ఆంధ్ర అసెంబ్లీకి బానిస ప్రాంతీయ కమిటీ


Mon,January 21, 2013 11:03 PM

tg-mapపెద్ద మనుషుల ఒప్పందంలో రెండు కీలకమైన షరతులు. ఒకటి తెలంగాణ రక్షణకు ప్రాంతీయమండలి స్వయంవూపతిపత్తితో కల్పించ డం, రెండు వ్యవసాయభూములు తెలంగాణేతరులు కొనకుండా క్రమబద్ధీకరణ. మొదటి షరతు ప్రకారం కమిటీని ఇచ్చినట్టే ఇచ్చి నీరుగార్చారు. రెండో షరతు అసలు పట్టించుకున్న వాడేలేడు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరే విధమైన ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే స్థితిలో తెలంగాణ లేదు. రాజ్యాం గ సవరణ ద్వారా ప్రాంతీయ మండలిని మరిన్ని విధులు నిధులు, స్వపరిపాలనాధికారాలతో ఏర్పాటు చేయాలనే ప్రత్యామ్నాయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నదని కొన్ని పత్రికలలో వార్తలు వచ్చినాయి. కొత్త రాష్ట్రం ఏర్పా టు కావాలంటే ఒక బిల్లు పెడితే సరిపోతుంది. పార్లమెంటులో హాజరైన వారిలో సగం కన్న ఒక్కరు ఎక్కువ ఓట్లు వేస్తే కొత్త హద్దులతో రాష్ట్రం ఏర్ప డి, అదే రాజ్యాంగ సవరణగా పరిగణించే అవకాశం ఉంది. కాని స్వయం పాలనా ప్రతిపత్తితో తెలంగాణకు కొత్త ప్రాంతీయ మండలిని ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.

ఒక రాష్ట్రంలో ప్రస్తుత శాసనసభకు తోడు దానికింద ద్వితీయస్థాయిలో మరొక చట్టసభ మండలి పేరుతో ఏర్పా టు చేయాలని ఆలోచిస్తే అందుకు కీలకమైన సవరణ అవసరం అవుతుంది. ఆర్టికల్ 368 (2) ప్రకారం మూడింట రెండు వంతుల ఆధిక్యతతో పార్లమెంటు ఆమోదిస్తేనే రాజ్యాంగ సవరణ పూర్తవుతుంది. యుపిఎ కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల ఆధిక్యత సభలో ఉందా? ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని పదేపదే చెప్పిన బిజెపి ప్రాంతీయ మండలి రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థించకపోవచ్చు. బిఎస్‌పి, జెడియు, లోకదళ్, సిపిఐ, వంటి అనేక పార్టీలు రాష్ట్ర విభజనను సమర్థించేవి కనుక ప్రాంతీయ మండలిని సమర్థించకపోవచ్చు. రాష్ట్రం అల్లకల్లోలం కావడాని కి తప్ప ఈ ప్రతిపాదన ఎందుకూ పనికి రాదు.

1956లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం రాజ్యాంగం (ఏడో సవరణ) బిల్లు 1956 ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రవేశపెట్టారు. మొదట ఆంధ్ర -తెలంగాణ పేరు పెట్టినారు. తరువాత పేరు తెలంగాణా పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిపాదిస్తే. ప్రదేశ్ అన్న పేరు దక్షిణాదిన లేదని, ఈ మాట ఎందుకు పేరులో చేర్చుతున్నారని ఉత్తరాది ఎంపీ ఒకరు అభ్యంతరం వ్యక్తంచేశారు. కాని తెలుగు ఎంపీపూవరూ పట్టించుకోలేదు.

ఈ రాష్ట్రాన్ని ఇతర అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ ఈ బిల్లును చట్టంగా రూపొందించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పాలనాధికారాల పంపిణీ, అధికారాల జాబితా లిస్టుల సవరణ వంటి అనేక అంశాలను మార్చవలసి ఉండడం వల్ల ఈ కీలకమైన సవరణ తప్పలేదు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ రక్షణలకు ఒక ప్రాంతీయమండలి ఏర్పాటు చేయాలన్నది ఒక షరతు. దీని రూపకల్పన, ప్రారంభం, అధికారాల దఖలు, నియామకం, రద్దు, కమిటీలు వేయకపోవడం వంటి అనేక అన్యాయాలకు గురౌతూ ఉండీ లేకుండా కొన్నాళ్లు ఉండిందీ కమిటీ.
దాంతో పాటు మరొక కీలకమైన మార్పు ఏమంటే ఆంధ్రవూపదేశ్‌లో పంజాబ్‌లో ప్రాంతీయ మండలుల ఏర్పాటుకు ఈ బిల్లులో నియమాలు చేయవలసి వచ్చింది.

ఇదే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్‌లకు కూడా ప్రాంతీయ మండలుల ఏర్పాటు చేయాలని కేంద్రం తలపెట్టింది. బీహార్ బెంగాల్‌లను కలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుని అందులో ప్రాంతీ య కమిటీలను రూపొందించాలనే ఆలోచన కూడా ఉండింది. కాని అప్ప ట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఈ పథకాలు పారలేదు. ఈ బిల్లు తోపాటు పంజాబ్‌లో ప్రాంతీయ మండలి ఏర్పాటుకు నియమాలను, ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంత ప్రజల రక్షణకు కొన్ని అంశాల పత్రాన్ని జత చేసి పార్లమెంటు ముందుంచారు. అయితే అధికారాల దఖలు పరచే విషయంలో కేంద్రం పంజాబ్ కు తెలంగాణకు ఎంతో వివక్ష చూపింది.

పశుసంవర్థనకు సంబంధించిన అధికారాలు. పశువులు మేపడం, పశువుల హద్దు మీరితే చర్యలు తీసుకోవలసిన అధికారాలు, వన్యజంతువుల రక్షణ, ధర్మాదాయ దేవాదాయసంస్థల నిర్వహణ, చేపలు పెంచడం, చేపలు పట్టేవారి హక్కులకు సంబంధించిన అధికారాలను పంజాబ్ ప్రాంతీయమండలికి ఇచ్చి, ఆ అధికారాలను తెలంగాణ ప్రాంతీయ మండలికి ఇవ్వకుండా వివక్ష అప్పుడే కేంద్రం చూపింది. ఇవి కీలకమైన అధికారాలు. వీటి ని తెలంగాణకు ఇవ్వలేదు.

రాజ్యాంగ సవరణ ద్వారా వ్యవసాయ భూముల విక్రయంపై నిర్ణయాధికారం తెలంగాణ ప్రాంతీయ మండలికి ఇచ్చినా దిక్కులేదు. తెలంగాణ విద్యాసంస్థలలో ప్రవేశాలను నిర్ణయించే అధికారం ప్రాంతీయ మండలికే ఇవ్వాలి. మద్యనిషేధ సంబంధ అధికారాలు కూడా మండలికే ఇవ్వాలని రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. కనీసం ఈ అధికారాలనైనా చెలాయించే అవకాశం తెలంగాణ మండలికి ఇవ్వకుండా వ్యవసాయభూములు తెలంగాణేతరులు తక్కువ ధరకు మోసంచేసి కొనడానికి, తెలంగాణలో ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు కుట్రలు చేసి ఆక్రమించడానికి అవకాశాలు కల్పించారు.

విద్యాసంస్థలను క్రమబద్ధీకరించే అధికారం కూడా వాడుకోనీయలేదు. ప్రాంతీయ మండలులకు నియామకాలు జరుపడంలో, వారిని రద్దు చేయడంలో కీలక పాత్ర వహించారు. రాష్ట్ర శాసనసభ ప్రణాళికకు లోబడి, తెలంగాణ అభివృద్ధి అంటే అదేం అభివృధ్ది? ఈ మాత్రం అధికారాలను కూడా వినియోగించకుండా మండలులకు అడుగడుగునా అడ్డుబడ్డారు. ఒకవైపు కమిటీ ఏర్పాటులో రెండేళ్లు ఆలస్యం చేస్తూ వేలాది ఎకరా ల తెలంగాణ వ్యవసాయ భూములను వలస సంపన్నులు కొనుక్కునే అవకాశాలు కల్పించి పెద్ద మనుషుల ఒప్పందానికి గండి కొట్టి, ఆదిలోనే తెలంగాణకు ఆంధ్రపాలకులు వారి తాబేదార్లు ద్రోహం చేసారు.

మొదట రాజ్యాంగంలోని అధికరణం 371 ప్రకారం, పార్ట్ బి లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను క్రమబద్ధీకరించే ప్రత్యేక అధికా రం కేంద్రానికి ఉంది. పార్లమెంట్ నిర్దేశించిన రీతిలో రాజ్యాంగం వచ్చినప్పడి నుంచి పదేళ్లు గానీ అంతకన్నఎక్కువ లేదా తక్కువ కాలం ఈ అధికా రం చెలాయించవచ్చు. రాష్ట్రపతి ఇచ్చే ఉత్తర్వులను ఈ రాష్ట్రాలు యథావిధిగా పాటించాలని కూడా 371 నిర్దేశిస్తున్నది.

కాని 371ను తర్వాత సవరించి ఆంధ్రవూపదేశ్, పంజాబ్ బొంబాయి శాసనసభలకు అనుబంధంగా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటుచేసే అధికారం కేంద్రానికి ఇచ్చారు. ప్రాంతీ య మండలి అని అస్సాంలో ఇదివరకే ఒక సంస్థ ఉండడం వల్ల, ప్రాంతీయ కమిటీ అని పేరు మార్చారు. 371(1) కింద రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసినా వాటి పదవీ కాలం నిర్ధారించలేదు. ప్రాంతీయులకు లేదా స్థానికులకు ఉద్యోగం కేటాయించే విధంగా చట్టం చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తూ ఆర్టికల్ 16(3)ను సవరించారు. తరువాత ప్రభుత్వం రంగంలో స్థానికులకు ఉద్యోగం కేటాయించే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రిక్వయ్మింట్ ఆస్ టు రెసిడెన్స్) ఆక్ట్, 1957ను పార్లమెంట్ ఆమోదించింది.

ఈ విధంగా అస్తవ్యస్తంగా తక్కువ అధికారాలతో ఏర్పాటుచేసిన ప్రాంతీ య కమిటీ కూడా రెండేళ్లు ఆలస్యంగా అమలులోకి వచ్చింది. నవంబర్ 1, 1956న ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ప్రారంభించారు. పంజాబ్‌లో ప్రాంతీయ కమిటీలను నవంబర్ 1957లో ప్రారంభించారు. 1958 ఫిబ్రవరిలో ఆంధ్రవూపదేశ్ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న సందేహానికి కేంద్రానికి ఉత్తరం రాస్తూ, రెండేళ్ల ఆలస్యం చేసింది. విశాలాంవూధను సమర్థించిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలా లేకపోతే తెలంగాణ విడిగా ఉండాలని పట్టుబట్టిన నాయకుడికి ఇవ్వాలా అనే విషయంలో మన సర్కారుకే సందేహం వచ్చింది. దీనిమీద తీరిగ్గా ఉత్తర వూపత్యుత్తరాలు నడిపింది ఆంద్రవూపదేశ్ ప్రభుత్వం. తెలివిగల మోసాలంటే ఇవే. ఈ లోగా వ్యవసాయభూముల విక్రయం పైన పరిమితులు లేవు.

విద్యాసంస్థలలో ప్రవేశాలపైన తెలంగాణ కు అధికారం లేదు. ఇస్తానన్న రక్షణల అమలు కూడా ఆ విధంగా ఉత్తరాల సాకుతో వాయిదా పడింది. తెలంగాణ అంతటా డబ్బున్న తెలివైన కోస్తాంవూధులు వ్యవసాయ భూములు కొని రక్షణ రాకముందే దాన్ని ఉల్లంఘించా రు. ప్రాంతీయ కమిటీ వచ్చేనాటికే దోపిడి దారుణంగా జరిగిపోయింది. దీనికి కూడా తెలంగాణ పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. దీన్ని తెలంగాణ కోసం ఏర్పాటయిందని అనుకోవాలి. దాని పేరు మాత్రం ఆంధ్రవూపదేశ్ ప్రాంతీయ కమిటీ. మండలి కాదు. తెలంగాణకు చెందిన మంత్రులు శాసనసభ్యులు ఇందులో సభ్యులు. స్పీకర్, ముఖ్యమంత్రి తెలంగాణ వారైనా సరే ఇందులో సభ్యులుకాదు. గవర్నర్ నియమించిన సీనియర్ సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు.

రెండు సమావేశాల మధ్య మూడునెలలకు మించి విరామం ఉండకూడదు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతిబిల్లును ఈ కమిటీకి పంపాలి. కమిటీ అభివూపాయాన్ని తిరస్కరించే అధికా రం అసెంబ్లీకి ఉంటుంది. అంటే ఊరికే చర్చించుకోవడానికన ్నమాట ఈ కమిటీ. ఈ ప్రాంతీయ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసుకోవ చ్చు. ఈ ఉపకమిటీల తీర్మానాలను ప్రాంతీయ కమిటీ తీర్మానంగా భావిస్తారు. కమిటీ సమావేశాలు గోప్యంగా ఉంచాలి. మీడియాకు అనుమతి లేదు. కమిటీ ప్రొసీడింగ్స్‌ను సభ్యులకు కూడా ఇవ్వరు. కమిటీ సిఫార్సుల ను అసెంబ్లీ గానీ ప్రభుత్వం కాని అమలు చేయకపోతే ఏం చేయాలో చెప్పలేదు. మిగులు నిధులు ఉన్నప్పకీ పోచంపాడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోతే ఈ కమిటీ ఏమీ చేయలేకపోయింది. విద్యాసంస్థలలో ప్రవేశాలకు స్థానికులకు అర్హత విషయంలో కమిటీ తీర్మానాలను కొన్నింటిని ప్రభుత్వం తిరస్కరించింది. కొన్ని సమీక్షించాలని తిప్పి పంపింది.

సర్వీసు అనే విషయాన్ని కమిటీ పరిధినుంచి తొలగించారు. కనుక ఆ విషయమై కమిటీ చేయగలిగిందేమీ లేదు. వనరుల కేటాయింపు సిఫార్సులు చేసినా వాటిని పట్టించుకునే వాడే లేడు. స్థానికులకే విద్యాసంస్థలలో ప్రవేశాలనే నియమాన్ని ప్రభుత్వాలు కోర్టులు నీరుగార్చాయి. స్థానిక పాలనపై సూచనలకు కూడా పట్టించుకోలేదు. ఈ కమిటీ చర్చించి విమర్శించి ఊరుకోవ డం మినహా చేయగలిగిందేమీ లేదు. పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్న రక్షణలు భద్రతలను కూడా దక్కించుకునే అధికారం ఈ కమిటీకి లేదు. 1958 నుంచి 1968 వరకు ఈ కమిటీ వంద నివేదికలు ఇచ్చింది. కనీసం పది నివేదికలు కూడా అమలుకు నోచుకోలేదు.

తెలంగాణకు మిగులు నిధులు ఉండేవి. కాని వీటిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించకుండా ఆంధ్రకు మళ్లించారని ఈ పదేళ్లలో అనేకసార్లు లేవనెత్తి, ఆ విధంగా మిగులు సొమ్మెంత మళ్లించారో చెప్పాలని పదేపదే తీర్మా నం చేశారు. 1969లో ఉద్యమం వచ్చిన తరువాత ఈలెక్క చేయకతప్పద ని ప్రభుత్వం భావించింది. కుమార్ లలిత్ అనే కాగ్ అధికారి చేత లెక్కలు వేయిస్తే, ఆయన 38.20 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఆంధ్రకు హైజాక్ చేశారని తేల్చారు. ప్రాంతీయ కమిటీ ఈ లెక్కలలో తప్పిన అంకెల ను, ఆదాయంలో నిష్పత్తికి మించి ఆంధ్రలో ఖర్చు చేసిన డబ్బును లెక్కించి మొత్తం 107.3 కోట్ల రూపాయలు దారి మళ్లించారని తేల్చింది. తెలంగాణ మిగులు నిధుల మళ్లింపుపైన ఉన్నతాధికార కమిటీ వేస్తానని ఇందిరాగాంధీ ఆనాడు ప్రకటించారు.

ఈ హామీ ఆ కుమార్ లలిత్ కమిటీ భూస్థాపితం చేశారు. ముఖ్యమంత్రి కేంద్రం అండదండలతో నియంతలై వ్యవహరిస్తూ, ప్రాంతీయ కమిటీని ఎందుకూ పనికిరాని కమిటీ చేసిన చరివూతను కెవి నారాయణరావు గ్రంధస్థం చేశారు. కనుక ఈ కమిటీని 1973లో రాజ్యాంగం 32వ సవరణ చట్టం ద్వారా రద్దుచేసినప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే భావన వ్యక్తమయింది.

మేఘాలయలో స్వతంవూతవూపతిపత్తి కలిగిన మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలికి చట్టంచేసే అధికారం కూడా ఉంది. మండలి అంగీకరించిన బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే చట్టం అవుతుంది. ఉమ్మడి ప్రయోజనాలను ప్రభావితం చేయని అంశాలపైన తమ ప్రాంతానికి సంబంధించి ఒక చట్టం చేసే అధికారం మండలికి ఉంది. తెలంగాణ కోసం తెలంగాణ పేరు లేకుండా ఏర్పాటయిన ప్రాంతీయ కమిటీకి ఆ బలం కూడా లేదు.

ఇదో ఇటివంటిదే మరొకటో, లేదా ఇంకొన్ని అధికారాలు పెంచి ఇస్తామనే భ్రమ కల్పించో మరొక మండలి ఏర్పాటుచేస్తామని, సరైన బలం లేకపోయినా రాజ్యాంగం సవరిస్తామని అంటే నమ్మడమా? ఇంకా నమ్మక ద్రోహాన్ని సహించడమా? తెలంగాణ తేల్చుకోవాలె.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

country oven

Featured Articles