తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు


Mon,March 4, 2013 11:36 PM

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్లో ఉన్న సొంత (?) ప్రభుత్వం కూడా బహిరంగంగా ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ ఎవరిమీద పోరాడాలి? ఎందరి మీద పోరాడాలి? శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు కింద నిర్మించిన జలాశయంలో గోదావరి నదీజలాలు చేరే ప్రాంతంలోనే గోదావరి నది పైన బాబ్లీతో సహా 13 ఆనకట్టలు నిర్మించి నదీ జలాలను దారి మళ్లించుకుంటే శ్రీరాంసాగర్ జలాశయానికి నీళ్లు ఎక్కడినుంచి వస్తాయనేది సామాన్యుని ప్రశ్న.

గోదావరి నదిపైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన శ్రీరాంసాగర్ జలాశయానికి దగ్గరగా బాబ్లీ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని లేకపోతే తమ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నచ్చజెప్పడంలో విఫలమైంది. జలాశ యం పరిధి లోపల రాష్ట్రం హద్దుకు ఆవల మరొక జలాశయం (బాబ్లీ) కట్ట డం వంటి చర్యలను ఏ విధంగా అరికట్టాలో పరిశీలించాలి. సుప్రీంకోర్టు సమర్థించినా ఇది దుర్మార్గమే. ఈ బాబ్లీ వల్ల 2.14 టీఎంసీ అడుగుల జలా న్ని పోచంపాడు కోల్పోతుంది. అయినా మహారాష్ట్ర వాటాకింది దాన్ని సర్దుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. అయితే నిపుణులు చెప్పేదేమంటే ఒప్పందానికి లోబడి, మహారాష్ట్రకు చెందిన వాటా జలాలను మాత్రమే వాడుకోగలిగితే సమస్యే లేదని. బాబ్లీకి అనుమతి లభించినప్పటికీ ఒప్పందం ప్రకారం జలాలను పంచేందుకు బాబ్లీ జలవినియోగా న్ని పర్యవేక్షించేందుకు కమి టీ సాధించడం ఒక విజయమని కూడా నిపుణులు అంటున్నారు. రోజూ నీళ్లను కొలిచి లెక్కవూపకారమే వాడుతున్నారా అని పరిశీలించడం ఎంత వరకు సాధ్యమో నిపుణులే చెప్పాలి.

చంద్రబాబు ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి పాలనా కాలందాకా నేతల నిర్లక్ష్యం,బాధ్యతారాహిత్యం కారణంగా బాబ్లీ పూర్తయింది. శరవేగంతో సాగుతున్న ఈ నిర్మాణాన్ని గురించి వివరాలు తెలిసినా కనీసం కోర్టులో సత్వరం విచారణ జరిపించడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. కోట్ల ఖర్చుతో కట్టిన తరువాత కూలగొట్టడం సాధ్యం కాదని మహారాష్ట్రకు తెలుసు. అందుకే అనేక ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయారు. బాబ్లీ విషయం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. మిగిలిన ప్రాజెక్టుల సంగతేమిటి? కోర్టుల్లోకి తోసి వదిలేద్దాం అన్నట్టు కోస్తాంధ్ర ఇంజినీ ర్లు, ఏదో మామూలుగా విధినిర్వహణ చేసిన ఇతర పెద్దల వల్ల తెలంగాణ జల ప్రయోజనాలకు పట్టిన గతి ఇది.

శ్రీరాంసాగర్ తరువాత గోదావరికి చాలా ఉపనదులు కలవడం వల్ల, శ్రీరాంసాగర్‌కు నీరు రాకపోయినా గోదావరి డెల్టాకు బాబ్లీ ఆనకట్ట వల్ల ఏ నష్టమూ వాటిల్లబోదు కనుక, తెలంగాణ ప్రాంతానికి అందులో ముఖ్యంగా పోచంపాడు జలాశయానికి గోదావరి నీరు చేరినా చేరకపోయినా మనకేం పట్టింది అన్నట్టు కోస్తాంధ్ర ముఖ్యమంవూతులు, ఇంజినీర్లు వ్యవహరించడం వల్లనే తెలంగాణకు నష్టం వస్తున్నదని తెలంగాణ ప్రాంత నాయకులు విమర్శిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం కృష్ణానదిపైన ఆలమట్టి దగ్గర ఆనకట్ట కడితే ఆంధ్రవూపదేశ్ ప్రయోజనాలు దెబ్బ తింటాయని భారీ ఎత్తున గగ్గోలు పెట్టారు. దానివల్ల కృష్ణా డెల్టాకు దెబ్బ తగులుతుంది కనుక అల్లరి చేస్తారు, సర్కారు కూడా వారితే కనుక పోరాడుతుంది. కాని తెలంగాణకు నీళ్లిచ్చే గోదావరి నదిపైన బాబ్లీ ఆనకట్టను, అటువంటి మరెన్నో ఆనకట్టలను ఆపడానికి చిత్తశుద్ధి లేదు ప్రయత్న మూ లేదు. తెలంగాణ రాష్ట్రం ఉండి ఉంటే, తెలంగాణ ఇంజనీర్లు ఈ అన్యాయాల్ని వివరించే అవకాశం లేనే లేదు. డెల్టాలో వారే మనుషులు మిగిలిన వారు కారనే ఆలోచన సమైక్యతకు విఘాతం.


18 లక్షల ఎకరాలకు నీరివ్వవలసిన తెలంగాణ ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని ఆపే బాబ్లీని ఈ విధంగా సుప్రీంకోర్టు ఆపకపోవడం, ఇతర ఆనకట్టలను ఆపడానికి ఎవరూ ముందుకు రాకపోవడం తెలంగాణకు జరిగిన జరుగుతున్న జరగబోతున్న అన్యాయాలు. 112 టీఎంసీల నీటిని నిలువ చేసే సామర్థ్యం ఉన్న పోచంపాడు ఇసుకతో ఇప్పడికే కూడుకుపోయి 87 టీఎంసీలకు పడిపోయింది. పోచంపాడుకు 17.5 అడుగుల ఎగువన బాబ్లీలో ఆనకట్ట కట్టారు. దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఆంధ్రవూపదేశ్‌ది. కానీ వారి కి పట్టకపోతే కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి గౌడ్ 2006లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిఉండి కూడా తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే గతి పట్టిందంటే తెలంగాణ పట్ల ఈ ప్రభుత్వాలు పార్టీలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయో అర్థం అవుతుంది. ఆ తరువాత ఈ రిట్ పిటిషన్‌లో ప్రభుత్వం తనను కూడా పార్టీ చేర్చాలని కోరింది. తరువాత ప్రభుత్వ న్యాయవాదులను నియమించి వాదించింది.

టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే దయాకర రావు కూడా ఈ పిటిషన్ లో పార్టీలుగా నమోదయ్యారు. తరువాత ఈ పిటిషన్లను కొట్టివేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ఆనకట్ట ఎత్తు తగ్గించడానికి, సమష్టి యాజమాన్యంలో నిర్వహించడానికి అంగీకరించింది. 200 కోట్లు అప్పడికే ఖర్చయిందని, ఈ ఆనకట్టను మంచినీటి కోసమే కడుతున్నామని మహారాష్ట్ర వివరించింది.

నిజానిజాలు దేవుడెరుగు. సుప్రీంకోర్టు ఈ అంశాలపైన ఆధారపడి తీర్పు చెప్పి ఉంటుంది. ఒకసారి కట్టిన తరువాత కూల్చమని ఆదేశించడం సాధ్యం కాదు కనుక సమష్టి యాజమాన్యాన్ని నిర్దేశించడం ఒక్కటే మార్గం.

తెలంగాణ రైతుల గతి సుప్రీంకోర్టుకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పవలసిన వారు చెప్పకపోతే! రాష్ట్రం తెలంగాణ పట్ల వ్యతిరేక వివక్షతో రాజ్యాం గ బాధ్యతను వదిలేస్తే ఎవరు పట్టించుకోగలరు? లాంఛన ప్రాయ పు ప్రయత్నాలే కాని, తెలంగాణ రైతులను ఆదుకోవాలన్న ఆసక్తే సర్కారుకు లేదు. సుప్రీంకోర్టులో ప్రభావంతంగా వాదించకపోవడానికి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. వర్షా కాలంలో బాబ్లీ గేట్లు తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశాన్ని కచ్చితంగా అమలయ్యేట్టు చూసుకోవాలి. వారు ఆగేట్లు తెరవకపోతే గోదావరినీరు పోచంపాడు జలాశయానికి చేరడం సాధ్యం కాదు కనుక గేట్లు తెరవాలని రోజూ డిమాండ్ చేయాల్సిందే. టీడీపీ నేతలు సాహసం చేసి బాబ్లీ ప్రాజెక్టుకు బస్సులో వెళ్లి నిరసన చేయబోతే మరాఠా పోలీసులు వీరు ఎంపీలా, ఎమ్మెల్యేలా అని చూడకుండా లాఠీ చార్జి చేసి పంపించారు. కాని ఈ కమిటీ వల్ల తీర్పు అమలును డిమాండ్ చేస్తూ అక్కడికి వెళ్లే అధికారం సుప్రీంకోర్టు ఇచ్చింది.

తెలంగాణకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల విషయంలో కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా అన్యాయం చేయడంలో కొత్తేమీ లేదు. కాని గోదావరి జలాలు తెలంగాణకు అందవలసినంత స్థాయిలో అందకుండా ఇతర రాష్ట్రా లు సాగించే అన్యాయాలను సరిగ్గా ప్రశ్నించకపోవడం కూడా దారుణమై న అన్యాయం. మొదట్లో తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకుండా బాబ్లీ ఆనకట్ట ఆరంభానికి పరోక్షంగా సహకరించిందనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం వారు కాంగ్రెస్‌ను కాంగ్రెస్ వారు తెలుగుదేశం పార్టీని, ఇద్దరూ కలిసి టీఆర్‌ఎస్‌ను, ఆ ఇద్దరినీ టీఆర్‌ఎస్ విమర్శిస్తున్నది. మాటల ఈటెలు విసురుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టరు దక్కించుకున్నారని కనుక వారికి ఇందులో ప్రయోజనాలున్నాయని విమర్శలు వచ్చాయి. అధికారంలో ఉన్న కాలంలో బాబ్లీలో గోదావరి పైన మహారాష్ట్ర, ఆలమట్టిలో కృష్ణాపైన కర్నాటక నిర్మించే ఆనకట్టలు మన రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తాయని తెలుగుదేశం పార్టీకి తెలియకపోవడం గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

అంతకుముందు మాట్లాడనంత మాత్రాన, ఈ ప్రాజెక్టులను తరువాత వ్యతిరేకించకూడదని అనలేం కనుక వారు రాష్ట్రవ్యతిరేకంగా రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిరసించాల్సిందే. అయితే మహారాష్ట్ర ఒక పథకం ప్రకారం రహస్యంగా తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసి, వారికోసం కట్టుకున్న పోచంపాడును పాడుపెట్టే విధంగా కడుతున్న అనేక ప్రాజెక్టుల గురించి తెలుసుకోలేకపోవడం, ఇంజినీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పకపోవడం, ఒకవేళ చెప్పినా పట్టించుకోకపోవడం ఏమాత్రం న్యాయం కాదు. అక్కడ తెలంగాణ ప్రయోజనాలపట్ల వారికున్న చిన్నచూపు నిర్లక్ష్యం కూడా అర్థమవుతుంది.

కృష్ణానదిపైన పోతిడ్డిపాడు ద్వారా నదిని అక్రమంగా తరలించి 800 టీఎంసీ అడుగుల జలాన్ని రాయలసీమకు తీసుకు వెళ్లడం వల్లనే సాగర్ ఎడమ కాలువలో సాగునీటిని తెలంగాణకు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీని గురించి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ మాట్లాడకపోవడాన్ని టీఆర్‌ఎస్ విమర్శిస్తున్నది. ఇతర రాష్ట్రాలు తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టులు కడితే అధికారంలో ఉన్నంత కాలం పట్టించుకోరు. అధికారంలో ఉన్న వారు కూడా పోతే పోనీ అన్నట్టు వ్యవహరిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమే పని గట్టుకుని తెలంగాణకు సమంగా నీటివాటా ఇవ్వకపోగా తెలంగాణకు మరింత అన్యాయం చేసే విధంగా నీటిని ఒక ప్రాంతానికి తరలించుకుపోవడంలో అర్థం ఏమిటి?
కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడినట్టే, సొంత ప్రభుత్వంతో కూడా పోరాడాలా? ఈ దశ ఉంటే సమైక్య రాష్ట్రమని అందరి ప్రభుత్వమ ని అనగలమా? రాష్ట్ర హోదా లేదు కనుక కర్నాటక మహారాష్ట్ర పైన తెలంగాణకు పోరాడే అవకాశం లేదు. వాస్తవంగా సమైక్యం కాకపోయినా రాష్ట్రం లో భాగంగా ఉన్నందున, తెలంగాణ తరఫున ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వ మే పోరాడాలి. పోరాడకపోతే ఉద్యమించడం, ఆ ఉద్యమాన్ని వారు అణచి వేయ డం జరుగుతూ వస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలను ధ్వంసంచేసే విధంగా ప్రభు త్వం పక్షపాతంతో తెలంగాణ వ్యతిరేకతతో ప్రాజెక్టులు రూపకల్పన చేస్తే తెలంగాణకు వేరే దారి లేదు, ఉద్యమించడం తప్ప.

అంతర్‌రాష్ట్ర జలవివాదాలు వచ్చినపుడు ఒక రాష్ట్రం మరొక రాష్ట్రాన్ని నిందిస్తూ సాగించే వివాదాలు సుప్రీంకోర్టులోనే ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాకు జిల్లాలోని కింది స్థాయి కోర్టు పరిష్కారాన్ని కోరినట్టే, రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లవలసిన మొదటి కోర్టు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే. ఆంధ్రవూపదేశ్‌లో ప్రధాన భాగమైన తెలంగా ణ ప్రాంతపు జలవాటా రాకుండా అడ్డుపడుతున్న శక్తులపైన న్యాయాపోరాటం జరపే హక్కు కేవలం ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వానికే ఉంటుంది. అందు లో విడిగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ పోరా డే అవకాశాలు చాలా తక్కువ. పభుత్వం తెలంగాణ జల ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మనమెందుకు పట్టించుకోవాలనే ధోరణిలో వ్యవహరిస్తే తెలంగాణాకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యమే ఉండే అవకాశమే లేదు. పది జిల్లాల్లో కొన్ని కోట్లమంది ప్రయోజనాలకు న్యాయస్థానంలో ప్రాతినిధ్యమే లేకుండా పోవడం రాజ్యాంగపరమైన అన్యాయమే.

మరొక వైపు పోతిడ్డి పాడు వంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేస్తే, న్యాయం కోరడానికి తెలంగాణకు వేదికే లేదు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధిలేని ప్రభుత్వం సమైక్య రాష్ట్రం అనిపించుకోదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను సీమ,కోస్తాంధ్ర ప్రభుత్వం రక్షించడానికి సుప్రీంకోర్టులో నిలబడి పరాయి రాష్ట్రాలతో పోరాడడానికి సిధ్ధంగా లేదని రుజువైంది. పైగా ఈ సీమాంధ్ర ప్రభుత్వమే పోతిడ్డి పాడు, పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావలసిన నీటిని మళ్లించడానికి, తెలంగాణలో విస్తారమైన ప్రాంతాలను ముంచి, కోస్తాంధ్రకు నీళ్లివ్వడానికి ప్రాజెక్టులు రూపొందించి తెలంగాణ డబ్బుతో, తెలంగాణ పన్నులతో వాటిని కట్టి నీటిని తన్నుకుపోతుంటే కనీసం న్యాయం కోసం ఎదిరిం చే వేదికే లేని దుస్థితి రావడం రాజ్యాంగపరమైన అన్యాయమే. కనుక ప్రత్యే క రాష్ట్రం ఏర్పాటు రాజ్యాంగ అవసరంగా మారింది.

అప్పుడు సీమాంధ్ర సర్కారు సాగించే దుర్మార్గపు ప్రాజెక్టులను, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు సాగించే అన్యాయపు ప్రాజెక్టులను కనీసం ఎదిరించి పోరాడి, తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేయడానికన్నా అవకాశం దొరుకుతుంది. ఇంకా తెలంగాణను ఆలస్యం చేస్తూ పోతే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు మట్టిగొట్టుకుపోయే విధంగా మహారాష్ట్ర, కర్నాటక ప్రాజెక్టులు కట్టడం, వాటిని తెలంగాణ వ్యతిరేకులే కాంట్రాక్టర్లు నిర్మించడం, ఆ తరువాత సీమాంవూధులైన రాజకీయ నాయకులే సీమాంధ్ర పక్షపాత ఇంజీనీర్లు అధికారులతో కలిసి తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులు కట్టడం జరిగిపోతూనే ఉంటాయి. జీవనాధారమైన నీటికోసమైనా తెలంగాణ మేల్కొనాల్సిందే.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి