తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం


Tue,April 23, 2013 12:02 AM


తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇనుప ఖనిజంతో సీమాంవూధ సర్కారు ఆడుకుంటున్న తీరు మరో కొత్త సాక్ష్యం. ఏవేవో లెక్కలు చూపుతూ తెలంగాణకు అన్యాయం జరగడం లేదని మేధావులమని అనుకునే వారు వాదిస్తున్నారు. వీధికెక్కి సవాలు చేస్తూ రెచ్చగొడుతున్నారు. వారి సొంత కళ్లు తెరవగలిగితే బయ్యారంలో ఏం జరుగుతుందో వారి బండారం బయటపడుతుంది. డబ్బు, ప్రలోభాలు గానీ ఉంటే, లేక అకారణ ద్వేషాలు రగులుతూ ఉంటే కంటికి కనబడవలసినది కూడా కనిపించదు. తెలంగాణకే కాదు విశాఖ గిరిజనుల కు కూడా పాలకులు ద్రోహం చేస్తున్నారు. విశాఖ గిరిజనుల సహకార సంఘాల ద్వారా అక్కడి బాక్సైట్ గనులకు ఉపయుక్తత కల్పించకుండా పారిక్షిశామికవేత్తలకు కట్టబెట్టడం ద్రోహమే. అదేవిధంగా తెలంగాణ సామాన్య జనం బతుకును మెరుగుపరచవలసిన అక్కడి ఖనిజాన్ని విశాఖకు తరలించడం ద్రోహమే. వీరికి పర్యావరణం నాశనమైనా పరవాలేదు. గిరిజనులు దోపిడీకి గురైనా పట్టదు. తెలంగాణ నుంచి వనరులు తరలిపోయినా బాధలేదు. ఇక్కడి ఫాక్టరీలు మూతబడేస్తారు. కొత్త ఫ్యాక్టరీలు పెట్టొచ్చని చెప్పినా వినరు. సొంతలాభాలు, స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రజలను దోచుకోవడమే వీరి లక్ష్యం.

ఖమ్మం, వరంగల్ జిల్లా పరిసరాల్లోని బయ్యారం, తదితర ప్రాంతాల్లో అపారమైన ఇనుప ఖనిజం ఉందని భూగర్భ సర్వే విభాగం వారు 2006 లో నివేదిక ఇచ్చిన వెంటనే, పాలకుల కు ముడి సరుకు కొరత పేరుతో లాకౌ ట్ చేయించిన పాల్వంచలోని ఏపీ స్టీల్స్ గుర్తుకు రాలేదు. కాని రాజకీయ స్వార్థ పు కన్ను ఆ సంపదపైన పడింది. రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టాలనే ఆలోచన మొగ్గ తొడిగింది. తెలంగాణ లేదు, ఆంధ్రాలేదు. దాన్నుంచి ఎంత లాభం ఎవరికి అప్పగించాలి, మనకెంత మిగులుతందనేదే ప్రధానమైపోయింది. బయ్యారంలో ఉన్నది అపురూపమైన సంపద. అక్కడ వేయి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇనుప ఖనిజం శుద్ధిచేసే కర్మాగారం పెట్టుకోవచ్చు. రోజూ వంద మెట్రిక్ టన్నుల శుద్ధిఅయిన స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న ది. ఒక మెట్రిక్ టన్నుకు 2013లో 139 డాలర్ల ధర అంతర్జాతీయ స్థాయి లో పలుకుతున్నది. ఇదే శుద్ధిచేసిన స్పాంజ్ ఐరన్ అయితే ఒక మెట్రిక్ టన్ను కు 600-700 డాలర్ల దాకా 2012లో అంతర్జాతీయంగా ధర పలికింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య ప్రాంతంలో హెమటైట్ రకం ఖనిజం, కరీంనగర్ వరంగల్ నిజామాబాద్‌లలో మాగ్నెటైట్ ఇనుప ఖనిజం నిలువలు ఉన్నాయని 2004లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తెలిపారు. ఇది అరుదైన విలువలున్న ఖనిజం అని వారి అంచనా.

ప్రపంచంలో ఎక్కడైనా ఇంధనం దొరికే చోటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పితే ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పడానికి భూగర్భ శాస్త్రజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త కూడా కానవసరం లేదు. అది సుపరిపాలన విధా నం. ఖనిజాన్ని ఎక్కడికో తరలించి ఇంకెక్కడో శుద్ధిచేసి మరెక్కడికో మళ్లీ తరలించి తుది ఉత్పాదన చేయాలని అనుకోవడం ప్రజావ్యతిరేక అభివృద్ధి వ్యతిరేక ఆలోచన. తెలంగాణలో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే ఉక్కు కర్మాగారం అక్కడే వచ్చి ఉండేది. అడిగేవారు లేరు కనుక, అడిగినా ఒత్తిడి లేదు కనుక తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు గురించి 2004 నుంచి డిమాండ్ చేసిన నాయకులు ప్రజావూపతినిధి లేడు. సహజంగానే మంచి పాలకులైతే ఇక్కడ ఈ పాటికి ఉక్కు కర్మాగారం పెట్టాల్సి ఉంటుంది. కనుక సుపరిపాలకులకూ దిక్కు లేరు. జనం చైతన్యవంతులై అడగకపోతే, ప్రజావూపతినిధులు అప్రమత్తులై ఉండకపోతే, పాలకుల ఆలోచనలు మూల వనరుల ను సొంత లాభాలుగా మలచుకోవడానికి ప్రయత్నించడం కూడా అంతే సహ జం. నిజంగా తెలంగాణ పట్ల వివక్ష లేకపోతే రాజశేఖరడ్డి, రోశయ్య, కిరణ్ ప్రభుత్వం, లేదా కేంద్రంలో పదేళ్లనుంచి పాలిస్తున్న మన్మోహన్ ప్రభు త్వం ద్వారా బయ్యారం దగ్గర ఉక్కుకర్మాగారం ఈ పాటికి ఉత్పత్తి మొదలు పెట్టి ఉండేది. ఇస్పాత్ పరిక్షిశమతో కలిపి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని ఊరికే ఒక ప్రతిపాదన ఆశ జూపారు. అది ఆశగా మాత్రమే మిగిల్చి, గనులను తవ్వి ఖనిజాన్ని తరలించుకుపోవడానికి ఏర్పాట్లు రహస్యంగా సాగించారు. ఇల్లెందులో పుష్కలమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. కాబట్టి ఇను ము శుద్ధిచేసే డోలమైట్ కర్మాగారం నెలకొల్పారు. ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి అనుకూలమైన పరిసరాలు వనరులు ఉన్నాయని సంబంధిత అధికారులు నివేదికలు పంపినా పట్టించుకోలేదు. స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పలేదు. సిలికా అనే పదార్థంతో కలిసి ఉన్న ఖనిజం నుంచి సిలికాను తొలగిస్తే అది శుద్ధిఅవుతుంది. 50 లారీల ఖనిజాన్ని శుద్ధి చేయాలంటే 30 లారీల సిలికాను ఎత్తిపోయాలి. అప్పుడు 20 లారీల శుద్ధ ఖనిజం అక్కడినుంచి విశాఖకు తరలిస్తారు. 30 లారీల తుక్కు బయ్యారానికి దక్కితే, 20 లారీల శుద్ధి చేసిన ఖని జం విశాఖకు తరలుతుంది. సంపద అటు తరలిపోగా ఇక్కడ మిగిలేది దుమ్ము, ధూళి, కాలుష్యం మాత్రమే. సహజ వనరులున్న ప్రాంతానికి బూడి ద, ఏ వనరులూ లేని చోట కర్మాగారాలు ఉద్యోగాలు, ఆర్థిక లాభాలూ అంటే అంతకన్న వివక్ష ఏముంటుంది? ఖమ్మం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో లక్షా 41 వేల ఎకరాల్లో ఏడు కోట్ల రూపాలయ విలువైన సహజ వనరు.. ఇనుప ఖనిజం గనులను విశాఖ ఉక్కు ఫాక్టరీకి కేటాయించడం తెలంగాణకు చేసిన మరొక అన్యాయం. మొత్తం 12 వేల కోట్ల టన్నుల ముడి ఇనుము ఇక్కడ ఉందని అంచనాలు.

దీన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఆయన అల్లుడు అనిల్ కుమార్ బినామీ ఆస్తి అని అనుకుంటున్న రక్షణ స్టీల్స్ సంస్థకు కట్టబెట్టడం దారుణం. ఆంధ్రవూపదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రక్షణ స్టీల్స్‌కు అప్పగించడానికి ఒప్పందం ఎప్పుడో కుదిరిపోయింది. ఏపీ గనుల సంస్థ ద్వారా విశాఖజిల్లా అన్రాక్ కు 2007 లో బాక్సైట్ గనులను ధారాదత్తం చేసినట్టే.., 2009లో రక్షణకు ఇనుప ఖనిజం గనులు ఇచ్చారు. గిరిజనుల ప్రాంతంలో భూముల బదలాయింపు నిషేధపు చట్టాన్ని గనుల క్రమబద్ధీకరణ చట్టం 1957ను పక్కదారి పట్టించి గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు వనరులను కట్టబెట్టారు. జీవో 64 (జూన్ 30,2010) ద్వారా ఖమ్మంలో 1.4 లక్షల ఎకరాలు పదేళ్లపాటు గనుల సంస్థకు ఇస్తే వెంటనే ఆ సంస్థ రక్షణ స్టీల్ సంస్థకు బదిలీ చేసింది. దీనికోసం జీవో 69 ద్వారా వైఎస్ ప్రభుత్వం గనుల సంస్థ రక్షణ స్టీల్స్ సంస్థతో ఒక సమిష్టి సంస్థను సృష్టించారు. దీనిపైన సంత కం చేసిన నాటి గనుల కార్యదర్శి శ్రీలక్ష్మి అన్రాక్ తరహాలో కేటాయించామ ని కూడా అందులో రాశారు. 2006లోనే కేటాయింపు పని మొదలైనా జీవో 64ను రోశయ్య ప్రభుత్వ కాలంలో జారీ చేశారు. జీవో 64 పైన రంజీవ్ ఆచా ర్య సంతకం చేశారు. దీనిపైన అసెంబ్లీలో గొడవ జరిగింది. గిరిజన సంఘాలు వ్యతిరేకించాయి.ఎన్‌జీవోలు ఉద్యమించాయి. రక్షణ సంస్థకు భూముల బది లీ కూడా గందరగోళమే. జీవో 64లో గనుల సంస్థకు గనుల అభివృద్ధిలో ఎంతో అనుభవం ఉంది కనుక గనులు బదిలీచేస్తున్నాం అని రాసి,ఆతరువాత వారి ఉమ్మడి భాగస్వామి కనుక రక్షణకు ఇస్తున్నామని ఆ తర్వాత పేర్కొన్నారు. కాని ప్రజాక్షిగహానికి తల వంచి రోశయ్య ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం రాసింది.

తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ పనికి అభ్యంతరం చెప్పడం వల్ల ఈ అన్యాయపు కేటాయింపు ఆగిపోయింది. అందుకు కేంద్రాన్ని అభినందించాల్సిందే. కానీ.. అంతకుముందే ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజావూపతినిధులు అడ్డుకుంటే బాగుండేది. ఆ అభ్యంతరాలు వచ్చిన తరువాత ప్రతిపక్షపార్టీలు ఒత్తిడి తెచ్చాయి. 2010 డిసెంబర్‌లో ఈ ఉత్తర్వులను రద్దు చేశా రు. ఇల్లెందులో బొగ్గు, మాధారంలో డోలోమైట్, పాఖాల చెరువు, ఒట్టేరు, అలుగేరు వాగులనుంచి నీరు తీసుకునే అవకాశం బయ్యారం గనులకు ఉండ డం వల్ల ఉక్కు ఫ్యాక్టరీకి బయ్యారం అనుకూలమైన ప్రాంతమే. సొంత కాప్టివ్ ప్లాంట్ ఉన్నా విద్చుఛ్ఛక్తికి ప్రత్యామ్నాయ వనరుగా కేటీపీఎస్ కూడా 75కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అయినా ఉక్కు ఫ్యాక్టరీ కాకుండా బెనిఫికేషన్ ప్లాంట్ నెలకొల్పడం వల్ల ఇనుపఖనిజం శుద్ధి మాత్రమే ఇక్కడ జరుగుతుంది. శుద్ధిఅయిన ఖనిజాన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ ఆ ఖనిజా న్ని ఉత్పత్తికి వినియోగిస్తారు. అందుకోసం విశాఖ పట్టణం ఉక్కుకర్మాగారాన్ని విస్తరిస్తారే కాని ఇక్కడ బయ్యారం ప్రజలకు, ప్రాంతానికి ఒరిగేదేమీలేదు. కొత్త ఫ్యాక్టరీ పెట్టకపోయినా ఫరవాలేదు. కాని దగ్గరలో పాల్వంచలో ఉన్న ఏపీ స్టీల్స్ ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు ఇవ్వకుండా మాడ్చి మూయించారు. కాని ముడి సరుకు కొరత సాకు చూపించి దాన్ని 1994లో లాకౌట్ చేశారు. కార్మికులు పోరాడినా, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ ఫాక్టరీ పునరుద్ధరణకు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఇతర అధికారులు ఈ ఫ్యాక్టరీని ఉద్ధరించడానికి 1200 కోట్లు కేటాయిస్తామని చెప్పినా ఇంతవరకూ ఏమీ జరగకపోగా, ఇక్కడినుంచి ఖనిజాన్ని విశాఖకు తరలించాలని నిర్ణయించడం అన్యాయం.

విశాఖ కర్మాగారం కోసం అధికారికంగా ఎక్కడా ఒక్క గనిని కూడా కేటాయించలేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఖనిజం కొనుగోలు చేస్తున్నారు. రక్షణ వంటి ప్రైవేట్ వ్యక్తుల కంపెనీలకు దోచి పెట్టకుండా ప్రభు త్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడం మంచిదే. అది జాతీయ సంపద కనుక విశాఖ జాతీయ కర్మాగారం కనుక న్యాయమే అని సీమాంవూధనేతలు జాతీయవాదాన్ని వినిపిస్తున్నారు. ఏ క్షణాన్నయినా మన ప్రభుత్వరంగంలో ఉన్న నవరత్న జాతీయ పరిక్షిశమల్లో ఒకటైన విశాఖ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనలు ఇప్పడికే ఉన్నాయి కనుక, ఇదొక పెద్ద కుట్ర అని అనుమానించే వారు కూడా ఉన్నారు. అపారమైన ఖనిజ సంపద ఉన్న తెలంగాణలో ఉన్న ఫాక్టరీ మూసేస్తారు, కొత్త ఫ్యాక్టరీ కట్టరు. ఖనిజాలను విశాఖకు తరలిస్తారు. ఇది కేవలం తెలంగాణ ద్రోహం కాదు, ఏటేటా వందలకోట్ల రూపాయల ప్రజాధనం రవాణా ఖర్చులకింద వృథా చేసే రాష్ట్ర ద్రోహం. అంతే కాదు దేశ ద్రోహం కూడా. జాతీయ సంపద అని నీతులు చెప్పేవారు జాతి ద్రోహాన్ని గుర్తించాలి. అర్థం చేసుకోవాలి.

ప్రభుత్వాధినేతలకు గనులను దోచి సొంత వారికి ఇవ్వడమో, లేక గనుల చుట్టూ ఉన్న వారిని కాదని ఎక్కడికో తరలించడమో అలవాటుగా మారిపోయింది. ఎన్నికైన తరువాత ఐదేళ్ల దాకా తాము ఏం చేసినా అడిగేవారు లేరనే అహంభావంతో ఏం జరిగితే మనకేమిటి అనే ఆలోచనతో రాజకీయాలు సాగుతున్నాయి. విశాఖపట్నంలో బాక్సైట్ గనులు జాతీయ సంపద. కాని ఆ గనులను ఎవరికి ఇచ్చారు? జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియంలిమిటెడ్ , అనార్క్ అల్యూమినియం లిమిటెడ్, జాతీయ అల్యూమినియం కంపెనీ నాల్కోలతో రాష్ట్ర ప్రభుత్వం 2005- 2010 మధ్య కాలానికి ఒప్పందాలపైన సంతకాలు చేసింది. వీరికి బాక్సైట్ ఖనిజాలను సరఫరా చేయడానికి అంగీకరించింది. ఇవన్నీ షెడ్యూల్డు ప్రాంతాలకు చెందిన గనులు. అంటే గిరిజనులకు చెందినవి. గిరిజనులకు కాకుండా వారి అనుమతి లేకుండా ప్రైవే టు వ్యాపారులకు ధారాదత్తం చేయడానికి కాదు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్ర దేవ్ 2012 సెప్టెంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వానికి ఒకలేఖ రాస్తూ ‘వెంటనే లీజులను రద్దు చేయాల’ని ఆదేశించారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూ లు, క్లాజ్ 3 ప్రకారం ఈ లీజులు చెల్లవని వీటిని రద్దు చేసి వెంటనే తమకు ఆ విషయం తెలియజేయాలని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంతకుముందు ఆగస్టు 2010లోనే ఈ లీజులను సస్పెండ్ చేయాలని అప్పడి గనుల మంత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రజల జీవనోపాధికి సంబంధించి సమస్యలు సృష్టించడం, పర్యావరణాన్ని దెబ్బతీయడం కారణంగా ఈ లీజులు సమంజసం కాదనికూడా తేల్చారు. ప్రభుత్వం కేంద్రమంత్రి లేఖపైన తాత్సారం చేసింది. రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థకు బాక్సైట్ గనుల లీజులు ఇవ్వడాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి. వీటిని ప్రైవేటు పరిక్షిశమలకు ధారాదత్తం చేసి జాతిసంపద ఆధారంగా వారు వేల కోట్లు లాభాలు పొందేందుకు ప్రభుత్వాలు సహకరించడం న్యాయం కాదు.

ఖనిజసంపద, ముడిసరుకు ఇంధనాలను తవ్వితీసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతించడమే జాతి వ్యతిరేక విధానం. ఈ విధానం వల్ల గాలి జనార్ధన్‌డ్డి వంటి అవినీతి వ్యాపారులు పుట్టుకొచ్చి రాజకీయాలను కూడా కలుషితం చేసి అధికారంలోకి వచ్చే ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఏర్పడింది. గాలికి కర్నాటకలో ఇనుప ఖనిజం గనులను ఇస్తూ చేసుకున్న ఒప్పందాలన్నింటిని సుప్రీంకోర్టు ఇటీవలే రద్దు చేసింది. జగన్ అక్రమార్జన కేసులలో గాలి జనార్ధన్‌రెడ్డి నిందితుడని వేరేచెప్పనవసరం లేదు. అఫ్తాబ్ ఆలం, కె ఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ రంజన్ గోగోయ్‌లతో కూడిన గ్రీన్ బెంచ్ ఏప్రిల్ 18న ఇచ్చిన తీర్పులో బళ్లారి, తుంకూర్, చిత్రదుర్గ జిల్లాలలో సాగే అక్రమ గనుల తవ్వకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ గనుల తవ్వకం ద్వారా వచ్చిన ఆదాయం అంతా ప్రభుత్వానికి చెందాలని ఆదేశాలు జారీచేశారు. కర్నాటక, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న గనుల తవ్వకాలన్నింటినీ రద్దు చేసింది.

బయ్యారం విషయంలో ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఖనిజాల తరలింపు ఉత్తర్వులు తెలుపుతున్నాయి. నిర్ణయం మార్చడానికి గానీ తెలంగాణకు సానుకూలత గానీ వీసమెత్తు కనిపించడం లేదు. కనుక ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికి, ప్రజాపోరాటాలు ఉద్యమాలు తప్ప మరొక మార్గం కనిపించడం లేదు. దొరికనచోటే ఖనిజాన్ని ముడిసరుకుగా మార్చే కర్మాగారాలు పెట్టాలన్న నిజాన్ని ఈ పక్షపాత పాలకులకు తెలియాలి. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం, ఇప్పుడు ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’ అనే ఉద్యమంగా పరిణమిస్తుందని వారికి తెలిసి రావాలి. ఇక్కడి సహజ వనరులన్నీ తరలించుకుపోవడాన్ని తెలంగాణ ప్రజలు నిలదీయాలి. విశాఖ గిరిజనులకు చెందిన ఖనిజాన్ని బడా పారిక్షిశామిక వేత్తలకు తరలించడం, తెలంగాణ ఖనిజాన్ని విశాఖకు తరలించడం రెండూ అన్యాయమే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి