ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?


Tue,March 19, 2013 12:09 AM


ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ్ తీహార్ జైలులో ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అతనికి ఉరి శిక్ష విధించారా? లేక తనే ఆ శిక్ష వేసుకున్నాడా? నేరం జరిగిన తరువాత నిజానిజాలను రుజువుల ఆధారంగా తేల్చాల్సిన విచారణ కోర్టులు మాత్రమే జరపాలి. ఆ బాధ్యత, అధికారం మరెవరికీ లేదు. జన మాధ్యమాలు ఆ నేర సంఘటన వివరాలు ఇస్తే ఇస్తుంది. అంతే గాని నేరస్తుడెవరో తేల్చే అవకాశం, శిక్షించే అధికారం మీడియా కు లేదు. కాని జనమాధ్యమాలు విరుచుకుపడి పదేపదే ప్రసారం చేసే అంశాలన్నీ వాస్తవాలనుకునే మానసికవూపభావానికి కోర్టుల్లో తీర్పులుచెప్పవలసిన న్యాయమూర్తులు కూడా లోన య్యే ప్రమాదం లేకపోలేదు. కాని పోలీసులే నేర నిర్ణయంచేస్తే అసలు నేరవిచారణ న్యాయస్థానంలో జరిగేదాకా వెళ్లనే వెళ్లదు. అక్కడే సమస్య ముగుస్తుంది. లేదా మళ్లీ దాన్ని విచారించే సమస్యే ఉండదు. ఇక జైలు అధికారులు శిక్ష విధిస్తే వారి విధిని వారు నిర్ణయించినట్టే కదా. రాంసింగ్‌కు కోర్టులో ఉరి శిక్ష పడితే, ఆ ఉరి తీయాల్సింది తీహార్ జైలు అధికారులే కదా.

కనుక వారే ముందే ఉరితీస్తే ఏమి తప్పు? అనే ప్రశ్న రావచ్చు. శిక్ష విధించే అధికారం జైలు అధికారులకు లేదు. నేరం రుజువైన తరువాత నేరస్తుడికి ఏ శిక్ష విధించాలో కోర్టు నిర్దేశించిన మేరకు ఆ శిక్షను అమలు చేయవలసిన బాధ్యత మాత్రమే జైలు అధికారులకు ఉన్నది. పోలీసులు నేర నిర్ణయం చేయడం ఎంత ప్రమాదమో, జైలుపోలీసులు శిక్ష విధించడం అంతకన్న ప్రమాదకరమైంది. అప్పుడు మనం చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయశాస్త్రం, న్యాయనిర్ణయం గురించి మాట్లాడుకునే అవసరం అవకాశం ఉండదు.డిల్లీ సామూహిక అత్యాచార సంఘటన జాతిని కుదిపేసింది. మీడియా ప్రతిస్పందన న్యాయం, సమర్ధనీయం కూడా. సహజంగానే మీడియా ఈ నేరాన్ని గురించి వివరాలను జనులకు చేరవేసింది, విమర్శించింది, చర్చను రెచ్చగొట్టింది. జనం వీధుల్లోకి వచ్చారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రభుత్వం గుండెల్లో నిద్రపోయారు. చట్టాన్ని మార్చమని వత్తిడిచేశారు. నేరస్తులు ఏం జరుగుతుందోనని భయపడ్డారు మొదటిసారి. పోలీసులు పట్టుకుంటారని కాదు. కోర్టు జైలుపాలు చేస్తుందని కాదు, జనంలో తిరగడం ఎట్లా అనే భయం పట్టుకుంది. చట్టానికి కాకుండా మీడియా వల్ల వచ్చిన ప్రతికూల ప్రచారానికి భయపడ్డారు వారు.

ఎంతగా ప్రచారం జరిగిందంటే వారికి జనంలో తిరగడం సాధ్యం కాకపోవచ్చు. అంతేకాదు ఏ కోర్టు కూడా వారికి బెయిల్ ఇవ్వడం కూడా అసాధ్యం కావచ్చు. వారిని శిక్షించకపోవడం అనేది ఊహాతీతమైన విషయం అయిపోవచ్చు. బహుశా రాంసింగ్ ఆవిధంగా జరుగుతుందనే ప్రాణాలు తీసుకుని ఉంటాడు. మనదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నేరన్యాయవ్యవస్థలో, నేర న్యాయశాస్త్రంలో ప్రాథమిక సూత్రం ఏమంటే..నేరం రుజువయ్యే దాకా నిందితుడిని అమాయకుడని భావించాలి. నిష్పాక్షికంగా నేర నిర్ధారణ జరగడం కోసం ఈ భావన అవసరమని చట్టం నమ్ముతుంది. మీడియా వారు పదేపదే ప్రచారం చేసినట్టు ఫలానా వాడే నేరస్తుడని ముందే న్యాయమూర్తిగారు నమ్మితే ఇక విచారణెందుకు? ఆ మాట న్యాయమూర్తిగారు నమ్మడం ఎం దుకు? పోలీసులు జైలు అధికారులు ఓ సారి వారే నేరస్తులని నమ్మితే సరిపోతుంది. తొందరగా ఉరితీసేయొచ్చు. ఓపనైపోతుంది. దాన్నే మీడియా వారి ట్రయల్ అని తిడతారు. రాంసింగ్ నేరస్తుడని కోర్టు వారు నమ్మినా నమ్మకపోయినా మొత్తం జాతి, ప్రపంచం నమ్మింది. కనుక ఉరితీస్తే ఏం బోయిందట అంటారు. పోలీసులూ ఇదే నమ్ముతారు. జైలర్లుమాత్రం నమ్మకూడదా. దీన్నే మీడియా వారి నేరన్యాయవిచారణ అనాలి మరి!

నిజానికి ఇంత రచ్చ జరిగిన తరువాత నిందితుల తల్లిదంవూడులు తమసంతానాన్ని సమర్థించుకునే అవకాశమే ఉండదు. అసలు ప్రతి నిందితుడి పక్షాన న్యాయవాది ఉండాలి. అతని కేసు ఏమిటో వినితీరాలి. కాని మీడియా విజృంభణ పుణ్యమాని వారికి కేసే లేకుండా పోయింది. వాదించే న్యాయవాది కూడా తానేదో పెద్ద తప్పుచేస్తున్నట్టు భావించడం, అతని పక్షాన వాదించే వారే గ్యాంగ్ రేప్ చేసిన రాక్షసుడిని చూసినట్టు చూడడం! అసపూవరైనా వాదిస్తారా అనే అనుమానం కూడా వచ్చింది. అతనికి బెయిల్ వస్తుందన్న నమ్మ కం జనానికి గానీ, వారికి గానీ లేకుండా పోయింది. ఈ నేరం జరిగిన తరువాత టీవీ చానెళ్ల వారు ‘రేప్’, ‘లా’ సంస్కరణల మీద ఆలోచన మొదలు పెట్టి వరసగా చర్చాకార్యక్షికమాలు ఏర్పాటు చేశారు. కాలేజీ అమ్మాయిల బృందాలను రప్పించి ‘ఆడవారిని రక్షించే బాధ్యత, చట్టాలు, ప్రభుత్వాలు’ అనే విషయం మీద ప్రత్యక్ష ప్రసారాలు విపరీతంగా సాగించారు. అందులో సామాన్యులు అడిగే సర్వసామాన్యమైన ప్రశ్న ఏమంటే ... ఈ సంఘటనలో నేరగాళ్లు ఆ ఆరుగురని అందరికీ తెలిసింది కదా. వారిని నేరుగా ఉరి తీయక మళ్లీ ఈ కోర్టులూ, వాయిదాలు ఎందుకట? అని టివీ కెమెరాలముందు నిలదీసి అడుగుతుంటే..ఇది పద్ధతి, అది న్యాయం సాక్ష్యం ఉండాలి అంటున్న వారు జనానికి పిచ్చివారి వలె అగుపించారు.

ఆ నేరం అంతఘోరంగా జరిగింది కనుక జనంలో వచ్చిన తీవ్ర వ్యతరేకత అది. ఇటువంటి సామాన్యుల మాటలు విని మీడియా వారి ప్రచా రం చూసి నిర్భయ ముద్దాయిలను నేరగాళ్లుగా నిర్ధారించి ఉంటే దాన్ని మీడి యా ట్రయల్ అని ఖరాఖండిగా అనవలసి వచ్చేంది. కాని జరిగింది అది కాదు. రాంసింగ్ తనను తాను విచారించుకుని, తానే నేరస్తుడని తీర్పు చెప్పుకుని తనకు తానే ఉరి శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే రాం సింగ్ డిల్లీలో డిసెంబర్ 16న ఏంజరిగిందో ఏం చేశారో, దాని వెనుక ఎవవరు ఉన్నారో న్యాయస్థానంముందు చెప్పవలసిన బాధ్యత ఉన్న వ్యక్తి. మీడి యా కెమెరా ముందు ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు. కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పడం వేరు. మీడియాలో వచ్చేది కేవలం సమాచారం మాత్రమే. కాని ఆ సమాచారం నిజమా కాదా అని సాక్ష్యం తేలుస్తుంది. కోర్టులు సాక్ష్యం కోసం ఎదురుచూస్తాయి. సాక్ష్యం ఉంటేనే సమాచారం నమ్ముతాయి. నేరాంగీకారం జరిగినంత మాత్రాన నేరం జరిగినట్టు నమ్మదు. నిజానిజాల నిర్ధారణ ఉంటే నే నమ్ముతుంది. అదే మీడియాకు కోర్టులకు తేడా. కెమెరాల ముందు కనిపించే నేరాల వెనుక ఇంకా వేరెవరయినా నేరగాళ్లు ఉన్నారా లేదా చూడవలసిన బాద్యత నేర న్యాయవ్యవస్థ మీద ఉంటుంది. మీడియా మీద లేదు. అంతకీలకమైన వ్యక్తి తివాచీ దారాలు ఏరుకుని పైకప్పు ఇనుప కడ్డీకి తాడు కట్టుకుని ఉరిగా మార్చుకున్నాడంటే అంతకన్న నిర్లక్ష్యం మరొకటి ఉండదు. జైలు అధికారుల నిర్లక్ష్యం కనుక రాంసింగ్ ఉరికి కారణమైతే దీన్ని పోలీసుల విచారణ, జైలర్ల చేత మరణ శిక్ష అమలు అనుకోవలసి వస్తుంది.

తీవ్రమైన నేరం చేసినకేసులో కీలకమైన ఒక నిందితుడు అనుమానాస్పదంగా మరణించడం ప్రభుత్వం పాత్రను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఎవరో కావాలని రాంసింగ్‌ను చంపారని ఇక్కడ కూచుని ఆరోపించడం న్యాయం కాదు. కాని రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మితే అందుకు సావకాశం కల్పించడం మాత్రం ఆత్మహత్య ప్రేరక పాత్ర అని అనక తప్పదు. అది చాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి. ఆత్మహత్యచేసుకోవడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం నేరపూరిత లక్షణమే అవుతుంది. కనుక ప్రభుత్వం అందు కు సమాధానం చెప్పవలసిందే. ఇదే జైలులో కాకుండా మరొకచోట జరిగి ఉంటే, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరారోపణకు నిందితుడు గురయ్యేవాడే. ఆత్మహత్య ప్రేరణ నేరానికి మన శిక్షా స్మృతిలో హత్యానేరానికి శిక్ష ఎంతో అంతే శిక్ష విధిస్తారు. అంటే రాంసింగ్ ఆత్మహత్య కు ఎవరు కారణం. ఆ హత్యకు ఎవరు కారణం? ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వం పరోక్ష బాధ్యతవహించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రాంసింగ్ ఆత్మహత్య వల్ల నిర్భయ కేసు విచారణ ఆగకపోవచ్చు. కాని ఈ కీలకమైన సాక్షి లేకుండా పోతాడు. న్యాయం కోసం, న్యాయపాలనకోసం అతను బతికి ఉండాల్సింది. అతను ఇచ్చిన నేరాంగీకారం అతని ముందు రుజువైపోయేది. ఇతర నేరస్తుల వ్యవహారాలు కూడా ఈ వ్యక్తి సాక్ష్యం ద్వారా ధృవపడేవి. వెనుక ఎవరు ఉన్నారు? ఆ లగ్జరీ బస్బు హఫ్తావసూలు జాబితాలో ఉండడం వల్ల వారు పొందిన లాభాలేమిటి? వంటి రకరకాల కథా కమామీషులు తేలిపోయేవి.

ఇంకా మనకు తెలియని సంగతులు తెలిసే అవకాశం ఈ కీలకమైన వ్యక్తి లేకపోవడం వల్ల శాశ్వతంగా మూసుకుపోయింది. ఇక జైలులో (కస్టడీలో) మరణం గురించి కేంద్ర హోంమంత్రి గారు ఇది తీవ్ర భద్రతా లోపమని ఓ ప్రకటన వెలువరించారు. ఇటువంటి కస్టడీ మరణ సంఘటనలు జరిగితే మెజిస్టీరియల్ విచారణజరపాలి. కార్యనిర్వాహక మెజివూస్టేట్ విచారిస్తాడు. అంటే న్యాయమూర్తి కాదు. ఒక పాలానాధికారి ఎందుకు ఏ విధంగా చనిపోయాడో విచారిస్తాడు. మరోసారి ఈ విధంగా జరగకుండా చూడాలని నివేదిక ఇస్తాడు. అది రికార్డుగా మిగిలిపోతుంది. తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడు. నిర్లక్ష్యాన్ని ఎవరూ పట్టించుకోరు. పాలనాధికారుల నివేదికలో పాలకులపట్లపక్షపాతం ఉండకపోదు. పోయిన వాడు పోయా డు. వీడిగొడవ మనకెందుకనే సిద్ధాంతం మరొకటి. ఇక మళ్లీ మీడియా సంగతి, జనం సంగతి ఆలోచిస్తే.. రాంసింగ్ ఆత్మహత్య వార్త చదివి తగిన శాస్తి జరిగిందని, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని, బాధితురాలి బంధువులు స్నేహితులు సహజన్యాయం జరిగింది అంటారు. మరికొందరు వాడిపాపాన వాడే పోయాడంటారు. అనవసరంగా కోర్టు తీర్పులు, దానిపైన దశాబ్దాల పాటు సాగే అప్పీళ్లు, దానిపైన శిక్షలు, శిక్షల మీద సమీక్షలు, క్షమాభిక్షలు, తిరస్కారాలు అందాకా ఈ నిందితులను కాపాడడం, ఈ గొడవంతా ఉండదు అని తీర్పు చెప్పడం మన పాఠక ప్రేక్షక న్యాయమూర్తులు, మీడియా జడ్జిలు చేసే పని.

ఇన్‌స్టంట్ శిక్షలు టివీల్లో సినిమాల్లో సాధ్యం. నిజజీవితంలో కూడా అదేవిధంగా జరగవు. మరీ ఆలస్యం కావడం అన్యాయమే అయినా వెను ఉరితీయాలనడం దారుణం. అనాగరికం.వరంగల్‌లో 2008 లో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, ఆ తరువాత ఆమె తిరస్కరించిందని ఆసిడ్ దాడులు చేసిన దుర్మార్గులను అరెస్టు చేశారు. తల్లిదంవూడులు వారికి నచ్చ జెప్పి లొంగిపొమ్మన్నారు. వారు లొంగిపోయారు. మరునాడు, వారిని మామునూరు దగ్గర అడవులకు తీసుకు వెళ్లారు. అక్కడ వారు ఆసిడ్ సీసాలు దాచుకున్నారట. అక్కడికి పోలీసులు తీసుకెళితే తప్పించుకుని పారిపోయే ప్రయత్నంచేస్తే ఎదురు కాల్పులు జరిగాయట. ముగ్గురూ మరణించారు. ఎవ్వరికీ ఆసిడ్ గాయాలు లేవు. వారు నిర్దోషులు కాకపోవచ్చు. ఖచ్చితంగా వారికి శిక్షపడవచ్చు. కాని వెను వారికి మరణ శిక్ష విధించే అధికారం ఎవరికి ఉంది. జిల్లా పోలీసు సూపరింటెండెంటు గారికా లేక న్యాయమూర్తికా. ఎవరికీ లేదు. ఉండదు. కాని ఆ ముగ్గురిని చంపడం సినిమా వలె థ్రిల్లింగ్ కహానీ అయింది. జనం బారులు తీరి పోలీసు అధికారిని అభినందించారు. ప్రజాభివూపాయం, మీడియా అభివూపాయం అతనికి శిక్ష వేయడం సరైనదే అనే. మరో అభివూపాయం వినడానికి జనానికి ఏ మాత్రం ఇష్టం లేదు.

అందరూ ఒప్పుకున్నదే నిజం. అందరూ అంగీకరిస్తే ఎవరినైనా కాల్చి చంపొచ్చా? నిజంగా పోలీసులు ఆత్మరక్షణ కోసమే చంపితే వారు నిర్దోషులే కాని ఎవరు ఈ విషయం తేల్చాలి? ఇది న్యాయం కాదని ఈ రచయిత మీడియా ముందు ఆరోజు చెప్పవలసి వచ్చింది. అప్పుడు కెమెరామెన్ కూడా కోపానికి వచ్చి, అదే ఆసిడ్ దాడిలో మీ అమ్మాయి గాయపడితే మీరిదే మాట అంటారా? అన్నాడు. ఖచ్చితంగా అనను అన్నాను. తరువాత నేనే ఎదురు ప్రశ్న వేసాను. ఆ కాల్పుల్లో చనిపోయింది మీ కొడుకు అయితే మీరేమంటారు? అని ఆ కెమెరామెన్‌ను అడిగాను. అతను ఆలోచనలో పడ్డాడు. విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చంపడమేనా అని అడిగి తీరుతాడు. దానికి జవాబేమిటంటే? బాధితురాలి తండ్రి గానీ, నిందితుడి తండ్రిగానీ న్యాయం చెప్పలేడు. దానికి ఒక పధ్దతి క్రమం పాటించి, సుశిక్షితుడైన నిష్పాక్షికమైన మూడో వ్యక్తి నిజనిర్ణయం చేయాలి. అతనే న్యాయమూర్తి. అదే కోర్టు. నేరం రుజువుచేయాల్సింది పోలీసులు ప్రాసిక్యూషన్. దాన్ని ఎందుకు మనం నిర్ణయించుకున్నాం? ఎందుకు వదిలేస్తున్నాం? న్యాయం ఎక్కడ తేలాలి? కేవలం న్యాయస్థానంలోనే. వారిమీద హత్య కేసు పెట్టిన తరువాతనే ఆ విచారణకు అవకాశం ఉందని మనం చాలాకాలంగా రూపొందించుకున్న న్యాయ విధానాలు సిద్ధాంతాలు, శాస్త్రాలు వివరిస్తున్నాయి. మనమే వాటిని చట్టాలుగా రాసుకున్నాం. చాలా కేసుల్లో పాటిస్తున్నాం. కొన్ని కేసుల్లో వదిలేస్తున్నాం. అంతా కొందరి ఇష్టం, సిస్టం కాదు. అదేనా న్యాయం అని ఎవరూ ఆలోచించరా? మీడియా సమాచారాన్నిచ్చి జనాన్ని చైతన్యవంతుల్నిచేస్తుంది. అభివూపాయ నిర్మాణం చేస్తుంది. పోలీసులు పరిశోధించి సాక్ష్యాలు సేకరిస్తారు. దాన్ని కోర్టు పరిశీలించి న్యాయ విచారణ చేస్తుంది. మీడియాది సమాచారం. కోర్టు వెతికే ది సాక్ష్యం. నిజమైన అధికారం సమాచారంలో లేదు. నిజమైన అధికారం ‘లా’ లో పోలీసు లాఠీలో ఉంది. ఇటు సమాచారాన్ని కాదని, అటు కోర్టులో సాక్ష్యం న్యాయాన్ని కాదని, మరణశిక్షలు అమలు చేస్తానంటే, ఆత్మహత్యలకు వెసులుబాటు కలిగిస్తాను అంటే, న్యాయవిచారణను ప్రభుత్వం చేస్తున్నట్టా లేక పోలీసులు చేస్తున్నట్టా? అని అనుమానించడం న్యాయం.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి