నేరమే అధికారమైతే...!


Sun,March 24, 2013 04:10 AM

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వాత మారణాయుధాలతో అల్లర్లు చేసినారట. ఈ ఆరోపణలతో తెలంగాణ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఇవి నిజమే అని పోలీసులైనా నమ్ముతారా? అది తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ సాగుతున్న రాజకీయ సమరం. ఉద్యమంలో బంద్‌లు రాస్తారోకోలు ఎటువంటివో సడక్ బంద్ కూడా అంతటిదే. ప్రభుత్వం పైన ప్రజానుకూల నిర్ణయాలు చేయాలని వత్తిడి తెచ్చేందుకు బంద్‌లు ధర్నాలు రాస్తా రోకోలు చేయడం సాధారణం. కాని తెలంగాణ ఉద్యమ ఉద్యోగ నాయకులు మాత్రం నేరాలు చేద్దాం రండి, మాకు నేరాలలో సహకరించండి అందరూ నేరాలు చేయండి అని ప్రోత్సహించారట. (సెక్షన్ 109 భారతీయ శిక్షాస్మృతి). ఇదీ పోలీసుల ఆరోపణ.

తెలంగాణ రాష్ట్రం కోరడం రాజ్యాంగబద్ధమైన డిమాండ్. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తున్న రాజకీయం పైన మౌనం వీడని ప్రధాని మీద ఒత్తిడి చేయ డం ప్రజాస్వామ్యబద్ధమైనది. అందులో భాగంగా శాంతియుతంగా సడక్ బంద్ చేయాలని పిలుపు ఇవ్వడం నేరం కాదు. నేర ప్రేరణ కాదు. ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గానీ,ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గాని ఇతర ఐకాస నాయకులు గానీ నేరాలు చేస్తున్నారా, చేయమంటున్నారా? ఆ పిలుపు విని ఉద్యమించిన ప్రజలు శాంతియుతంగా రోడ్డుమీద కూర్చోవడం లేదా నిలబడడం నేరాలా? తెలంగాణ వద్దని ఉద్యమిస్తు న్న కిరాయి ఉద్యమకారులపైన ప్రభుత్వం ఇటువంటి కేసులే పెట్టిందా?

సడక్ బంద్ ఉద్యమానికి ముందు 1777మంది కార్యకర్తలను అరె స్టు చేశారు. 57 కేసులు నమోదు చేశారు. అయినా ఉద్యమం ఆగలేదు. తెలంగాణ ఉద్యమ నేతలు కోదండరాం ప్రభృతులపైన బనాయించిన కేసుల వివరాలేమిటో తెలుసుకుంటే అవి ఎంత అబద్ధపు ఆరోపణలో అర్థమవుతుంది. మొదటిది,నేర ప్రేరణ, ఏది నేరం ఎవ రు ప్రేరేపించారు. అసలు లోతుగా ఆలోచిస్తే, జనం సడక్ బంద్ కు దిగేట్టు రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రభుత్వ పెద్దలు, తెలంగాణ ను రగిలించి ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా నోటికొచ్చిన భాషలో మాట్లాడుతున్న బాధ్యతారహిత ప్రజావూపతినిధులు, తెలంగాణపై కక్ష గట్టి, వ్యతిరేక ప్రచారాలు చేస్తున్న మీడియా నేర ప్రేరకులు. వారి మీద కేసులు పెట్టాలి. వారే ఆనేరగాళ్లు. కానీ వారిమీద కేసులు పెట్ట రు. ఉద్యమాలను అణచడానికి మాత్రం తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు నేరవూపేరణ ఆరోపణకు సెక్షన్ 109 ఒక ఆధారం. ఐపిసిలో ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఉదాహరణలు కాని, సెక్షన్‌లో ఉన్న నిర్వచనం కాని తెలంగాణ ఉద్యమ నేతలమీద ప్రయోగించడం అసమంజసం.
Indian Penal Code, Section 109. Whoever abets any offence shall, if the act abetted is committed in consequence of the abetment, and no express provision is made by this Code for the punishment of such abetment, be punished with the punishment provided for the offence.
ఇక మరో నేరారోపణ. కోదండరాం ప్రభృతులు మారణాయుధాలు పట్టుకుని హింసాత్మక అల్లర్లు చేయడానికి చట్టవ్యతిరేకంగా సమావేశం అయ్యారట. ఆ మారణాయుధాలను ఉపయోగించి చంపే అవకాశం ఉందట. అటువంటి చట్టవ్యతిరేక అల్లర్లు చేయడానికి మారణాయుధాలతో సిద్ధం కావడం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారట.

బహుశా కోదండరాం పెన్ను పట్టుకుని వెళ్లి ఉంటాడు. అది మారణాయుధం. అదన్న మాట హింసాత్మక మారణాయుధ సహిత అల్లర్ల కుట్ర. అదే ఉద్దేశ్యంతో నేరాలు చేయడానికి గుమికూడిన ఆ మారణాయుధ సహిత అల్లర్ల సంకల్ప బృందం లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నేరస్తుడే కనుక అందరినీ మూడేళ్ల పాటు జైలుకు పంపవచ్చు. కాని ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. వీరిని జైలుకు పంపితే చాలని వారి అభివూపాయం.

ఈ నేరాలన్నీ సరిపోనట్టు ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఉత్తర్వును ఉల్లంఘించ డం మరో నేరం. సెక్షన్ 188 కిందా పబ్లిక్ సర్వెంట్ జారీచేసిన ఉత్తర్వులు ఉల్లంఘించి తద్వారా అవరోధాలు కల్పించడం నేరం. దీనికి ఆరు నెలల దాకా జైలు శిక్ష జరిమానా కూడా విధించవచ్చు. దుర్మార్గపు నిర్బంధం అనే నేరం ఎవరు చేశారో తెలుసా? పోలీసులు కాదు. పోలీసు వారి ఆరోపణ ప్రకారం కోదండరాం మొదలైన నాయకులు దుర్మార్గంగా కొందరిని ఒక మార్గంలో నడవకుండా ఆపి నిర్బంధం పాలుచేసి సెక్షన్ 340 కింద నిర్వచించిన నేరం చేశారట. ఈనేరానికి ఏడాది జైలు, 1000 రూపాయల జరిమానా విధించవచ్చు.
తెలంగాణ ఉద్యమనాయకులు చేసిన మరో నేరం యాభై రూపాయలు లేదా అంతకన్న ఎక్కువ నష్టంచేశారట. సెక్షన్ 427 నేరం అది. ఇవి కాకుండా ప్రజా ఆస్తు లు విధ్వంస నిరోధక చట్టం 1984 అనే మరో చట్టాన్ని కూడా ఈ నేతల మీద ప్రయోగించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేస్తే అయిదేళ్ల జైలు, పేలుడు పదార్థా లు, నిప్పు ద్వారా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంచేస్తే ఏడాదినుంచి పదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు.

తెలంగాణ ఉద్యమనాయకులు ప్రేలుడు పదార్థాలు తెచ్చుకుని సడక్ బంద్ చేస్తున్నారని ఈ సెక్షను ప్రయోగించడం ద్వారా తప్ప మరే నాయకుడు పోలీసు అధికారి కూడా ఆరోపణ చేయలేదు. తెలంగాణ వ్యతిరేక వార్తలు రాయడానికి అత్యుత్సాహంతో ఉన్న మీడియా మిత్రులు కూడా రాయలేదు. అయినా కేసులు పెట్టి లోపల తోయడానికి తోచిన ఆరోపణలన్నీ చేసి కోర్టుముందు పడేశారు, జైల్లో తోసేశారు.
అరెస్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆ చట్టాల్ని సవరించారు. ఏడేళ్ల జైలుశిక్ష కన్న తక్కువ శిక్షలు నిర్ధారించిన సెక్షన్ల కింద కేసులు నమోదయితే అసలు అరెస్టేచేయకూడదని కొత్తగా క్రిమినల్ లా ను సవరించుకున్నాం. కాని అదెవరికీ గుర్తుండదు.

ఈ చట్టంకింద కోదండరాంను ఇతరులను అరెస్టుచేయడానికి వీల్లేదు. అయినా ఎందుకు అరెస్టు చేసారు? అయితే విచివూతమేమంటే ఈ కేసులన్నీ బెయిలబుల్ కేసులు. అంటే పోలీసు అధికారులే బెయిల్ ఇవ్వదగిన నేరాలు. కాని వారు ఇవ్వరు. ఇవ్వకూడదని వారికి ఉత్తర్వులు ఉంటాయి. ఆ రకం ఆదేశాలు కాగితం మీదా ఉండవు. ముఖ్యమంవూతికి అసలు తెలంగాణానేతలు అరెస్టయిన విషయమే తెలియదని అంటాడు. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో, మారణాయుధాలతో అల్లర్లు చేయడానికే రోడ్లమీదికి వచ్చారని ముఖ్యమంవూతికి గానీ హోంమంవూతిగారికి గానీ చెప్పారో లేదో గాని వారికి తెలియదని కూడా వార్తలు వచ్చాయి. చేయని నేరాలతో ఆరోపణలు చేయడం, అరెస్టు చేయదగని నేరాలలోఅస్టు చేయడం, బెయిల్ ఇవ్వతగిన నేరాలే అయినా పోలీసు అధికారులు బెయిల్ ఇవ్వకపోవడం వరుస అన్యాయాలు. ఉద్యమాన్ని అన్యాయంగా అణచే మార్గాలు.

బెయిల్ ఇవ్వదగని నేరాలు అంటే పోలీసు అధికారులే తమంత తాము బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని అర్థం. అటువంటి కేసులలో న్యాయాన్యాయాలు పరిశీలించి పోలీసులు మోపిన నేరాల నిజానిజాలను పరీక్షించి అన్యాయంగా అరెస్టు చేశారని అర్థమైన వెంటనే బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వ కూడదని ముందే నిర్ణయించుకుంటే స్వేచ్ఛను ఎవరూ రక్షించలేరు. మొత్తం 11 మంది నేతల మీద ఇటువంటి వింత వింత కేసులు పెట్టారట. వారిలో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారట. వారు కూడా కోర్టు ముందుకు వస్తే తప్ప అరెస్టయి జైల్లో ఉన్న 8 మందికి బెయిల్ ఇవ్వరట. చట్టంలో ఈ సౌకర్యం ఉంటే పోలీసులు ప్రతికేసులో ఒకరిద్దరిని అసలు అరెస్టే చేయరు. ఇంకా చాలా కాలం ఈ కేసులో అరెస్టు చేయకపోవచ్చు. అందాకా కోదండరాంకు గానీ ఇతరులకు గానీ బెయిల్ రాదని ఈ అన్యాయ సూత్రాలు వివరిస్తున్నాయి. ఇదామన న్యాయం? ఇటువంటి అసమంజస కారణాలమీద బెయిల్ నిరాకరించి స్వేచ్ఛకు ప్రజాస్వామ్య ఉద్యమాలకు హాని చేసేందుకు స్వతంత్ర భారత దేశం లో కూడా బ్రిటిష్ పాలనలో వారి బానిసల తరహాలోనే అధికారులు వ్యవహరించడం ఆశ్చర్యకరం.

మరీ బాహాటంగా తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసు అధికారులు తమను ఆ విధంగా ఎవరు ఆదేశించారో వెల్లడించాలి. అసలు ఎవరు ఆదేశించినా వారు తప్పుడు కేసులు పెట్టడం వృత్తి ధర్మానికి న్యాయానికి విరుద్ధం.ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ 24 గంటలు మించి జైల్లో ఉన్నాడు కనుక ఉద్యోగంనుంచి తొలగించ వచ్చేమోనని, తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చేమోనని ఆలోచించే కుట్రదారులు మరి కొందరు. వారిలో తెలంగాణ వ్యతిరేక మీడియా వర్గాల ఉత్సాహం మరికొంత. ఎవరికీ బాద్యత లేదు, జవాబుదారీతనం లేదు. ద్వేషం ఒక్కటే లక్ష ణం. అణచివేత ఒక్కటే లక్ష్యం.
రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు రాజకీయ ఉద్యమాలమీద కూడా పోలీసులను చట్టాలను వాడుకోవడం ప్రభుత్వాలకు అలవాటయింది. సంకీర్ణ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి రాజకీయ వ్యూహాలకన్నా పోలీసు ఫైళ్లను చట్టాల సెక్షన్లను ఆయుధాలుగా విసురుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా రాజకీయ వ్యూహ రచయితలు అవసరం లేదు. వారికి సీబీఐ చాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమానికి కొత్త వ్యూహాలు రాజకీయ నైపుణ్యాలు ఏవీ అవసరం లేదు. పోలీసులకు తెలిసిన కేసుల సెక్షన్లు చాలు. దానికి పెద్ద తెలివితేటలు కూడా అవసరం లేదు. రాయించుకున్న జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ చాలు. తప్పు డు కేసులు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమే అసలైన నేరం. ఆనేరానికి శిక్షలు వేయాలని అనేక దేశాల్లో చట్టాలు చేసుకున్నారు. అటువంటి చట్టమే మనదేశంలో ఉంటే ఎందరు ప్రభుత్వ పెద్దలు, ఎందరు పోలీసు అధికారులు జైల్లో ఉంటారో చెప్పలేము. పదవులు రాజకీయం అధికార రక్షణ, కుట్రలుమోసాలు, దుర్మార్గపు ప్రచారాలు, (ఇన్)జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ సూచించిన దుర్మార్గపు ఉద్యమ అణచివేత నీచ విధానాలు అమలు చేసే చోట న్యాయం పోలీసుల దగ్గరో లేక ఇంకెక్కడో దొరుకుతుందా? దొంగకేసులు పెట్టే వారే దొంగల కన్న పెద్ద నేరస్తులనే చైత న్యం జనంలో రావాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 25, 2013 11:45 PM

రక్త పిపాసులకు జవాబు రక్తదానం

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన