క్షమాభిక్షలు,మరణశిక్షలు-తొందరపాట్లు


Tue,February 12, 2013 12:37 AM

ప్రాణాలు పోయినా నిర్ణయాలు తీసుకోరు. క్షణాల్లో ప్రాణాలు తీస్తారు. ఇదీ మన పాలన. అసలు సాగదీతనే పాలనగా మారిపోయింది. ఏ నిర్ణయమైనా తమ అవసరాలు తీరడం కోసం వాయిదా వేయడం, అవసరానికి పనికొస్తుందం నిర్ణయాలు తీసుకోవడం పాలనగా మారిపోయింది. అది తెలంగాణ నిర్ణయమైనా, అఫ్జల్ గురు మరణశిక్ష అయినా మన్మోహన్ ప్రభుత్వానికి తేడాలేదు. అన్నీ వాయిదా పడుతూనే ఉంటాయి. పాపం పీవీ నరసింహారావును నిర్ణయాలు తీసుకోని ప్రధాని అని అనవసరంగా నిందించారని అనిపిస్తున్నది. ఆయనకున్న మౌనవూపధాని నిందను ఆయన శిష్యుడు మన్మోహన్ సింగ్ కొనసాగిస్తూ గురువుగారి రుణం కొంత తీర్చుకుంటున్నారు.

ఈ పాలనా నిర్ణయాలు తీసుకొనే విషయంలో ఇతర అధికార కేంద్రా లు, పార్టీ మేనేజర్లు మల్లగుల్లాలు పడుతున్నారని, మన్మోహన్ మౌనంగా మోహనంగా కాలం గడుపుతున్నారని అనుకోవచ్చు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నవంబర్‌లో అజ్మల్ కసబ్‌ను రహస్యంగా ఉరి తీసిన తరువాత, ‘ఈ విషయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా తెలియదు తెలు సా’? అని సగర్వంగా చాటుకున్నారు. అదీ స్థితి. మరో అతిరహస్య నిర్ణ యం, అతి వేగపు అమలు కూడా అఫ్జల్ గురు ఉరి విషయంలో కనిపించింది. భారత సార్వభౌమాధికారం పైన దాడి కనుక అది తీవ్ర నేరమని, ఉరి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన చాలా సంవత్సరాల తరువాత ఉరి తీయడం, అదే సమర్థత అని చాటుకోవడం మనం చూస్తున్నాం.

ఆలస్యాలు మరణాలకు కారణాలు అవుతాయి. ఉదాహరణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టే కనిపించడం, వెను వాయిదా వేయడం, సీమాంధ్ర నాయకులు విజయగర్వంగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తూ మాట్లాడడం ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ రానేరాదనడం, దాంతో నిరాశ చెంది కొందరు యువకులు ఆత్మాహుతి చేసుకోవడం జరుగుతున్నది. మనకు కనిపిస్తున్న ఉరిశిక్షలు ఇవి. ప్రాణాలందరికీ సమానమే. ప్రాణం ఖరీదు ఒకటే. కానీ మన్మోహన్‌సింగ్ పాలనాకాలంలో నిరాహార దీక్ష చేయాల్సిన దశ లేకపోవడం పొట్టి శ్రీరాములు అదృష్టం. మరణశిక్షలో పోయిన ప్రాణాన్ని బట్టి రాజకీయ విలువ పెరుగుతుంది. అఫ్జల్ ఉరితీత వల్ల మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయాత్మక ప్రభుత్వంగా పేరుతెచ్చుకుంటుంది. తరువాత ఓట్లు తెచ్చుకుంటుంది.

హిందూ టెర్రరిజం అని షిండే అనవలసింది కాదు. తీవ్రవాదానికి రంగులు మతాలు లేవు. అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నాయి. టెర్రరిస్టులలో ఎక్కువ శాతం మంది ముస్లింలు ఉన్నంత మాత్రాన అది ముస్లిం టెర్రరిజం అనడం ఎంత అసమంజసమో, ముస్లింలు అంతా టెర్రరిస్టులు అనే మాట ఎంత అన్యాయమో, హిందూ టెర్రరిజం అని వర్గీకరించడం కూడా అంతే అన్యాయం. కసబ్‌ను ఉరితీసిన తరువాత హోం మంత్రి హిందూ టెర్రరిజం మంత్రం చదివారు. అందువల్ల వచ్చిన దుష్పరిణామాలను ఊహించుకుని భయపడి అఫ్జల్ గురును ఉరితీశారు. ముస్లిం ఓట్లను దెబ్బతీశామేమోనని భయం. హిందూ ఓట్లు కోల్పోతామేమోనన్న భయం. బీజేపీ లబ్ధి పొందుతుందేమోనని భయం, కనుక మరికొన్నిచర్యలు. ఈ క్రమంలో బతుకులంటే లెక్కలేని ప్రభుత్వం మనుషులను ఓట్లుగా చూస్తున్నది. సీట్లుగా విభజిస్తున్నది. నేర న్యాయ విధానాలు, నేర విచారణలు, అరెస్టులు, విడుదలలు, మరణశిక్షలు, క్షమాభిక్షలు అన్నీ ఓట్ల లెక్కతో ముడేసి చూస్తున్నారు.

అప్జల్‌గురు ఉరి నిర్ణయంలో దశాబ్ద కాలం ఆలస్యం ఎందుకు జరిగింది? కనీసం అఫ్జల్‌గురుకు లేదా ఆయన కుటుంబానికి ఎందుకు సమయం ఇవ్వలేదు? ప్రాణం తీసే ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన విషయం, దానిపై న్యాయసమీక్ష కోరుకునే అధికారం ఉన్న విషయం అప్జల్‌కు, అతని భార్యకు లేదా సమాజానికి చెప్పవలసిన అవసరం లేదా? అనేవి ప్రశ్నలు. మానవ హక్కుల సంఘాలు మావూతమే కాకుండా రాజ్యాంగ పాలన గురించి అర్థమైన వారుకూడా అడిగే ప్రశ్నలివి. అఫ్జల్ గురును ఉరితీయడమే సరి అని ప్రభుత్వం నమ్మితే బాహాటంగా ఆ పని ఎందుకు చేయలేదు? ఎందుకింత రహస్యం? చట్టం నిర్దేశించిన పరిష్కారాలు నిరాకరిస్తూ, ప్రాణాలు తీయడానికి తొందర, రహస్యం ఎందుకు? న్యాయపరమైన అంశాలే కాకుండా పాలనాపరమైన అరాచకం మన ప్రభుత్వాల్లో వ్యాపించింది.

ఉరిశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష అభ్యర్థనలను పెండింగ్‌లో పడేసి కూచున్నది. అయిదేళ్లపాలనా కాలంలో రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పరిష్కరించింది 22 కేసులు మాత్రమే. 35 మందికి న్యాయస్థానాలు ఉరి శిక్ష విధిస్తే ప్రతిభాపాటిల్ గారు జీవిత ఖైదుగా మార్చారు. ముగ్గురి క్షమాభిక్షను తిరస్కరించి ఉరితీయమన్నారు. ప్రణబ్ ముఖర్జీగారు రాష్ట్రపతి భవనంలో ప్రవేశించిన తరువాత అప్పుడప్పుడే హోంమంవూతిగా సుశీల్ కుమార్ షిండే పదవిలోకి వచ్చారు గనుక ఆయన మళ్లీ పరిశీలించాలని ఎనిమిది కేసులు తిరిగి పంపించారు. ఈ కేసుల్లో 13 మంది బతుకుల కాగితాలున్నాయి. వీరిలో అఫ్జల్ గురుది నాలుగో ఫైలు. దాన్ని ముందుకు తెచ్చి మిగిలిన వారి కన్న ముందే ఉరి తీశారు.

ఉరికొయ్యల వంక చూస్తూ బోలెడు అభ్యర్థనలు ఇంకా విచారణలో విచారకరంగా ఉన్నాయి. వారి చిట్టా ఇది. 1. ఉత్తర ప్రదేశ్ లో సోదరుడి కుటుంబానికి చెందిన అయిదుగురిని చంపిన కేసు- నేరం రుజువై ఇద్దరు హంతకులు సురేశ్, రాంజీకి మార్చ్ 2011లో ఉరిశిక్ష విధించారు. 2. కర్నాటకకు చెందిన ప్రవీణ్ కుమార్- 1994లో నలుగురు కుటుంబ సభ్యులను హత్యచేసినట్టు రుజువైంది. సెప్టెంబర్ 2003లో ఉరి విధించారు. 3. 2004లో భార్యను అయిదుగురు కూతుళ్లను చంపిన జాఫర్ ఆలీకి ఉరి శిక్షవిధించారు.

ఆరేళ్ల నుంచి క్షమాభిక్ష కోరుతున్నారు. 4. సుందర్ సింగ్ (ఉత్తరాఖండ్)- 1989లో అత్యాచారం హత్యచేసినట్టు రుజువై 2010లో మరణ శిక్ష పడింది. 5. లాండ్ మైన్ పేల్చి 1993లో 22 మంది పోలీసుల మరణానికి కారణమైన సైమన్, జ్ఞాన్ ప్రకాశ్, మాదయ్య, బిల్వేంవూదలకు ఉరివేశారు. 6. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో బల్వంత్ సింగ్ రజోనా పాత్ర రుజువై మరణ శిక్ష వేసినా, సహ నిందితుడి కేసు విచారణలో ఉంది. 7. మనిందర్ సింగ్ బిట్టాను చంపడానికి కారుబాంబు పేల్చి తొమ్మిదిమంది అమాయకులు చనిపోవడానికి 1993లో కారకుడైన దేవిందర్ పాల్‌సింగ్ మరణ శిక్ష కూడా న్యాయవిచారణలో ఉంది. 8. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యలో మరణ శిక్ష పడిన మురుగన్, శంతన్, పేరారివలన్ మరణ శిక్షలు కూడా న్యాయసమీక్షలో ఉన్నాయి. 9. గుర్మీత్ సింగ్ 1996లో మరణశిక్ష పడినా 27 సంవత్సరాల నుంచి క్షమాభిక్షపైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల వివరాలను సుభాష్ చంద్ర అగర్వాల్ సమాచార హక్కు కింద కోరారు. ప్రణబ్ ముఖర్జీ అజ్మల్ కసబ్ క్షమాభిక్షను తిరస్కరించే నాటికి 15 కేసుల్లో 19 మంది చావు బతుకులు... కాగితాలు సంతకాల మీద ఆధారపడి ఉన్నాయని తేలింది.కొన్ని హోంమంవూతి గారి దగ్గర పడి ఉంటే పదకొండు కేసులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. మళ్లీ పరిశీలించి తగిన సలహా ఇవ్వడం కోసం 2009-12 మధ్యకాలంలో 26 క్షమాభిక్ష కేసులను రాష్ట్రపతి నుంచి హోంశాఖ తిరిగి తెప్పించుకున్నది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 18 కేసులు నిర్ణయించినా 8 కేసులు ప్రణబ్ ముఖర్జీ నిర్ణయానికి వదిలేసింది. 2004లో అఫ్జల్ గురుకు ఉరి శిక్ష పడింది. అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ తాజాది. అన్నింటికిలోకి అదే ఆఖరిది. క్యూ తప్పించి ముందు కసబ్ ను ఆ తరువాత అఫ్జల్‌ను ఉరి తీయాలని కేంద్ర నిర్ణయించింది.

ఉరి శిక్షకు గురైన దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్ ఏదో ఒకటి తేల్చకుండా మా బతుకుల్ని నాన్చి ఎందుకు చంపుతారు అంటూ సుప్రీంకోర్టులో సవా లు చేశారు. ఆ కేసులో సీనియర్ న్యాయవాది కె టి ఎస్ తులసి వాదిస్తూ 1997-2011 కాలంలో రాష్ట్రపతి 32 క్షమాభిక్ష పిటిషన్లలో చావు కోసం 13 మంది దశాబ్దం పాటు ఎదురు చూసిన తరువాత పదమూడింటిలో మాత్రమే నిర్ణయం తీసుకున్నారని వివరించారు.. మరొక సీనియర్ న్యాయవాది రాం జఠ్మలాని ఇదే కేసులో వాదిస్తూ ఉరిశిక్ష కు గురైన వ్యక్తిని ఉరితీయడంలో ఆలస్యం అయినా ఆర్టికిల్ 21ని భంగపరిచినట్టే అని వాదించా రు. భారతీయ శిక్షాస్మృతి 302 వ సెక్షన్ కింద ఉరి విధించడం సమంజసమే అయినా, ఉరి అమలులో ఆలస్యం చట్టం నిర్దేశించిన దానికన్న ఎక్కువ శిక్ష విధించినట్టవుతుందని వివరించారు.

క్షమాభిక్ష కోరే వారిని కనికరించి త్వరగా నిర్ణయించాలని చావో రేవో తొందరగా తేల్చాలని అందుకు ఉపకరించే మార్గదర్శకాలను రూపొందించాలని దానికి ఒక విధానం అంటూ ఉండాలని రాష్ట్రపతికి సమాచార కార్యకర్త అనిల్ గల్గాల్ అభ్యర్థన దాఖలుచేశారు. ఇటువంటి అభ్యర్థనే ప్రధానికి దాఖలుచేస్తే కనీసం అదిముట్టిందని కాగితం ఇవ్వలేదని, రాష్ట్రపతి కార్యాలయం మాత్రం తమ పత్రం అందినట్టు దాఖలా పంపించదని ఆయన సంతోషిస్తున్నాడు. చివరకు ఎట్లాతయారైందంటే క్షమాభిక్ష పిటిషన్‌ను న్యా యంగా పరిశీలించి నిర్ణయించినందుకు కాకుండా ఏదో ఒకటి చెప్పండి సార్ అని బతిమాలుకోవడం, అదీ వినక పోతే, ఓ విధానం తయారు చేయండి మహానుభావా అని వేడుకోవడం, ఆ దరఖాస్తు అందిందనైనా చెప్పండి బాబూ అని దేబెరించడం, ముట్టిందన్నందుకు ఎంతో ఆనందించడం పౌరులకు అలవాటు చేసిన మన ప్రభువులను ఏమంటే బాగుంటుంది?
క్షమాభిక్ష పైన ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని అడిగీ అడిగీ విసిగి వేసారిన అఫ్జల్‌గురు కూడా చివరకు ఒకదశలో తాను లాల్ కృష్ణ అద్వాని ప్రధాని కావాలని కోరుకుంటున్నానని చెప్పుకున్నాడు.

ఇదేమిటి అని అందరూ ఆశ్చర్య పోయారు. దానికి ఆయన ఇచ్చిన వివరణ ఏమంటే అప్పుడు కనీసం తన చావు సంగతన్నానిర్ధారణ అవుతుందట.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఘనత బిజెపికి ఇవ్వదలచుకోలేదు. చివరకు ఆ విధంగా అఫ్జల్‌గురును ఉరి తీసి బిజెపి ప్రశంసను సాధించింది మన్మోహన్ సర్కార్.

అయితే కొన్ని క్షమాభిక్షలను కర్కశంగా దశాబ్దాలు నిద్రబుచ్చి, మరికొన్ని క్షమాభిక్ష అభ్యర్థనలను తక్షణం ఎందుకు తిరస్కరిస్తున్నారనే సందేహం సామాన్యుడికి రాక మానదు. కాని ఆశ్చర్యకరంగా ఈ సందేహం సుప్రీంకోర్టు ధర్మాసనానికే వచ్చింది. దేవిందర్ పాల్ సింగ్భుల్లర్ కేసులోనే ఈ సవాలు విసిరారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఎవరు సమాధానం ఇస్తారు? ఎన్నో కేసుల్లో నేరాలు అత్యంత ఘోరమైనవే అయినా సుప్రీంకోర్టు కొందరు నిందితుల మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. ఏది ఘోరాతి ఘోరమో, ఏది ఉరి వేయతగిన నేరమో, ఏది జీవిత ఖైదు సరిపోయే రుజువులో న్యాయమూర్తి తేల్చుతారు. నేరస్తుల జీవితాలే వారి అభివూపాయం పైన ఆధారపడి ఉంటాయి. ఆ తరువాత ఉరిపడిన వారి గురి హోంమంవూతిత్వ శాఖపై పడుతుంది. ఎందుకంటే వారు తమను క్షమించాలని వేడుకున్నది రాష్ట్రపతినే అయినా అది నిజంగా నిర్ణయించేది హోంమంవూతి గారే. అసలు నిర్ణయిస్తే కదా? పనిచేయని ప్రభుత్వం కన్న అసమర్థ ప్రభుత్వమే మిన్న అనుకునే దారుణానికి మన ప్రజావూపాతినిధ్య ప్రభుత్వాలు దారితీస్తున్నాయి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి