బలిదానాలపై స్పందించని భారతం


Tue,April 2, 2013 12:01 AM

uriదేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని పిలుస్తాం. సత్కరిస్తాం. ధైర్య సాహసాలను ప్రశంసిస్తాం. స్వాతం త్య్రం కోసం జైళ్లకు వెళ్లిన గాంధీ నెహ్రూలను అసలు మరిచిపోం. గాంధీని తుపాకీ గుండ్లకు బలిచేశారు. ఇందిరాగాంధీని స్టెన్ గన్‌లతో సెక్యూరిటీ గార్డులే చంపేశారు. రాజీవ్‌గాంధీని మానవ బాంబుతో పేల్చారు. వీరిని దేశంకోసం త్యాగం చేసిన వారని గౌరవిస్తున్నాం. వారి వారసులకు ఓట్లు ఇచ్చి అధికారపీఠాలు అప్పగిస్తున్నాం. ఒక్కరు ఆత్మాహుతి చేసుకుంటే విప్లవాలు చెలరేగి, నియంతలు కూలిపోయిన సంఘటనలు ఇటీవలే చదివాం. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ప్రజల విప్లవోద్యమ వార్తలను చేరవేస్తుంటే రాక్షస ప్రభుత్వాలు పతనమైనాయి. ప్రజాస్వామ్యాలు అవతరించాయి.

కానీ భారతేదేశంలో రెండు లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా భ్రష్టు పట్టి న వ్యవసాయరంగాన్ని మనం సంస్కరించుకోలేకపోతున్నాం. అంతేకాదు, వేయిమం ది అమాయక యువకులు తెలంగాణ కోసం ఆత్మాహుతి అయిన తరువాత కూడా కేంద్రంలో కదలిక లేదు, కాంగ్రెస్‌లో మార్పులేదు. కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకుల కాఠిన్యం కరగలేదు. అవే మోసాలు. అవే ద్రోహాలు. కుట్రలు, అబద్ధాల ప్రచారాలు. ఆత్మహత్యలకు పురికొలిపే అధికారిక వాగ్దాన భంగాలు. రెచ్చగొట్టే దురంహంకార పూరిత వ్యాఖ్యలు చేసే తెలంగాణ వ్యతిరేక కోస్తాంధ్ర నాయకుల వింత వ్యవహారాలు. తెలంగాణలోనే అధికారాన్ని పదవులను అంటి పెట్టుకున్న వారి పదవీ ప్రియత్వం. వీటన్నింటీ ఫలితంగా.. వారానికి ఒకరో ఇద్దరో ఇంకా ప్రాణాలు బలిపెడుతూనే ఉన్నా రు. కానీ పట్టించుకునే వారేలేరు. ప్రాణాలకు విలువేలేదు. ప్రాణాలు తీసుకున్నవారి కుటుంబాలకు ఏవైనా సహాయాలు అందుతున్నాయా అంటే అదీ లేదు. ఆత్మహత్యకు స్పందించడం కూడా మానేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య ఇదివరకు అన్ని పత్రికల్లో మొదటి పేజీ వార్త. ఇప్పుడు కేవలం ‘నమస్తే తెలంగాణ’లో కనిపించే వివరమైన వార్త.

రైతుల ఆత్మహత్యల విషయంలో కూడా ఈ విధంగానే జరిగింది. దురదృష్టవశాత్తూ తెలంగాణలో అదీ వరంగల్ జిల్లాలోనే రైతులు పురుగుమందు తాగి ప్రాణాలు బలిపెట్టడం ప్రారంభమైంది. అప్పడికి టీవీ ఛానల్స్ పోటీ ఇంతగా లేదు. పత్రికల బ్యానర్ వార్తలు ప్రజలలో సంచలనం రేపుతున్న రోజులవి. వందల మంది వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆగలేదు. మహారాష్ట్ర, కర్నాటకరాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల రైతులు బలిదానాలు చేసుకుంటున్నా విచారణా కమిషన్లు, నివేదికలతో ప్రభుత్వాలు కాలక్షేపం చేశాయే తప్ప ఆత్మహత్యలను నివారించే పనే చేయలేదు. కొత్తగా ఆత్మహత్య చేసుకుంటే వార్త గానీ, రోజూ ఆత్మహత్యచేసుకుంటే అది మామూలు వ్యవహారంగా మారిపోయి, వార్తవలె కనిపించడం ఆగిపోయిం ది. రైతులు ఆత్మహత్య చేసుకున్నా దిక్కులేదు, వార్త కూడా లేదు.

వార్త వచ్చినా పట్టించుకునే నాథుడు లేడు. ఏడాది తరువాత ఒకసారి గణాంకాలు ప్రకటిస్తారు. పత్రికలు ఎడిటోరియల్స్ రాస్తాయి. ఫలానా కమిటీ నివేదిక అటకెక్కించారని, ప్రణాళికాసంఘం సిఫార్సులు పనికిరాకుండాపోయాయని విమర్శలు గుప్పిస్తారు. అది రాసిన వారితోపాటు మరికొందరు కూడా చదివే అవకాశం ఉంది. ప్రభుత్వాలు గానీ, ప్రజావూపతినిధులు గానీ, పార్టీ పాలసీ నిర్ణేతలు గానీ పట్టించుకోవడంలేదు. ఆత్మహత్యలు చేసుకునే రైతులకు విలువ నశించింది. ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే సహాయం కూడా ఒక పద్ధతి లేకుండా, వింత నియమాలతో, నిర్ధారణ సూత్రాలతో ఆ పథకం కాగితాలలో కూరుకుపోయి సమాధి అయింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు, రెండు లక్షలమంది రైతులు ఆత్మహత్యచేసుకుంటే చలించని మొండి భారతం మనది. అన్నదాత ఆత్మహత్య వార్త చివరకు క్రైంపేజీలో సింగిల్ కాలం ఐటంగా మారిపోయింది. పాలగుమ్మి సాయినాథ్ ఒక వ్యాసంలో.. పత్రికలు, టెలివిజన్ మీడియా ఏ విధంగా ఆత్మహత్యలను నిర్లక్ష్యం చేసిందో విశ్లేషించి రాస్తే ఆయనకు అవార్డులు, ఆయన వార్తల ఆధారంగా వీడియో సినిమాలు తీసిన వారికి రివార్డులు లభించాయి. కానీ సమస్యను పట్టించుకున్న వారు లేరు. ‘తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు....అసలు కారణం ఇదో మరొకటో’ అని తేలికగా తీసిపారేయడం కూడా చూస్తూనే ఉన్నాం.

తెలంగాణ కోసం నడివయసు ఆశాజీవులుకూడా నిరాశోపహతులవుతున్నారు. పిట్టల వలె రాలిపోతున్నారు. మనుషుల ప్రాణాలకు లెక్కలేదు. రైతులకు ఆదుకోవడానికి ఒక పథకమో, కార్యక్షికమమో ఉన్నది. అది అమలైనా కాకపోయినా, అందరికీ సాయం అందినా అందకపోయినా, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఒకఆశగానైనా మిగిలి ఉన్నది. కాని తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న వారికి ఏ విలువా లేదు. వారి కుటుంబాలకు ఏ ఆదరువూ, ఆధారమూ లేదు.
నేనున్నానని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టింది. జోలె పట్టి 61 లక్షల రూపాయల విరాళాలు సేకరించింది. పెద్దలు హరగోపాల్, ఘంటా చక్రపాణి, శివాజీ, శ్రీధరస్వామి, ప్రకాశ్‌రెడ్డి, అల్లంనారాయణ, కట్టా శేఖర్‌డ్డిలతో కూడిన కమిటీ 260 కుటుంబాలకు తొలివిడత ఆర్థిక సాయం చేయడానికి ముందడుగు వేసింది. ఒక్కొక్కరికి 25 వేల రూపాయల సాయం అందించే మహత్కార్యాన్ని ఆరంభించింది. పత్రికలు సామాజిక బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలో చాటి చెప్పింది నమస్తే తెలంగాణ.

ఎవరో ఏదో చేస్తారని చూడకుండా చుట్టూ చీకటిని తిట్టుకుంటూ కూచోకుండా ‘నమస్తే తెలంగాణ’ ఒక చిన్నిదీపాన్ని వెలిగించింది. ఆ కార్యక్షికమంలో ప్రతి ఒక్కరూ ఆత్మహత్యలు వద్దని పదేపదే చెప్పారు. ‘బలిదానాలు వద్దు, బరిగీసి పోరాడదాం’ అని నినదించారు. తెలంగాణ అంతటికీ చేరవలసిన సందేశం ఇది.ఆగిపోవలసింది ఆత్మహత్యలే. ఆవేశం అవసరం కాని అది ఆవేదనగా మారి నిరాశతో కూడి ఆత్మహత్యతో అంతం కావడం ఏ విధంగానూ న్యాయం కాదు. ఈ విధం గా చనిపోవడం నిజంగా త్యాగమే అయినా దానికి విలువ లేదు. ఇప్పుడు ఎంతమంది చనిపోయినా పట్టించుకోని సమాజం, మీడియా, పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకముందు దాని గురించి పట్టించుకుంటాయని అనుకోవడం వ్యర్థం. కనుక ఇక ఎవ్వరూ ఆత్మ హత్య చేసుకోరాదనే ప్రబోధాన్ని ప్రతి హృదయానికి చేర్చాల్సిన అవసరం ఉన్నది.
నేరగాళ్లకు నీరాజనాలు, అందలాలు, త్యాగశీలురకు నిర్లక్ష్యాలు.. ఇదీ మన వింత సమాజం తీరు. కొందరి గురించి విపరీతంగా పట్టించుకుని, మరికొందరిని అసలు గుర్తించనే గుర్తించని వింత మనుషులు, వింత మీడియా మనది.

తీహార్ జైల్లో రాంసింగ్ ఆత్మహత్యను మీడియా గానీ సమాజంగాని చాలా తొందరగా వదిలేసింది. కొన్నాళ్లు పోతే రేప్ సంఘటన వార్త కూడా లెక్కలో ఒక అంకెగా పరిగణించి, లోపలి పేజీలో సింగిల్ కాలం వార్తగా మారిపోతుందేమో. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన లో కీలక నిందితుడు రాంసింగ్ మరణం చాలా తీవ్రమైన అంశం.
మరోవైపు ముంబై పేలుళ్ల కేసులో ఇరవై సంవత్సరాల తరువాత వచ్చిన తుదితీర్పులో కీలకాంశాలన్నీ పక్కకుపోయి, సంజయ్‌దత్ విషయం నెత్తికెత్తుకున్నా రు. జనమాధ్యమాలు, మాజీ జడ్జీలు, నటులు ఇతర పెద్దలు కూడా సంజయ్‌దత్ కష్టసుఖాలను గురించి తీవ్రంగా ఆలోచించి కలవరపడుతున్నారు. ఆయన చా లా గొప్పనటుడు, దేశ సేవాపరుడైన సునీల్‌దత్ కుమారుడు. సానుభూతికి అర్హుడే. కానీ సమాజమంతా కది లి ఆయనకు క్షమాభిక్ష పెట్టేదాకా వెంటపడుతున్న తీరు చూసి ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇదే పని అన్యాయంగా జైలు పాలవుతున్న వారి కోసం ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు సమాధానం లేదు.సినిమా,రాజకీయం, జైలుసీన్, కోర్టులు, నల్ల కోటు పెద్దలు, పోలీసులు అన్నీ క్రైం థ్రిల్లర్ సినిమాకు సరిపోయే కథా వస్తువులు, నాటకీయ సంఘటనలు. అంతే ఇక మీడియాలో ఒక ఛానె ల్ తరువాత మరొకటి చొప్పున సంజయ్‌దత్‌కు శిక్ష-క్షమాభిక్ష అనే అంశంమీద అవే కార్యక్షికమాలు కొనసాగిస్తున్నాయి.

సినీనటి సమాజ్ వాదిపార్టీ మాజీ ఎంపీ జయవూపద, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ సంజయ్‌దత్‌ను వదిలేయాలని కోరుతున్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి ప్రశాంత్ భూషణ్ సంజయ్‌దత్ నేరమే చేయలేదని వాదిస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయన ఏకే 56 ఆటోమేటిక్ ఆయుధాన్ని కొనుక్కున్నారని ఆత్మరక్షణ కోసం ఏ పని చేసినా నేరం కాదని అన్నారు. ట్రిగ్గర్ నొక్కి పట్టినంత సేపు గుళ్లు వెదజల్లే అత్యాధునిక మారణాయుధం ఏకే 56. అజ్మల్ కసబ్ వంటి వారు వాడిన ఆయుధం. ముంబైలో పేలుళ్లకోసం కాల్పులకోసం దావూద్ ఇబ్రహిం వంటి మాఫియాడాన్‌లు పాకిస్తాన్ సాయంతో దేశంలోకి చేరవేసిన అక్రమ ఆయుధాలలో ఒక ఏకే 56ను ఆయన కొన్నారని ఆరోపణ రుజువైంది. సంజ య్ దత్‌కు దావూద్‌తోనూ అతని సోదరుడు ఇతర అనుచరులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా రుజువైంది. కానీ కుట్ర రుజువు కాలేదని కింది కోర్టు తీర్పు చెప్పింది. దానిపైన సీబీఐ అప్పీలే చేయలేదు. ఎందుకు చేయలేదో చెప్పవలసిన బాధ్యత సీబీఐ పైన, ప్రభుత్వం పైన ఉన్నది. ఇంతటి తీవ్రనేరాలు చేసిన ఆరోపణలు న్న వారి అవసరాలను త్యాగాలను కష్టాలను ఉటంకిస్తూ వారికి ఊరట కలిగించడానికి ఉద్యమం చేసే ఈ పెద్దలు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న వేయిమందికి, వ్యవసాయం చేయలేక బాకీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రెండు లక్షలమంది అన్నదాతలకు ఏం చేస్తారు?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles