రక్త పిపాసులకు జవాబు రక్తదానం


Mon,February 25, 2013 11:45 PM


నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి ‘మానెత్తురు తీసుకో’ అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు తాగే ముష్కరులు అయిదారుగురు ఉంటే వారి బాంబు దెబ్బతిని జీవన్మరణస్థితిలో ఉన్న బాధితులకు రక్తం పంచి ఇచ్చే మానవతామూర్తులు వందలు వేల మంది ఉన్నారు. నెత్తురు దానం చేసి బతికించాలనుకునే వారి రద్దీతో ప్రైవేటు ఆస్పవూతులు నిండిపోయినై. అరుదైన గ్రూపు రక్తం కావాలని టీవీ చానెల్స్‌లో రాగానే వందలాదిమంది అక్కడికి చేరుకుని మానవతా పరిమళాలు వెదజల్లిన భాగ్యనగరం మనది. నిరంతరం మత కలహాలను రెచ్చగొట్టే మత పార్టీ సంకుచిత నాయకులు, ఎదుటి మతాన్ని కించపరిచే కుహనా సెక్యులరిస్టు కుత్సిత మేధావులు మానవజాతిని చీల్చుతూ ఉంటే, ఏ స్వార్థమూ లేని మామూలు మనుషులు, మధ్యతరగతి మానవులు తమ సెల్‌ఫోన్ నెంబర్లు ఇచ్చి ‘అవసరం ఉంటే అడగండి వస్తాం’ అని డాక్టర్లకు హామీ ఇచ్చిన మానవతామూర్తులు. ఇరవై ఏళ్ళ లోపు గిరి వెన్నంతా బాంబుముక్కలతో చిట్లిపోయి నెత్తురంతా కోల్పోయి మరణంతో పోరాడుతూ ఉంటే అతనికి అరుదైన ఎ బి గ్రూపు నెత్తురు కావాల్సి వచ్చింది. అందుకు 300 మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా తరలి వచ్చా రు. మెగాస్థాయిలో చిల్లరగా రక్తం అమ్ముకోవడానికి కాదు. ఉచితంగా ఇవ్వడానికి. మేడ్చల్ దగ్గర పూడూరు గ్రామంలో బాధితులకు రక్త దానం చేయడానికి ఒక శిబిరాన్ని నిర్వహించడానికి యువకులు ముందుకు రావడం మరో మంచితనం. చనిపోయిన వారిలో, రక్తదానం చేయడానికి వచ్చిన వారిలో అన్ని మతాల వారూ ఉన్నారు. మతం రాజకీయాల మిక్చర్‌తో కల్లోలం సృష్టిస్తు న్న నేతలు గుర్తుంచుకోవలసిన మాట ఇది. కావలసింది కొవ్వొత్తుల ప్రదర్శనలు బంద్ పిలుపులు కాదు, మంచితనం పలకరింపులు. రాజకీయ పరామర్శలు కాదు. మనలోని చెడుతనం పైనే ఆత్మ విమర్శలు.

హిందువో ముస్లిమో, క్రైస్తవుడో... ఒకరికి కాలు నుజ్జునుజ్జు అయింది. మరొకరికి ఎముకలు చిట్లిపోయినై. ఇంకో అభాగ్యుడికి చర్మం అంతా కాలిపోతే మరొక శరీరభాగం నుంచి చర్మంతీసి అతికించడానికి గంట పట్టింది. ఒక అమ్మాయి కుడి కాలు ఎగిరి దూరంగా పడిపోయింది. ఇంకొకరికి వంటినిండా ఇనుప చువ్వలు ఇరుక్కుపోయినై. మరో యువకుడి ఊపిరితిత్తుల్లోకి బాంబు శకలాలు దూరినై. అనేక ఆపరేషన్లుచేసి శరీరాన్ని ఛిద్రం చేసిన మేకు ల్ని తొలగించారు. 16 యూనిట్ల రక్తం ఎక్కించిన తరువాత గాని అతనికి ఊపిరి అందలేదు. ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు.. రక్తంతాగే రాక్షసుల అభాగ్యనగరంలోనే.., రక్తం ఇచ్చే మానవుల భాగ్యనగరం కూడా ఉందంటే మనిషికి బతికే అవకాశం ఉందన్న విశ్వాసం పుడుతుంది. కాని ఎంత రక్తం ఇచ్చినా ఆ గిరి కూలిపోయింది. పన్నెండు గంటలు అతను గాయాలు భరించలేక నేలకొరిగాడు. అతని వంటి నిండా లోహపు ముక్కలు, వీపంతా చీలిపోయింది. మెషిన్‌గన్‌తో కాల్చినట్టు. ఆ గాయాలతో అతను బతకలేడు. ఆ విధంగా ఒక్కడు కాదు. ఇంకా డజన్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు సార్లు మూడు సార్లు ఆపరేషన్ చేసి బాంబు ముక్కలు తీసివేయవలసి వస్తున్నది. డాక్టర్లు బాధితుల గుండె నిబ్బరాన్ని మెచ్చుకుంటున్నారు. వళ్లంతా తూట్లుబడి బతుకుతారో లేదో తెలియకపోయినా, తమ పేర్లు బంధు మిత్రు ల వివరాలు, ఫోన్ నెంబర్లు చెప్పి ఓపిగ్గా చికిత్స కోసం ఎదురుచూస్తున్న బాధితుల మొక్కవోని ధైర్యం మానవతకు మరో గుర్తు. ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో, గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించిం ది. అయితే ప్రభుత్వం తెలుసుకోవలసిందేమంటే, బాంబులకు బలైన వారికి ఇచ్చేది క్షమాభిక్ష కాదు. అది వారి హక్కు. టెర్రరిస్టుల దౌర్జన్యంతో పాటు ప్రభుత్వ అలసత్వం కూడా వారి మరణానికి లేదా గాయాలకు కారణం కనుక వారి జీవనహక్కు కింద వారి బాధలకు పరిహారం పొందే హక్కు వారికి ఉన్న ది. ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి డిమాండ్ చేసే అధికారం కూడా ఉన్న ది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. తెలిసినా మన కోర్టుల్లో న్యాయం ఒక జీవిత కాలం లేటు కనుక ఆ జోలికి వెళ్లరు. మన కర్మ ఈ విధం గా కాలింది అనుకుని భరిస్తారు. ఏదో కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. పోయిన వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే, గాయపడిన వారి జీవితాలను నిలబెట్టే బాధ్యత ప్రజావూపభుత్వంపైన ఉన్నది. జీవించే హక్కు అంటే చట్టపరమైన న్యాయ విధానాల ద్వారా మాత్రమే జీవితాన్ని హరించాలి. అంతేగాని దుష్పాలన నిష్పాలన, అలసత్వం, రాజకీయ నిష్క్రియాపరత్వం, రాజ్యాంగేతర రాజకీయ స్వప్రయోజనాధార నిర్ణయాలతో దుర్మార్గులకు మార్గం సుగమం చేసి సగటు మనుషుల ప్రాణాలు తీయడం కాదు. లా ఆఫ్ టార్ట్స్ (పౌర ఉల్లంఘనలను నష్టపరిహారం చెల్లించే పరిహార న్యాయశాస్త్రం) ప్రకారం ప్రాణాల విలువ లెక్క కట్టి, గాయాల నష్టం, బాధ, సంపాదనా శక్తి క్షీణత, ఆయుర్దాయం డబ్బు రూపంలో గణించి కచ్చితమైన పరిహారం చెల్లించాలి. హైదరాబాద్ బాంబు పేలుడు వంటి దుశ్చర్యలు ప్రభుత్వాల నిశ్చర్యల ఫలితమే కనుక రాజ్యాంగపరమైన వారి బతుకు హక్కులను ఉల్లంఘించినందుకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలి, అంతేకాని ఏలిన వారు దయదలిచి భిక్షం వేయడం కాదు. ఒక కుటుంబ సభ్యుడు మరణిస్తే అందువల్ల ఆ కుటుంబానికి ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడంలో, అతను సగటున ఎంతకాలం బతికి, నెలకు సగటున కుటుంబానికి ఎంత వెచ్చించే వాడో ఏవిధంగా ఆదుకునే వాడో అంచనా వేసి డబ్బు ఇవ్వాలని న్యాయశాస్త్రం చెప్పింది.

ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత నుంచి విముక్తి లేదని కూడా వివరించే తీర్పును సిఆర్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రవూపదేశ్ కేసులో జస్టిస్ జీవన్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అదే ఈ నాటికీ న్యాయం కూడా. ఇదివరకున్న కార్మిక నష్టపరిహార చట్టం ఇప్పుడు ఉద్యోగుల నష్టపరిహార చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులు గాయపడినా మరణించినా, అందుకు కారణం ఎవరైనా సరే యాజమాన్యం పరిహారం చెల్లించాలి. ఆ పరిహార గణన విధానాన్ని కూడా ఆ చట్టం నిర్దేశించింది. సుప్రీంకోర్టు తీర్పులు ఈ లెక్కను మరిం త పటిష్టం చేశాయి. ఉద్యోగులు కాని మామూలు పౌరులకు పరిహారం చెల్లిం చే బాధ్యత వారి పన్నుల మీద సర్కారు చలాయించే పాలకులమీద ఉంటుం ది. కనుక బాధితుడికి మృతుని కుటుంబానికి తగిన పరిహారం ఇచ్చితీరాలి. గాయపడిన వారికి ఇస్తానన్న లక్షరూపాయలు ఏమాత్రం చాలవు. కనుక వారికి ఎంత పరిహారం ఇవ్వాలో ఒక నిపుణుల బృందం ద్వారా నిర్ణయింపచేసి, ముందుగా కొంత డబ్బు తాత్కాలికంగా ఇచ్చి, తరువాత మొత్తం పరిహారాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించాలి. అసలు సర్కారు దగ్గర ఇటువంటి సందర్భాలలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఎంత పరిహారం చెల్లించాలో ఒక విధానం ఉండాలి లేదా అందుకు ఒక చట్టం రూపొందించాలి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూన్సు చట్టం ఒకటి ఉంది. ఏదైనా వ్యవస్థలో ప్రమాదం జరిగినపుడు, కలెక్టర్ బాధితుల కు వెంటనే పరిహారం చెల్లించి, ఆసొమ్మును ఆవ్యవస్థ యాజమాన్యం నుంచి తరువాత వసూలు చేయాలి. ఈ బాధ్యత యాజమాన్యం తప్పొప్పులపైన కాకుండా జనం గాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది కచ్చితమైన బాధ్య తా సూత్రం. యాజమాన్యాలు తమ బాధ్యతకు బీమా జోడించి బాధితులకు డబ్బు ఇవ్వాలని ఈ చట్టం నియమాలు చెప్తున్నాయి. ఈ చట్టం మామూలు మనుషులకు ప్రభుత్వానికి కూడా వర్తించేట్టు చేయాలి. లేదా ఇంకేది అవసరం అనిపిస్తే ఆ పని చేసి పరిహారం మాత్రం వెంటనే చెల్లించి తీరాలి. బాధితులకు పరిహారాలు ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం మానేయవలసిన సందర్భం ఇది. హైదరాబాద్ బాంబు పేలుళ్లలో బాధితులైన సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంతో షం, కానీ ఇదీ దయా,భిక్ష కాదు. బాధ్యతే. అదే సమయంలో ఖర్చుపూక్కువవుతాయని ప్రైవేటు ఆస్పవూతుల నుంచి సర్కారీ దవాఖానాలకు తరలిస్తామని ఒక మంత్రిగారు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. ఇది న్యాయమైన పని కాదు. నిపుణుల చికిత్స ఎక్కడ ఉంటే అక్కడ అవసరమైన వారికి చికిత్స జరిపించడం బాధ్యత. ఉగ్రవాద రక్కసికి ఎవరైనా బలైతే దురదృష్టం అనుకోవచ్చు కాని చికిత్సలేక మరణిస్తే, వైద్యం చాలక మరణిస్తే, అది ఉగ్రవాద నేరం కన్న ఘోరం. ఆ ఘోరాలకు ప్రభుత్వం పాల్పడకూడదు.

బాధితులకు డాక్లర్లు నర్సులు ఆత్మీయ మిత్రులుగా మెలిగితే అంతకన్న ఊరట మరొకటి ఉండదు. కార్పొరేట్ ఆస్పవూతులు కూడా ఇది తమ బాధ్యత అని వైద్యం చేయాలో లేక లాభాలే లక్ష్యం అనుకుంటారో వారే తేల్చుకోవా లి. డాక్టర్ల వలె పోలీసులు పాలకులు కూడా బాధితులకు వారి బంధుమివూతులకు మిత్రులైతే బాగుండేది. కాని చాలా అన్యాయం జరుగుతున్నది. వివిఐపిల వరద తుఫానుగా మారి బాధితులు సామాన్యులు అల్లాడిపోతున్నారు. సీఎం, పీఎం, మినిస్టర్ స్థాయి నేతలు విరుచుకుపడుతున్నా రు. నేరస్థలంలో సాక్ష్యాలను క్లూలను, రక్షించాలంటే శాస్త్రీయ నిపుణులు పరిశీలించేదాకా ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదు. అందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నేరస్తులను పట్టుకోవడమే సాధ్యం కాకపోవచ్చు. ఇక ఆస్పవూతికి కూడా వేళా పాళా లేకుండా విమానం దిగగానే పరుగెత్తడం, ఒక్క రూపాయి, ఒక్క నెత్తు రు చుక్క ఇవ్వకుండా ఒక్క కన్నీటి బొట్టు రాల్చకుండా, బాధితుడి కష్టం కొంతై నా తీర్చకుండా ‘మేం పరామర్శిస్తున్నాం’ అంటే అది ఎందుకూ పనికి రాదు. వారికి కూడా ఉపయోగపడదు. పత్రికల్లో టీవీల్లో వారి ఫోటోలు చూసుకుని మురిసిపోతారేమోగాని జనం మెచ్చే పనులు కావు. అసలు ఈ నేతలు రావడానికి ఉదయం ఆరునుంచి ఎనిమిదిగంటలకు సమయం కేటాయించడం అందరికీ మంచిది. ఒక్కొక్క వివిఐపి కోసం రోడ్డును రోజూ రెండు మూడు గంటల పాటు చెరబట్టి, జనాన్ని కదలకుండా రోడ్ల మీద నిలబెట్టి వేధిస్తే ప్రభువులు ప్రజలకు మివూతులుగా ఉండగలుగుతారా? వరసగా డజన్ల కార్లు జనం కళ్లలో దుమ్ము కొట్టుకుంటూ పోతూ ఉంటే నిజానికి పోలీసులు కూడా బాధితులే అయినా వారికీ ప్రజల నుంచి ఏ సానుభూతీ దొరకదన్న వాస్తవాన్ని గమనించాలి.పోలీసులు పొలిటీషియన్లు జనానికి స్నేహితులను రుజువు చేసుకోవడానికి ఇదొక అవకాశం. ఓట్ల కోసం కాకపోయినా సామాజిక స్పృహ ఉంటే జనానికి చేరువ కావలసిన అవకాశం. ఎక్కువ ఖర్చవుతుందని సర్కారు దవాఖానకు బాధితులను తరలించాలనుకునే ఈ నేతలు, ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చినందుకు అయ్యే ఖర్చును తగ్గించడానికో లేక ఆ డబ్బును బాధితుడికి ఇవ్వడానికి నిర్ణయిస్తే బాగుండేది. ఒక పత్రిక దీన్ని టెర్రర్ టూరిజం అని అభివర్ణించింది అందుకేనేమో.

భాగ్యనగరంలో బతుకు భయం. అసలు బతకడమే ఒక సాహసం. బతు క్కు గ్యారంటీ లేకపోయినా, మరణానికి ప్రతి ప్రదేశం చిరునామావలె తయారైంది. దీనికి ఒక మంత్రిగారు ఇచ్చిన వ్యాఖ్యానం ఆయన ఆలోచనా స్థాయి ని తెలియచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్ ఉగ్రవాద ముష్కరుల అడ్డా అవుతుందని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే విడిపోతే ఏమవుతుందో అని ఆ మంత్రిగారు వాపోయారు. హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారిందన్న మాట నిజ మే అనుకుంటే దానికి హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోకుండా పాలించిన ఇటువంటి మంత్రులే కారణం. పాతబస్తీని వదిలేసి, కొత్తగా కాలనీలు నిర్మించుకోవడానికి పథకాలు వేసిన ప్రతి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈనాటి దుర్మార్గానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ ముఖ్యమంవూతులను గద్దె దించడానికి హింసా రాజకీయాలను జిల్లాల నుంచి మోసుకు వచ్చి గూండాలను దింపి బాంబుదాడు ల సంస్కృతిని తెచ్చింది ఈ బాధ్యతారహిత ప్రభుత్వాలే. టెర్రరిజం మూలా లు కేవలం హైదరాబాద్‌లోనే కాదు అనేక జిల్లాల్లో ఉన్నట్టు సమాచారం ఉంది. హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో దాడులు జరపడానికి వీలుగా రెక్కి నిర్వహించినట్టు సమాచారం ఉన్నా కాపాడుకోలేని అసమర్థ ప్రభుత్వపు మంత్రులే ఇటువంటి అసంబద్ధ అబద్ధాలను చెప్తున్నారు. పాతబస్తీలో అసలు పాలనే లేదు. మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఏది చెబితే అది చేస్తారు. వారి అనుమతిలేకుండా చట్టాలు అమలు చేయరు. పన్నులు వసూలు చేయరు. రోడ్లు వెడల్పు చేయరు. నేరస్తులకు ఆశ్రయం కల్పించే మతపార్టీ నాయకుల ఇళ్లను తనిఖీ చేయరు. అక్కడ జనం బాగుపడడానికి ఏమీ చేయరు. చంపడానికి సహకరించే శక్తులను పట్టుకోకుండా సాయం చేస్తారు. హైదరాబాద్ నగరం టెర్రరిస్టు ముష్కరుల అడ్డాగామారిందనడమే తామున్నది దివాళాకోరు ప్రభుత్వమని చెప్పే నేరాంగీకార ప్రకటన. హైదరాబాద్ సంస్కృతిని మత సామరస్యాన్ని రాజకీయాలకోసం నాశనం చేసిన రాజకీయ నాయకుల నీతి ఈ విధంగానే ఉంటుంది. ఇటువంటి నాయకులున్నా, భాగ్యనగరం ఇంకా పూర్తిగా నాశనం కాకుండా ఉండడం ఇక్కడి ప్రజల గొప్పతనం, హుందా తనం, గుండె నిబ్బరం. వారి సహనశీలతకు ఇది నిదర్శనం. ఇటువంటి మూర్ఖపు దివాళాకోరు ప్రకటనలు కూడా వీరు సహిస్తారు. ఇటువంటి నాయకుల ఏలుబడిలో భాగ్యనగరం నలిగిపోవడం ఇక్కడి పౌరుల దౌర్భాగ్యం. పౌర చైతన్యమే ఉగ్రవాదానికి, మూర్ఖవాదానికి చెంప పెట్టు అవుతుంది. మానవత్వం, మత సామరస్యం, రక్తం పంచుకునే సోదరభావం ఉన్న భాగ్యనగరం మనది. దుష్ట శక్తులను రాజకీయంగా ఓడించే శక్తిని సంతరించుకుంటే మరింత భాగ్యనగరమవుతుంది.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Published: Tue,June 18, 2013 12:58 AM

ద్వేషం చిమ్మిన దమనకాండ

ఇనుప గోడలు, ఉక్కు పాదం, అమానుష పోలీసు హింస, రాజధాని నగర దిగ్బం ధం, తెలంగాణ జిల్లాలలో వేలాది అరెస్టులు, ఇవన్నీ చలో అసెంబ్లీకి ప్రభు

Published: Tue,June 11, 2013 12:43 AM

విశాలాంధ అబద్ధాలకు అసలు నిజాల జవాబు

దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు, అబద్దాలను నిజాలుగా చూపుతూ తెలంగాణ వాస్తవాలను అబద్ధాలు అంటూ నిందించే అనైతిక నీచ రచనా కార్యక్షికమా

Published: Tue,June 4, 2013 04:20 AM

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

తెలుగు సినీ పరిక్షిశమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని

Published: Mon,May 27, 2013 11:07 PM

తెలంగాణ మంత్రులూ గద్దెదిగండి

తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమందికి పైగా ఉరికొయ్యలకు వేలాడు తూ ఉంటే తెలంగాణ ప్రజావూపతినిధులు మంత్రి పదవులకు వేలాడుతూ ఉండడం స్వార్థ రా

Published: Mon,May 20, 2013 11:53 PM

చాకో కొత్త మాట, కాంగ్రెస్ పాత పాట

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన కట్టుబాటు లేదని మరోసారి అర్థమైంది. ఆపార్టీకి బోలెడంతమంది అధికారిక ప్రతినిధులున్నారు. వారు ఒక

Published: Tue,May 14, 2013 12:01 AM

ఆత్మవంచనా.. ఆత్మగౌరవమా?

అక్కరకు రాని చట్టము, మొక్కిన వరమీయని వేలుపు, మోహరమున తానెక్కిన బారని గుర్రము,వంటి వన్నీ.., గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ’ అన్న

Published: Mon,May 6, 2013 03:06 PM

ఆరని పగలు-అమాయకుల బలి

పాకిస్థాన్‌లో ఇంకా 535 మంది సరబ్‌జిత్‌లున్నారు, భారత్‌లో 272 మంది సమానుల్లాలు ఉన్నారు. పాక్ జైళ్లలో ఉన్నవారిలో 483 మంది చేపలు పట్ట

Published: Mon,April 29, 2013 12:16 PM

స్వేచ్ఛ అంటే రెచ్చగొట్టడం కాదు

చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గొప్ప హాస్య వ్యంగ్య రచనలలో ప్రహసనాలు ఒకటి. నాటికలు గల్పికల రూపంలో చిలకమర్తి సామాజిక దుర్మా

Published: Tue,April 23, 2013 12:02 AM

తెలంగాణకు తాజా ఖనిజ ద్రోహం

తెలంగాణ ప్రాంతాన్ని నిర్లజ్జగా అన్యాయాల పరంపరకు గురి చేయడానికి పాలకులు సిధ్ధంగా ఉన్నారు. తెలంగాణ పట్ల నిర్లక్ష్యానికి బయ్యారం ఇన

Published: Mon,April 15, 2013 11:58 PM

అవినీతికి ఉరివేస్తే మిగిలేది ఎంతమంది ?

రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేశంతో ఒక మాట న్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు, ఆర్థికనేరాలకు ఆయనను ఉరితీ

Published: Tue,April 9, 2013 03:25 AM

కట్జూ మాటల్లో కరువైన కట్టుబాట్లు

రోగాలొచ్చి చనిపోయిన వారినే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకు న్న వారని వర్ణిస్తున్నారని, ఒక అబద్ధాన్ని తాత్కాలిక ప్రయోజనాలకోసం కాంగ్రె

Published: Tue,April 2, 2013 12:01 AM

బలిదానాలపై స్పందించని భారతం

దేశం కోసం ప్రాణాలు బలి పెడితే అమరవీరులు అంటున్నాం. సరిహద్దులో దేశ భద్రతకోసం సైనికులు పోరాటంలో మరణిస్తే వీర చక్ర, పరమవీర చక్ర అని

Published: Tue,March 26, 2013 12:07 AM

వివక్షపై వివరణ ఇవ్వాలె

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రమాణంలో ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకున్నట్టుంది. భయపక్షపాతాలు లేకుండా అందరికీ న్యాయం

Published: Sun,March 24, 2013 04:10 AM

నేరమే అధికారమైతే...!

నేరాలు చేద్దాం రండి. నా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. మీదగ్గర లేకపోయినా ఫరవాలేదు. మనమంతా కలసి విధ్వంసం సృష్టిద్దాం అని పిలిచారట. తర్వ

Published: Tue,March 19, 2013 12:09 AM

ఉరిశిక్ష: విచారించిందెవరు? విధించిందెవరు?

ఢిల్లీ నగర రోడ్లమీద డిసెంబర్ 16, 2012 నాటి గ్యాంగ్‌రేప్ ఘటన తీవ్రత ఇంకా మరచిపోలేదు. అప్పుడే ఆ నేరం చేసిన వారిలో ముఖ్యుడు రాంసింగ

Published: Tue,March 12, 2013 12:25 AM

ఆగని అత్యాచారాలు,అభవూదతలో మహిళలు

అభద్రతకు కారణం అసమానత. కుటుంబంలో, సమాజంలో, కార్యవూపదేశంలో, చివరకు మంత్రివర్గంలో, ప్రభుత్వంలో అందరూ సమానులే అన్నమాట వట్టిబూటకం. అ

Published: Mon,March 4, 2013 11:36 PM

తెలంగాణ ప్రాజెక్టులకు ‘ఉమ్మడి’ముప్పు

విచివూతమేమంటే తెలంగాణ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి మహారాష్ట్ర, కర్నాటక వంటి పరాయి రాష్ట్రాలే కాదు, సీమాంధ్ర నేతల గుప్పిట్ల

Published: Mon,February 18, 2013 11:13 PM

అప్జల్ ఉరి- అంతులేని ప్రశ్నలు

ఆరోజు భద్రతాదళాలు ప్రాణాలకు తెగించి పోరాడలేకపోతే ఈ దేశ పార్లమెంటరీ సార్వభౌమాధికారంతోపాటు ఎంపీల ప్రాణాలు టెర్రరిస్టుల హస్తగతం అయ్యే

Published: Tue,February 12, 2013 12:37 AM

క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవ

Published: Tue,February 5, 2013 12:04 AM

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట

Published: Mon,January 21, 2013 11:03 PM

ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ

పెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు

Published: Wed,January 16, 2013 11:50 PM

హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?

తెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర

Published: Mon,January 21, 2013 07:23 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్

గోడావరిలో ఎక్కి హైడ్రాబాడ్‌లో దిగాను’ అనడంలో ఎంత అచ్చమైన తెలుగున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంగ్లేయుల పాలనా కేంద్రం ప్రెసిడెన

Published: Mon,December 31, 2012 11:42 PM

ఇదీ టీడీపీ లేఖలోని మర్మం ?

తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో

Published: Mon,December 24, 2012 11:45 PM

అఖిలపక్షంలో తేలుస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాధించిపెట్టిన అఖిల పక్షం, పట్టించుకోబోదని తెలుగుదేశం అడిగిన అఖిలపక్షం, డిసెంబర్ 28.. అంద రూ ఏదో జరుగుతుం

Published: Tue,January 1, 2013 05:41 PM

కేవీ రంగారెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

రంగాడ్డి అనే పేరు తప్ప రంగాడ్డి జిల్లాలో ప్రజలకు దక్కింది ఏమీ లేదు-ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసి

Published: Mon,December 10, 2012 11:28 PM

అమ్మానాన్నలే నేరం చేస్తే పిల్లల గతేమిటి ?

ప్రే మతో పెంచాల్సిన అమ్మానాన్నలే పిల్లలను కొడితే ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, లాయర్లు, కోర్టులు రంగ ప్రవేశం చేయవల సి వస్తుంది.

Published: Thu,December 6, 2012 03:15 PM

సమైక్యవాదులెవరు? వేర్పాటువాదులెవరు?

ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరు అని ఈ తరంలో చాలా మందికి అటు ఆంధ్రప్రాంతంలో ఇటు తెలంగాణలో తెలియదు. చాలామందికి తెలంగాణ వారు ఇదివర

Published: Sat,December 1, 2012 11:47 AM

మాట్లాడే కుత్తుక మీద కొత్త కత్తి

ఎయిర్ ఇండియాలో సమ్మె చేస్తున్న ఒక సంఘం నాయకులను, వారి వ్యతిరేక సంఘం వారు అరెస్టు చేయించారు. దానికి కారణం సమ్మె కాదు. ఫేస్‌బుక్, ఆర

Published: Sat,December 1, 2012 11:49 AM

నెహ్రూ నిర్వాకమే తెలంగాణకు శాపం

జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14 తొలి వూపధాని జయంతి) తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేసినట్టు? ఆయన మాటలే మో తెలంగాణకు అనుకూలం, చర్యలేమో త

Published: Sat,December 1, 2012 11:50 AM

చట్టం పట్టుకోలేని(ఆత్మ) హత్య

చట్టం పట్టుకోలేని హత్య ఆత్మహత్య. చాలా తెలివైన మోసగాళ్లు పక్కవారిని ‘ఆత్మహత్య’ చేస్తారు. స్వార్థ రాజకీయానికి ప్రజల ప్రాణాలకు లెక్క

Published: Fri,December 14, 2012 05:16 PM

తెలంగాణ కోసం తపించిన సర్దార్

జస్టిస్ సర్దార్ ఆలీ ఖాన్ వంటి ప్రముఖ వ్యక్తి, మంచిమనిషి చనిపోతే టీవీ వార్తా ఛానెళ్లు ఎందుకు కనీసం కింద స్క్రోలింగ్ వాక్యం కూడా ఇవ్

Published: Fri,December 14, 2012 05:16 PM

రాజ్యాంగ వ్యతిరేక కుటిల రాజకీయం

రాజిడ్డి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలని రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు నిర్దేశిస్తున్నాయని గతవారం ‘నమస్

Published: Fri,December 14, 2012 05:15 PM

రాజిరెడ్డి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత!

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరవూపదేశ్‌లో కొందరు యువకులు ప్రాణాలిస్తే మరి కొంద రు మహిళలు తమ మానాన్ని బలి చేయవలసి వచ్చింది. ఉత్తరాఖండ

Published: Fri,December 14, 2012 05:11 PM

‘మార్చ్’ రాజ్యాంగం హక్కు

ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంత రాజ్యాంగ సమ్మతమో, ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనిచెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ సెప్టెంబర్ 30న త

Published: Fri,December 14, 2012 05:14 PM

చెరువులను మింగుతున్న వినాయకులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ. చెరువులను పూలతో పూజించే పండుగ.కనుక ఆ చెరువులను రక్షించుకోవడానికి పండుగలన

Featured Articles