అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు!


Tue,February 5, 2013 12:04 AM


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నాయకులు పలురకాల ప్రకటలను చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల తీర్మానంచేస్తే తప్ప నిర్ణయం సాధ్యంకాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పడం నిరాశ కలిగించింది. ఫలితం మరికొన్ని ఆత్మహత్యలు. ఏమాత్రం ఆధారంలేని అబద్ధాలు మాట్లాడడం వల్ల తెలంగా ణ ఇక రాదేమోనని నిరాశతో సున్నిత మనస్కులు ప్రాణాలు తీసుకుంటున్నా రు. లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా వ్యవసాయ విధానా లు రూపొందించిన ప్రభుత్వాలు వారి హత్యలకు బాధ్యత వహించినట్టే, జవాబుదారీతనం, బాధ్యత లేకుండా ప్రాణాలు తీసేమాటలు మాట్లాడే వారు ఆత్మహత్యలనే హత్యలకు బాధ్యత వహించాలనేది నైతిక విలువ. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం రుజువు చేయడం సాధ్యం కాకపోయినా, ఒక అప్రజాస్వామిక, రాజ్యాంగవ్యతిరేక, దుర్నీతి అది. తెలంగాణ ఎందుకు అడుగుతున్నారనే ఆలోచన పిసరంత కూడా చేయకుండా, ఇవ్వం, ఇవ్వరు, దేశం వదిలి వెళ్లిపోండి, అసపూన్నటికీ తెలంగాణ రాదు, రానివ్వం వంటి మాటలు రోజూ అనడం దాన్ని పదేపదే విని ఇంకా చావండి అన్నట్టు ప్రసారం, ప్రచా రం చేయడం సహించరాని అనైతిక ధోరణి.


కోస్తాంధ్ర నాయకుల బాధ్యతారాహిత్య ప్రకటనలకు తోడు ఢిల్లీ పెద్దలు కూడా అదే రకంగా రోజుకో ప్రకటన చేయడం తెలంగాణ కోసం ఆందోళనలో ఉన్న సామాన్యులను మరింత ఆందోళనలకు గురి చేస్తున్నది. పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో జనవరి 30న చేసిన ఒక ప్రకటిన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. ఆ ప్రతిపాదనకు అనుకూలమే. కాని ఆ నిర్ణయానికి అవసరం ఏమంటే.. రాష్ట్ర విభజనను సమర్థిస్తూ రాష్ట్ర శాసనసభ ఒక సానుకూల తీర్మానం చేయడం. అందరిమధ్య ఏకాభివూపాయ సాధనకోసం సంప్రదింపులు జరుపుతున్నాం. అందువల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం ఉంది. కాని ఒకే ప్రతిబంధకం శాసనసభ తీర్మానం. అది రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి అని ప్రకటించారాయన. శాసనసభలో అధికారపక్షానికి చెందిన కోస్తా రాయలసీమల కాంగ్రెస్ సభ్యులే తెలంగాణ ప్రతినిధుల కన్న ఎక్కువగా ఉంటే, వారికి తోడు ఆ ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల శాసనసభ్యులు కలిసికట్టుగా వ్యతిరేకిస్తుంటే అసలు తీర్మానం ఆమోదింపచేయడం సాధ్యమా అని విలేకరులు సరిగ్గా అడిగారు. మెజారిటీ సభ్యులను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చాకో సమాధానం చెప్పారు. చాకో ప్రకటన ప్రకారం శాసనసభ తీర్మానం తప్పని సరి అయితే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశం ఏనాటికీ లేదు. ఆయన వివరణ ఏమంటే ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఫైలు కదలదని. చాకో ప్రకటనపైన వ్యాఖ్యానం చేస్తూ రాజ్యాంగనియమాల ప్రకారం తీర్మా నం అవసరంలేకపోయినా, తీర్మానం వచ్చితీరాలనే రాజ్యాంగ సంప్రదాయం స్థిరపడిపోయిందని జర్నలిస్టు స్మితా గుప్తా వివరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన అన్వయమని, అసలు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేదని అన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును రాష్ట్ర శాసనసభకు అభివూపాయం కోసం పంపడం మాత్రం రాజ్యాంగం నిర్ధారించిన విషయం. చాలా జాగ్రత్తగా రాజ్యాంగంలో అంతే రాశారు. ప్రత్యేకంగా దానికి ఆమోదం గానీ అంగీకార తీర్మానం అనిగానీ, అవసరం అనిగానీ ఆర్టికల్ 3లో లేదు. రాజ్యాంగంలో సమక్షిగంగా చర్చించి ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా సంప్రదింపులు, అభివూపాయసేకరణ చాలు, ఏ అభివూపాయమైనా ఫరవాలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటుచేసే అధికారం కేంద్రానికి ఉందని బాబూలాల్ పరాటా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వివరించింది.


ఇటీవల రాజమంవూడిలో జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల సమావేశంలో తెలంగాణ వ్యతిరేకతను వారు చాటిచెప్పారు. విభజన తీర్మానం ఆమో దం అసాధ్యం అని కూడా తేల్చి చెప్పారు, ఇదివరకు అధిష్ఠానం నిర్ణ యం శిరోధార్యం అనే వారు. ఈ సారి తెలంగాణ ఇస్తే పార్టీ వదిలిపెట్టడానికి కూడా సిధ్ధమని ప్రకటించారు. దీని వెనుక సమైక్యత కోసం వారి చిత్తశుద్ధి ఉందనుకోవాలో లేక రాజకీయంగా వారికి ఇంకే ఎత్తుగడలున్నాయనుకోవాలో తెలియదు. మా తీర్మానం లేకుండా మీకు తెలంగాణ ఏవిధంగా వస్తుంది? మమ్మ ల్ని ఇంతగా తిడితే మేం అనుకూల తీర్మానం చేస్తామనే అనుకుంటున్నారా? అని కూడా వారు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ వ్యతిరేకత విషయంలో తెలంగాణేతర ప్రాంత శాసనసభ్యుల సమైక్యతకు ఇంతకన్న తార్కాణం ఏదీ లేదు. రాజకీయపార్టీలు అన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలత ప్రకటించాయి. పార్టీ విధానాన్ని అనుసరించి విభజనను వ్యతిరేకించే సిపిఎం కూడా తెలంగాణ ఇవ్వదలిస్తే మేం అడ్డుకోబోమని తెలియజేశారు, యూపీఏ భాగస్వామ్య పక్షాలలో తెలంగాణను వ్యతిరేకించే వారు లేరు. ప్రతిపక్షాలలో ప్రధానమైన బీజేపీతో సహా అనేక ఇతర పక్షాలు తెలంగాణ విడిపోవడాన్ని సమర్థించే వారే. ఒక్క తెలంగాణేతర శాసనసభ్యులు, వారి అనుయాయులైన కొంద రు తెలంగాణ శాసనసభ్యు లు తప్ప తెలంగాణకు వేరే శత్రువుపూవరూ లేరు. తెలంగాణ విడిగా ఉండాలా లేక, ఆంధ్రవూపదేశ్‌లో కొనసాగాలా అనేవిషయంలో జనాభివూపాయం అవసరమే అనుకుంటే అది తెలంగాణలో నిర్వహించాలే గాని మరెక్కడా అవసరం లేదు. తెలంగాణలో అడగకుండా మిగతా అంతటా అభివూపాయం సేకరించాలని కూడా ఈ నాయకులు అనగలరు. ఆలోచనకు నోటికి పరిమితులేమీ ఉండే అవకాశం లేదు కనుక ఏదైనా అనవచ్చు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండడానికే, తెలంగాణ వంటి మైనారిటీ ప్రజావర్గాన్ని రక్షించడానికే, వారికి ఒక గొంతుక కల్పించడానికే ఆర్టికల్ 3 రూపొందింది.
విభజింపబడే రాష్ట్ర శాసనసభలో సానుకూల తీర్మానం ఉండి తీరాలనడం, ఈ రాజ్యాంగ నియమంలో అక్షరాలకు అర్థాలకు కూడా వ్యతిరేకం. రాజ్యాం గం విస్పష్టంగా ఒక పద్ధతిని నిర్వచించిన తరువాత దానికి భిన్నంగా ఎవరై నా కొత్త ధోరణిని అవలంబిస్తే అది రాజ్యాంగ సంప్రదాయంగా వ్యవస్థాపితం అయ్యే ప్రసక్తే లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఆయా రాష్ట్రాల శాసనసభల నుంచి సానుకూల తీర్మానాలు పొందారు. అక్కడ ఆయా రాష్ట్రాల నాయకులు ముఖ్యమంవూతులు విడిపోవడాన్ని వ్యతిరేకించినా ఏదో ఒక దశలో వివేచనతో అందుకు అంగీకరించారు. ఆంధ్రవూపదేశ్‌లో ఆ పరిస్థితి లేనే లేదు. వివేచన వివేకం కన్న మొండి పట్టుదలలు, మోసాలు, పిడి వాదాలు, రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలుచేసే దుర్మార్గం వ్యాపించిన సందర్భాలలో అనుకూల తీర్మానం సాధ్యమే కాదు.



తెలంగాణ రాష్ట్రాన్ని విడిగా ఏర్పాటు చేయాలనడం ఏదో దేశ ద్రోహమన్న ట్టు తాము సమైక్యవాదులం అని చెప్పుకునే పెద్దలకు కనిపించని వినిపించని కొన్ని కఠిన చారివూతిక సత్యాలను ఈ మధ్య ప్రముఖ రచయిత రామచంద్ర గుహ ఒక వ్యాసంలో (ది హిందూ, జనవరి 30) వెల్లడించారు. మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి కోస్తా సీమాంవూధులు దాదాపు నలభై సంవత్సరాలు తపించారని అందుకు ప్రతిఘటిస్తూ తమిళులు లేవనెత్తిన అసమంజసవాదాలనే వీరు ఇప్పుడు తెలంగాణ విషయంలో తమవాదాలుగా వినిపిస్తున్నారని అంటూ, ఆ రచయిత విడిపోయి కలిసి ఉండవచ్చని నచ్చజెప్పారు. 1914లో ఆంధ్ర దేశం అనే విధానాన్ని తమిళ మేధావులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వదేశ మిత్రన్ అనే మద్రాస్ వారపవూతిక 1914జూన్ 6న సీమాం ధ్ర నాయకులు చేసిన ఆరోపణలను వివరించింది. గుంటూరు, నెల్లూ రు, బెజవాడల్లో అనేక సమావేశాలు జరిపారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీయాలని ఈ సమావేశాలు జరిగాయి. తరవాత పరిస్థితులు అనుకూలిస్తే నిజాం పాలిత ప్రదేశంలోని తెలుగు ప్రాం తాలను కూడా కలపాలని వీరు ఆ ప్రసంగాల్లో చెప్పారు. గుంటూరు సమావేశంలో తమిళుల కబంధహస్తాల నుంచి విముక్తులం కావాలని తమిళులే ఆంధ్రుల ప్రగతిని స్తంభింపజేస్తున్నారని ఆవేశపూరిత ప్రసంగాలు సాగాయి. అప్పటికింకా అది బ్రిటిష్ పాలన. స్వతంత్ర సమరయోధులపైన రాజకీయ నాయకులపైన పత్రికా రచయితలపైన రాజవూదోహం కేసులు పెడుతున్న రోజు లు. అప్పుడే ఎవరూ ఇటువంటి వేర్పాటువాదాన్ని ప్రదర్శించినా ఈ ఆంధ్ర నాయకుల మీద రాజవూదోహం కేసులు పెట్టలేదు. (ఇప్పుడు రాజ్యాంగ పాలన అమలువుతున్న ఈ రోజుల్లో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీద రాజ్రదోహం, దేశం మీద దండయాత్ర, మొదలైన బుర్రకు తోచిన కేసులన్నీ పెడుతున్న ఆంధ్ర ప్రాంత నాయకులు గమనించాల్సిన చరిత్ర ఇది) వేరు రాష్ట్రం అడుగుతున్న ఆంధ్రులకు వ్యతిరేకంగా ఆనాటి తమిళుల వాద న, తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్రుల వాదనలోని డొల్లతనంలో ఎంత సారూప్యం ఉందో అర్థం అవుతుంది. ‘....వీరి వాదనలో సమంజసత్వం ఏమిటో బోధపడడంలేదు. తమిళులు విద్యలో ప్రగతి చెందితే వారితో ఉంటూ ప్రేరణ పొందవచ్చు. వారి ప్రగతి వీరినెట్లా ఆపింది? వారిది తెలివైన సమాజం, పురాతన నాగరికత చరిత్ర ఉన్నవారే. తమిళులను ఆదర్శంగా తీసుకుని వారూ కొత్త ఆలోచనలు చేయవచ్చు. కొత్త ఆశయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అసలు వారు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో అర్థమే కావడం లేదు. వారుంటున్న ప్రాంతంలో తమిళులు ప్రవేశించకూడదని వారంటున్నారా? ప్రాంతీయ విభేదాలు లేకుండా కలిసి ఉంటేనే ప్రగతి అని దేశభక్తులు సమైక్యత కోసం ప్రగతి కోసం ప్రబోధిస్తుంటే ఆంధ్రులు ఇతరుల నుంచి విడిపోయి స్వతంత్ర ప్రాంతంగా ఉండాలనుకోవడం విచారకరం...’ అని తమిళుల అభివూపాయాన్ని స్వదేశ మిత్రన్ వివరించింది. తమిళులు వ్యతిరేకించినా ఆంధ్ర వేర్పాటు వాదం 1920 నుంచి 1930 వరకు సాగింది.



తెలంగాణ విడివాదాన్ని పిడివాదం అని నిందించే ఈ ఆంధ్రులు తెలుసుకోవలసిందేమంటే, మహాత్మాగాంధీ వీరి విడి వాదాన్ని అప్పుడు సమర్థించారు. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్ వంటి నేతలు దేశ సమైక్యతకు హానికరం అంటూ గట్టిగా ప్రతిఘటిస్తున్నా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉన్న రాష్ట్రాలను విభజించాలని గాంధీ సమర్థించా రు. ముస్లింలు నెమ్మదిగా కాంగ్రెస్‌ను వీడిపోతూ జిన్నా నాయకత్వంలో ఒక ముస్లిందేశం డిమాండ్ పెరిగి పాకిస్తాన్ వేర్పాటుకు దారితీసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువా త ఆంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్య మం తలెత్తితే నెహ్రూ, పటేల్ వంటి నాయకులు ముస్లింలీగ్ పాకిస్తాన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దేశం ముక్కలు కావడానికి భాషావూపయుక్త రాష్ట్రాల ఆలోచన వేదిక అవుతుందేమోనని ఆందోళన చెందారు. గాంధీ మరణంతో ఈ వాదానికి ఉన్న ఒకే ఒక బలమైన మద్దతు తగ్గిపోతుందని కూడా ఆనాయకులు అనుకున్నా రు. 56 రోజుల నిరాహారదీక్ష తరువాత పొట్టి శ్రీరాములు మరణిస్తే, కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం మీద ఆంధ్రులు కోపగించి రైల్వే స్టేషన్లపైన, ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు చేశారు. రామచంద్ర గుహ కూడా చాలాకాలం భాషారాష్ట్రాలు దేశ సమైక్యతకు అనుకూలం కాదనే భావించారు. పాకిస్తాన్ విభజన, శ్రీలంక అంతర్యుద్ధం కూడా భాషా ప్రాతిపదికమీద జరిగాయి. బెంగాలీలు తమిళులు తమకు స్వతంత్ర ప్రతిపత్తిని నిరాకరించి, తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించారన్న కోపాలే ఈ పరిణామాలకు కారణం. ఒక దశలో భాషావూపయుక్త రాష్ట్రాలు అవసరం అనుకున్నారు. కాని దాని ఉపయో గం ఇక ఎంత మాత్రం లేదు అని రామచంద్ర గుహ వివరించారు. ఒక రాష్ట్రం నుంచి ఒక ప్రాంతం విడిపోవాలనే ఉద్యమంలో సక్రమమా, ఆ ఉద్యమాలు కొనసాగుతాయా, లేదా అవి తిరస్కరించతగిన కృత్రిమ ఉద్యమాలా అని ప్రశ్న లేవనెత్తిన రామచంద్ర గుహ తెలంగాణ ఉద్యమం కృత్రిమం కాద ని, బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో చదువుకున్న ఆంధ్ర ప్రాంతీయులు అంతగా చదువుకొనే అవకాశాలులేని నిజాం పాలిత హైదరాబాద్ జిల్లాల ప్రజలు భయపడ్డారు. కొన్ని రక్షణలు అడిగారు. లభించలేదు. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. అప్పడినుంచి దాని తీవ్రత హెచ్చుతగ్గులున్నా అసలు తెలంగాణ కావాలన్న డిమాండ్ మాత్రం సమసిపోలేదు. ఒకసారి సమైక్యం అయిన తరువాత మళ్లీ విడిపోవడం ఎందుకు అని ఆనాడు తమిళులు ఆంధ్ర వేర్పాటు వాదులను అడిగారు. ఈనాడు ఆంధ్రులు తెలంగాణవాదులను అదే అడుగుతున్నారు. కోస్తా ఆంధ్రులతో సహజీవనంలో వారి విద్యావూపబుద్ధుల నుంచి ప్రేరణ పొందాలని అంటున్నారు. 40ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం తరువాత ఆంధ్రుల వేర్పాటువాదం సమంజసమైందనే ఆలోచన తమిళులలో ఉదయించింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా నాలుగు దశాబ్దాలపైబడి నడుస్తున్నదని రామచంవూదగుహ పోల్చారు. ఇప్పుడు దేశ సమైక్యతకు ముప్పులేని ఈ రోజుల్లో దేశం నియంతల చేతిలోకిపోతుందన్న భయం లేదు. సరైన పాలన అవసరమైన ఈ దశలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు మంచిదేనని రామచంవూదగుహ అభివూపాయపడ్డారు. నలభై ఏళ్ల తరువాత ఆంధ్ర విడివాదంలో సమంజసత్వం ఉందని తమిళులు గ్రహించారు. వారిలో ఉదయించిన ఆ వివేకం ఇన్ని దశాబ్దాలతరువాతైనా కొందరు ఆంధ్ర పిడి వాదులకు ఎందుకు కలగడం లేదని సామాన్యుల ప్రశ్న.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త

100

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి