సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం


Tue,June 4, 2013 04:20 AM

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని చీల్చివేసింది. ఈ ప్రాంతంలో భూములు, నీళ్లు, చెరువులు, సబ్సిడీలు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతూ తెలంగాణపై అంతులేని విషాన్ని, విద్వేషాన్ని కక్కుతున్నది. పైకి కళామతల్లి. తెర మీదనే సమైక్య సందేశం. తెర తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని వెక్కిరించే ద్వేషం. ఈ తారల నిజస్వరూపం తెలుసుకోవడం కష్టం. రాజకీ య నాయకులు నటనలో ఈ తారలతో తీసిపోనట్టే, రాజకీయాలలో సినీనటులు నాయకులకన్నా తీసిపోరు. రాజకీయపార్టీల వలెనే సినీపరిక్షిశమలో పేరెన్నిక గన్న కుల కుటుంబాలు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవు అనే మాటకు వ్యతిరేకార్థం తీసుకోవలసిందే. వారిలో నరనరాల జీర్ణించుకుపోయిన తత్వం - కుల తత్వం, ప్రాంతీయ తత్వం, తెలంగాణ వ్యతిరేకత్వం. 1969లో తెలంగాణ ఉద్యమం సాగుతున్నపుడు ఈ ప్రాంతీయాతీత మహోన్నత కళాకారులంతా మన అభిమానుల్లో సగం మంది ఎందుకు వేరు రాష్ట్రం కావాలనుకుంటున్నారని కనీస ఆలోచన కూడా చేయకుండా సమైక్య నినాదాలు, గీతాలు రాయించి సినీ దృశ్యాలు తీయించి జనం మీదకు వదిలినవారే.

ముల్కీ నియమాలు రాజ్యాంగ వ్యతిరేకం అని రాష్ట్ర హైకోర్టు 2:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసి, హైకోర్టు మైనార్టీ తీర్పు ఇచ్చిన జస్టిస్ కొండా మాధవ రెడ్డి (తెలంగాణ బిడ్డ) అన్వయాన్ని సమర్థిస్తూ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని నిర్ధారించిన తరువాత ఆ తీర్పు ఫలాలు తెలంగాణకు అందకుండా 1972లో జై ఆంధ్ర ఉద్యమం లేవదీశారు, రాజ్యాంగబద్ధమైన ముల్కీ నియమాలను రాజకీయంగా నాశనం చేసి, తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించే విధంగా ఇందిరాగాంధీ మీద ఒత్తిడి చేయడమే వీరి లక్ష్యం. 1969లో సమైక్యత పేరుతో తెలంగాణను వ్యతిరేకించిన వారు, 369 మంది తెలంగాణ కోసం కాల్పుల్లో చనిపోతే ఒక్క సానుభూతి మాట కూడా చెప్పలేదు ఈ సినీ నట రత్నశేఖర సమ్రాట్టులు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారికైనా సానుభూతి పలికే మానవత్వాన్ని నటించారు. పత్రికల్లో ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు జనవరి 1973లో ఇచ్చారు. సినిమాలకు వసూలైన సొమ్ములో ఒకరోజు మొత్తాన్ని చనిపోయిన వారి సహాయనిధికి ఇచ్చారు.

అప్పుడు మంచివాళ్లకు మంచివాడు సినిమా ఒకరోజు వసూళ్లు ఇచ్చి కృష్ణ ఆయన భార్య విజయనిర్మల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మద్రాసులో ఒకరోజు నిరాహారదీక్ష కూడా చేశారు. ఇక ఎన్‌టిఆర్, తెలుగు ఆత్మగౌరవ పరిరక్షకుడు, తెలుగుదేశ వ్యవస్థాపన చేసి అల్లుడి చేతిలో ఆ పార్టీని పెట్టిన నటరత్న 1969 కాలంలో సమైక్యాంధ్ర సినీగీతాల వైతాళికుడే. అయినా జైఆంధ్ర ఉద్యమ కాలానికి మాట మార్చి ప్రత్యేకాంధ్ర ఇవ్వాలన్నారు. నటసావూమాట్ బిరుదాంకితులైన అక్కినేని నాగేశ్వరరావు వారితో గొంతు కలిపి ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలని 1973 ఫిబ్రవరి 17న బ్రహ్మాండమైన పత్రికా ప్రకటన చేశారు. (ఇది ఆనాటి ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఆ ముక్కను ప్రచురిస్తూ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న సవాల్ రెడ్డి గారు ‘నమస్తే తెలంగాణ’లో ఒక వ్యాసం రాశారు). తెలంగాణలో ఉన్న అభిమానులు చనిపోతే ఫరవాలేదు, వారికి సమైక్య మంత్రోపదేశం చేస్తారీ మహానుభావులు. జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలుపోయిన అభిమానులకు ధనసాయం చేసి సమైక్యవాదానికి పాతర వేస్తారు ఈ నటవీరులు. ప్రజాభివూపాయాన్ని గౌరవించాలన్న నీతి వీరికి తెలంగాణ ప్రజల అభివూపాయాన్ని గౌరవించవలసినప్పుడు గుర్తురాలేదు.

1973లో ఆంధ్రుల కోసం గుర్తొచ్చింది. భిన్నదృక్పథాలతో కలిసి ఉండడం కంటే స్వేచ్ఛగా సోదరభావంతో జీవించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు అప్పుడు చెప్పుకున్నారు ఈ ఇద్దరు నటులు. ఎన్టీఆర్ లేకపోయినా ఆయన కుటుంబం ఇంకా రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ వెలుగులు వెలుగుతూనే ఉన్నది. ఎన్నార్ తన మూడుతరాల కుటుంబ సినీ సమ్రాజ్యాన్ని సామ్రాట్టుగా హైదరాబాద్‌లో ఏలుతూనే ఉన్నారు. కళాకారులు రాజకీయాలకు అతీతమైనా, ప్రజాదరణతో పెంపొందిన కళారంగం ప్రజల మనోభావాలకు ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించదని కనుక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా ఆంధ్రవూపదేశ్‌ను విభజించాలని డిమాండ్ చేశారు ఈ మాట్నీ దేవుళ్ళు. వారి వారసులు ఇక్కడి ఎస్టేట్ వ్యవహారాలలో పడిపోయి ఇది ఎవరి స్క్రిప్టో, ఎవరి డైలాగులో మరిచిపోయి ఉంటారు. ఆనాటి తమ ప్రకటన వారికి ఇప్పుడు గుర్తుకు రాదు.

వీరే కాదు పత్రికావ్యాపార ప్రకటనల రూపంలో 1973 జనవరిలో పలువురు విసిరిన కొన్ని సినీ డైలాగులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. తెలుగుసినీ పరిక్షిశమ మానవతా నిధి సమితి వారు ఈవిధంగా ప్రకటించారు: ఒకనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి సామరస్యంగా ఆంధ్రు లు విడిపోయారు. ఈనాటికి కూడా లక్షలాది తెలుగు వారు ఇంకా తమిళ నాడులో స్థిరపడిపోయారు. ప్రభుత్వ న్యాయ సినీ వ్యాపార పారిక్షిశామిక కళా రంగాలలో ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నారు. వారు తెలుగువారని చెప్పితే తప్ప తెలియనంతగా తమిళ సోదరులు వారిని తమలో కలుపుకున్నారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ సోదరులు విడిపోయినా ఎంతో సామరస్యంతో ఒక తల్లిబిడ్డల్లా బతుకుతూ పురోభివృద్ధి చెందగల సదవకాశం ఉన్నది, ఆ అవకాశాన్ని కేంద్ర నాయకత్వం స్వప్రయోజనాలకోసం అవరోధిస్తున్నది.... అంటూ అమరవీరులకు విరాళాలు ఇవ్వమని అడిగారు. తెలుగు చలన చిత్ర నిర్మాతలు మరొక ప్రకటన విడుదల చేస్తూ ఒకే భాషకు చెందిన తెలుగుజాతి 16 సంవత్సరాల కలయికలో పొందిన అనుభవంతో సోదరులుగా విడిపోయి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించుకుని సుహృద్భావంతో ప్రశాంతంగా జీవించాలని ఉభయులూ ఆరాటపడుతున్నారు... వేర్పాటుకు అంగీకరించి ఈదారుణ రక్తపాతాన్ని అరికట్టవలసిందిగా ప్రధానమంవూతికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

ఇదేరకమైన వినతిని కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, పిలకా గణపతి శాస్త్రి, ఆరుద్ర, అనిసెట్టి సుబ్బారావు, కె రామలక్ష్మి, దాశరథి, సినిమా డైరెక్టర్లు కె ప్రత్యగాత్మ, కె ఎస్ ప్రకాశరావు, జి రామినీడు, హేమాంబరధరరావు, తాతినేని రామారావు, ఎ. పూర్ణచంవూదరావు, టి. ఎల్. బాబు, ప్రొడ్యూసర్లు పి వి సుబ్బారావు, చెరుకూరు ప్రకాశరావు, తమ్మాడ్డి కృష్ణమూర్తి, కె. కుటుంబరావు విడిగా ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన చేయాలని 1973 జనవరి 24న 60 మంది చిత్ర నిర్మాతలు వినతి చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజల కోర్కెకు తమ సమావేశంలో పూర్తి మద్దతు వ్యక్తం చేశారు. ప్రజలు ఏమికోరుతున్నారో తెలుసుకుని పరిష్కారమార్గం ఆలోచించాలని ఆనాటి హీరోయిన్ వాణిశ్రీ అడ్వర్టయిజ్‌మెంట్ ద్వారా అభ్యర్థించారు. తాను ఉద్యమ దిగ్విజయాన్ని ఆకాంక్షించే ఆంధ్రుడిని అంటూ సినీ హీరో రామకృష్ణ ఇంకో వాణిజ్య ప్రకటనలో చెప్పారు. జై ఆంధ్ర అంటున్న ఆంధ్రుల ఆనందం కోసం వారితో ఒక కంఠం కలుపుతానని, ఒక లాటీ దెబ్బయినా తినాలని అలా కాని నాడు నేను ఆంధ్రుడనే కానని నాకు అనిపించిందని మరో హీరో కృష్ణంరాజు వ్యాపార ప్రకటన విడుదల చేశారు. అన్నదమ్ములు విడిపోతానంటే పెద్దలు కలసి ఉండమని చెప్పడం మంచిదే కాని విపత్కర పరిస్థితిలో కలిసి ఉండమనడం మూర్కత్వమే అవుతుంది (అచ్చుతప్పు ఆ వ్యాపార ప్రకటనలోదే, నాది కాదు) అని కృష్ణం రాజు చెప్పారు. ఇప్పుడు వేయిమంది చనిపోయినా చలించని వీరు తెలుగువారా?

రోము పట్నం తగులపడుతుంటే ఆనందంతో నీరో రాజు ఫిడాలు వాయించాడుట అలాగాక ప్రస్తుతపు గడ్డు పరిస్థితిలో ఆనందం కోసం సినిమాలు ప్రదర్శించడం నాకిష్టం లేదు అంటూ నాటి కథానాయిక జమున గుంటూరులోని తన అలంకార్ ధియేటర్‌ను 26.1.73నుంచి కొంతకాలం నిలిపివేయుటకు నిశ్చయించుకున్నానని తన వ్యాపార ప్రకటనలో వివరించారు. జై ఆంధ్ర అమరవీరులకు ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. వీరి దృష్టిలో తెలంగాణ ఉద్యమ వీరులు బలిదానం చేసినా అమర వీరులు కాదు, అసలు మనుషులే కాదు. చలం, శారద మాత్రం అటు తెలంగాణ సోదరులు ఇటు ఆంధ్ర సోదరులూ ప్రత్యేక రాష్ట్రం అనే ఒకే లక్ష్యంకోసం ప్రాణాలను బలిదానం చేస్తున్నారని సానుభూతి తెల్పుతూ ఇంకొక వ్యాపార ప్రకటన చేశారు. రక్తపాతం లేకుండా గమ్యం చేర్చే నాయకత్వాన్ని ప్రసాదించాలని భగవానుని ప్రార్థిస్తున్నానంటూ అంజలి ఘటించి అంజలీదేవి వ్యాపార ప్రకటనలో జై ఆంధ్ర అన్నారు. ఈ విధంగా కృష్ణ, విజయనిర్మల, శోభన్ బాబు, యస్ వి రంగారావు జనవరి 1973లో అనేక ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటనలు ప్రచురించిన పత్రికలను స్కాన్ చేసి మిషన్ తెలంగాణ వెబ్‌సైట్‌లో మిత్రుడు కొణతం దిలీప్ అందరికీ అందుబాటులో తెచ్చారు. ఈ మానవతావాదులు, సమైక్యవాదం తప్పని తెలుసుకున్న కళాకారులు అహింసాత్మకంగా సాగుతున్న ఉద్యమం పట్ల ఎవరినీ బాధించకుండా తామే తనువులు త్యాగం చేసిన వేయిమంది తెలంగాణ బిడ్డల పట్ల ఏమాత్రం సానుభూతి చూపకుండా రాక్షస మౌనం పాటించడం ఏం న్యాయం. వారి వ్యాపారాలు, సినిమాలు, సన్మానాలు భజనలే తప్ప జనం గొడవే వీరికి పట్టదు. చనిపోతున్నవారిలో వీరి అభిమానులున్నారని వీరికితోచదా?. కళకు వ్యాపారాలు, డబ్బుకు కులాలు, సినిమాలకు ప్రాంతీయభేదాలు ఉంటాయని ఇవేవీ లేని అభిమానులకు తెలియదు. ఇటువంటి పిచ్చి అమాయకులనే అందరూ మోసం చేస్తారు.

రాజకీయపార్టీల వలెనే సినీ ప్రముఖులు కూడా తెలంగాణను వ్యతిరేకించడానికి సమైక్యవాదాన్ని వినిపించారు. అవకాశం దొరికినపుడు, నకాబు తీసి, జైఆంధ్ర అంటూ తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణను ఇంకా దోచుకోవడం కోసం మళ్లీ సమైక్యం సమైక్యం, తెలుగువారంతా ఒకటి, అన్నదమ్ములు అంటూ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీశ్రీ వాక్యాన్ని తెలుగు సినీ సామ్రాజ్య చరిత్ర కూడా అక్షరాలా అమలు చేస్తున్నది. తెలుగు సినిమా వాళ్లు మద్రాసులో ఉన్నంత కాలం దగ్గరగా ఉన్న కోస్తాంధ్ర జిల్లాల సంపన్న వర్గాలు ఆధిపత్యం చెలాయించారు. వీరేదో ఆంధ్ర దేశానికి మేలుచేసినట్టు కళామతల్లికి సేవచేసినట్టు నటిస్తూ హైదరాబాద్‌కు తరలినప్పుడు, విపరీతమైన సర్కారీ సబ్సిడీలతో ఎకరాలకు ఎకరాలు భూములు భోంచేసేశారు. పేరుకు కళ, చేసేది ఫక్తు వ్యాపారం, అదీ అందరికీ అవకాశం ఇచ్చేనీతే లేని కుల వ్యాపారం. శ్రమదోపిడీ, జూనియర్ ప్రతిభావంతులమీద ప్రముఖ రచయితల మేధోసంపత్తి చౌర్యం,, జూనియర్ కళాకారులను శృంగార వస్తువులుగా వినియోగించే ఘరానా వ్యభిచారం, తమ కులానికి చెందని వారినే ఏకైక కారణంతో ఆ వ్యక్తులను అన్నిరకాలుగా వాడుకోవడం, అవకాశాలు రాకుండా తరిమివేయడం, దొంగకేసుల్లో ఇరికించడం, శీలహనన ప్రచారాలతో భ్రష్టు పట్టించడం, కుల గుత్తాధిపత్యంతో ఇతరుల సినిమాలు ఆడడానికి వేదిక కూడా లేకుండా వేధించడం అందరికీ తెలిసినవే. ఈ సంకుచిత సమ్రాట్టులు, సూపర్‌లు మెగాలు, రత్నాలు, పద్మాలు తెలంగాణపై దోపిడీ కొనసాగడం కోసం సమైక్య సూత్రాలు వల్లించి తెలంగాణ వ్యతిరేకత చాటుకుంటున్నారు. అమ్ముడుబోయే రచయితలు సమైక్యాంధ్ర గీతాలు రచిస్తారు. సినీ టీవీ మీడియాలో పాడిందే పాట గా వేస్తుంటారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే పాటకు మేకప్ తీసేస్తే అంతా మనది చేసుకుని మేమే వెలుగుతాం అనే ధోరణి కనిపిస్తుంది.

అన్నహీరో, తమ్ముళ్లు మాదకవూదవ్యాలు అమ్ముకునే వారు, మరికొందరు ఎస్టేట్ మేనేజర్లు, ఇంకొందరు వ్యాపార వ్యవహారాలు చూసేవారు. ఇతర తమ్ముళ్లు రాజకీయాలు నడిపేవారు. ఇదీ వీరి కళాపోషణ. వీరి కళాసేవ ఓ బోగస్. సమైక్యత ఓ ఖాళీనినాదం, కుట్రల విధానం. డబ్బు సంపాదన, సొంత కుటుంబ వారసులను జనం నెత్తిన రుద్దడం తప్ప వీరికి మరో లక్ష్యం ఉందా. బెట్టింగ్‌తో ఏ విధంగా క్రికెట్‌ను ఐపిఎల్ భ్రష్టు పట్టించిందో, సీమాంధ్ర సినీ పరిక్షిశమ, మోస వ్యాపార గుత్తాధిపత్యాలతో కళను ఏనాడో కళంకితం చేసింది. గుడ్డి అభిమానంతో తారలను ఆరాధించే మూర్ఖ, అమాయక, తెలివి తక్కువ, వెర్రిమాలోకాలు ఆడియో రిలీజ్ సొంతడబ్బా వంశ కీర్తి భజన కార్యక్షికమాలకు హడావుడిగా వచ్చిరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడం మానేసి ఈ దుర్మార్గుల కుట్రలు వ్యాపారాలు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే వీర ఆటలు శతదినోత్సవాలు చేసుకుంటున్నాయి. వీళ్లే ప్రచారాలకు వస్తారు. తెలంగాణ వ్యతిరేకంగా కుహనా సమైక్యం వినిపిస్తారు. ఈ కళావ్యాపారుల నిజస్వరూపాలు తెలుసుకోవడమే అసలు సిసలు చైతన్యం. ఇప్పుడున్న గాంధీలు నిజంగా గాంధీలు కాదు. కాంగ్రెస్ తాతల నాటి కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం ఎన్టీఆర్ స్థాపించిన ఒరిజినల్ పార్టీ కాదు, రంగులు పూసుకుని విగ్గులు పెట్టుకుని ఎవరో రాసిచ్చిన వాక్యాలు భట్టీ బట్టి చదివే వ్యాపారులు కళాకారులు కాదు. అభిమానులంతా ఈ నిజం అర్థం చేసుకున్నప్పుడే నిజమైన కళకు నీరాజనాలు అందుతాయి. కుల కుటుంబ కళా విహీన నీలి వ్యాపారాలు కుప్పగూలుతాయి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

38

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన

Featured Articles