హైదరాబాద్ కోసం ఇంకా కుట్రలా?


Wed,January 16, 2013 11:50 PM

tg-hydతెలంగాణ వేరు హర్యానా వేరు. హైదరాబాద్ వేరు బొంబాయి వేరు. అర శతాబ్దానికి మించి చరిత్రలేని ఆధునిక నగరం చండీగఢ్ వేరు, శతాబ్దాల చరిత్ర ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేరు. కాని తెలంగాణ కోసం ఇక్కడి జనం పడిన తపన, హర్యానా కోసం అక్కడి జనం పడిన తపన ఒకటే. తమ రాజధానిని కాపాడుకోవడానికి మరాఠీలు పడిన వేదన, హైదరాబాద్ కోసం తెలంగాణ వేదన ఒకటే. ఉమ్మడి రాజధానిగా ఉండగల భౌగోళిక సానుకూలత చండీగఢ్‌కు ఉంది కాని హైదరాబాద్‌కు అది కుదరదు. కొత్తగా కృత్రిమంగా ఆ లక్షణం తెచ్చినా రాదు. కుట్ర చేసినా రాదు.

తొలి భారత స్వాతంత్య్ర సమరం తిరుగుబాటులో కీలకమైన భాగస్వా మ్యం వహించిన పోరాట యోధులు హర్యానా వారు. ఈ తిరుగుబాటు విఫ లం కాగానే అణచివేత మొదలైంది. బ్రిటిష్ పాలకులు హర్యానాను 1858లో పంజాబ్‌లో కలిపారు. అప్పటి నుంచి హర్యానాకు ప్రత్యేక వ్యక్తిత్వం, గుర్తిం పు లేకుండా అడ్డుకున్నారు,-తెలంగాణను అడ్డుకున్నట్టే. ఈ ప్రాంతానికి ఆ విధంగా బ్రిటిష్ పాలకులు శిక్ష విధించారు. ఒకరికింద పడి ఉండమని, అభివృద్ధి గురించి ఆలోచించొద్దని... హర్యానా ప్రజలను రెండోస్థాయి పౌరులుగా పరిగణించారు. భాషలో, అలవాట్లలో సంస్కృతిలో పంజాబ్‌కు హర్యానాకు తేడాలున్నాయి,.. కోస్తాంవూధకు తెలంగాణ ప్రజలకు ఉన్నట్టే. హిందీ మాట్లాడే వారికి పంజాబీ మాట్లాడే వారికి మధ్య అహంకార, అధికార దుర్మార్గ సమస్యలు ఉన్నాయి.

తెలంగాణ తెలుగుకు, కోస్తాంధ్ర తెలుగుకు మధ్య ఉన్నట్టే. 1948లో పంజాబీ సుబా కావాలని మాస్టర్ తారాసింగ్ అడిగిన దశలోనే ప్రత్యేక హర్యానా రాష్ట్ర ఉద్యమం కూడా పుట్టింది. తెలంగాణతో కలిపి విశాలాంధ్ర ఏర్పడాలనుకున్నారే కాని సమైక్య తెలంగాణాంధ్ర కావాలని వారు ఆనాడు కూడా అనుకోలేదు. విశాలాంధ్ర అంటే ఆంధ్రను విస్తరించుకోవడం అనే సామ్రాజ్య విస్తర ణ వాదాన్ని తలపించే దుర్మార్గం అని తెలుసుకోకుండా నిజంగా సమైక్యమే అని కొందరు అనవసరంగా నమ్మారు. కాని అప్పుడే కావలసినన్ని అనుమానాలు తలెత్తాయి. బూర్గుల రామకృష్ణారావు, కె వి రంగాడ్డి, చెన్నాడ్డి ప్రభృతులు విశాలాంవూధలో విలీనం చేసి తెలంగాణ గుర్తింపును మసిచేసే ఆలోచన ఉందన్న విషయాన్ని పసిగట్టారు.అత్యధిక తెలంగాణీయులు కూడా అదే అనుమానించారు.

కాని పడనియ్యలేదు. మొదటి నుంచి ఈ కుహనా సమైక్యవాదాన్ని హర్యానీయులు, తెలంగాణీయులు అనుమానించినా ప్రయోజనం లేకపోయింది. చరిత్ర సమాంతరంగా నడిచింది. ఆంధ్ర తెలంగాణ పేరుతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన తరువాత తెలంగాణ వారు ఢిలీ ్లనుంచి తిరిగి రావడం కోస్తాంవూధులు మాత్రం ఢిల్లీలోనే ఉండి పేరులోనించి తెలంగాణ తీసేసి, ఉత్తరాదిలో ఉండే పేర్ల వంటి ఆంధ్ర ప్రదేశ్ అనే దుష్ట సమాసాన్ని విశాలాంధ్ర పేరుగా నిర్ణయించేట్టు చేసి తెలంగాణను నామరూపాలు లేకుండా కుట్ర మొదలుపెట్టారు.

పంజాబ్ హర్యానీయుల మధ్య అనుమానాల సమస్య తీర్చడానికి ఆనాటి పంజాబ్ ముఖ్యమంత్రి భీంసేన్ సచార్ పంజాబ్‌ను రెండు ఉప ప్రాంతాలుగా విభజించాడు.ఒకటి పంజాబ్ మరొకటి హిందీ ప్రాంతం. పంజాబ్‌లో పం జాబీ భాష గురుముఖి లిపితో అధికార భాష కాగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాష హిందీ ప్రాంతానికి అధికార భాష. సచార్ సూత్రాల ద్వారా కొంత న్యాయం చేయడానికి సచార్ ప్రయత్నం చేసినారు.

ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూవూతాలు విఫలమైనట్టే అక్కడ సచార్ ఫార్ములా కూడా పనికిరాకుండా పోయింది. 1953 డిసెంబర్ 25న రాష్ట్రాల పునర్విభజన కోసం అభివూపాయాలు వినడానికి ఫజల్ అలీ కమిషన్ వచ్చినపుడు పంజాబ్ సుబా విడిగా కావాలని వారు, హర్యానాను విడిగా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని వీరూ కోరారు. ఆ కమిషన్ మాత్రం వీరిద్దరినీ విడదీయాలని అనుకోలేదు. ఆ ప్రాంతంలో నిరాశ అలుముకుంది. విశాలాంధ్ర విస్తరణలో కలిపేసి తెలంగాణను బలి చేయవద్దన్న కోరికలో న్యాయం చూసిన కమిషన్ విలీనాన్ని సిఫార్సు చేయకపోయినా విలీనం చేయ డం వల్ల ఇక్కడ చెలరేగిన నిరాశ నిస్పృహ గురించి చెప్పనవసరం లేదు.

1956లో పంజాబ్‌ను ద్విభాషా రాష్ట్రం అన్నారు. అంటే రెండు అధికార భాషలను ప్రకటించింది. పంజాబ్, హిందీ ప్రాంతాల గుర్తింపును కాపాడడానికి కొన్ని జిల్లాలను చేర్చారు. అనేకసార్లు పంజాబ్ సుబాను సిక్కుల విడి రాష్ట్రంగా ప్రకటించాలనే ఆందోళన చెలరేగింది. ప్రత్యేకంగా సిక్కుల పంజాబ్ కోసం సంత్ ఫతే సింగ్ 1965లో ఆమరణ దీక్షతోపాటు ఆత్మాహుతి చేసుకుంటానని ప్రకటించారు. పత్రికలను గుప్పిట్లో పెట్టుకున్న కొన్ని వర్గాలు ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయి. అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ తప్ప హర్యానా ప్రజలు తమ హిందీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తారన్న నమ్మకంతో విభజనను సమర్థించారు.

ఇక్కడ తెలంగాణను కొందరు వ్యతిరేకించినట్టు కాకుండా అక్కడ పంజాబ్, హిందీ ప్రాంతాలలో విభజన డిమాండ్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సర్దార్ హుకుంసింగ్ ఆధ్వర్యంలో 23 సెప్టెంబర్ 1965న పంజాబ్ పునర్నిర్మాణ సంఘం ఏర్పాటు చేశారు. రోహ్తక్ హిందీ ప్రాంత ఎమ్మెల్యేలంతా కలిసి 17 అక్టోబర్ 1965న సమావేశమై కొత్త హిందీ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు, పంజాబ్‌లోని హిందీవూపాంతాలతో సహా ఢీల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఒక హిందీ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, ఆయా రాష్ట్రాలు ఒప్పుకోకపోతే పంజాబ్‌లోని హిందీ ప్రాంతాలను కొత్త హిందీ రాష్ట్రంగా ప్రకటించాలని తీర్మానించారు. హిందీ మాట్లాడే ప్రాంతాలను విభజిస్తే ఎంత మాత్రం సహించబోమని కూడా వారు తీర్మానించారు. ఆనాటి హర్యానా ఎమ్మెల్యేల ఐక్యతను చూసి తెలంగాణ ఎమ్మెల్యేలు నేర్చుకోవలసిన పాఠం అది. నేర్చుకోకపోవడం తెలంగాణ దురదృష్టం.

హుకుంసింగ్ కమిషన్ పంజాబ్ విభజనను సమర్థిస్తూ సరిహద్దు నిర్ధారణకు కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. 1966 ఏప్రిల్ 23న కేంద్రం జస్టిస్ జే సీ షా అధ్యక్షతన పంజాబ్‌ను హర్యానాను విభజించడాని కి ఏర్పాటు చేసింది. నవంబర్ ఒకటి తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తే అదే తేదీ (1966 నవంబర్ 1) విడిపోయి బాగుపడాలనుకున్న హర్యానా పంజాబ్‌లకు పుట్టినరోజు. హర్యానాతోపాటు చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాం తంగా ప్రకటించారు. కొంత పంజాబ్ భాగాన్ని హిమాచల్‌ప్రదేశ్‌కు బదిలీ చేశారు. పంజాబ్ సరిహద్దులను కొత్తగా నిర్వచించారు. శాసనసభ్యుల పార్లమెంటు సభ్యుల నియోజక వర్గాలు ఏరాష్ట్రంలో ఎందరో నిర్ణయించారు. వీటన్నింటనీ నిర్ధారిస్తూ పంజాబ్ పునర్నిర్మాణ చట్టం1966ను పార్లమెంటు రూపొందించింది.

చండీగఢ్‌కు లేనిదీ హైదరాబాద్‌కు ఉన్నదీ చరిత్ర. 1947లో పంజాబ్‌ను నిలువునా చీల్చి పాకిస్తాన్‌కు భారత్‌కు మధ్య పంచినప్పుడు లాహోర్ పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందింది. ఇక్కడి పంజాబ్ కు రాజధాని అవసరమైం ది. చండీ మందిర్ ఉన్న ప్రాంతంలో కొత్తగా చండీగఢ్‌ను నిర్మించారు. కొత్త జాతి ఆధునిక పురోగతికి ప్రతీకగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని నెహ్రూ కలలుగన్నారు. పంజాబ్ హర్యానాల సరిహద్దు మీద ఉండడం వల్లనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ నిలబడగలిగింది. కాని ఆ నగరా న్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించించారు.

కేంద్ర హోంమంత్రి పాలనాధికార పరిధిలో చండీగఢ్ ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 239 ప్రకారం అడ్మినివూస్టేటర్‌ను నియమిస్తారు. ఛీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు సలహాదారుగా ఉంటారు. ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి డిప్యూటీ కమిషనర్‌గా సాధారణ పరిపాలన చూసుకుంటారు. శాంతి భద్రతలను చూసుకోవడానికి ఒక సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌ను నియమిస్తారు. ఒక డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అడవుల వ్యవహారాలను పరిపాలిస్తారు. ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా ఉండదు. హోంమంత్రే అసలు పాలకుడు. 1985 నుంచి పంజాబ్ గవర్నర్ చండీగఢ్ పాలకుడుగా పనిచేస్తున్నారు.

1950 నుంచి చండీగఢ్ పంజాబ్‌కు రాజధాని. 1956లో తూర్పు పంజా బ్ ప్రాంతాలను (PEPSU) పంజాబ్‌లో కలిపినపుడు ఒక పెద్ద ఉత్తరాది రాష్ట్రానికి ఆధునిక ప్రణాళికాబద్ధ నిర్మాణం కలిగిన రాజధాని నగరంగా చండీగఢ్ ఎదిగింది.

పంజాబ్ వారూ హర్యానా వారూ కూడా తమకు చండీగఢ్ రాజధానిగా ఉండితీరాలని పట్టుబట్టడం వల్ల దాన్ని ఉమ్మడి రాజధాని చేయ డం, ఎవరికీ చెందకుండా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉండడం వల్ల, ఆ నగరానికి పెద్దగా చరిత్ర లేకపోవడం, తనదైన సంస్కృతి ఏదీ లేకపోవడం, చారివూతాత్మక సంబంధం పెద్దగా ఎవరికీ లేకపోవడం వల్ల ఎవరికీ పూర్తిగా ఆధిపత్యం లేకపోయినా ఇరువర్గాల వారూ ఫరవా లేదనుకోవడం వల్ల చండీగఢ్ తమతోపాటు పంచుకోవడానికి, కేంద్రం ఆధిపత్యంలోకి పోవడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదు. హైదరాబాద్ సంగతి పూర్తిగా వేరు. హైదరాబాద్‌కు వ్యాపారం కోసం వచ్చిన వారికి, మిగులు డబ్బుతో ఇక్కడి భూములను కొనుక్కున్న డబ్బు మనుషులకు తెలంగాణ జిల్లాలతో ఇక్కడి ప్రజలకు ఉన్న సంబంధం అర్థంకాదు. వారు పుట్టిన గ్రామం మట్టితో వారికి ఉన్నఅనుబంధమే ఇక్కడ పుట్టిన వారికి ఇక్కడి మట్టితో ఉంటుందన్న జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యకరం.

హైద రాబాద్ 400 వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరం. తెలంగాణకు హైదరాబాద్‌కు ఎవంత అన్యాయం చేసినా, నవాబులు సుల్తాన్‌లు జమీందార్ల పాలనలో ప్రజలు నలిగిపోయినా ఇక్కడ తెలుగుదనం బతికింది. కోస్తాంధ్ర నుంచి వచ్చి న కొందరు, కొన్ని పత్రికలు, కొన్ని చానెల్స్ ఎంత దారుణంగా భాషా పరమైన దాడి చేసినా ఇక్కడి తెలుగు యాస, కవితా వైభవం బతికింది. బతుకుతుంది. పోతన నుంచి అభినవ పోతన దాకా, సోమన నుంచి కాళోజీ దాకా కవులూ వెలిగినారు. కావ్యాలు వర్ధిల్లినాయి. ఇక్కడి జనులకు హైదరాబాద్‌తో ఉర్దూ భాషతో ముస్లిం దోస్తులతో సామరస్యం బతికింది. ఎందరు చంపడానికి ప్రయత్నించినా బతుకుతుంది. చండీగఢ్‌తో హైదరాబాద్‌కు పోలికలేదు. పెట్టుబడులు పెట్టాం కనుక మాది అంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం బొంబాయితో పోలిక చెప్పినా కాని, హైదరాబాద్ పూర్తిగా వేరు.

పొసగని కుదరని ప్రత్యామ్నాయాలతో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఆవిధంగా ఎందుకు రాసిందో అందరం ఊహించగలం, సరిగ్గా కోస్తాంవూధులు కోరుకున్నట్టే హైదరాబాద్ నుంచి విజయవాడ తగిలేదాకా మధ్యలో నల్లగొండ రంగాడ్డి ఖమ్మం జిల్లాల ప్రాంతాలన్నింటినీ కలిపి ఇప్పడి గ్రేటర్ హైదరాబాద్ ను గ్రేటెస్ట్ హైదరాబాద్‌గా మార్చడాన్ని ఆరు ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా చేర్చారు ఆ మేధా(తా)వులు. దీని వెనుక కుట్ర ఏమంటే రాష్ట్ర విభజన తప్పదంటే హైదరాబాద్‌ను తెలంగాణకు దక్కకుండా చేయడమే. అంతాపోయిన తరువాత మిగిలిన ముక్కలను అటూ ఇటూ తెలంగాణగా పిలవాలని ఆ కుట్ర చేశారు.

ఆరు ప్రత్యామ్నాయాల్లో అసలా ప్రతిపాదనే ఒక దారుణ కుట్ర. చండీగఢ్‌కు తెలంగాణకు ఉన్న తేడాలను చెరిపి వేసి ఉమ్మడి రాజధాని చేయ డం, కేంద్రపాలిత ప్రాంతం చేయడం తెలంగాణ వారిని హైదరాబాద్‌లో రెండోశ్రేణి మనుషులుగా అణచివేయడం, సీమాంధ్ర సామ్రాజ్యాధిపత్య దుర్మార్గాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడమే అని వేరే చెప్పనవసరం లేదు. దానికి ఒక న్యాయమూర్తి తల ఊపడం మనదేశంలో న్యాయం ఎటువంటి ప్రభావాలకు ప్రలోభాలకు గురి కాగలదో చెప్పడానికి ఒక ఉదాహరణ. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తామ ని హోంమంత్రి ప్రకటించిన తరువాత సీమాంధ్ర నాయకులు, వర్తకులు కలి సి ఈ పథకం పన్నారు, శ్రీకృష్ణ కమిటీని కూడా అందుకు వాడుకోవడం, ఆ కమిటీ వారు నిస్సిగ్గుగా వాడుకోబడడం, వారి పైరవీ తెలివితేటలను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వ్యతిరేకతలో వారి తీవ్రతను, తమ ప్రయోజనాల ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే తెగువను అర్థం చేసుకోవచ్చు.

చింతన్ బైఠక్‌కు కాంగ్రెస్ పెద్దలు సిద్ధమవుతున్న దశలో రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ఆలోచనను పరిశీలించిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకృ ష్ణ కమిటీ ఆరు మార్గాల దుర్మార్గాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణలోని అనే క ప్రాంతాలను హైదరాబాద్‌కు కలిపి, కొందరు వర్తకులకు ధారాదత్తం చేయడానికి ఆ కమిటీ నివేదిక చేసుకుని, ఇప్పుడు ఢిల్లీలో పైరవీకి లొంగే కాంగ్రెస్ నాయకుల చేత ఈ ప్రతిపాదనను హైకమాండ్ ముందుకు జొప్పించడానికి చాలా పకడ్బందీగా కృషి చేశారని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా గ్రేటెస్ట్ హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి తొలగించిన తరువాత తెలంగాణ అంటూ మిగిలేది ఏమీ ఉండదని తెలుసుకోలేనంత అమాయకులుగా ఉండకూడదు.

బొంబాయిని గుజరాతీలు కొంతకాలం మరాఠీలకు దక్కకుండా గుజరాతీలు విపరీతమైన ప్రయత్నాలు చేయడం వల్ల వారు సాధించిందేమంటే కనీసం 80 మంది ఉద్యమాలలో పోలీసుల తూటాలకు అమాయకులు బలిచేయడం. బొంబాయి చివరకు మరాఠీల రాజధానిగా మళ్లీ మారిపోక తప్పలేదు. చంద్రబాబు యు టర్న్‌ను ఆసరాగా తీసుకుని, తెలంగాణను వ్యతిరేకించడంలో సీమాంధ్ర నాయకులంతా రాజీనామాల డ్రామా ఆడడం, శ్రీ కృష్ణ కమిటీతో ఏడాదిపాటు తెలంగాణ వారిని నిరాశా నిస్పృహలలోకి నెట్టి, కనీసం వేయి మంది ప్రాణాలు తీసుకోవడానికి కారణమైనారు. 1969 ఉద్యమంలో బ్రహ్మానందడ్డి హయాంలో తుపాకీ గుళ్లకు బలి చేస్తే, ఈ సీమాంధ్ర పార్టీ రాజకీయాతీత కుట్రకు కేంద్రం కూడా సాయం చేసి ఎవరూ తుపాకుల తో కాల్చకుండానే, ఎవరికి వారు తమంత తామే ఆత్మాహుతి చేసే సుదీర్ఘ మరణహోమం రచించడం తెలంగాణ చరివూతలో ఒక విషాద ఘట్టం.

వేయి మంది ప్రాణాలు తీసినా రాజకీయాలకు రక్త దాహం తీరకపోవడం తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతం పేరుతో కేంద్ర హోంమంవూతికి అప్పగించడానికి మరో కుట్ర చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసే బాధ్యత తీసుకున్నందుకే కేంద్ర హోంమంత్రి చేతికి కీలకమైన అధికారం అంది తెలంగాణ ఇన్నేళ్ల్లు నానాతంటాలు పడింది. ఇక శాశ్వతంగా తెలంగాణ గుండెకాయను తీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని చేసే కుట్రను తెలంగాణ భరిస్తుందని అనుకోవడం భ్రమ. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇస్తుందని రాష్ట్రమంవూతుల చేత చెప్పించి కేంద్రం కొంత కొత్త ప్రయోగం చేస్తున్నది కావచ్చు. తెలంగాణ కోసం కేంద్రపాలిత ప్రాంతం కుట్రను పటిష్టంగా తిప్పి కొట్టాలి. హైదరాబాద్ నగరం బొంబాయి కాదని, చండీగఢ్ కానే కాదని హైదరాబాద్‌కు సాటి హైదరాబాదేనని చాటిచెప్పాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి