరిగ్గానే రాసి, తెలుగులో దాన్ని ఆరుసూవూతాల పథకంగా మార్చారు. మొద ట ఎనిమిది సూత్రాల పథకం, తరువాత ఐదు, ఆ తరువాత ఆరు సూత్రా లు ప్రతిపాదించారని, మొదటి రెండు అమలుకాలేదనే చారివూతక వాస్తవం ఉమ్మడి రచయితలకు తెలియదని వేణుగోపాల్ తేల్చారు. విశాలాంధుల అబద్ధాల పుస్తకంలో పది పదిహేను విషయాలు రెండుసార్లు, మూడుసార్లు అవే వాక్యాలతో పునరుక్తం చేశారనీ, ముస్లింల పట్ల, ఉర్దూ పట్ల అనేక చోట్ల విశాలాంధులు వ్యతిరేకత ప్రకటించారనీ వివరించారు. మతోన్మాదంతో ముస్లిం వ్యతిరేక భావజాలంతో చరివూతను తారుమారు చేసే హక్కు అబద్ధాల రచయితలతో సహా ఎవరికి లేదని వేణుగోపాల్ చెప్పారు. 2500 ఏళ్ల చరివూతలో తెలుగు వారంతా ఒకే పాలన కింద లేని కాలం 2100 వందల ఏళ్లయితే, మిగిలిన నాలుగొందల ఏళ్లలో కూడా మొత్తం తెలుగు భూభాగం ఒకటిగా ఉందని చెప్పడానికి సరైన ఆధారాలే లేవనీ పుస్తక రచయిత తేల్చి చెప్పి, విడివిడిగా ఉన్నాం కనుక విడగొట్టండి అని తెలంగాణ అడగడం లేదన్నారు.అయినా కలిసి ఉన్నాంఅని అబద్ధాలు చెబు తూ ఆ కారణంగా కలిసే ఉంచండి అని విశాలాంధులు అనడం ఎంత చారివూతక అవివేకమో వేణుగోపాల్ వివరించారు. కలిసి లేకపోయినా కలిసి ఉం డాలని కోరుకోవడంలో తప్పులేదు అంటూ అసలైన విశాల భావాన్ని రచయిత ఈ పుస్తకంలో చాటారు. ఇవ్వాళటి భూభాగంతో సమానమైన ప్రాం తం ఒకే పాలన కింద ఒకే రాజకీయ అస్తిత్వంతో 1956 నవంబర్ 1 కన్న ముందులేదని చారివూతక ఆధారాలతో వేణు రుజువు చేశారు.

నిజాం పాలనలోని తెలంగాణకు బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతానికి మధ్య సంబంధాలు లేవని తెలంగాణవాదులు అంటున్నారని పేర్కొంటూ దాన్ని ఖండించడానికి విశాలాంధులు ప్రయత్నించారు. వీరు ఏవిధంగా తమకు కావలసిన వాక్యాలు మాత్రమే ఉటంకించి, తమకు ఇష్టంలేని వాక్యాలను తొలగించి మాడపాటి హనుమంతరావు సంఘటనను వక్రీకరించిన విషయం రచయిత బట్టబయలు చేశారు. తెలంగాణలోని జిల్లాలను మద్రాసు రాష్ట్రంలో కలపాలని ఎవరూ అనుకోవడం లేదని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన తెలంగాణ ఆంధ్రోద్యమము పేజి 118-9 స్పష్టం గా రుజువుచేసింది. దీన్ని తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్య సంబంధం అని వాదించే పేలవమైన అంధ ప్రయత్నాన్ని వేణుగోపాల్ తిప్పికొట్టారు. నిజామాబాద్, మెదక్ సరిహద్దులలో మంజీర నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు గురించి, వరంగల్ జిల్లా అటవీ ప్రాంతాలకు సంబంధించి వలస రావడానికి ప్రభుత్వం చేసిన ప్రకటనను, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో కొత్తగా నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టుల కోసం నిజాం కోస్తా ప్రజలను పిలిచాడని నిర్భీతిగా ఒక అర్ధసత్యాన్ని మరొక అబద్ధంతో కలిపి వండేశారు. కాలువల కింద వ్యవసాయం తెలిసిన వారిని సరిహద్దులలోకి ఆహ్వానించారు. సరిహద్దు జిల్లాలు కాని ప్రాంతాలలో కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడి భూముల దురాక్షికమణను తెలంగాణ రైతాంగం ఎంతగా వ్యతిరేకించిందో వివరించే గోలకొండ పత్రిక వ్యాసాలను వేణుగోపాల్ ఉటంకించారు.

తెలంగాణవాదులు లేవనెత్తని వాదాలను లేవదీసారని అబద్ధాలు రాస్తూ దాన్ని ఖండించడానికి ఏవిధంగా పూనుకున్నారో వివరించారు. ‘విశాలాంధ్ర నినాదం సామ్రాజ్యవాదం’అంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులు ఉటంకించడం ఖండించడానికి చేసిన వక్ర ప్రయత్నాలను, విశాలాంధులు ఇచ్చిన ఆధారంలోనే ఉన్న నిజాలను వేణుగోపాల్ చూపించారు. పూర్వ హైదరాబాద్ రాజ్యాన్ని విభజించాలన్న రామానంద తీర్థను అయ్యదేవర కాళేశ్వరరావులను నెహ్రూ వ్యతిరేకించిన అంశం వేణుగోపాల్ ఆధారాలతో రుజువుచేశారు. నెహ్రూ వ్యాఖ్యలపై తెలంగాణవాదం అబద్ధమెట్లా అయిందో విశాలాంధ చెప్పలేకపోయింది. ఈ అంశంపైన వేణుగోపాల్ చేసిన విశ్లేషణ చదివితే అంధత్వం అడ్డొస్తే తప్ప కుహనా సమైక్యవాదులకు కూడా కనువిప్పు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని వంటి నేతలకు లిఖిత ప్రసంగాలు మరెవరో రాస్తారని, దాన్ని యథాతథంగా చదవకుండా నాయకులు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మార్పులు చేస్తారని విశాలాంధులకు కనబడలేదు. ఆనాటి ప్రజా నాయకుడు నారాయణడ్డి, ఇంజనీరు సర్వోత్తమరావు సాక్ష్యాన్ని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తను కనిపిస్తున్నా చూసే ఇష్టంలేని వారిని అంధులనక తప్పదు. మొదట్లో విలీనం మంచిదే అనుకున్న వారు తరువాత జరిగిన మోసం తెలుసుకుని విడిపోవడమే కరెక్టనుకున్నవారు కూడా ఉన్నారు. నెహ్రూ వ్యాఖ్యలపైన గోలకొండ పత్రిక సంపాదకీయాలను, బస్తర్ తెలంగాణ, చాందా ప్రాంతాలతో రెండో తెలుగు రాష్ట్రాన్ని ఫజల్‌అలీ కమిషన్ సిఫార్సు చేసిన వార్త ప్రచురించిన ఆంధ్రవూపభ 1954 జూలై 13 పత్రికను వేణుగోపాల్ ప్రచురించారు.

హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విలీనానికి వ్యతిరేకి అని, వేర్పాటువాదులు ప్రజల మనసులో అబద్ధం నాటారని విశాలాంధ అబద్ధానికి రుజువులున్న పేజీలు 51-53 చదవాల్సిందే. ఉద్యోగాల అన్యాక్షికాంతం గురించి వివరించారు. ఆర్థికాంశాలను గణాంకాలను తప్పుడుగా ఉటంకించిన విశాలాంధులు చదవని నివేదికల జాబితా, భార్గవ కమిటీ నివేదికలో విశాలాంధులకు రుచించని అంశాలు కూడా ఉన్నాయని వేణుగోపాల్ వివరించారు. ఇంకా జలవనరుల దోపిడీ, ఖనిజాల దోపిడీ, విద్యలో వివక్ష, వ్యవసాయం పరిక్షిశమలలో అన్యాయాలకు సంబంధించి విశాలాంధవాదుల అబద్ధాలను, బూటకపు వాదాలను సాక్ష్యాధారాలతో పేజీలు 81-97 పేజీలలో రుజువు చేశారు. ఇక 64నుంచి101 అంశాల దాకా రాజకీయాలు అనే భాగమున్నది.ఇది మిగిలిన మూడు భాగా ల కన్న ఎక్కువ విషపూరితం. ఈ భాగం కూడా విశాలాంధ్ర మహాసభ చరిత్ర అజ్జానానికి అద్దంపడుతుంది. వీరికి పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలియదు. అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో దానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎనిమిదో అధ్యాయంలో తప్పులేదని, నోటికి ఏది వస్తే అది,అబద్ధాలు, అర్ధసత్యాలు, వంచనలు, నిందలు, శాపనార్థాలు, తలకిందుల వాదనలు అన్నీ కలిపి వండారు. ఈ అంశాలలో విశాలాంధ వాదులు చేసిన వాదనలలో ప్రతి ఒక్కదానికి ప్రతివాదన ఉంది. నిక్కమైన నిజాలే వారి వాదనలు జవాబు చెపుతాయి. తెలంగాణలోని పదివేల గ్రామాలు ఒక్కుమ్మడిగా లేచి నిలిచాయి. ప్రతి ప్రజా సమూహం తెలంగాణ ఆకాంక్షతో సంఘటితమైంది. కులం, మతం, వర్గం, వయోభేదం, స్త్రీ పురుషభేదం, ఉద్యోగభేదం ఏవీ అడ్డురాని ఒక విశాల ప్రజా ఐక్యత ప్రదర్శితమైంది. ఈ క్రమంలో పెల్లుబికిన సృజనాత్మక వికాసమే విశాలాంధ్ర మహారభసకు జవాబు.ఇంత చెప్పినా అర్థం కాని విశాలాంధులు చాలా మంది ఉంటారు. వారికోసం మరికొన్ని పేజీలు ఉన్నాయి. అందులో మానవత్వం గురించి, సహజ న్యాయం గురించి, మనుషులు, మేధావుల బాధ్యత గురించి ప్రజాస్వామ్య బాధ్యతల గురించి ఉంది. చివరన చదవదగిన పుస్తకాల జాబితా ఉంది. ద్వేషం నిండిన కొందరు ఇవి చదవరు. వారు చదివిన చదువులకు వీటిని చదివించే శక్తి లేకపోవడం ఆ చదువుల తప్పుకాదు, చదువుకొన్న వారి తప్పు. కాని వారితో సహా ఇది అందరూ చదవాల్సిన పుస్తకం.

పొఫెసర్ మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి