వివక్షపై వివరణ ఇవ్వాలె


Tue,March 26, 2013 12:07 AM


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తానన్న ఈ సభా నాయకుల వారు, తనకు ఏ భయమూ లేదని ప్రకటించారు. కాని భయంతోపాటు పక్షపాతం కూడా లేకుండా పనిచేయాలి కదా? ‘కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను విధి ద్వారా వ్యవస్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని నిబద్ధతను కలిగి ఉంటానని, భారత దేశ సమక్షిగతను సార్వభౌమాధికారాన్ని సమున్నతంగా నిలబెడతానని, నేను ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంవూతిగా నా బాధ్యతలను అంతఃకరణ శుధ్ధితో విధేయతతో నిర్వర్తిస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏ విధమైన భయమూ పక్షపాతమూ లేకుండా, ప్రేమ, ద్వేషం లేకుండా అన్ని రకాల ప్రజలకు న్యాయం చేస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని వారు చేసిన ప్రమాణం. ఇందులో రెండు అంశాలు ప్రధానం, ఒకటి అంతః కరణ రెండు భారత రాజ్యాం గం. రెండోదానికి రాజ్యాంగ గ్రంథం ప్రమాణం, కాని అంతఃకరణ నాయకుని అంతర్గతమైన అంశం. ఆ అంతఃకరణను అనుసరించి రాజ్యాంగ ప్రకారం నిష్పక్ష పాతంగా ఉన్నానా లేదా అని తన అంతఃకరణాన్నే ప్రశ్నించుకోవలసి ఉంటుంది. రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన ప్రతి ప్రజావూపతినిధికి, మంత్రికి, ముఖ్యమంవూతికి వారి స్థానాలకు ఎదురుగా ఈ ప్రమాణం రాసి ఉన్న పత్రాన్ని ఛట్రంలో బిగించి గోడపైన అమర్చాలి. అప్పుడు శాసనసభ్యులు మంత్రులు అందరూ దాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రమాణంలో రెండుసార్లు భారతరాజ్యాంగం ప్రస్తావన ఉంది కనుక రాజ్యాంగ ప్రతిని సభ్యులందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి, మంత్రి, శాససభాపక్షం కార్యాలయాలు, శాసనసభ్యుల కార్యాలయాలలో ఒక్కొక్క ప్రతి విధిగా ఉండాలి.

ఆ ప్రమాణం అర్థం రాజ్యాంగంలో కీలకమైన అంశాలు, బాధ్యతల గురించి ప్రతి శాసనసభ్యుడికి శిక్షణ ఇవ్వాలి. శాసన సభకు దగ్గరలో ఉన్న భారత పరిపాలనా సిబ్బంది కళాశాలలో ఈ శిక్షణ నిర్వహించాలి. పరిపాలనా, సహజ న్యాయ సూత్రాలు వివరించాలి. ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే నేరమయ్యే అవకాశం ఉందని, రాజ్యాంగాన్ని అనుసరించకపోతే పదవి పోయే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పాలి. ఈ సారి కూడా అసెంబ్లీలో పరుష పదజాలాలు విసురుకున్నారు. తెలంగాణ విషయం వచ్చేసరికి వివక్ష అన్యా యం, విమర్శ అన్నీ ఎదురుకావడం పాలకులకు ఈ ప్రాంతం పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటి చెప్పా యి. అన్నింటి కన్నా బాధాకరమైన మాట....‘తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వం ఏచేస్తావో చేస్కో’ అని ముఖ్యమంత్రి నోటి నుంచి రావడం. మరునాడు ముఖ్యమంవూతి వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ గురించి మాట్లాడనే లేదని, హరీశ్‌రావు వ్యాఖ్యలకు ప్రతిగా మాత్ర మే అన్నానని చెప్పుకున్నారు. హరీశ్‌రావు తెరాసకు, తన నియోజక వర్గానికి ప్రతినిధి. ముఖ్యమంత్రి సభానాయకుడు. మొత్తం రాష్ట్రానికి, అన్ని ప్రాంతాల ప్రజలకు నాయకుడు. తెలంగాణకు అన్యాయం జరిగిందని, దశాబ్దాలుగా ఇక్కడి ఆదాయం తీసుకుంటూ ఇక్కడ తక్కువ ఖర్చు చేస్తున్నారని, ఇక్కడి నుంచే నిధులను తరలిస్తూ ఇక్కడి జిల్లాలలు నీళ్లు ఇవ్వడం లేదని చాలా స్పష్టమైన అంశాలను ప్రభుత్వం ముందు ఉంచిన తరువాత వివక్ష నివారించడానికి, న్యాయం చేయడానికి సమతౌల్యం పాటించడానికి ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత, జవాబుదారీతనం ముఖ్యమంత్రికి ఉంది.

అవిశ్వాస తీర్మానాలు ప్రతిసారీ ప్రభుత్వాలను పడగొట్టడానికి మాత్రమే పెట్టరు. దాని లక్ష్యం ప్రభుత్వాన్ని నిలదీయడం, లోపాలను ఎత్తిచూపడం, ప్రభుత్వం తప్పిదాలను సవరించుకునేందుకు సమాచారాన్ని ఇవ్వడం. ప్రభుత్వం కాపాడుకున్నంత మాత్రాన తప్పిదాలన్నీ ఒప్పులు కాబోవు. విమర్శను స్వీకరించడం, అర్థంచేసుకోవడం, తరువాత నిజానిజాలను పరిశీలించడం రాష్ట్ర అధినేతగా ఉన్న ప్రజానాయకు డి బాధ్యత. యువతరం నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి చాలా ఆవేశంతో ప్రతి విమర్శను ఆరోపణను తిప్పికొట్టడంలో సమర్థతను ఉద్రేకాన్ని ప్రకటించి స్వపక్ష ప్రశంసలు అందుకున్నారు. కాని సభా మర్యాదలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, విమర్శలను సహించే సహృదయత, అన్యాయం జరిగిందనే అంశాలను పరిశీలించి న్యాయం చేసే అవకాశాలను వాడుకోవడం వంటి మంచి లక్షణాలకు సంబంధించిన అనుమానాలు తీవ్రంగానే ఉన్నాయి.వివక్ష, అసమాన అభివృద్ధి అనే అంశాలు రాజ్యాంగ ఉల్లంఘనలే అవుతాయి, మార్గదర్శక సూత్రాలను తృణీకరించడమే అవుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు శిక్షలు ఉండవు. వెను పదవులు పోవు. కానీ వీధిలో జరిగే నెత్తుటి నేరాల కన్న సమాజాన్ని తీవ్రంగా హాని చేసే చట్ట వ్యతిరేక కార్యక్షికమాలు ఇవేనని పాలకులు గుర్తించాలి. తమ ప్రాంతాన్ని అభివృధ్ది చేయడంలోలోపాలను ఉన్నాయని ప్రజాప్రతినిదులు వివరిస్తే ఆ వివరాలు తానే నోట్ చేసుకుని, అసెంబ్లీలోనే నేతల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేయాలి. చాలా మంది నాయకులు ఆ విధంగా తమ వ్యక్తిత్వాన్ని నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడితే ప్రతి విమర్శలు చేసే అధికారం సభా నాయకుడి హోదాలో ముఖ్యమంవూతికి ఆయన అధికార పక్ష సభ్యుల హోదాలో అనుచర వర్గానికి ఉండి తీరుతుంది. ఆవేశంలో విమర్శకు ఎదురుదాడి చేసే వేగంలో వచ్చిన మాట అని ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణను సదుద్దేశంతో స్వీకరించినా, తనకు తెలంగాణ పట్ల వివక్ష లేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వననే మాట తాను పాటించలేదని రుజువు చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.

శాసనసభలో చర్చలు పరిణామాలు చూస్తూ ఉంటే అవిశ్వాసం తోపాటు విశ్వాసం కూడా ఓడిపోయిందా అనే అనుమానం (కాదు కాదు నమ్మకం) కలుగుతుంది. కిరణ్ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా ఓడిపోయింది. కాని ప్రభుత్వం పైన విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యుల కన్న విశ్వాసం వ్యక్తం చేయని సభ్యుల సంఖ్య ఎక్కువ. మొత్తం 293 సభ్యులలో సగం కన్న తక్కువ- 142 మంది అవిశ్వాసం లేదని ప్రకటించారు. 152 మంది విశ్వాసం ఉందని ప్రకటించలేదు. 58 మంది అవిశ్వాసం ప్రకటిస్తే, 64 మంది తటస్థ వైఖరి అవలంబించారు. 29 మంది ఓట్లు వేయలేదు. అంటే ప్రభుత్వానికి పరిపాలించడానికి అవసరమైన కనీస బలం సగం కన్న ఒక్క ఓటైనా ఎక్కువ ఉండాలన్న నియమం భంగపడింది. సాంకేతికంగా ఆలోచిస్తే సభలో హాజరై ఓటువేసిన సభ్యులలో మెజారిటీ ఎటుందని మాత్రమేపరిశీలించాలి. అప్పుడు కిరణ్ ప్రభుత్వం విజయం సాధించినట్టు సంతోషించవచ్చు. ప్రకటనలను విమర్శలను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికార పక్షానికి సహకరించిందని అనుకోవడానికి వీల్లేదు. మజ్లిస్ బాహాటంగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వాన్ని పడగొట్టకుండా కాపాడి తటస్థ సభ్యులు ఓటింగ్ హాజరు కాని సభ్యులు తమ అభివూపాయాలకు అనుగుణంగా తమకు సమస్యలు రాకుండా చూసుకున్నారు. సాంకేతిక విజయం వెనుక నైతిక పరాజయం చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాని ఈ నాటి అవకాశవాద రాజకీయాల్లో అధికార పక్షం అధికారం చలాయించదు. ప్రతిపక్షం ప్రతిపక్ష లక్షణాలను ప్రదర్శించదు. నైతిక విలువల గురించి ఆలోచించడం కన్న ఎవరి అవసరం అవకాశం ఏమిటనే అంశమే ప్రధానమైపోయింది.

కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని టీఆరెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేసే విమర్శలు నిజాలేమోనని జనం నమ్మే పరిస్థితిని టీడీపీ వైఖరి బలపరిచింది. అవిశ్వాసంపై అధికార పక్షం గెలిచినట్టు కనిపించినా మరో వైపు భయంకరమైన అవిశ్వాసానికి గురై అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సతమతమవుతుండడం అస లు సంగతి అని రుజువైంది. తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులు, ఆరుగురు టీడీపీ సభ్యులు తమ శాసనసభా పక్షం కొరడా ఉత్తర్వులను ఉల్లంఘించి ఎదుటి పక్షానికి ఓటు వేశారు. ఆయా పార్టీలు ఏ విధంగా బలహీనమవుతున్నాయనీ, ఆ పార్టీల్లోనే అవిశ్వాసం ఎంతగా ఉందనేది వెల్లడైన అంశం. ప్రజావూపతినిధులు ఉండే శాసనసభలో మాటలను ఒక సమరం అనుకోరాదనీ, సభ్యులు సమరవ్యూహాలు పన్నడం సరికాదని, సభా కార్యక్షికమాలను సమర భాషలో మీడియా రాయడం సమంజసం కాదని, సభ్యులు రెచ్చిపోయి మీడి యా దృష్టిని ఆకర్షించడం కోసం సభానియమాలను ఉల్లంఘిస్తే అదే కారణంతో సభా నాయకులు అధికార పక్షనేతలు తమ రాజ్యాంగ బాధ్యతలను, రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చేసిన బాసలను మరిచిపోయినట్టు వ్యవహరించరాదని తెలుసుకోవాలి. తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులుకేటాయించలేదని, వివక్ష ఉంద ని రుజువుచేస్తే, ఈ మాటలకు తోడుగా ఆ వాస్తవాలు సభానాయకులను ప్రజల న్యాయస్థానంలోనే కాదు, అసలు న్యాయస్థానంలో కూడా బోనులో నిలబెట్టే అవకాశం ఉంది. అది రాజ్యాంగ, ప్రజాస్వామ్య, వివక్షరహిత ప్రజాపాలనకు సంబంధించిన విషయం. వ్యక్తిగత ఆవేశ కావేశాలకు పరిమితమైంది కాదు. ఒక సభ్యుడు చేసిన ప్రసంగానికి రెచ్చిపోయి పక్షపాతపూరిత ప్రకటనలు చేయడం సభాహక్కులకు భంగకరమని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు విమర్శించారు. సభా హక్కుల భంగం నోటీసు ఇస్తామన్నారు. అంతకన్న మిన్నగా రాజ్యాంగాన్ని విస్మరించడం, రాజ్యాంగ పర ప్రమాణాన్ని ఉల్లంఘించడం తీవ్ర అంశాలు. ప్రజావూపాతినిధ్యం ద్వారా రాజ్యాం గం ప్రకారం లభించిన పదవులను ప్రమాణాల ఉల్లంఘన కారణంగా వదులుకోవలసి వస్తుంది. లేదా ప్రజాక్షిగహానికి గురి కాక తప్పదు.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles