ఆరని పగలు-అమాయకుల బలి


Mon,May 6, 2013 03:06 PM

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్టే వారే. వీరికి సరబ్‌జిత్, సమానుల్లాల గతి పట్టాల్సిందే నా? సరబ్‌జిత్ సింగ్ తాగుడు అతని కొంప ముంచింది. చివరకు పాకిస్థాన్ పగబట్టి ప్రాణాలు తీసేదాకాపోయింది. 28 ఆగస్టు 1990 నాడు పాకిస్థాన్ సరిహద్దు గ్రామంలో ఉన్న తన పొలం దున్నుతూ ఉన్న సరబ్‌జిత్ కాస్త మందెక్కువ తాగి తరువాత దారితప్పి, ముందుకుపోయి దేశపు సరిహద్దుదాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. కసూర్ దగ్గర ఖల్రా సరిహద్దు లో పాకిస్థాన్ రేంజర్లు సరబ్‌జిత్‌ను పట్టుకున్నారు. అక్కడి నుంచి అతని నర కం ఆరంభమైంది. కుటుంబ సభ్యులు తొమ్మిది నెలలపాటు ఇతని గురిం చి వెతికి వెతికి విసిగిపోయారు.

పాకిస్థాన్‌లో బందీగా ఉన్న విషయం వారికి తెలియదు. ఏడాది తరువాత పాకిస్థాన్ జైలు నుంచి సరబ్‌జిత్ రాసిన ఉత్తరం లో తనను మన్జిత్ సింగ్ అనే పేరుతో అరెస్టు చేశారని, తన గుర్తింపు కాగితాలేవీ వెంట లేకపోవడం వల్ల తాను సరబ్‌జిత్ అంటే వారు నమ్మడం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. పాకిస్థాన్ అధికారులు సరబ్‌జిత్ సింగే అసలైన మన్జిత్ సింగ్ అంటూ కేసు రుద్దారు. మన్జిత్ సింగ్ రట్టూ అనే వ్యక్తి చెల్లని చెక్కుల నేరంలో అరెస్టయ్యాడు. అతన్ని రెండు రోజుల కస్టడీకి రిమాండ్ చేశా రు. అతనే బాంబు దాడులు చేయించాడని అనుమానించారు. అతని పోలిక లు కొన్ని ఉన్న సరబ్‌జిత్‌ను ఇందులో ఇరికించారని ఒక విమర్శ. అసలు నేరస్తుడు మన్జిత్‌సింగ్ట్ట్రూ అయిఉండవచ్చ నీ, సరబ్‌జిత్ మాత్రం ఏ నేరమూ చేయలేదని కుటుంబ సభ్యులు వివరించారు. ‘నేనే మన్జిత్‌సింగ్ట్ట్రూ అని తన చేత నేరం ఒప్పించార’ని సరబ్‌జిత్ తన లాయర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పట్టుకున్న వెంటనే పాకిస్థాన్ పోలీసులు గొలుసులతో కట్టివేసి, కళ్లకు గంతలు కట్టి క్రూరంగా హింసించారని కూడా అతను రాశాడు. ఏ నేరమూ చేయకుండానే సరబ్‌జిత్ 19 సంవత్సరాల పాటు ఒంటరి జైలు శిక్ష అనుభవించ డం అత్యంత దారుణమని బ్రిటిష్ లాయర్ జాస్ ఉప్పల్ విమర్శించారు.

సరబ్ పాకిస్థాన్ హద్దుల్లోకి ప్రవేశించడానికి నెలరోజుల ముందే జరిగిన లాహోర్ బాంబుపేలుళ్ల కేసులో అతన్ని ఇరికించారు. టెర్రరిస్టు అన్నారు. భారత్ పక్షాన గూఢచారిగా వ్యవహరిస్తూ నిఘా వేశాడని కూడా అతనిపై నేరారోపణలు చేశారు. భారత్ పక్షాన గూఢచారిగా నిఘా వేసిన వాడు టెర్రరిస్టు ఎట్లా అవుతాడో? పాకిస్థాన్ అధికారులే చెప్పాలి. ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీసుకు చెందినవాడని, కెమెరా ముందు అతను ఫైసలాబాద్, లాహోర్‌లో బాంబుదాడులు చేసినట్టు అంగీకరించాడని పాకిస్థాన్ ఆరోపణ. మాన్ సింగ్ అనే అతడిని ముందు కెనడాలో పట్టుకుని ఆ తరువాత ఇండియాలో పట్టుకున్నారట. ఈ విధంగా బుర్రకు తోచిన ఆరోపణలన్నీ చేసి జైలులో తోశారు.

పాకిస్థాన్ సైనిక కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. లాహోర్ హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు ఆ శిక్షను ఖరారు చేశాయి. మన్జిత్‌సింగ్ అనుకుని సరబ్‌జిత్‌ను పట్టుకున్నారని, కనుక అతనికి శిక్ష వేయడం సరికాదని వాదిస్తే,‘పేర్లతో ఏముంది? అతను నేరం అంగీకరించిన తరువాత’ అంటూ లాహోర్ హైకోర్టు అతని శిక్షను సమర్థించింది. అసలు నేరాంగీకారం ఏ కోర్టులో నూ నమోదు చేయలేదు. టీవీ కెమెరాకు ఇచ్చిన నేరాంగీకార ప్రకటనకు అంత విలువ ఇచ్చి మరో సమర్థన లేకుండా మరణ శిక్ష వేయడం సరికాదు. జడ్జి ప్రశ్నించినపుడు చాలా స్పష్టంగా అతను ఆరోపణలన్నింటినీ ఖండించాడు. జులై 28న లాహోర్‌లో బాంబు సంచీని బస్సులో పెట్టారని ఆరోపణ, కాని ఆరోజున అతను ఇండియాలో ఉన్నాడు. సరబ్‌జిత్ లాయర్లు నిర్ణయించిన తేదీనాడు కోర్టులో హాజరు కాకపోవడంవల్ల అతని సమీక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

లాయర్లు రాకపోతే కేసు కొట్టేయడానికి ఇదేమయిన మామూలు కేసా? పిటిషన్ డిస్మిస్ అంటే క్లయింట్‌ను ఉరితీయడం అని తెలియదా! ఇదేం న్యాయమో పాకిస్థాన్‌కే తెలియాలి.
26 జూన్ 2012న పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్‌అలీ జర్దారీ సరబ్‌జిత్‌కు క్షమాభిక్ష ఇవ్వాలని నిర్ణయించారు. క్షమాభిక్షలో భాగంగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని, అతను ఇదివరకే 22 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు కనుక జీవిత ఖైదు అంటే పాకిస్థాన్‌లో 14 సంవత్సరాలే కనుక విడుదల చేయాలని సంతకం కూడా చేశారు. భారత దేశం ఈ చర్యను ప్రశంసిస్తూ లేఖ కూడా రాసింది. కాని మత వాద సంస్థలు జమాతె ఇస్లామీ, జమాతె ఉద్దావా ఈ విడుదలను తీవ్రంగా విమర్శించాయి. పాకిస్థాన్‌లో ఇండియాలో మీడి యా కూడా సరబ్‌జిత్ సింగ్‌కు శిక్ష తగ్గించి విడుదుల చేస్తున్నట్టు వార్త ప్రసా రం చేశాయి. ఆ తరువాత పాకిస్థాన్ జైలు అధికారులు ఒక ప్రకటనలో, జైలునుంచి శిక్ష తగ్గించి విడుదలయ్యేది సరబ్‌జిత్ కాదని సూర్జిత్‌సింగ్ అని మామూలు సవరణ విడుదల చేశారు. ఆ విధంగా నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. సూర్జిత్ సింగ్ 30 ఏళ్ల తరువాత విడుదలై భారత దేశానికి వచ్చి తాను ‘రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ ఏజెంట్‌నేనని చెప్పుకున్నాడు. పాక్‌లో పొరబాటున ప్రవేశించానని అక్కడ చెప్పాడు. సరబ్‌జిత్ కూడా ఇదే చెప్పాడు. ఏది నిజం అనేది తెలిసేదెట్లా?

సరబ్‌జిత్‌కు మరణశిక్ష విధించడానికి కీలకమైన సాక్షి ఎవరంటే షౌకత్ సలీం. లాహోర్ బాంబు దాడిలో సలీం తండ్రి ఇతర బంధువులు మరణించారు. సరబ్‌జిత్ కుట్రచేసి బాంబులు వేయించాడని అత ను సాక్ష్యం చెప్పాడు. ఆ తరువాత తనకు సరబ్‌జిత్ నేరం సంగతి తెలియదని, పోలీసులు ఒత్తిడిచేస్తే ఆ విధంగా తప్పుడు సాక్ష్యం చెప్పానని సలీం వివరించాడు. సలీం వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేయలేదు కనుక ఆ ప్రకటన చెల్లదని లాయర్ అబ్దుల్ రానా హమిద్ చెప్పారు. లాహోర్ బాంబు దాడిలో దాఖలు చేసిన నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో ఎక్కడా సరబ్‌జిత్ సింగ్ పేరుగానీ అతని రూపురేఖల ప్రస్తావన గానీ లేవని,మానవ హక్కుల లాయర్ అన్సార్ బర్నే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతన్ని రెడ్ హాండెడ్‌గా పట్టుకోలేదు. భారత్ పాకిస్థాన్ సరిహద్దులో 30 ఆగస్టున అరెస్టయితే తొమ్మిదిరోజుల తరువాత అతని మీద బాంబుదాడికేసు పెట్టి ఉగ్రవాది అనే ముద్ర వేశారు.

ఫైసలాబాద్‌లో ఒకసారి, లాహోర్‌లో మూడు సార్లు బాంబు దాడులు జరిగాయి. రెండు జిల్లాల్లో నాలుగు పోలీసుస్టేషన్ పరిధి అధికారులు దర్యాప్తు చేశారు. నలుగురు మెజివూస్టేట్‌లు రికార్డు చేయవలసి ఉండగా అందరి సాక్ష్యుల వాంగ్మూలాన్ని ఒకే మెజివూస్టేట్ రికార్డుచేశారని బర్నే తెలియజేశారు. ఏ సాక్షి ప్రకటన కూడా మెజవూస్టేట్ ప్రమాణం చేయించినవి కావు. సరబ్‌జిత్‌ను చూసిన వారి ముందు పరేడ్ చేయించినప్పుడు అక్కడ మెజివూస్టేట్ లేడు. మెజివూస్టేట్ లేనిది చూసి ఇతనే సరబ్‌జిత్ అనే నిందితుడని పోలీసులే సాక్షులకు తెలియజేశారు. దీన్ని స్వతంవూతంగా నిష్పాక్షికంగా నిందితుడిని గుర్తు బట్టడం అని అనడానికి వీల్లేదు. ఈ గుర్తింపు విషయాన్ని ఏకైక సాక్షి షౌకత్ సలీం స్వయంగా వివరించాడు.
బ్రిటిష్ లాయర్ జాస్ ఉప్పల్ సరబ్‌జిత్ విచారణలో దారుణమైన లోపాలను ఎండగట్టాడు.
1.అతనే నేరస్తుడనడానికి ప్రాథమికంగా ఆతన్ని గుర్తించలేదు.బాంబు దాడులతో అతనికి ప్రమేయముందని శాస్త్రీయమైన ఆధారం ఒక్కటి కూడా నేరవిచారణలో కోర్టు ముందుంచలేదు.
2. మొత్తం విచారణ ఇంగ్లిషులో జరిగింది. అతనికి ఇంగ్లిషు రాదు, అందులో మాట్లాడలేడు. అనువాదకుడిని కూడా పెట్టలేదు.
3. అతన్ని బందీగా ఉంచినప్పుడు హింసించి నేరం బలవంతంగా ఒప్పించారని ఆరోపణలు ఉన్నాయి.
4. నేర విచారణ ఆదరబాదరాగా జరిపించారు.
5.కీలకమైన సాక్షి అనేకసార్లు తన వాంగ్మూలాన్ని మార్చాడు.ఇన్నిలోపాలున్నపుడు నేరం రుజువైనట్టు తీర్పు చెప్పడమే దారుణం అంటే మరణ శిక్ష విధించడం మరీ దారుణం.

2008లో సరబ్‌జిత్ కుటుంబ సభ్యులు పాకిస్థాన్‌కు వెళ్లి ప్రముఖ రాజకీయ నాయకులను కలిశారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా కలిశారు. సరబ్‌జిత్‌ను విడుదల చేయడానికి పాక్ ప్రధాని మౌలికంగా అంగీకరించా డు. అతని నేరాలకు కొత్తగా సాక్ష్యం దొరికితే పాకిస్థాన్‌లో విచారించడానికిగాను అతన్ని పంపడానికి భారత్ అంగీకరిస్తే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సినీహీరో సల్మాన్ ఖాన్, రాజామురాద్ సరబ్‌జిత్ విడుదలకు పెద్ద ప్రచారోద్యమం చేశారు. ఫ్రీ సరబ్‌జిత్ అని జాస్ ఉప్పల్ మరో ప్రచారోద్య మం లేవదీశారు.

విడుదల పిటిషన్‌పై లక్షా 33 వేలమంది సంతకాలు చేశారు. పాకిస్థానీ విద్యార్థి బృందం కూడా విడుదలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. విడుదలైన సూర్జిత్‌సింగ్ భారత్‌కు వచ్చిన తరువాత తానే అస లు గూఢచారి నని చెప్పాడు. సరబ్‌జిత్, క్రిపాల్ అనే ఇద్దరు భారత ఖైదీలు పాకిస్థాన్ వాగ్దా నం చేసిన విధంగా తమను విడుదల చేస్తారని నమ్మి, ఇస్తాంలోకి మారారని, సరబ్‌జిత్ సర్ఫరాజ్‌గా క్రిపాల్ మహ్మద్‌దీన్‌గా పేర్లు మార్చుకున్నారని వెల్లడించాడు. అతను మతం మారలేదని, అతను గురుసిఖ్ అనీ గురుసిఖ్ అయి న వాడు ఎన్నటికీ మతం మారడని, జైల్లో కూడా సిఖ్ గురువుల చిత్రాలు పెట్టుకుని ప్రార్థనలు చేసేవాడని సరబ్‌జిత్ సోదరి బంధువులు చెప్పారు.

26 ఏప్రిల్ 2013 నాడు సాయంత్రం 4.30 సమయంలో పాకిస్థాన్ లాహోర్‌లోని కోట్ లఖ్ పత్ సెంట్రల్ జైల్‌లో తోటి ఖైదీలు సరబ్‌జిత్ పైన ఇటుకలు, ఇనుప కడ్డీలు, లోహపు రేకులు, బ్లేడ్‌లతో దాడి చేశారు. అతని వెన్నెముక విరిగింది. తలమీద అనేక గాయాలైనాయి. కోమాలోకి వెళ్లిపోయా డు. లాహోర్‌లోని జిన్నా ఆస్పవూతిలో చేరే సమయానికే అతని పరిస్థితి దారుణంగా ఉంది. ఇద్దరు దాడిచేశారో ఆరుగురా, జైలు సెల్ లోనా లేక బయటకు గంటన్నర విరామంలో వచ్చినపుడు దాడి జరిగిందా తెలియదు. ఇదంతా పాకిస్థాన్ ముందుగా పన్నిన కుట్ర ప్రకారం జరిగిందని, జైలు అధికారులు కూడా దాడి చేసిన వారిలో ఉన్నారని అతని బంధువులు ఆరోపించారు. సరబ్‌జిత్‌ను యుకెకు పంపాలని పలువురు డిమాండ్ చేశారు, భార త ప్రధా ని అతన్ని మానవతా దృక్పథంతో విడుదల చేయాలని, భారత్‌లో చికిత్సకు పంపాలని కూడా కోరారు. భార్య, ఇద్దరు పిల్లలు సోదరిని ఆస్పవూతికి వెళ్లి చూడడానికి అనుమతించారు.
భారత్‌లో అఫ్జల్ గురును అతి రహస్యంగా తొందరగా ఉరి తీసిన తరువా త పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌ను చంపాలనే ఆలోచనలు వచ్చాయని విమర్శలు వచ్చాయి.

మే 2న సరబ్‌జిత్ చనిపోయాడని ప్రకటించారు, భారత్ కు శవం చేరుకున్న తరువాత మళ్లీ శవపరీక్ష జరిపితే కీలకమైన అంగాపూన్నోలేవని తేలింది. కపాలం రెండుగా ముక్కలైందని తేలింది. పాకిస్థాన్‌లో భారత్ లో ఆ దేశానికి చెందని పౌరులు చాలామంది బందీలుగా ఉన్నారు. వారి విడుదలకు ఇరువైపులా పౌర సమా జం ప్రభుత్వాల పైన ఒత్తిడిచేయకపోవడం వల్ల సరబ్‌జిత్‌వంటి సంఘటనలు జరుగుతున్నాయని సర్బజిత్ తరఫు లాయర్ అవైస్ షేక్ విమర్శించారు.

జనవరిలో చంబైల్ సింగ్ అనే మరొక భారతీయ ఖైదీని జైలు సిబ్బంది కొట్టి చంపారని, అనుమానాస్పదంగా మరణించినా, ఇతని శవపరీక్షను రెండు నెలల తరువాత జరిపారని తెలిసింది. కేవలం భారతీయులు కనుక వీరిని చంపేశారని అనుకుంటే తప్పేమిటి? దురదృష్టవశాత్తూ భారత్‌లో కూడా అదేపరిస్థితి. జమ్మూ జైల్లో పాకిస్థాన్ ఖైదీ సమానుల్లాపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కోమాలో ఆస్పవూతిపాలయ్యాడు. పాకిస్తాన్ ఖైదీల పట్ల భారత్, భారత ఖైదీల పట్ల పాకిస్తాన్ మానవతా దృష్టితో వ్యవహరించే రోజు అసలు వస్తుందా? పాకిస్థాన్ ప్రభుత్వం ఇద్దరు ఖైదీల మీద విచారణ కు ఆదేశించింది. కొందరు జైలు సిబ్బందిని సస్పెండ్ చేసింది. భారత్ కూడా అటువంటి చర్యలు ప్రకటిస్తుంది.

కాని ఇది సరబ్‌జిత్, సమానుల్లాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, సమువూదజలాల్లో చేపలు పడుతూ పాకిస్థాన్, శ్రీలంక సాయుధ దళాలకు చిక్కిన వారు అనేకమంది ఉన్నారు. విదేశాల్లోని జైళ్లలో కనీసం 6569 మంది భారతీయులు మగ్గుతున్నారని సమాచార హక్కు చట్టం కింద వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ నుంచి చాలా మంది దుబాయ్ తదితర అరబ్ దేశాలలో ఏదో ఒక నెపంతో ఇరుక్కుపోయారు. వీరి బతుకుల గురించి భారత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సరబ్‌జిత్ గురించి కూడా భారత్ సరైన పద్ధతిలో చేయవలసినంత కృషి చేయలేదనే విమర్శలను ఎదుర్కొంటున్నది.

అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు లను ఉరి తీసిన తరువాత పాకిస్థాన్ లో మతమౌఢ్య ఖైదీలు సిబ్బంది చేతుల్లో సరబ్‌జిత్ వంటి ఖైదీలకు ప్రమాదం ఉందని తెలియదా? అతని రక్షణ పాకిస్థాన్ బాధ్యత కాదా? చేపలు పట్టుకునే వారయినా, పొరబాటున చొరబడిన వారైనా సరే వారిపైన తప్పుడు కేసులు బనాయించి హింసించడం, ఇరు దేశాల మధ్యచర్చలలో పరస్పరం విడుదల చేయడానికి వారిని సంప్రదింపుల సరుకు గా వాడుకోవడం ఎన్నా ళ్లు?. భారత్ మీద పగ తప్ప మరో ఎజెండాలేనట్టు పాక్ వ్యవహరిస్తున్నది. భారతదేశంలో మన రాజకీయ నాయకులకు ఎన్నికలు, ఓట్లు ముఖ్యం. మిగతా ప్రయోజనాలన్నీ గాలికి. ఉరితీయడం ద్వారా ఓట్లకు గురి పెట్టడం, ఉరితీయకపోతే బిజెపి వంటి పార్టీలకు ఓట్లు వస్తాయని భయపడడం. అస లు ఉరితీయడమే సమస్యకు పరిష్కారం కాదని, ఉరి తీయడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయని అర్థం చేసుకోవడం లేదు.

ఇండోపాక్ జుడిషియల్ కమిటీ ఆన్ ప్రిజనర్స్ పేరుతో ఒక సమష్టి కమిటీ ఇరుపక్షాల ఖైదీలను విడుదల చేయడానికి కొంత పనిచేసింది. అదేం చేస్తున్నది? పాకిస్థాన్, భారత్ ఇరువైపులా మానవ హక్కుల కమిషన్ల ద్వారా ఇటువంటి కేసులను విచారించడానికి నిజానిజాలు తేల్చడానికి ప్రయత్నా లు ప్రారంభించాలి. ఇందుకు ఒక విధానాన్ని, యంత్రాంగాన్ని, వేదికలను రూపొందించాలి. పగలు ప్రతీకారాలు, రాజకీయ అవసరాలతో సరబ్‌జిత్ వంటి అమాయకులను బలి తీసుకోవడం అమానుషం.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన