కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు


Tue,April 9, 2013 03:25 AM

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ప్రచారం చేయడం, దాన్ని మీడియా హైలైట్ చేయడం ఇటీవలే గమనించాం. తెలంగాణ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకొని ఉండడంవల్ల సహేతుకంగా మాట్లాడడం కష్టమని తమ అమానవీయ వ్యాఖ్యల ద్వారా కొందరు నిరూపించుకుంటారు. ఇంకా ఇటువంటి రాజకీయ ప్రలాపాలు మరిచిపోకముందే తెలంగాణను బాధ్యతారహిత వ్యాఖ్యలతో గాయపరిచిన మరో మహానుభావుడు మార్కండేయ కట్జూ గారు. ఆయన కొన్నేళ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి మంచిపేరుతెచ్చుకున్న మహానుభావుడు. కొన్ని నిజాలు నిక్కచ్చిగా చెప్పిన పేరున్న వ్యక్తి. ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా నిరంతరం సంచలన వ్యాఖ్య లు చేస్తూ వార్తల్లో రహిస్తున్న సమున్నత అధికార పీఠంపై ఉన్న ఉన్నతుడు.

పరువు, కట్టుబాటు, నీతి, నియమాలు త్యాగం సి, ఫిరాయింపుల ద్వారా అధికారానికి దగ్గరయ్యే రాజకీయ నాయకులు తెలంగాణ గురించి మరీ అన్యాయంగా, ప్రజావ్యతిరేకంగాకూడా మాట్లాడితే ఆశ్చర్యం కలగదు. నీతి మాలిన రాజకీయాలనుంచి ఏ ప్రజలు అంతకుమించి ఏమీ ఆశించజాలరు. కాని రాజ్యాంగ మూలసూవూతాలు తెలిసి, న్యాయం చెప్పడమే తన ఉద్యోగంగా దశాబ్దాలు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వ్యక్తి, ఆ న్యాయం మరిచిపోయి అన్యాయంగా మాట్లాడారేమోనని న్యాయశాస్త్ర విద్యార్థుల కు అభివూపాయం కలుగుతుంది. పార్లమెంటులో ఉన్నా సుప్రీంకోర్టులో ఉన్నా అధికారం అంటి పెట్టుకొని ఉండాలనుకునే వారు ఈ విధంగానే మాట్లాడతారా? అనే అనుమానం వస్తుంది. ఎన్నడూ ఓటు వేయలేదని కట్జూగారే చెప్పారు. ఆయనకు ప్రజాస్వామికమైన తెలంగాణ డిమాండ్ న్యాయంగా కనిపించలేదు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినప్పుడే న్యాయం నుంచి కూడా విరమిస్తారా! అని అనుమానం వచ్చే విధం గా మాట్లాడకూడదని ఆయనకు ఎవరైనా చెబితే బాగుంటుందేమో.

కట్జూగారి మాటలు తెలంగాణ వ్యతిరేకం మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం. న్యాయానికి ప్రతీఘాతుకం. కనీస మానవత్వానికి పొసగని అమానుషం. జీవితం అంతా ఉత్తరాదిన గడిపిన ఆయన కు తెలంగాణ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. కాని వృత్తి ఉద్యోగాలన్నీ న్యాయస్థానాల గడపలోపట గడిపిన న్యాయమూర్తికి న్యాయం తెలియకపోవడమే బాధాకరం. తీర్పులు చెప్పడం అలవాటయిన మార్కండేయ కట్జూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయం కాదని ఓ తీర్పు విడుదల చేశారు. అన్నీ విని తీర్పు చెప్పడం ఎప్పుడైనా అవసరం.

తెలంగాణ డిమాండ్ మీద తీర్పు ఇచ్చే ముందు తెలంగాణ వూపజలు ఏం కోరుకుంటున్నారో వారి వాదం వినే అవసరం ఉంది. కనీసం విషయం ఏమిటని తెలుసుకోవాలి. ఒక అభివూపాయానికి వచ్చేముందు ఎదుటి వారి అభివూపాయం, వాదం తెలుసుకోవాలనేది ప్రాధమిక సూత్రం. ఇరుపక్షాల వాదనలు వినకుండా ఒక నిర్ణయానికి రాకూడదని ఒక సహజ న్యాయసూత్రం. సామాన్యపౌరులకు ఆ విషయాలు తెలియవు. వారు పాటించకపోవచ్చు కూడా. కాని న్యాయశాస్త్ర నిష్ణాతులు సహజ న్యాయమార్గాన్ని గుర్తుంచుకోకపోవడం చాలా అసహజం. కావాలని ఆ సూత్రం పాటించకపోతే అది సన్మార్గం కాదు. అన్యాయ మార్గం. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఎందుకు వచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం అరవై ఏళ్లుగా ఉద్యమం ఎందు కు సాగుతున్నదనే ప్రశ్న మెదడులో ఉదయించకపోతే ఎట్లా? న్యాయం ధర్మం తెలుసని మనమంతా అనుకుంటున్న కట్జూ గారి చురుకైన మేధస్సు అటువంటి ప్రశ్నలను ఎందుకు సంధించేలేదు?
తెలంగాణ డిమాండ్- భారత సమాఖ్య తత్వానికి అనుకూలం.

తెలంగాణ వ్యతిరేక కట్జూ వ్యాఖ్య మన సమాఖ్యతత్వానికి వ్యతిరేకం. రాజ్యాంగ ముఖ్య లక్షణం సమాఖ్య. ఇందులో అధికార వికేంవూదీకరణ, అధికారాల విభజన ప్రధాన విధానాలు. కొత్త రాష్ట్రాలు వద్దనడం ఈ సమాఖ్య ఆలోచనకు విరు ధ్ధం. ఆర్టికల్ 3 చాలా స్పష్టంగా రాష్ట్రాలను ఏర్పాటుచేసే అధికారాన్ని కేంద్రానికి ఇచ్చింది. సీమాంధ్ర వంటి దురహంకార దుర్మార్గ ఆధిపత్యానికి మైనారిటీ ప్రజ బలైపోతూ ఉంటే సంఖ్యారాక్షసంతో ప్రజాస్వామ్యం పేరుమీద అంకెల రంకెలు వేస్తూ నిధులు, నీళ్లు అధికారాలు హైజాక్ చేసే పక్షపాత ప్రభుత్వాల బారినుంచి తెలంగాణ జనం వంటి ప్రజానీకాన్ని కాపాడడానికి ఆర్టికల్-3 లేకపోతే అవకాశమే ఉండదని అంబేద్కర్ వివరించారు. దానిమీద రాజ్యాంగసభలో చాలా చర్చజరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేముందు ఉన్న రాష్ట్రం అనుమతి తీసుకోనవసరం లేదని చాలా స్పష్టంగా ఈ ఆర్టికల్ రూపొందించారు. తెలంగాణవూపజల వంటి వారికి విముక్తి, స్వతం త్రం ఇచ్చి సమగ్ర భారతదేశంలో సగౌరవంగా బతికే అధికారం ఇచ్చేది ఆర్టికల్ మూడు. రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరిధిలో అడిగే తెలంగాణ రాష్ట్రం డిమాండ్ రాజ్యాంగబద్ధమైనది. ఇది మౌలిక రాజ్యాంగ అవగాహనకు సంబంధించిన అంశం. అంతటి రాజ్యాంగ మేధావి ఈ తీర్పు ఏ విధంగా ఇచ్చారు?

ఒక పౌరుడిగా మార్కండేయ కట్జూకు తెలంగాణ వ్యతిరేక అభివూపాయం కలిగి ఉండే రాజ్యాంగ హక్కు ఉన్నది, కాని ఉన్నతస్థాయిలో ఉండి పత్రికారచనా ప్రమాణాలను వృత్తి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతలో ఉండి, సమగ్ర విచారణ తరువాత తీర్పు చెప్పవలసిన ధర్మం తెలిసి ఉండి కూడా ఆ పనిచేయకపోవడం భావవూపకటనా స్వేచ్ఛకిందికి రాకపోగా, తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది భావవూపకటనా స్వేచ్ఛకు సంబంధించినదని, దాని ఉల్లంఘన అవుతుందని గుర్తించాలి.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే కొత్త రాష్ట్రాలకు డిమాండ్ పెరుగుతుందని ప్రతి జిల్లా ఒక రాష్ట్రంగా రూపొందించాలని అడుగుతారని కట్జూగారు ఆందోళన చెందారు. ఇది అవాస్తవం. ఇటువంటి వాదాన్నే ముందుంచిన ఒక సీనియర్ నాయకుడికి ఈ వాదం ఎంత అవాస్తవమో ప్రొఫెసర్ కోదండరాం తెలియజేసి ఆయనను ఒప్పించిన సంగతి దక్కన్ టీవీ లోగో ఆవిష్కరణ సభలో వివరించారు. రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ జరిగినపుడు కొత్త గా 14రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కేవలం ఆ కారణంగానే కొత్త రాష్ట్రాల డిమాండ్‌లు తలెత్తిన దాఖ లా ఒక్కటీ లేదు. ఆతరువాత కాలంలో మరి 14 రాష్ట్రా లు అవతరించాయి. అప్పుడు విచ్చలవిడిగా జిల్లా సైజు రాష్ట్రాలు కావాలని ఎవరూ అడగలేదు. 2001లో మూడు రాష్ట్రాలు కొత్తగా రూపొందించారు. ఆ తరువాత కూడా కొత్తగా రాష్ట్రాలు అడిగిన వారు లేరు.

తెలంగాణ 1952 నుంచి ఉన్న డిమాం డ్. 1969లో, 2009లో, 2012 డిసెంబర్‌లో మోసానికి గురైన ఉద్యమం. అనవసరమైన కొత్త రాష్ట్రాల డిమాండ్ ఎక్కడ వచ్చింది అని విచారిస్తే ఈ మాట ఎంత అవాస్తవమో ఎంత నిరాధారమో అర్థం అవుతుంది. విదర్భ, గూర్ఖాలాండ్ కోసం డిమాండ్ ఉన్నమాట నిజమే. కానీ అవి కొత్త డిమాండ్‌లు కావు. లేదా ఎక్కడో చిన్న రాష్ట్రం ఇచ్చినందు వల్ల తలెత్తిన గొంతెమ్మ కోరికలు కాదు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే, అందువల్ల మాత్రమే వచ్చిన డిమాం డ్ అనడానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు, దొరకదు. తెలంగాణ కావాలన డం అసలు రాష్ట్ర విభజనే కాదు. నిజానికి తెలంగాణ ఒకవిశాల రాష్ట్రం. హైదరాబాద్‌లో ఉంటే దాన్ని భాష ఆధారంగా విడదీసి అందులోంచి మరాఠీ, కన్నడ మాట్లాడే ప్రాంతాలను వేరు రాష్ట్రాలలో కలిపారు. ఆంధ్రతో విలీనం చేయకండి అనే డిమాండ్ 1952 నుంచే ఉన్నది. హైదరాబాద్ అనే పేరుతో తెలుగు రాష్ట్రంగా మిగిలిన తెలంగాణను ఆ విధంగానే ఉంచండి అనే డిమాండ్ ప్రాతిపదికగా ఈ నాటికీ తెలంగాణ రాష్ట్ర కోరిక మిగిలి ఉందన్న చారివూతిక వాస్తవాన్ని గమనించాలి కదా.

ఇక సమగ్ర సమైక్యవాదీ అయిన వివేకవంతుడు మార్కండేయ కట్జూగారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల దేశం ముక్కలవుతుందని భయపడ్డారు! అయితే ఒక్క నివేదికతో 14 రాష్ట్రాలు సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫజల్ ఆలీ, ఆనాటి ప్రధాని నెహ్రూ, ఆనాటి హోం మంత్రి ప ఈ దేశాన్ని ముక్కలు చేసినట్టా? పంజాబ్ హర్యానా ఏర్పడినప్పుడు, ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్, ఉత్తరాంచల్ ఏర్పడినప్పుడు దేశం ముక్కలైందా? స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొన్ని రాష్ట్రాలు, రాజ్యాలు కలిపి విడదీసి కొత్త రాష్ట్రాలు చేసినప్పుడు మనది, ముక్కలైన దేశమా? లేక ముక్కలు కలిసిన దేశమా? దేశాన్ని ముక్కలు చేయడానికి మారణాయుధాలు సరఫరా చేసిన తీవ్రవాది దావూద్ ఇబ్రహీంతో కలిసి విందు చేసి, ఆ మాఫియా పంపిన తుపాకులు కొని, ఆ మాఫియా డబ్బుతో తీసే సినిమాల్లో నటించి సొమ్ము చేసుకుని నేరస్తుడని రుజువైన సంజయదత్‌కు క్షమాభిక్ష కోరిన కట్జూ తెలంగాణ కోసం బతుకులను కుటుంబాల్ని ముక్కలు చేసుకున్న వేయిమంది త్యాగశీలుర గురించి ఆలోచించే మానవత్వం కూడా ఉంటే ఎంతో బాగుండేది. తెలంగాణ ఇస్తే రాజ్యాంగం ఆర్టికల్- 3 ప్రకారం ఇస్తారు.

దేశం ముక్కలయ్యే పని చేసే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని భావిస్తున్నారా? ఇంతకన్నఅసమంజస వాదం మరొకటి ఉంటుందా? తెలంగాణలో వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, స్వార్థ ప్రయోజనాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు వంటి లాభాలు ఎన్నో ఉన్న వ్యాపార పారిక్షిశామికవేత్తలు, ఆ తరువాత స్థాయిలో తమ వ్యాపారాలకు అనుబంధంగా రాజకీయాలు చేసే సంపన్నులైన లగడపాటి, రాయపాటి, కావూరి, రేణుకా చౌదరీలు, టీజీ వెంక నిరాధార నిందాపూరిత తెలంగాణ వ్యతిరేక వచనాలు విసురుతుంటే, వినీవి నీ విసుగెత్తిన తెలంగాణ ప్రజలు వారి కుట్రారాజకీయం అర్థం చేసుకున్నారు. కాని కట్జూగారు కూడా వారి ధోరణిలోనే మాట్లాడడమే తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.

కొందరు రాజకీయనాయకులు స్వార్థం కోసం లేవనెత్తిన వాదం తెలంగాణరాష్ట్ర వాదం అన్న మాటకొస్తే.., ఈ మాట కోస్తా నాయకుడో లేక కక్ష గట్టిన రాయలసీమ ఫాక్షనిస్టు నాయకుడో అన్న మాట వలె ఉంది కాని ఒక న్యాయమూర్తి అనవలసిన మాటగాలేదు. ఆయనకు ఎవరైనా చరిత్ర తెలిపి తే బాగుండేది. ఒకనాడు భూస్వామ్య దుర్మార్గం మీద జమీందార్ల దౌర్జన్యాల మీద సాగి న సమరం తెలంగాణసమ రం. అది స్వేచ్ఛ కోసం, విముక్తికోసం సాగిన సమ రం.1956కు ముందు తెలంగాణను తెలంగాణగానే ఉండనీయాలని, సీమాంవూధ తో కలపకూడదని సాగిన ఆందోళన, వారి ఒప్పందాలు, మోసపోతామని తెలియక వాగ్దానాలను అమాయకంగా నమ్మడం వంటి సంఘటలనతో తెలంగాణ ప్రజలు అయిష్టంగా ఉన్నా కలిపింది స్వార్థ నాయకులు. కాని విడిగా ఉండాలని నాడూ నేడూ పోరాడుతున్నది నాయకులు కాదు. ప్రజలే.

1969 లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని మధ్యలో వచ్చి పట్టుకున్నవాడు, తరువాత టోకున పదవులకోసం అమ్మేసిన వాడు చెన్నాడ్డి అనే నాయకు డు. ఆయన చేసిన ఆ పని వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిం ది. పోతున్నది. 360 మంది శవాల మీద ఈ ద్రోహం జరిగిం ది. 2009 నుంచి వేయి మంది చనిపోయారు. వారూ స్వార్థపరులా? తెలంగాణ రాష్ట్రం కావాలనే బలీయమైన కోరిక ఉండడంవల్లనే కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తెరాస గానీ జేఏసీ గానీ ఉద్యమ నాయకత్వం వహించగల్గడానికి కారణం తెలంగాణ ప్రజల ఆకాంక్షనే. ఎవరైనా పదవులు కాపాడుకోవడానికో లేక కొత్తగా పదవులకోసమో ఉద్యమంలో చేరితో చేరి ఉండవచ్చు. కాని పదవులకోసం వారు ఉద్యమాన్ని ప్రారంభించారనడం సమంజసం కాదు. పదవి కోసమే రాజకీయం చేశార ని అనుకున్నా ప్రతిపార్టీ రాజకీయం చేసేది పదవికోసం కాదని దేశ సేవ కోసమని ఎవరైనా నమ్ముతున్నారా? న్యాయమూర్తులూ రిట్మైంట్ తరువాత పదవులు ఆశిస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు పదవులు ఆశించవద్దనే నైతిక స్థాయి స్థైర్యం రిటైర్డ్ న్యాయమూర్తులకు ఉండదు. ఎవరిది స్వార్థం, ఏది స్వార్థం? ఒక్కసారి శ్రీకాంతాచారి ఆత్మాహుతి దృశ్యాలు చూస్తే అతను స్వార్థంతో తెలంగాణ ఉద్యమం లేవనెత్తలేదని కట్జూగారికి అర్థం కావచ్చు. టీబీ వచ్చి ఆయన మరణించలేదని రేణుకాచౌదరికి కూడా కనువిప్పు కావ చ్చు (కాకపోవచ్చు). తెలంగాణ గురించి ఏమావూతంఅవగాహన లేకుండా, కనీసం తెలుసుకునే ప్రయత్నం లేకుండా పెద్దలు మాట్లాడడం వారి పెద్దరికానికి శోభ కాదు.

కట్జూ గారు పత్రికారంగ మండలి అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి పత్రికలలో ఉన్న తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర సంపాదకులను వాడుకుని వారి కింద రిపోర్టర్లుగా సబ్ ఎడిటర్లుగా పనిచేస్తున్న తెలంగాణ వారిని అదుపుచేయండి అని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీకృష్ణ ఎనిమిదో చీకటి అధ్యాయం చేర్చారు. ఆయన పత్రికా స్వాతంవూత్యాన్ని ఉల్లంఘించారని, వృత్తి ప్రమాణాలను దెబ్బతీశాడని నిష్పాక్షిక ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే వారు ఈ పత్రికా రంగ మండలినే ఆశ్రయించాలి. సెకనుకు కొంత చొప్పున డబ్బు ఇస్తాడని లగడపాటి ఏం మాట్లాడినా పదేపదే ప్రసారం చేసే అమ్ముడు సరుకు పాత్రికేయుల మీద ఫిర్యాదు చేయాలన్నా ఈ మండలినే ఆశ్రయించాలి. ఇరు పక్షాల వాదనలు విని వార్త రాయాలన్న నైతిక నియమావళి ఉల్లంఘించారని ఫిర్యాదుచేయాలన్నా ఈ మండలే దిక్కు. కాని దానికి అధ్యక్షుడు న్యాయాన్యాయాలు తెలిసిన వాడని మనమంతా నమ్ముతున్నవ్యక్తి మార్కండేయ కట్జూ గారే ఏకపక్షంగా మాట్లాడితే చరిత్ర, వాస్తవాలు, రాజ్యాంగం, చట్టం, ప్రాణత్యాగాలు అర్థం చేసుకోకుండా అన్నింటికీ విరుద్ధంగా సీమాంధ్ర మీడియా వలె వారి వితండ దుర్మార్గ వాదాన్నే వినిపిస్తే ఆయన మీద ఫిర్యాదుకూడా ప్రెస్ కౌన్సిల్ కే చేయాల్సి వస్తుంది. చేయాలి. మిమ్మల్ని మీరే అభిశంసించుకోండి సార్ అని అడగాల్సి వస్తుంది, అడగాలి. పేరుకు ముందున్న న్యాయమూర్తి అనే బిరుదు, ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడని పేరు చివరన తగిలించిన పదవీ నామం, వారికి భుజకీర్తులు. వాటికి తగిన కీర్తి, అర్హులం యోగ్యులం అనిపించుకునే తీరు అవసరం. ఆయన అనుకుంటారని మనం నమ్మడం దురాశో, నమ్మితే నిరాశో ఎవరు చెప్పాలి?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles